Топ-100
Back

ⓘ వృత్తులు ..
                                               

కుటీర పరిశ్రమ

కుటుంబంలో సభ్యులతో నడిపే చిన్న పరిశ్రమలను కుటీర పరిశ్రమ అంటారు. ఇవి పెట్టుబడి తక్కువగా పరిశ్రమ ఎక్కువగా కలిగి ఉంటాయి. కుటీర పరిశ్రమ అంటే గృహ పరిశ్రమ. సమాజానికి అవసరమైన వస్తువులని చిన్న చిన్న పనిముట్ల ద్వారా తక్కువ ఖర్చుతో ఇంట్లో గానీ లేదా ఏదైనా చిన్న ప్రదేశంలో ఆయా వస్తువులను తయారు చేయటం కుటీర పరిశ్రమగా పరిగణించవచ్చు, ఈ కుటీర పరిశ్రమలకు పెద్దగా పెట్టుబడి అవసరం ఉండదు. చాలామంది వారి వృత్తిపనులు,కుల వృత్తులతో భాగంగా కుటీర పరిశ్రమ నిర్వహిస్తున్నారు. ఈ పరిశ్రమలకు ఆర్థిక వ్యవస్థలలో విశేషమైన స్థానం ఉంది.కుటీర పరిశ్రమలొ ఈ క్రింది అంశాలు ప్రాముఖ్యత వహిస్తాయి కుటుంబసభ్యుల తోర్పాటు వుంటే వారి నైపుణ్యం ...

                                               

కౌలు రైతు

రైతుల్లో నాలుగో వంతు రైతులు కౌలుదారులు న్నారు. వారి సంఖ్య ఇంకా ఎక్కువనేది బ్యాంకర్ల భావన. మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు తీసుకునే భూముల కౌలుకు చట్టబద్ధత కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కౌలు కు ఇచ్చేవారు, తీసుకునే వారి ప్రయోజనాల పరిరక్షణ కోసం ఈ చట్టాన్ని రూపొందించారు.స్వయం సహాయక సంఘాల్లో భూమి లేని నిరుపేద మహిళలు ఉమ్మడిగా వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తుంది. వ్యవసాయ భూముల ఒప్పందాలు రాత పూర్వకంగా చేసుకోవాలి. కౌలు కాలపరిమితి కనీసం 5 సంవత్సరాలు ఉండాలి. భూమిపైన పంట రుణం తీసుకునే అర్హత కౌలుదారుకు కలుగుతుంది. పంటలు దెబ్బతిన్న సందర్భంలో పంటల బీమాయేగాక ప్రభుత్వం ఇచ ...

                                               

క్షౌరశాల

క్షౌరశాల స్త్రీ పురుషుల అందాలకు మెరుగులు దిద్దే ఒక ప్రదేశము. వీటిని సౌందర్య శాల లని కూడా పిలుస్తారు. ఇవి స్త్రీ పురుషులకు విడి విడి గానూ లేదా కలసి కూడా ఉంటాయి. పల్లెలలో వీటిని మంగలి అంగడి అని వ్యవహరిస్తారు.

                                               

గూఢచర్యం

గూఢచర్యం అంటే ఏదైనా ఒక రహస్య సమాచారం కలిగిన వారి నుంచి వారికి తెలియకుండా దక్కించుకోవడం, లేదా బయలు పరచడం. ఈ పనిని చేసేవారిని గూఢచారులు, లేదా వేగులు అంటారు. వీళ్ళు రహస్య సమాచారాన్ని సేకరించి తమ సంస్థకు చేరవేస్తారు. ఏ ఒక వ్యక్తి అయినా, లేదా బృందం అయినా ఒక ప్రభుత్వం తరఫున, లేదా ఒక సంస్థ తరఫున, లేదా స్వతంత్రంగా గూఢచర్యం చేయవచ్చు. గూఢచర్య కార్యక్రమాలు సాధారణంగా రహస్యంగా, ఎవరికీ తెలియకుండా జరిగిపోతుంటాయి. కొన్ని సందర్భాల్లో ఇవి న్యాయ సమ్మతమైనవి, మరికొన్ని సందర్భాల్లో ఇవి చట్టవిరుద్ధమైనవి కూడా. బయటి ప్రపంచానికి తెలియని మూలాలను శోధించి సమాచారాన్ని వెలికితీయడం గూఢచర్యంలో భాగం. గూఢచర్యం అనేది తరచుగా ...

                                               

చేతి పనులు

చేతివృత్తులు, కులవృత్తులు మన సమాజంలో అనాదిగా ఉన్నాయి. ఆయా వృత్తుల పేర్లతోనే కులాలు ఏర్పడ్డాయి. అయితే ఈనాడు కులవృత్తులు కుప్పకూలుతున్నాయి. ఈ వృత్తుల్నే నమ్ముకున్న వారి జీవితాలు తెల్లారిపోతున్నాయి. ఆధునిక పనిముట్లు ఉన్న ఉపాధిని దెబ్బతీస్తున్నాయి. చేతిలో చేవఉన్నా పనిలేక బలహీనవర్గాలు నలిగిపోతున్నాయి. ఆధునిక పరిస్థితులకు తగ్గట్లుగా చేతివృత్తుల్ని తీర్చిదిద్ది ఉపాధి కల్పించాలి. 11 బీసీ కులాలకు సమాఖ్యలు ఏర్పాటుచేసింది ప్రభుత్వం.ప్రభుత్వం

                                               

ఛాయా గ్రాహకుడు

ఛాయాగ్రాహకుడి ని ఇంగ్లీషులో ఫోటోగ్రాఫర్ అంటారు. ఫోటోగ్రాఫర్ అనే పదం గ్రీకు భాష నుండి ఉద్భవించింది. ఫోటోగ్రాఫ్స్ అనగా గ్రీకు అర్ధం కాంతితో చిత్రాలను గీయడం లేక వ్రాయడం లేక చిత్రించడం. కెమెరా ద్వారా చిత్రాలను చిత్రించే వ్యక్తిని ఫోటోగ్రాఫర్ అంటారు. వృతి పరంగా ధనం సంపాదించడానికి కొందరు ఈ పనిని ఎన్నుకుంటారు. కొంతమంది ఔత్సాహిక చాయా గ్రాహకులు తమ బంధువుల కోసం, స్నేహితుల కోసం కొంత సమయం ఈ పనిని చేపడతాడు. ఒక వ్యక్తి తన ఆనందం కోసం తనను తాను కెమెరాలో బంధించుకోవడం లేక తాను చూస్తున్న వాటిలో మళ్ళీ మళ్ళీ చూడాలనుకున్న కొన్ని ప్రదేశాలను కెమెరాలో బంధించడం చేస్తుంటాడు. మరికొందరు ఆధారాల కోసం కొన్ని చిత్రాలను బం ...

                                               

చర్మకారుడు

చర్మ సంబంధ వస్తువులు అనగా చెప్పులు మొదలగువాటిని తయారు చేయువారిని చర్మకారులని అంటారు. ఈ వృత్తిని ఎక్కువగా మాదిగ కులానికి చెందినవారు నిర్వర్తిస్తుండేవారు. ఉత్తర భారతదేశంలో వీరిని అస్పృశ్యులుగా చూస్తారు. వీరు ఈరోజు షెడ్యూలు కులాల కింద వర్గీకరించబడ్డారు. వీరు భారతదేశమంతటా, పాకిస్తాన్, నేపాల్ లో కనిపిస్తారు. రాం నారాయణ్ రావత్ ప్రకారం చర్మకారుల కులం చెప్పులలాంటి జంతుచర్మ సంబంధ వస్తువుల అవసరం పెరిగినప్పటి నుండి ఆవిర్భవించింది అనీ, అంతకు ముందు వీరు కర్షకులనీనూ.

చేనేత
                                               

చేనేత

చేనేత ప్రసిద్ధి చెందిన ఒక కుటీర పరిశ్రమ. పద్మశాలీల కుల వృత్తి. ఈ పరిశ్రమకు స్నుసంధానంగా మరికొన్ని చేతి పనులు వృత్తులు ఉన్నాయి. ఈ పరిశ్రమలో ఉపయోగించు వస్తు సముదాయం. మగ్గం దీని ద్వారా వస్త్రం తయారగును నూలు దీనిని మగ్గం పై అల్లుతూ వస్త్రం తయారు చేస్తారు రాట్నం దారాన్ని క్రమ పద్ధతిలో మగ్గానికి అందించు సాధనం

దర్శకుడు
                                               

దర్శకుడు

దర్శకుడు అనగా ఛలనచిత్రానికి మార్గనిర్దేశకుడు. ఛలనచిత్రానికి సంబంధించి ఇరవై నాలుగు శాఖలను సమన్వయపరిచీ సమర్ధవంతంగా ఆయా శాఖల నుండి తనకు కావలసిన విధముగ వారి వారి సామర్ధ్యన్ని ఉపయొగించుకుని తన ఆలొచనలకు ప్రాణం పోసి తెరపైకి ఒక దృశ్యముగ మలచే వ్యక్తిని దర్శకుడు అని సంభొధిస్తారు.

పోలీసులు
                                               

పోలీసులు

శాంతి భద్రతలను సంరక్షిస్తూ, ప్రజల జీవితాలకు, ఆస్తులకూ రక్షణ కల్పిస్తూ, నేరాలు, విధ్వంసాలూ జరక్కుండా కాపాడేందుకు ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన వ్యవస్థ పోలీసు.

వృత్తులు
                                               

వృత్తులు

వృత్తి, వృత్తులు. సమాజంలోని ప్రజలు, జీవనభృతి కొరకు చేపట్టే పనులకే వృత్తులు అంటారు.ఈ వృత్తులు, ప్రజల అభీష్టం మేరకు, నైపుణ్యాలపై లేదా వంశపారంపర్యంగా వస్తున్న జీవన శైలిపై ఆధారపడి వుంటాయి.

వైమానికుడు
                                               

వైమానికుడు

వైమానికుడు అనగా విమానం యొక్క దిశాత్మక ఫ్లైట్ కంట్రోల్స్ నిర్వహిస్తూ విమానమును నడుపు వ్యక్తి. అయితే విమాన ఇంజనీర్లు లేదా మార్గనిర్దేశకుల వంటి విమాన సిబ్బంది యొక్క ఇతర సభ్యులు కూడా ఏవియేటరులుగా భావింపబడతారు, వీరు పైలట్లు కాదు, విమానాన్ని నడపరు. వైమానిక సిబ్బంది లో విమానం నడిపే వ్యవస్థ ఆపరేటింగ్ లో ప్రమేయం లేని వారు అలాగే గ్రౌండ్ సిబ్బంది సాధారణంగా ఏవియేటర్స్ గా వర్గీకరించబడలేదు

సినిమాటోగ్రాఫర్
                                               

సినిమాటోగ్రాఫర్

సినిమాటోగ్రఫీ అని పిలవబడే కళాత్మక, శాస్త్రీయ చలన చిత్రాలను చిత్రీకరించే వ్యక్తిని సినిమాటోగ్రాఫర్ అంటారు. ఒక సినిమా నిర్మాణంలో సినిమాటోగ్రాఫర్ తన సిబ్బందితో నైపుణ్యాన్ని ఉపయోగించి చిత్రాన్ని రూపొందిస్తారు. ఒక మూవీని చిత్రీకరించడానికి సినిమాటోగ్రాఫర్ కి లైటింగ్ బాయ్స్ ఇతర సాంకేతిక నిపుణులు సహాయ కెమెరామెన్లు తమ సహకారాన్ని అందిస్తారు.