Топ-100
Back

ⓘ సినిమా ..
                                               

ఇట్ హాపెన్డ్ వన్ నైట్ (1934 సినిమా)

ఇట్ హాపెన్డ్ వన్ నైట్ 1933, ఫిబ్రవరి 22న విడుదలైన అమెరికా హాస్య చలనచిత్రం. ఫ్రాంక్ కాప్రా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో క్లార్క్ గేబుల్, క్లాడెట్ కాల్బెర్ట్ నటించారు. 1934లో జరిగిన 7వ ఆస్కార్ అవార్డుల్లో ఉత్తమ చిత్రం,ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ స్క్రీన్ ప్లే విభాగాల్లో ఆస్కార్ అవార్డులను అందుకుంది.

                                               

ఇవాన్స్ చైల్డ్‌హుడ్ (1962 సినిమా)

ఇవాన్స్ చైల్డ్‌హుడ్ 1962, ఏప్రిల్ 6న విడుదలైన రష్యా చలనచిత్రం. ఆండ్రోయ్ తార్కోవ్ స్కీ దర్శకత్వంలో బాల నటుడు నికోలాయ్ బుర్లీయేవ్, వాలెంటిన్ జుబ్కోవ్, ఎవ్వని జర్రికోవ్, స్టెపాన్ క్రిల్లోవ్, నికోలాయ్ గ్రింకో, తార్కోవ్ స్కీ భార్య ఇర్మా రౌష్ నటించిన ఈ చిత్రం వ్లాదిమిర్ బోగోమోలోవ్ అనే రచయిత 1957లో రాసిన ఇవాన్ అనే కథ ఆధారంగా రూపొందించబడింది. ఒక యుద్ధ వాతావరణాన్ని చూపిస్తూ, ఆ యుద్ధంలో తల్లిని తండ్రిని కుటుంబాన్ని కోల్పోయిన పండ్రెండేళ్ల బాలుడి కథ నేపథ్యంలో ఈ ఇవాన్స్ చైల్డ్‌హుడ్ సినిమా తెరకెక్కింది.

                                               

కవితా రాధేశ్యాం

ఇటీవల భారతదేశంలో జంతు బలిని నిషేధించాలంటూ పూర్తి నగ్నంగా ఫోజులిచ్చి కెమెరాకు చిక్కి వివాదాస్పదమైన సుప్రసిద్ధ బాలీవుడ్ నటి కవితా రాధేష్యం. ఈమె విక్రమ్ భట్ దర్శకత్యంలో హూ డన్ ఇట్ అల్జాన్ అనే టి.వి సీరియల్ లో నటించింది. ఢిల్లీలో 1984 డిసెంబరు 31 న జన్మించిన ఈమె ప్రస్తుతానికి బొంబాయిలో ఉంటోంది. బిగ్ బాస్ సెస్సన్ 6 కు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వెళ్లడానికి నిరాకరించిన మహిళ కవితా రాధేష్యం. 2009 లో కిషోర్ నమిత్ కపూర్ యాక్టింగ్ ఇన్ స్టిట్యూట్ లో కవితా రాధేష్యం డిగ్రీ పట్టా పొందింది. ఆ తర్వాత సుభాష్ ఘాయ్ ఇన్ స్టిట్యూట్ విజిలింగ్ వుడ్స్ ఇంటర్నేషనల్ వారు నిర్మించిన షార్డు సినిమాల్లో నటించింది. వివాద ...

                                               

కింగ్ కాంగ్ (1933 సినిమా)

కింగ్ కాంగ్ 1933లో విడుదలైన అమెరికా సాహస చలనచిత్రం. మేరియన్ సి. కూపర్, ఎర్నెస్ట్ బి. స్కోడెసాక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఫే వ్రే, బ్రూస్ కాబోట్, రాబర్ట్ ఆర్మ్‌స్ట్రాంగ్ తదితరులు నటించారు. ఈ చిత్రం, ప్రపంచ సినీచరిత్రలో ఒకేసారి రెండు థియేటర్స్ లో విడుదలైన తొలి చిత్రంగా నమోదయింది. ఈ చిత్రం ఆల్ టైం గొప్ప చిత్రంగా, ఆల్ టైం హర్రర్ చిత్రంగా రొట్టెన్ టమాటోస్ వారిచే ధ్రువీకరించబడింది. 1991లో లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ యునైటెడ్ స్టేట్స్ నేషనల్ ఫిల్మ్ రిజిస్ట్రీలో "సాంస్కృతికంగా, చారిత్రాత్మకంగా, ఆకర్షణీయంగా ముఖ్యమైనది"గా ఈ చిత్రాన్ని ఎంపిక చేసింది.

                                               

గురి

గురి 2004, మార్చి 5 న విడుదలైన తెలుగు చలనచిత్రం. భరత్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీహరి, నవీన్ వడ్డే, సంఘవి, పొన్నాంబళం, ధర్మవరపు సుబ్రమణ్యం నటించగా, సురేష్ సంగీతం అందించారు.

                                               

గేట్ ఆఫ్ హెల్ (సినిమా)

గేట్ ఆఫ్ హెల్ 1953లో విడుదలైన జపాన్ చలనచిత్రం. ఈస్ట్ మాన్కోర్ ఉపయోగించి ఈ సినిమా చిత్రీకరించబడింది. గేట్ ఆఫ్ హెల్ సినిమా డాయి ఫిల్మ్ వారి మొట్టమొదటి రంగు చిత్రం, జపాన్ వెలుపల విడుదలైన మొట్టమొదటి జపనీస్ రంగు చిత్రం.

                                               

జాదూగాడు

జాదూగాడు 2015, జూన్ 26న విడుదలైన తెలుగు చలనచిత్రం. యోగి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాగశౌర్య, సోనారిక భాడోరియా, కోట శ్రీనివాసరావు, అజయ్ ముఖ్యపాత్రలలో నటించగా, సాగర్ మహతి సంగీతం అందించారు. ఇది సోనారిక భాడోరియా తొలి తెలుగు చిత్రం.

                                               

జోరుగా హుషారుగా

జోరుగా హుషారుగా 2002, సెప్టెంబర్ 13 న విడుదలైన తెలుగు చలనచిత్రం. చంద్రమహేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాహుల్, రుబీనా జంటగా నటించగా, మణిశర్మ సంగీతం అందించారు.

                                               

టూరింగ్‌ టాకీస్‌

టూరింగ్‌ టాకీస్‌ సినిమాలను ప్రదర్శించే ఒక సంస్థ. గత కాలంలో సినిమాలను ప్రదర్శించే సినిమా హాళ్ళూ ఎక్కువగా లేని కాలములో సినిమాలను ప్రదర్శించడానికి తాత్కాలికంగా ఒక డేరాను ఏర్పాటుచేసి అందులో సినిమాలను ప్రదర్శించేవారు. ఇవి కేవలము పల్లెటూర్లల్లో మాత్రమే ఏర్పాటు చేసేవారు. పట్టణాలలో ఆడిని సినిమాలను ఇందులో ప్రద్ర్శించే వారు. వీటిని ఒక ప్రాతంనుండి మరొక ప్రాంతానికి తరలించడానికి అనుకూలంగా వుండేవి. అందుకే వాటిని టూరింగు టాకీసులు అనేవారు. ఇందులో ప్రతి సినిమా సుమారుగా ఒక వారము మాత్రమే ప్రదర్శించేవారు. వారాంతములో అనగా చివరి రోజున ఆ తర్వాత ఆడబోయే సినిమాని, ప్రస్తుతము ఆడుతున్న సినిమాని కలిపి రాబోయే సినిమాని ...

                                               

డ్రాకులా (1931 సినిమా)

డ్రాకులా 1931, ఫిబ్రవరిలో విడుదలైన అమెరికా హర్రర్ సినిమా. యూనివర్సల్ పిక్చర్స్ నిర్మాణంలో టాడ్ బ్రౌంనింగ్ దర్శకత్వంలో బెలా లుగోసీ, హెలెన్ ఛాండ్లర్, డేవిడ్ మేనర్స్, డ్వైట్ ఫ్రే, ఎడ్వర్డ్ వాన్ స్లోన్ తదితరులు నటించిన ఈ చిత్రం, హామిల్టన్ డీన్, జాన్ ఎల్. బాల్డెస్టన్ 1924లో రాసిన డ్రాకులా నాటకం ఆధారంగా రూపొందించబడింది. ఈ రెండింటికి బ్రిటీష్ అబ్రహం స్టోకర్ 1897లో రాసిన డ్రాకులా అనే నవల మాలం.

Users also searched:

...
...
...