Топ-100
Back

ⓘ సమాజం, సినిమా. రాజసులోచన - ముత్యం గిరిజ - గౌరి కొంగర జగ్గయ్య - శంకర్ రాజబాబు రేలంగి - రమణయ్య ఆర్.నాగేశ్వరరావు - సింహాలు గుమ్మడి - డాక్టర్ నాగయ్య - వెంకటాచలం సి. ..
                                               

భక్తప్రహ్లాద (1931 సినిమా)

భక్తప్రహ్లాద తొలి తెలుగు టాకీ చిత్రము. హెచ్.ఎం.రెడ్డి నిర్మించిన ఈ చిత్రము సెప్టెంబర్ 15, 1931న విడుదలైనది. హిందీలో తొలి టాకీ ‘ఆలం ఆరా’ అర్దేషిర్‌ ఇరానీ తీశాడు. ఆయనకి తెలుగులోనూ, తమిళంలోనూ కూడా చిత్రాలు తియ్యాలనిపించింది. హెచ్‌.ఎమ్‌.రెడ్డి తెలుగువాడు గనక తెలుగు ‘భక్తప్రహ్లాద’ని, తమిళ కాళిదాసుని ఆయనకు అప్పజెప్పారు. అప్పట్లో ధర్మవరం రామకృష్ణమాచార్యులు రచించిన "భక్త ప్రహ్లాద" నాటకాన్ని సురభి నాటక సమాజం వారు వేస్తుండేవారు. ఆ నాటకసమాజంవారిని బొంబాయి పిలిపించి, వారితో చర్చించి, సినిమా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఈ చిత్రాన్ని బొంబాయిలోని కృష్ణామూవీటోన్ స్టూడియోలో తీశారు. అప్పుడు ఈ చిత్ర నిర్మాణ ...

                                               

రాఖీ (2006 సినిమా)

రాఖీ 2006 లో కృష్ణవంశీ దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో జూనియర్ ఎన్టీఆర్, ఇలియానా ప్రధాన పాత్రలు పోషించారు. తన చెల్లెలికి జరిగినటువంటి అన్యాయం మాత్రమే కాక మరేవిధమైనటువంటి అన్యాయమూ మరే ఆడపిల్లకూ జరగకూడదని రామకృష్ణ అనే యువకుడు సమాజం మీద జరిపిన పోరాటమే చిత్రకథ.

                                               

తెలుగు సినిమా

తెలుగు సినిమా లేదా టాలీవుడ్ హైదరాబాదు కేంద్రంగా పనిచేస్తున్న భారతీయ సినిమా లోని ఒక భాగము. తెలుగు సినిమా పితామహుడుగా సంబోధించబడే రఘుపతి వెంకయ్య నాయుడు 1909 నుండే తెలుగు సినిమాని ప్రోత్సాహానికై ఆసియా లోని వివిధ ప్రదేశాలకి పయనించటం వంటి పలు కార్యక్రమాలని చేపట్టాడు. 1921 లో భీష్మ ప్రతిజ్ఞ అను నిశబ్ద చిత్రాన్ని నిర్మించాడు. కోస్తాంధ్రలో ప్రప్రథమమైన ఫిలిం స్టూడియో అయిన దుర్గా సినీటోన్ ని నిడమర్తి సూరయ్య రాజమండ్రిలో స్థాపించాడు. తెలుగు సినిమా, తెలుగు నాటకరంగం, తెలుగు టీవీ ప్రసారాలలో అత్యున్నత ప్రతిభకి వేదిక హైదరాబాదు లోని లలిత కళాతోరణంలో జరిగే నంది అవార్డుల ప్రదానోత్సవం వేడుక. ఇది ఆంధ్రప్రదేశ్ ప్ ...

                                               

నాగభైరవ కోటేశ్వరరావు

నాగభైరవ కోటేశ్వరరావు ప్రముఖ కవి, సాహితీవేత్త, సినిమా మాటల రచయిత. సంప్రదాయ ఛందో కవితా రచనలలోనూ, ఇతర విధానాలలోనూ అందె వేసిన చేయి. సమాజం శ్రేయస్సు, అణగారిన వర్గాల పట్ల కరుణ ఇతని రచనలలో కనిపించే ప్రధానాంశాలు.

                                               

భక్త ప్రహ్లాద (1942 సినిమా)

భక్త ప్రహ్లాద 1942 లో వచ్చిన పౌరాణిక చిత్రం. శోభనాచల ప్రొడక్షన్స్ వారు చిత్రపు నారాయణరావు దర్శకత్వంలో ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రం విష్ణు భక్తుడైన ప్రహ్లాద కథే ఈ సినిమా. ఈ కథ ఆధారంగా తెలుగులో వచ్చిన రెండవ చిత్రం ఇది. మరింత ఆధునిక సాంకేతిక విలువలతో కూడుకుని ఉంటుంది. ఆ రోజుల్లో సురభి తెలుగు నాటక సమాజం ఉపయోగించిన డ్రామా వెర్షన్ ఆధారంగా ఈ సినిమా డైలాగులను రూపొందించారు. మొదటి భక్తప్రహ్లాద 1932 లో విడుదలైంది. ఇది తెలుగులో వచ్చిన మొట్టమొదటి టాకీ సినిమా కూడా.

                                               

వేములవాడ భీమకవి (సినిమా)

వేములవాడ భీమకవి 1976 లో వచ్చిన జీవితచరిత్ర చిత్రం. ఎన్‌టి రామారావు తన రామకృష్ణ సినీ స్టూడియోస్ బ్యానర్‌లో నిర్మించాడు డి. యోగానంద్ దర్శకత్వం వహించాడు. ఇందులో ఎన్.టి.రామారావు, నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలలో నటించగా, పెండ్యాల నాగేశ్వరరావు సంగీతం అందించాడు.

సమాజం (సినిమా)
                                     

ⓘ సమాజం (సినిమా)

 • రాజసులోచన - ముత్యం
 • గిరిజ - గౌరి
 • కొంగర జగ్గయ్య - శంకర్
 • రాజబాబు
 • రేలంగి - రమణయ్య
 • ఆర్.నాగేశ్వరరావు - సింహాలు
 • గుమ్మడి - డాక్టర్
 • నాగయ్య - వెంకటాచలం
 • సి.యస్.ఆర్ - జమీందారు
                                     

1. సంక్షిప్త చిత్రకథ

ఒకానొక డాక్టర్ తాను చదువుకొనే రోజుల్లో తప్పి పోయితన కూతురు క్రమంగా వెంకటాచలం అనే ఒక సజ్జనుడి వద్ద గౌరి అనే పేరుతో అల్లారు ముద్దుగా పెరుగుతుంది. గౌరిని జమీందారు కుమారుడైన శంకర్ పేమించి పెళ్ళి చేసుకుంటాడు. పెళ్ళికి ముందు వెంకటాచలం తనకు బిడ్డను ఇచ్చినవారు ఆపదలో ఉన్నారని వెళ్లి అక్కడ ప్రాణం కోల్పోయిన అభాగిని ఉత్తరక్రియలకు గౌరి వద్ద ఉన్న నెక్లెస్‌ను సింహాలుకు ఇస్తాడు. పెళ్ళి అయిన తర్వాత గౌరికి శంకర్ బహుమతిగా ఇచ్చిన ముప్పై అయిదు వేల రూపాయల నెక్లెస్‌ను కూడా సింహాలు దొంగిలించి, అంతకు ముందు ఇచ్చిన నెక్లెస్ తానే ఇచ్చినట్లు గౌరి చేత ఉత్తరం వ్రాయించుకుంటాడు. రెండో నెక్లెస్ దొంగతనం కేసులో సింహాలు పట్టుబడగానే అతడు గౌరి అమాయకంగా వ్రాసి ఇచ్చిన ఉత్తరాన్ని చూపిస్తాడు. దానితో గౌరి అగ్ని పరీక్షకు గురి అవుతుంది. పరిస్థితులన్నీ గౌరికి ప్రతికూలం కాగా, అంతస్తులూ, అంతరాలూ బలపడి జమీందారు కోడలిని ఇంటినుండి వెళ్లగొడతాడు. భర్త కూడా ఆమెను అనుమానిస్తాడు. దిక్కులేని గౌరిని మళ్ళా సింహాలు బంధించి వ్యామోహం కొద్దీ పెళ్ళి చేసుకోవాలని నర్తకి ముత్యం ఇంటిలో దాస్తాడు. ఆమె గౌరి చెర విడిపిస్తుంది. ముత్యం సహాయంతో జమీందారు గుమాస్తా రమణయ్య నిజాలు సేకరిస్తాడు. ఇంతలో దీపావళి రోజు ప్రమాదంలో శంకర్ కళ్లు పోతాయి. చివరకు శంకర్ అనుమానాలు తొలగిపోయి గౌరిని స్వీకరిస్తాడు.

                                     

2. పాటలు

ఈ చిత్రంలోని పాటలను మల్లాది రామకృష్ణశాస్త్రి, దైతా గోపాలం, కొసరాజు రాఘవయ్య చౌదరి వ్రాయగా అశ్వత్థామ వాటికి బాణీలను కూర్చాడు. ఈ సినిమాలోని పాటల వివరాలు:

 • అందమంటే నన్నడగరాదా బాలరాజో బంగారుసామి - జిక్కి, పిఠాపురం - రచన: కొసరాజు
 • సమాజమిదియేనా మానవ సమాజమిదియేనా - పి.బి. శ్రీనివాస్ - దైతా గోపాలం
 • చక్కని చుక్కా చిక్కాలంటే రాత వుండాలోయి - జిక్కి, పి.బి. శ్రీనివాస్ - రచన: కొసరాజు
 • ఎందుకీ కన్నుమూత కానరాని దేనిపైన మమత - జిక్కి - రచన: మల్లాది
 • కనుల నిదుర రాకపోతే పడ్డావనుకో ప్రేమలో - జిక్కి, పి.బి. శ్రీనివాస్ - రచన: ఆరుద్ర
 • నిన్నే నిన్నే ఏయ్ ఏయ్ వన్నెల చిన్నెల చిన్నారి - పిఠాపురం,కె.రాణి - రచన: కొసరాజు
 • జయ సీతారామ రామా జయ - పి.సుశీల, నాగయ్య - రచన: దైతా గోపాలం
 • గౌరీదేవి పెళ్ళండోయి కన్యల్లార రారండోయి - మనోహరి బృందం - రచన:దైతా గోపాలం
 • కనబడకుంటే నేమే వినబదకుంటే నేమే - పి.బి.శ్రీనివాస్ - రచన: కొసరాజు
విశ్వరూపం (సినిమా)
                                               

విశ్వరూపం (సినిమా)

విశ్వరూపం 1981, జూలై 25న విడుదలైన తెలుగు చలనచిత్రం. దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నందమూరి తారక రామారావు, జయసుధ, అంబిక అ నాయికానాయకులుగా నటించారు. విద్యార్థులు రాజకీయాలకు దూరంగా ఉండాలని, స్వార్థపరులైన రాజకీయ నాయకుల కుట్రలకు బలికావద్దని ప్రభోదించే చిత్రం విశ్వరూపం. స్వార్థ రాజకీయ కుట్రలకు సమాజం ఏవిధంగా బలి అవుతుందన్న విషయాన్ని దర్శకుడు చక్కగా వివరించాడు. ఇందులో కళాశాల అధ్యాపకునిగా, పచ్చిరౌడీగా ఎన్.టి.ఆర్. తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించారు.