Топ-100
Back

ⓘ పాతపాడు, విజయవాడ గ్రామీణ. విజయవాడ రూరల్ మండలంలోని ఎనికెపాడు, కుందావారి ఖండ్రిక, కొత్తూరు, గూడవల్లి, గొల్లపూడి, జక్కంపూడి, తాడేపల్లి, దోనె ఆత్కూరు, నిడమానూరు, ను ..




                                     

ⓘ పాతపాడు (విజయవాడ గ్రామీణ)

విజయవాడ రూరల్ మండలంలోని ఎనికెపాడు, కుందావారి ఖండ్రిక, కొత్తూరు, గూడవల్లి, గొల్లపూడి, జక్కంపూడి, తాడేపల్లి, దోనె ఆత్కూరు, నిడమానూరు, నున్న, పాతపాడు, పైదూరుపాడు, ప్రసాదంపాడు, ఫిర్యాది నైనవరం, బోడపాడు, రామవరప్పాడు, రాయనపాడు, వేమవరం, షహబాదు, సూరాయ పాలెం గ్రామాలు ఉన్నాయి.

                                     

1. గ్రామ భౌగోళికం

సముద్ర మట్టంనుండి 21 మీ.ఎత్తు

సమీప గ్రామాలు

ఈ గ్రామానికి సమీపంలో అంబాపురం, కె.తాడేపల్లి, పాయకపురం, సూరంపల్లి గ్రామాలు ఉన్నాయి.

                                     

2. గ్రామంలోని సాగు/త్రాగునీటి సౌకర్యం

సుబ్బమ్మ చెరువు:- నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా, 2017,మే-29న ఈ చెరువులో పూడికతీత కార్యక్రమం ప్రారంభించారు. ఈ విధంగా చెరువులో త్రవ్విన మట్టిని, రైతులు తమ పొలాలకు తరలించుకొనడమేగాక, పేదల ఇళ్ళు మెరక చేసుకొనడానికీ, పంచాయతీ పనులకూ ఉపయోగించుకొనడం విశేషం.

                                     

3. గ్రామ పంచాయతీ

  • ఈ గ్రామ పంచాయతీ భవనాన్ని 1964 ప్రాంతాలలో నిర్మించారు. ఈ భవనంలోనే తపాలా కేంద్రం, డ్వాక్రా, రైతుల సదస్సులు, సర్పంచి, కార్యదర్శులకు సంబంధించిన కార్యక్రమాలు నడుపుచున్నారు. ఈ భవనం శిథిలావస్థకు చేరినది.
                                     

4. గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

శ్రీ రామాలయం

ఈ గ్రామంలోని రామాలయంలో, ప్రతి సంవత్సరం, శ్రీరామనవమి సందర్భంగా, ప్రత్యేక పూజలు నిర్వహించి, శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహించెదరు.

                                     

5. గణాంకాలు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2980. ఇందులో పురుషుల సంఖ్య 1532, స్త్రీల సంఖ్య 1448, గ్రామంలో నివాస గృహాలు 738 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1349 హెక్టారులు.

జనాభా 2011 - మొత్తం 3.371 - పురుషుల సంఖ్య 1.754 - స్త్రీల సంఖ్య 1.617 - గృహాల సంఖ్య 957