Топ-100
Back

ⓘ అగ్ని పురాణము లో శ్రీమహావిష్ణువు ప్రధాన దైవంగా నడుస్తుంది. పురాణానికి కావలసిన ఐదు లక్షణాలు ఈ పురాణంలో ఉన్నాయి. అగ్ని వశిష్ఠుడికి చెప్పగా అదే విషయాన్ని వశిష్ఠుడు ..
                                               

వాయు పురాణము

వాయు పురాణము, శైవ పురాణము, dedicated to వాయువు, ఇందులో 24.000 శ్లోకములు ఉన్నాయి. ఈ పురాణము నాలుగు (పాదములుగ విభజించబడింది. ప్రక్రియ ఉపసంహర అనుసంగ ఉపోద్ఘాత బాణభట్టు తన రచనలైన కాదంబరి, హర్షచరిత్ర ఈ వాయు పురాణాన్ని గురించి ప్రస్తావించాడు. హర్ష చరిత్రలో ఈ గ్రంథం తన స్వగ్రామంలో తనకు చదివి వినిపించినట్లు చెప్పాడు. పర్షియన్ యాత్రికుడు అలె బెరూని కూడా తన రచనలో అష్టాదశ పురాణాల గురించి ప్రస్తావించాడు. అందులో వాయుపురాణం క్రీ.శ 600 కు పూర్వనుంచే అత్యంత పవిత్రమైన గ్రంథంగా లెక్కించబడేదని తెలియజేశాడు. ఈ పురాణంలో విశ్వం సృష్టి, పునఃసృష్టి, కాలాన్ని లెక్కించడం, అగ్ని, వరుణాది దేవతల మూలాల్ని, అత్రి, భృగు, అ ...

                                               

నాగమణి

నాగమణి అనగా హిందూ పురాణాల ప్రకారం నాగుపాము తల పై ఆభరణంగా ఉండే ఒక మణి. ఈ మణి గురించి అగ్ని పురాణము, వాయు పురాణం, విష్ణు పురాణం, భాగవత పురాణం, బ్రహ్మ పురాణము, మత్స్య పురాణం, మహా భారతము, గరుడ పురాణం వంటి గ్రంథాలలో ప్రస్తావించబడింది. పూర్వం నుండి నాగమణి అత్యంత విలువైన మణి అని, మంత్ర శక్తులు ఉన్నాయని హిందువుల గట్టి నమ్మకం ఇప్పటికీ ఉంది. పూర్వం అటవీతెగల్లో నాగుపాములను, పులి చర్మాలను ధరించిన వ్యక్తిని చాలా శక్తిమంతుడిగా భావించేవారు. వేదకాలంలో మొట్టమొదటి సారిగా మహా శివుడు ఆకారం రూపొందిస్తున్నప్పుడు శివుడి చేతులను, తలను నాగుపాముల చిత్రాలతో అలంకరించాడు. మణి అనేది మహిమ గల వస్తువుగా పూర్వం భావించబడేది ...

                                               

శివ పురాణము

అష్టాదశ పురాణాలలో శివ పురాణం ఒకటి. వాయవీయ సంహితలో చెప్పిన ప్రకారం ఇందులో 12 సంహితలు, లక్ష శ్లోకాలు ఉండేవట. కాని వేదవ్యాసుడు పురాణాలను పునర్విభజన చేసిన తరువాత ఇందులో 24.000 శ్లోకాలు ఉన్నాయి. వ్యాసుడు దీనిని తన శిష్యుడు రోమహర్షణునికి ఉపదేశించాడు.

                                               

నారసింహ పురాణము

నారసింహ పురాణము ఉపపురాణాలలో ఒకటి. ఆర్.సి. హజ్రా ఉపపురాణాలు గురించి తన అధ్యయనంలో ఇవి 5 వ శతాబ్దం యొక్క చివరి భాగంలో అసలు రచనలు రాసినట్లు నిర్ధారణకు వచ్చాడు, అయితే దానిలోని అనేక చాలా భాగాలు తరువాత చేర్చబడ్డాయి, ఈ ప గురించి 1300 లో తెలుగులోకి అనువదించబడింది. ఉపపురాణాలు ఒక వంద వరకు తెలియజేసాడు. వీటిలో చాలావరకు తాళపత్ర గ్రంథములుగా ఉన్నాయి. వీటిలో ప్రసిద్ధికెక్కినవి, ప్రచురించబడినవి చాలా తక్కువ మాత్రమే. ఉపపురాణములు అసంఖ్యాకములుగా వెలసి విస్తృతముగా విస్తృతి పొందాయనేది తెలుసుకోవచ్చును. ముద్రితమైన ఉపపురాణములను పరిశీలిస్తే అవి మహాపురాణములలోని అనేక విషయ అంశములు మథాతథముగా ఉన్నాయని తెలుస్తుంది. అలాగే ప ...

                                               

పురాణములు

అష్టాదశ పురాణాలను కృష్ణద్వైపాయనుడైన వ్యాసమహర్షి రచించాడని, రచించిన తాను వక్తగా కాకుండా ఆ విషయాలను ఒకప్పుడు నైమిశారణ్యంలో శౌనకుడు మొదలైన మహా మునులు దీర్ఘ సత్రయాగం చేస్తున్నప్పుడు, వారికి వ్యాసుని శిష్యుడైన రోమహర్షణుడు కుమారుడైన సూత మహర్షి ద్వారా చెప్పించాడని పురాణాలే చెబుతున్నాయి. ఈ పురాణాలు మధ్య యుగంలో జరిగిన శైవ, వైష్ణవ ఘర్షణల వలన పరివర్తన చెందాయి అనే వాదన కూడా లేక పోలేదు. కొన్ని శ్లోకాల రచన శైలి వ్యాస మహర్షి రచన శైలిని గమనిస్తే ఆ విషయం అవగతం అవుతుంది.

                                               

సప్తర్షులు

హిందూ సంప్రదాయములోను, పురాణ గ్రంథాలలోను ఏడుగురు దివ్యశక్తి గల తపస్సంపన్నులను సప్తర్షులు అని ప్రస్తావించారు. భారత సాంప్రదాయిక ఖగోళ విజ్ఞానంలో ఏడు నక్షత్రాలను కూడా సప్తర్షులు అంటారు. ఈ నక్షత్రాలను ఆంగ్లంలో ఖగోళశాస్త్రంలో "Big Dipper" లేదా "Ursa Major" అంటారు.

అగ్ని పురాణము
                                     

ⓘ అగ్ని పురాణము

అగ్ని పురాణము లో శ్రీమహావిష్ణువు ప్రధాన దైవంగా నడుస్తుంది. పురాణానికి కావలసిన ఐదు లక్షణాలు ఈ పురాణంలో ఉన్నాయి. అగ్ని వశిష్ఠుడికి చెప్పగా అదే విషయాన్ని వశిష్ఠుడు వ్యాసుడికి చెప్పగా, వ్యాసుడు తన శిష్యుడైన రోమ మహర్షి చేత సత్రయాగం జరుగుతున్నప్పుడు అవే విషయాలు అక్కడ ఉన్న ఋషులకు చెప్పాడని ఈ పురాణం చెబుతోంది. ఇందులో విష్ణువు అవతారాల గురించి, విశేషించి రామావతార౦, కృష్ణావతారాలగురించి, పృథ్వి గురించి ఉంది. యాగ పూజావిధానాలు, జ్యోతిశ్శాస్త్ర విషయాలు, చరిత్ర, యుద్ధము, సంస్కృత వ్యాకరణము, ఛందస్సు, న్యాయం, వైద్యం, యుద్ధ క్రీడలు వంటి అనేక శాస్త్రాలకు సంబంధించిన విషయాలు ఇందులో చోటు చేసుకొన్నాయి.

ఇది 8 - 9 శతాబ్దాల మధ్యలో రూపు దిద్దుకొన్నదని ఒక అభిప్రాయం ఉంది. 10-11 శతాబ్దాల మధ్య అని కూడా కొందరంటారు., ఈ కాలంలో ప్రస్తుత రూపానికి పరిణమించినా కాని, అసలు పురాణం అంతకంటే చాలా పురాతనమైనదని భావించవచ్చును.

                                     

1. శ్లోకాలు

అసలు ఈ పురాణంలో 12.000 శ్లోకాలు ఉన్నాయని ప్రథమ అధ్యాయం లోనూ, 15.000 శ్లోకాలు ఉన్నాయని చివరి అధ్యాయం లోనూ చెప్పబడింది. కాని ప్రస్తుత కాలములో 11.457 శ్లోకాలు మాత్రమే ప్రాచుర్యంలో ఉన్నాయి. అయితే ఈ పురాణంలో కొంత గద్య భాగంకూడా ఉంది. మధ్యయుగములో జరిగిన శైవ వైష్ణవ ఘర్షణ ల వల్ల కొన్ని శ్లోకాలు చొప్పించబడ్డాయనే వాదన కూడా లేకపోలేదు. వైష్ణవ పంచరాత్రము, భగవద్గీతలోని కొన్ని శ్లోకాలు చొప్పించబడ్డాయని, వైష్ణవచ్చాయ కల్పించబడిందనే వాదన కూడా ఉంది. మెదటి అధ్యాయంలో అగ్నిని విష్ణువుగా, రుద్రుడుగా, కాలాగ్నిగా వర్ణించారు. తరువాత అధ్యాయాలలో అగ్నిని విష్ణువుగా వర్ణించారు.

                                     

2. పురాణములో విశేషాలు

అగ్ని పురాణాన్ని తామాస పురాణంగా చెబుతారు. మొదటి అధ్యాయాలలో మత్య్స కూర్మ వరాహా అవతారాల గురించి చెప్పబడుతుంది, తరువాత రామాయణం చెప్పబడుతుంది, బుద్ధ అవతారం గురించి, కల్కి అవతారం గురించి సృశించబడుతుంది. శైవ, వైష్ణవ, శాక్త, సౌర ఆగమాలకు సంబంధించిన విషయాలు కూడా ఉన్నాయి. నారద, అగ్ని, హయగ్రీవ, భగవంతుల మధ్య సంవాదము ఉంటుంది. వాసుదేవ-సంకర్షణ-ప్రద్యుమ్న-అనిరుద్ధ-నారాయణ పూజావిధానము చెప్పబడింది. శివలింగ, దుర్గా, గణేశాది దేవత పూజావిధానాలు చెప్పబడ్డాయి.

                                     

3. విషయ సంగ్రహం

ఇప్పుడు లభిస్తున్న అగ్ని పురాణంలో 383 అధ్యాయాలున్నాయి. పురాణంలో చెప్పబడిన 50 విషయాల జాబితా చివరి అధ్యాయంలో మళ్ళీ చెప్పబడింది.

 • 2-4 అధ్యాయాలు - మత్స్య, కూర్మ, వరాహావతారాలు
 • 21-70 అధ్యాయాలు - నారదుడు, అగ్ని, హయగ్రీవుడు, భగవానుడు - వీరి మధ్య జరిగిన సంవాదము. ఇందులో స్నానాది కర్మ నియమాలు, హోమగుండం నిర్మాణము, ముద్రలు పూజలో వ్రేళ్ళు ఉంచవలసిన విధానం, వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధులను చతుర్వ్యూహాలు పూజించే విధానం, విగ్రహాలను ప్రతిష్ఠించే విధానం, విగ్రహ లక్షణాలు, సాలగ్రామ పూజా విధానం, ఆలయాలను బాగుచేసే విధం తెలుపబడినాయి.
 • 150వ అధ్యాయము - మన్వంతరములు, మనువుల నామములు
 • 106వ అధ్యాయము - నగరాలలో వాస్తు గురించి
 • 16వ అధ్యాయము - బుద్ధ, కల్కి అవతారాలు
 • 1వ అధ్యాయము - ఉఫద్ఘాతము, విష్ణువు అవతారాల వర్ణన
 • 338వ అధ్యాయము - సంస్కృత నాటకాల గురించి
 • 327వ అధ్యాయము - దేవాలయంలో లింగ ప్రతిష్ఠాపన గురించి
 • 339-340 అధ్యాయాలు - నాటక రీతులు, నటనలో భావాల వ్యక్తీకరణ
 • 109-116 అధ్యాయాలు - వివిధ తీర్ధాల గురించి
 • 151-167 అధ్యాయాలు - వివిధ వర్ణముల విధులు
 • 337వ అధ్యాయము - కవిత్వం, ఉపదేశాలు
 • 106వ అధ్యాయము - భువన కోశము విశ్వము యొక్క స్వరూపము
 • 168-174 అధ్యాయాలు - వివిధ పాపముల పరిహారముల గురించి
 • 121-149 అధ్యాయాలు - ఖగోళ, జ్యోతిష్య శాస్త్రముల విషయాలు
 • 336వ అధ్యాయము - వేదాలలో నాదం గురించి కొంత చర్చ
 • 13-15 అధ్యాయాలు - మహాభారత కథ
 • 5-11 అధ్యాయాలు - రామాయణం ఏడు కాండల సంక్షిప్త కథనం
 • 107వ అధ్యాయము - స్వయంభూ మను వృత్తాంతము
 • 369-370 అధ్యాయాలు - మానవ శరీర నిర్మాణ శాస్త్రము
 • 382వ అధ్యాయము - యమగీత
 • 1వ అధ్యాయము - హరివంశము
 • 360-367 అధ్యాయాలు - అమరకోశం లాంటి పదవివరణ
 • 249-252 అధ్యాయాలు - ధనుర్విద్య, వివిధ అస్త్రముల ప్రయోగము
 • 346-347 అధ్యాయాలు - కావ్యనిర్మాణం
 • 117వ అధ్యాయము - పితృదేవతల పూజల గురించి
 • 71వ అధ్యాయము - గణేశ పూజా వీధానం
 • 272వ అధ్యాయము - పురాణపఠన సమయంలో ఇవ్వవలసిన బహుమానముల గురించి. ఈ అధ్యాయంలోనే పురాణముల జాబితా, ఒక్కొక్క పురాణంలో ఉన్న శ్లోకాల సంఖ్య చెప్పబడింది.
 • 377-380 అధ్యాయాలు - వేదాంతము, బ్రహ్మజ్ఞానము
 • 279-300 అధ్యాయాలు - వైద్యశాస్త్రంలో విభాగాలు
 • 301-316 అధ్యాయాలు - సూర్యారాధన, వివిధ మంత్రాలు. ఇందులో 3009 నుండి 314వ అధ్యాయం వరకు త్వరితాదేవి ఆరాధనా మంత్రాలగురించి ఉంది.
 • 175-207 అధ్యాయాలు - వివిధ వ్రతములను ఆచరంచే విధానము
 • 72-105 అధ్యాయాలు -లింగారాధన, దేవి రూపాలు, హోమాగ్నిప్రజ్వలన, చందపూజ, కపిల పూజ, ఆలయాల పవిత్రీకరణ
 • 343-345 అధ్యాయాలు - వివిధ అలంకారముల గురించి. దండి రచించిన కావ్యదర్శనంలో ఉన్న విషయమే ఇక్కడ ఉంది.
 • 381వ అధ్యాయము - భగవద్గీత సంగ్రహము
 • 218-248 అధ్యాయాలు - రాజ్యపాలనా విధానములు
 • 254-258 అధ్యాయాలు - వ్యవహారము చట్టము, న్యాయము. మితాక్షరి అనే గ్రంథంలో ఉన్న విషయం చాలావరకు ఈ యధాతధంగా ఈ అధ్యాయంలో ఉంది.
 • 371వ అధ్యాయము - వివిధ నరకముల గురించి.
 • 273-278 అధ్యాయాలు - పురాణ వంశ చరిత
 • 348వ అధ్యాయం - ఒకే శబ్దంతో ఉన్న మాటల గురించి monosyllabic words.
 • 383వ అధ్యాయము - అగ్నిపురాణ ప్రశంస.
 • 372-376 అధ్యాయాలు - రాజయోగము, హఠయోగము గురించి
 • 349-359 అధ్యాయాలు - సంస్కృత వ్యాకరణం
 • 17-20 అధ్యాయాలు - పురాణం యొక్క ఐదు ముఖ్య లక్షణాలు
 • 341-342 అధ్యాయాలు - నాటకాలలో చలన విధానాలు - చేతులు వంటి అంగాల ద్వారా నటనను కనబరచే విధం
 • 317-326 అధ్యాయాలు - స్కందునితో ఈశ్వరుడు చెప్పిన విషయాలు - శివగణాల పూజ, వాగీశ్వరి, అఘోర, పశుపత, రుద్ర, గౌరి పూజ
 • 118-120 అధ్యాయాలు - పురాణముల ప్రకారం భూగోళ వర్ణన, వివిధ ద్వీపాల మధ్య దూరం
 • 259-271 అధ్యాయాలు - వేదముల గురించిన కొన్ని వియాలు
 • 328-335 అధ్యాయాలు - ఛందస్సు గురించి "పింగళ సూత్రాలు, వాటిపై వ్యాఖ్య