Топ-100
Back

ⓘ రోగ నిర్ణయ శాస్త్రము వైద్యశాస్త్రములోని ఒక ముఖ్యమైన శాఖ. వివిధమైన శరీర భాగాలు, వాటి ముక్కలు, కణాలు, ద్రవాలను పరీక్ష చేసి వ్యాధులను గుర్తించుట, పరిశోధంచుట దీని మ ..
రోగ నిర్ణయ శాస్త్రము
                                     

ⓘ రోగ నిర్ణయ శాస్త్రము

రోగ నిర్ణయ శాస్త్రము) వైద్యశాస్త్రములోని ఒక ముఖ్యమైన శాఖ. వివిధమైన శరీర భాగాలు, వాటి ముక్కలు, కణాలు, ద్రవాలను పరీక్ష చేసి వ్యాధులను గుర్తించుట, పరిశోధంచుట దీని ముఖ్యోద్దేశము.

                                     

1. చరిత్ర

పరిశోధనాత్మక, వైద్యశాస్త్రంలో రోగ నిర్ణయ శాస్త్రము అతి పురాతన కాలంలోని శాస్త్రీయ పద్ధతులను అభివృద్ధి చేసినకాలం నుండి ఉన్నది. ఇది సుమారు ఇటలీ లోని పునరుజ్జీవన కాలంతో ప్రారంభమైనది. ఆ కాలంలో సర్జన్లు, వైద్యులే ఈ పనికూడా చేసేవారు. ఆధునిక కాలంలో ఇది ఒక ప్రత్యేకమైన విభాగంగా అభివృద్ధిచెందినది.

                                     

1.1. చరిత్ర స్థూల రోగ నిర్ణయ శాస్త్రము

వివిధ వ్యాధుల్ని ఒక పద్ధతి ప్రకారం డిసెక్షన్ ద్వారా పరీక్షించడం పునరుజ్జీవనానికి పూర్వం తెలియదు. ఇలా డిసెక్షన్ ద్వారా వ్యాధి కారణాన్ని మొదటగా గుర్తించింది ఇటాలియన్ ఆంటోనియో బెనివైనీ 1443-1502. అయినా ఇందులో గ్రాస్ పెథాలజిస్ట్ జియోవనీ మోర్గాగ్నీ 1682-1771 ప్రసిద్ధిచెందిన వ్యక్తి. ఇతని రచన "De Sedibus et Causis Morborum per Anatomem Indagatis" 1761 లో ప్రచురించబడినది. ఇందులో సుమారు 600 పైగా ఆటాప్సీలు చేసి వాటి వివరాలు మరణానికి ముందు రోగుల వ్యాధి లక్షణాలతో పోల్చబడ్డాయి. అప్పటికే సామాన్యమైన అనాటమీ బాగా అభివృద్ధిచెందింది. అయినా డె సెడిబస్ మొదటిసారిగా వ్యాధులలో వచ్చే తేడాలను వ్యాధులకు పోల్చాడు. 19వ శతాబ్దంలో ఇది బాగా పరిణతి చెంది అప్పటికి తెలిసిన అన్ని వ్యాధుల గ్రాస్ అనాటమీ వివరాలు తెలిసాయి. అతి విస్తృతంగా పరిశోధన చేసి కార్ల్ రోకిటాన్స్కీ 1804-1878 20.000 ఆటాప్సీలు జరిపాడు.

                                     

1.2. చరిత్ర సూక్ష్మ రోగ నిర్ణయ శాస్త్రము

జర్మనీ వైద్యుడు రుడాల్ఫ్ విర్కో Rudolf Virchow 1821-1902 సూక్షశాస్త్ర పితామహునిగా పేర్కొంటారు. అప్పటికి సూక్ష్మదర్శిని కనుగొని 150 సంవత్సరాలైనా, విర్కో మొదటిసారిగా వ్యాధి లక్షణాల్ని కణాలలోని మార్పులతో పోల్చాడు. ఇతని శిష్యుడు జూలియస్ కాన్హీమ్ Julius Cohnheim 1839-1884 సూక్ష్మమైన మార్పులను ప్రయోగశాలలో ఇన్ఫ్లమేషన్ గురించి పరిశోధించాడు. ఇతడు ఫ్రోజెన్ సెక్షన్ Frozen section పద్ధతిని ప్రారంభించాడు. ఇది ఆధునిక కాలంలో శస్త్రచికిత్స సమయంలోనే రోగనిర్ధారణ చేసే అవకాశం కలిగింది.

                                     

2. ఆధునిక రోగ నిర్ణయ శాస్త్రము

ఆధునిక పరిశోధన పద్ధతులైన ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని Electrom Microscope, ఇమ్యునో హిస్టో కెమిస్ట్రీ Immunohistochemistry, మోలెక్యులర్ జీవశాస్త్రం Molecular Biology విస్తృతంగా అభివృద్ధి చెంది వీటిని వ్యాధుల నిర్ధారణ మాత్రమే కాకుండా మరెన్నో క్లిష్టమైన నిర్ణాయాల్ని తీసుకోవడంలో ఉపయోగపడుతున్నది. బాగా విస్తృతమైన భావంతో చూస్తే పరిశోధనలన్నీ కణాలు, కణజాలాలు, అవయవాలలో జరిగే మార్పులన్నీ పేథాలజీ విభాగంలోనే ఉన్నాయి.

                                     

3. రోగ నిర్ధారణ, ఒక శాస్త్రము

పేథాలజీ విస్తృతమైన, క్లిష్టమైన శాస్త్రీయ పద్ధతి ద్వారా కణాలు, కణజాలాలలో వివిధ పరిస్థితులలో జరిగే మార్పుల్ని, రోగాన్ని/గాయాన్ని నయం చేసే క్రమం లో శరీరం స్పందించు విధానాన్ని గుర్తిస్తుంది. వీనికి కారకాలను వివరిస్తుంది. రోగం పెరుగుట, తగ్గుట చాలా విషయాల పైన ఆధారపడి ఉంటుంది.ఉదా:- అంతర బాహ్య కారణాలు అనగా శరీర గాయాలు, అంటురోగాలు, విష ప్రభావము, రక్త ప్రసరణ ఆగిపోవడము, జన్యు పరివర్తనాలు, స్వయం రోగనిరోధక శక్తి autoimmunity మొదలగునవి.కొన్నిసార్లు పేథాలజీ లో గాయాన్ని నయం చేయడానికి శరీరం స్పందించే విధానం కూడా కొన్ని కొత్త రోగాలకు దారి తీస్తుంది. Elucidation of general principles underlying pathologic processes, such as cellular adaptation to injury, cell death, inflammation, tissue repair, and neoplasia, creates a conceptual framework with which to analyze and understand specific human diseases.

                                     

4. ప్రధానమైన వైద్య విభాగము

పేథాలజీ లో పనిచేసే వైద్యులు బ్రతికున్న రోగుల నుండి తీసిన శరీరభాగాల్ని పరీక్షించి రోగ నిర్ధారణ చేస్తారు. ఉదాహరణకు చాలా వరకు కాన్సర్ Cancer వ్యాధిని నిర్ధారించేది పేథాలజిస్ట్. వీరు ఆటాప్సీలు నిర్వహించి మరణానికి కారణాలను కూడా పరిశోధిస్తారు. ఆధునిక పేథాలజిస్ట్ లు ఇవే కాకుండా పరిశోధన Research కూడా చేయగలరు. పేథాలజీ నిపుణులు సామాన్యంగా రోగుల్ని పరీక్షించరు. వీరు వైద్యులకు కన్సల్టెంట్లుగా పనిచేస్తారు.

                                     

4.1. ప్రధానమైన వైద్య విభాగము సర్జికల్ పేథాలజీ

అనటామికల్ పేథాలజీ Anatomical pathology లేదా సర్జికల్ పేథాలజీ Surgical pathology నిపుణులు కణాల్ని, కణజాలాల్ని పరీక్షించి వ్యాధి నిర్ధారణ చేస్తారు. ఇందులోనే స్థూల, సూక్ష్మ రోగనిర్ణయ విభాగాలున్నాయి. వర్ణకాలు ఉపయోగించి, ఇమ్మునాలజీ పరీక్షలు చేసి కణాలలోని ఇతర పదార్ధాలను గుర్తింపు ఇందుకు సహాయం చేస్తుంది. వీరే కాన్సర్ ను గుర్తించేది.

అయితే సర్జికల్ పేథాలజీ అన్ని విభాగాల కన్నా చాలా క్లిష్టమైనది, ఎక్కువ సమయం పట్టేది. తొలగించిన శరీర భాగాల్ని పరీక్షించి, వాటినుండి నిర్ణితమైన ప్రదేశాల నుండి చిన్న చిన్న ముక్కలను Grossing ఫార్మలిన్ లో ఫిక్సింగ్ Fixation చేసి, వివిధ రసాయనాల ద్వారా ప్రోసెసింగ్ Tissue processingచేసి చివరికి మైనంలో ఎంబెడింగ్ Embedding చేస్తారు. ఆ తరువాత వాటిని మైక్రోటోమ్ Microtome ఉపయోగంతో చాలా పలుచని పొరలుగా సున్నితమైన బ్లేడుతో పలుచని పొరలుగా కత్తిరించి Section cutting వాటికి వివిధ వర్ణకాలు వేస్తారు. తర్వాత వాటిని సూక్ష్మదర్శిని ద్వారా పరీక్షించి కణాలలోని మార్పుల ఆధారంగా వ్యాధుల్ని నిర్ణయిస్తారు.

                                     

4.2. ప్రధానమైన వైద్య విభాగము సైటో పేథాలజీ

సైటో పేథాలజీ Cytopathology లో సూక్ష్మదర్శిని ఉపయోగించి ద్రవాలలోని కణాల్ని మొత్తంగా పలుచని పొరలుగా చేసి లేదా సన్నని సూది సాయంతో రోగి శరీరం నుంచి తొలగించి వాటిని వర్ణకాలు వేసి పరిశీలించి రోగ నిర్ధారణ చేస్తారు.

                                     

4.3. ప్రధానమైన వైద్య విభాగము క్లినికల్ పేథాలజీ

క్లినికల్ పేథాలజీ Clinical pathology లేదా ప్రయోగశాల వైద్యం Laboratory medicine ఒక రోగ నిర్ణయ విభాగము. ఇందులో వివిధ వ్యాధుల్ని శరీర ద్రవాలను పరీక్షించి నిర్ణయిస్తారు. ఆధునిక క్లినికల్ పేథాలజీ లో ఎక్కువగా సామాన్యమైన పరీక్షలు ఆటోమేటిక్ యంత్రాల ద్వారా జరుగుతాయి. పేథాలజిస్ట్ బాధ్యత వీటిని నియంత్రించడం, నాణ్యత పరిరక్షణ, సాంకేతిక నిపుణులను పర్యవేక్షణ మొదలైనవి.

                                     
  • క రణ న న న ర ధ ర చడ కష ట వ ద య న మ త త అభ ప ర య ర గ న ర ధ రణ చ యడ న క మ నహ య చట న క న ర ణయ న యమ ల ప రక ర కన స మ చ ద ప రప చ ఆర గ య స స థ ప ల లలల

Users also searched:

...