Топ-100
Back

ⓘ వృత్తులు ..
                                               

దర్జీ

వస్త్రాలు, దారంతో బట్టలు లేదా దుస్తులు కుట్టే టైలర్ దర్జీ.వేలాది ముస్లిం కుటుంబాలు దర్జీ పనిలో ఉన్నాయి.రెడీమేడ్‌ బట్టలు విరివిగా రావడం యువత దానిమీద మోజుతో ఎక్కువ ఆసక్తి చూపుతూ కొనుగోలు చేయడంతో దర్జీల దగ్గర బట్టలు చేసి కుట్టించుకొనేవారు తక్కువయ్యారు. దీనితో వీరి జీవన భృతికి ఆటంకం ఏర్పడి కుటుంబ పోషణ జరగడం కష్టంగా తయారైంది. రెడీమేడ్‌ వస్త్రాలు తక్కువ ధరకు దొరకడం, తోపుడు బండ్లపైన సైతం టీషర్టులు, జీన్‌‌ప్యాంట్లు విరివిగా దొరుకుతున్నాయి. సంతలో సైతం రెడీమేడ్‌ దుస్తులు విక్రయిస్తుండటంతో గ్రామీణ ప్రాంతాలకు చెందిన నిరుపేదలు వాటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. దానికి తోడు కుట్టడానికి అవస ...

                                               

నాట్యాచార్యుడు

నర్తకులకు నాట్యం నేర్పే గురువును నాట్యాచార్యుడు అంటారు. ముఖ్యంగా శాస్త్రీయ పద్ధతులను అనుసరించి నాట్యాచారుడు తన శిష్యులకు నాట్యాన్ని నేర్పిస్తాడు. శాస్త్రీయ నృత్యం నేర్పించే నాట్యాచారుడు నాట్యం నేర్పించే సమయంలో సంప్రదాయ దుస్తులను ధరించి ఉంటాడు. నర్తకుడు నాట్యం ద్వారా తన హావ భావాలను వెలిబుచ్చడానికి అవసరమైన మెలుకువలను ఇతను నేర్పిస్తాడు. నాట్య గురువు తన సంపాదన కోసమే కాక నాట్యకళను కలకాలం బ్రతికేందుకు శాయ శక్తుల కృషి చేస్తాడు, కొత్త నాట్యాచార్యులను తయారు చేస్తాడు. భారతీయ కళా వైభవాన్ని ప్రపంచ నలుమూలలా ప్రసరింప చేస్తున్న వారిలో నాట్యాచార్యుని యొక్క పాత్ర ప్రముఖమైనది.

                                               

నావికుడు

నావ నడుపు వ్యక్తిని నావికుడు లేదా ఓఁడంగి అంటారు. నావ అనగా పడవ, లేదా ఓఁడ సాధారణంగా సముద్రాలలో ఓడ నడిపే వ్యక్తినే నావికునిగా వ్యవహరిస్తారు. స్త్రీలింగ వాచకము నావిక లేదా ఓఁడంగిని. నావికుడు సరియైన దిశలో నావను నడిపి గమ్యస్థానానికి సరియైన సమయానికి చేర్చవలసిన బాధ్యతను కలిగి ఉంటాడు. ప్రధానంగా నావికుడు అన్ని సమయాల్లో తాను నడుతున్న ఓడ ఏ స్థానంలో ఉందో తెలుసుకోగల ప్రాథమిక పరిజ్ఞానాన్ని కలిగి ఉండాలి. నావికుడు ఓడ యొక్క నాటికల్ పటాలు, నాటికల్ ప్రచురణలు, మార్గదర్శిని సామగ్రిని నిర్వహించడం, సాధారణంగా వాతావరణ పరికరాలు, సమాచార బాధ్యతలను నిర్వహిస్తాడు.

                                               

న్యాయమూర్తి

వంద మంది దోషులు తప్పించుకున్నప్పటికి ఒక నిర్దోషికి కూడా శిక్ష పడకూడదనే భారతదేశ సాంప్రదాయంలో న్యాయమూర్తి తన, పర అనే భేదం లేకుండా న్యాయమైన తీర్పును ఇవ్వవలసి ఉంటుంది.

                                               

న్యాయవాది

న్యాయవాది ని ఆంగ్లంలో లాయర్ అంటారు. న్యాయం కోసం వాదిస్తాడు కాబట్టి ఇతనిని న్యాయవాది అంటారు. న్యాయస్ధానంలో కక్షి, ప్రతికక్షి దారుల మధ్య వ్యాజ్యపరమైన వివాదం జరుగునప్పుడు ఇరువర్గాలలో ఒకరి పక్షమున ఒకల్తా పుచ్చుకొని, వారి తరుపున, వారిని సమర్థిస్తూ, న్యాయమూర్తి ఎదుట తన చట్టబద్దవాదనలు వినిపించెవాడు న్యాయవాది. ఇతనిని ప్లీడరు, వకీలు, అడ్వకేటు అని కూడా పిలుస్తారు. వ్యాజ్యాలు రెండు రకాలు. ఒకటి సివిల్, మరొకటి నేరసంబంధమైన క్రిమినల్. సివిల్ కేసులు వాదించే లాయరుని సివిల్ లాయరని, నేరాలకు సంబందించిన కేసులను వాదించే అడ్వకేటును క్రిమినల్ న్యాయవాది అంటారు. న్యాయవ్యాధి పట్టబద్రుడై వుండి బి.ఎ; బి.కాం; బి.ఎస్సి, ...

                                               

పల్లెల్లో కులవృత్తులు

రైతులు దేశానికి వెన్నెముక అంటారు. రైతులు నివసించేది పల్లెల్లోనే. రైతు అంటే వ్యవసాయదారుడు. దేశానికి ఆహారం పెట్టగలిగిన వాడు రైతు. దేశ జనాభాలో అధిక శాతం వ్యవసాయదారులే. వీరు ప్రకృతి కరుణా కటాక్షం మీద అధార పడి బ్రతుకుతున్నారు. రైతుల మీద ఆధారపడి అనేక కుల వృత్తుల వారు ఉన్నారు. నిజానికి రైతులు, కులవృత్తి పనివారు ఒకరి మీద ఒకరు అదార పడి ఉన్నారు. ఆ ఇద్దరి బాంధవ్యం ఎంతగా పెనవేసుకుని పోయిందంటే ఒకరు లేనిదే మరొకరు లేరనే విధంగా వుండేది. ఇదంతా గతం. భూమిని నమ్ముకొని ప్రకృతి మీద ఆధార పడిన రైతులు వర్షాలు లేక వారి జీవన విధానము విచ్ఛిన్నమైనది. రైతులనే అంటి పెట్టుకొని వున్న ఈ కులవృత్తి పని వారి జీవన విధానము కూడా ...

                                               

పురోహితుడు

పౌరోహిత్యాన్ని బ్రాహ్మణ కులవృత్తిగా ప్రభుత్వం గుర్తించాలి: పుర హితవు కోరే పోరోహిత్యాన్ని బ్రాహ్మణ కులవృత్తిగా గుర్తించి వారిని సామాజికంగా,ఆర్ధికంగా రాజకీయంగా ఆదుకోవలసిన భాధ్యత ప్రభుత్వాలపై ఉంది.ప్రతి కులానికి కుల వృత్తి ఉంది కమ్మై కుమ్మరి వడ్రంగి అలా అందరికీ కు వృత్తి కేటాయించి వారి వారి వృత్తులలో రాయితీలు అందించి వారు ఆర్ధికంగా నిలదొక్కుకొనేందుకు చేయూతనిస్తున్నాయి. అయితే సమాజ శ్రేయస్సే పరమావధిగా సర్వేజనాః సుఖినోభవంతు అంటూ హైదవ ధర్మాన్ని పరిరక్షించడంలో కీలక పాత్ర పోషిస్తున్న పౌరోహిత్యాని ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం బ్రాహ్మణ కుల వృత్తిగా గుర్తించాలని ఆంద్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య విజ్నప్త ...

                                               

మంగలి

కేశఖండన, కేశాలంకరణ చేసే వ్యక్తిని క్షురకుడు లేదా మంగలి అంటారు. సామాన్యంగా వీరిలో నాయీ బ్రాహ్మణ కులస్తులు ఎక్కువగా ఉంటారు. మంగళ వాయిద్యాలు వాయించేవారు కనుక మంగళ అని పేరు వచ్చింది. దేశంలో అనేక ప్రాంతాల్లో ముస్లింలు కూడా నాయీ వృత్తి చేస్తున్నారు. మనదేశంలో ఎక్కువగా మంగలి కులస్తులే క్షౌరవృత్తిని ఆచరించినా అక్కడక్కడా ఇతరులు కూడా ఈ వృత్తిని ఆచరిస్తున్నారు. హైదరాబాదు, నెల్లూరు లోని కొన్ని ప్రాంతాలలో మహమ్మదీయులు ఈ వృత్తిని ఆచరిస్తున్నారు. అలాగే కొన్ని అరబిక్ దేశాలలో కూడా ఇతర మతస్తులు ఈ వృత్తిని ఆచరిస్తున్నారు.

                                               

మగ్గం

1404 లో ఇది వస్త్రాలుగా నేత దారం ప్రారంభించడానికి ఉపయోగించే ఒక యంత్రం అని అర్థం. 1838 నాటికి ఇది దారం నూలు తో వస్త్రాలను తయారి యంత్రం అని వాడుకరిలోకి వచింది.

                                               

మావటి

మావటి అంటే ఏనుగును మచ్చిక చేసుకునే వారు. ఏనుగును మచ్చిక చేసుకునే వృత్తి వీరికి వంశ పారంపర్యంగా సంక్రమిస్తుంది. వీళ్ళకు చిన్నప్పుడే ఒక ఏనుగును అప్పగించి అది ముసలిదైపోయే దాకా దాన్నే అంటిపెట్టుకుని ఉంటారు. ఏనుగును నియంత్రణలో ఉంచడానికి వాడే పరికరాన్ని అంకుశం అంటారు. దీంతో దాని శరీరంపై పొడవడం ద్వారా తమ ఆధీనంలో ఉంచుకుంటారు. సంస్కృతంలో వీళ్ళను రెగావాన్, యుక్తిమాన్, బల్వాన్ అని మూడు రకాలుగా వర్గీకరించారు. రెగావాన్ అంటే ప్రేమతో లొంగదీసుకునే వారు. యుక్తిమాన్ అంటే తెలివితో లొంగదీసుకునే వారు. బల్వాన్ అంటే శక్తితో లొంగ దీసుకునేవారు.