Топ-100
Back

ⓘ అలహాబాదు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నగరమే ప్రయగ్ రాజ్.ఈ నగరానికి మరొక పేరు అలహాబాద్. ప్రయగ్ రాజ్ జిల్లాకు ఇది ప్రధానకేంద్రం. ఉత్తరప్రదేశ్ నగరాలలో జనసాంద్రతలో ..
అలహాబాదు
                                     

ⓘ అలహాబాదు

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నగరమే ప్రయగ్ రాజ్.ఈ నగరానికి మరొక పేరు అలహాబాద్. ప్రయగ్ రాజ్ జిల్లాకు ఇది ప్రధానకేంద్రం. ఉత్తరప్రదేశ్ నగరాలలో జనసాంద్రతలో అలహాబాద్ 7వ స్థానంలో ఉంది. 2011 గణాంకాలను అనుసరించి అలహాబాద్ నగరం, జిల్లా ప్రాంతంలో జనసంఖ్య 17.4 లక్షలు. ప్రపంచంలో అత్యంతవేగంగా అభివృద్ధిచెందుతున్న నగరాలలో అలహాబాద్ 130వ స్థానంలో ఉంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అలహాబద్ అతిపెద్ద వాణిజ్యం కేంద్రం, తలసరి ఆదాయంలో 2వ స్థానం, జి.డి.పిలో మూడవస్థానంలో ఉంది అని భావిస్తున్నారు. అలహాబాదు నగరానికి ప్రధానమంత్రుల నగరమన్న ఖ్యాతి ఉంది. భారతదేశ 13 మంది ప్రధానమంత్రులలో 7 మంది ప్రధానమంత్రులు అలహాబాదు వాసులే. వీరంతా అలహాబాదులో జన్మించడం, అలహాబాదు విశ్వవిద్యాలయంలో చదువుకోవడం లేక అలహాబాదు నుండి పార్లమెంటుకు ఎన్నిక కావడం జరిగాయి.

నగరానికి అసలు పేరు ప్రయాగ. ప్రయాగ అంటే నదీసంగమ ప్రదేశం అని ఒక అర్ధం ఉంది. వాస్తవంగా దీనిని త్రివేణిసంగమం అని కూడా అంటారు. పనిత్ర గంగా, యమున, సరస్వతీ నదుల సంగమప్రదేశమే ప్రయాగ. హిందూపురాణాలలో అతిపురాతనమైనది పవిత్రనగరమైనది అయిన ప్రయాగకు ప్రాముఖ్యం అధికం. ప్రయాగలో పలు ఆలయాలు, అవిత్ర ప్రదేశాలు ఉన్నాయి. అలహాబాదు ఉత్తరప్రదేశ్ దక్షిణప్రాంతంలో ఉంది. అలహాబాదు ఉత్తరదిశలో ప్రతాప్ ఘర్, తూర్పు దిశలో బధోహి, దక్షిణదిశలో రేవా, పడమర దిశలో కౌశంబి ఉంది. నగరవైశాల్యం మొత్తం 63.07 చదరపు కిలోమీటర్లు. అలహాబాదు నగరానికి పలు శివారుప్రాంతాలు ఉన్నాయి. నగరం, పరిసరప్రాంతాలు పలు పురాపాలకాల నిర్వహణలో ఉన్నాయి. అల్షాబాదు జిల్లాలోని అధిక భూభాగం నగరపాలక నిర్వహణలో ఉంది. అలహాబాదు వాదులను అలహాబాది అని అంటారు.

అలహాబాదును హస్థినాపు రాజైన కౌసుంబి స్థాపించాడు. ఇప్పుడు కౌసుంబి ప్రత్యేక రాష్ట్రంగా ఉంది. కౌసుంబి ఈ నగరాన్ని రాజధానిగా చేసుకుని పాలన సాగించాడు. ప్రయాగ తరచుగా డోయబ్ ప్రాంతంలో సస్కృతిక, రాజకీయ, రాజ్యరాజధానిగా ఉంటూ వచ్చింది. మొదట కౌసుంబి తరువాత ప్రతిష్ఠాన పురం అని పిలువబడుతూ వచ్చింది. ఆ తరువాత మొగల్ చక్రవర్తి అయిన అక్బర్ ఈ నగరానికి అలహాబాదు అని నామకరణం చేసి తరువాత దీనిని తన రాజ్యంలో ప్రధాన రాజకీయ కేంద్రం చేసాడు. అభివృద్ధి చెందుతున్న నగరంగా ఇక్కడ పలు కళాశాలలు పరిశోధనా సంస్థలు స్థాపించబడ్డాయి. అలహాబాదు ప్రధాన ఆదాయం పర్యాటకం అయినప్పటికీ నగర ప్రధాన ఆదాయవనరుగా ఆర్థికసేవలు, భూముల క్రయవిక్రయాల నుండి లభిస్తున్నది.

                                     

1. పేరువెనుక చరిత్ర

అలహాబాదు Hindi: इलाहाबाद, Urdu: إلٰه‌آباد ఉత్తర భారతములోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రములోని ఒక ప్రముఖ పట్టణం. అలహాబాద్ అనే పేరును మొఘల్ చక్రవర్తి అక్బర్ 1513 సంవత్సరములో మార్చాడు. భారతీయ భాషలలో నగరాన్ని ఇలాహాబాదుగా వ్యవహరిస్తారు. అరబిక్ భాషలో ఇలాహ్ అనగా దేవుడు. పర్షియన్ భాషలో ఆబాద్ అనగా ఆవాసము అని అర్ధం. అంతకు పూర్వము ప్రయాగ గా సంస్కృతములో యాగాలకు యోగ్యమైన భూమి పిలువబడుతుండేది ఈ నగరం హైందవ పుణ్యక్షేత్రములలో ప్రముఖమైనది.

బ్రహ్మ ప్రపంచాన్ని సృష్టించిన తర్వాత మొట్టమొదటి యాగాన్ని ప్రయాగలో చేశాడని హిందువుల నమ్మకము.

                                     

1.1. పేరువెనుక చరిత్ర పురాణకథనాలు

ప్రయాగ, గంగ, యమునా, సరస్వతి ఈ మూడు నదులు కలిసే చోటే ప్రయాగ. ఈ మూడు నదులలో సరస్వతి నది అంతర్వాహిని. ఇది పైకి కనబడదు. ఈ త్రివేణి సంగమంలో స్నాన మాచరించడము చాల పుణ్య దాయకమని నమ్మకం. ఇక్కడ పుణ్య స్నానాలు తమ కొరకే గాక తల్లి దండ్రులకొరకు, భార్య, బంధువులకొరకు, గురువుల, సోధరుల కొరకు చేయ వచ్చు. నదీ మధ్యలో స్నాన మాచరించ డానికి చిన్న చిన్న పడవలుంటాయి. ఆ పడవలలో సంగమ స్థానానికి వెళ్లి అక్కడ స్నానం చేయవచ్చు. గంగ, యమున నదులు కలిచే చోట రెండు విధాల రంగు కల నీళ్లు ప్రవహిస్తుంటాయి. ఒకటి నల్లని నీళ్లు, రెండోది ఎర్రని నీళ్లు. ఇక్కడ నది లోతు తక్కువగాను, ప్రవాహ వేగంకూడ తక్కువ గాను వుంటుంది. భక్తులతో పూజలు చేయించడానికి పూజారులు ఆ సంగమ స్థానంలో పడవలపైనే వుంటారు. సంగమ స్థాననికి వెళ్లే భక్తులు పడవలలో రాను పోను రెండింటికి ఎంత డబ్బు ఇవ్వాలో ముందే మాట్లాడు కోవాలి.

                                     

2. చరిత్ర

అలహాబాదును పూర్వం ప్రయాగ అని పిలిచేవారు. ప్రయాగ వేదకాలం నాటి నుండి ఉన్న నగరాని భావించబడుతుంది. సృష్టికర్త అయిన బ్రహ్మ సృష్టి ఆరంభించగానే ప్రయాగలో యాగం నిర్వహించినట్లు హిందూపురాణాలు తెలియజేస్తున్నాయి. పురాతత్వశాస్త్ర పరిశోధనలలో ఇక్కడ త్రవ్వకాలలో లభించిన వస్తువులు క్రీ.పూ 600-700 నాటివని ౠజువైంది. యయాతి ప్రయాగ నుండి బయలుదేరి సప్తసింధు మైదానాన్ని జయించినట్లు పురాణకథనాల ద్వారా తెలుస్తున్నది. యయాతి మహారాజు కుమారూలైన యదు, దృహ్యు, పురు, అను, తుర్వసులు ఇక్కడి స్థానికులలో ప్రధానమైన వారని రుగ్వేద ఆధారంగా తెలుస్తుంది. రామాయణ కావ్యం ఇతిహాసం నాయకుడైన రామచంద్రుడు తన తమ్ముడైన లక్ష్మణుడు భార్య అయిన సీతతో చిత్రకూటంలో పర్ణశాల నిర్మించడానికి ముందుగా ప్రయాగలో ఉన్న భరద్వాజ ఆశ్రమంలో కొంతకాలం నివసించినట్లు రామయణ కథనాలు తెలియజేస్తున్నాయి.

ఆర్యులు వారు ఏర్పరుచుకున్న ఆర్యవంతంలో మద్యదేశంలో స్థిరపడిన సమయంలో ప్రయాగ లేక కౌసుంబి వారి భూభాగంలో ప్రాముఖ్యత వహించింది. హస్థినాపుర ప్రస్తుత డిల్లీ సమీపప్రాంతం రాజులైన కౌరవరాజుల చేత ప్రయాగ నగరాన్ని స్థాపించబడింది. హస్థినాపురం వరదలలో మునిగి ధ్వంసం అయిన తరువాత కురు రాజులు కౌసుంబి నగరాన్ని రాజధానిగా చేసుకుని పాలనసాగించారు.

ఆర్యుల అనంతరం - పలు రాజ వంశీకులు ప్రయాగను పరిపాలించారు. వౌర్యులు, గుప్తులు, కుషాణుల ఏలుబడిలో స్వర్ణయుగం పొందిందీ ప్రయాగ. క్రీ.శ.643 ప్రాంతంలో చైనా బౌద్ధ యాత్రికుడు హుయాన్‌త్సాంగ్ ఈ ప్రాంతాన్ని సందర్శించి పలు అధ్యాయాలను వెలువరించాడు. అలహాబాద్ కోట క్రీ.శ.1526లో ఢిల్లీ సుల్తానులు ప్రవేశించటం. ప్రయాగ ప్రాంతం వారిని అమితంగా ఆకట్టుకోవటంతో ఇక్కడ స్థిర నివాసానికి సంబంధించిన కట్టడాలను నిర్మించటం మొదలుపెట్టారు.

అలహాబాదుతో చేరిన డోయాబా భూభాగంగం పలుసామ్రాజ్యాలకు చెందిన చక్రవర్తుల ఆధ్వర్యంలో పాలించబడింది. ఈ భూభాగం మౌర్య, గుప్త సామ్రాజ్యాలలో భాగంగా ఉంటూ వచ్చింది. కన్నౌజ్ సామ్రాజ్యానికి ముందు 15వ శతాబ్ధానికి చెందిన కుశ సామ్రాజ్యంలో భాగంగా ఉంటూ వచ్చింది. భారతదేశం మీద ఆంగ్లేయులు దండయాత్ర సాగించడానికి ముందు ఈ భూభాగం మీద మరాఠీయులు దండయాత్ర సాగించారు. 1765లో బ్రిటిష్ ప్రభుత్వం అలహాబాదు కోటలో సైన్యాలదళాలను స్ర్హాపించింది. అలహాబాదు భారతదేశ ప్రధానుల రాజధానిగా గుర్తింపు పొందింది. 1193లో మహమ్మద్ ఘోరీ అలహాబాదును తనరాజ్యంలో కలిపిన తరువాత ప్రయగ డిల్లీ సుల్తానుల సామ్రాజ్యంలో ఒక భాగంగా మారింది. తరువాత డిల్లు బానిసరాజుల వశం అయిన తరువాత ప్రయాగ నగరం ప్రాముఖ్యత మరింత పెరిగింది. 1575లో నగరంలో అక్బర్ పాదుషా శత్రు దుర్భేద్యమైన కోటను నిర్మించి ఇలాహాబాదు అని నామకరణం చేసాడు.త్రివేణీ సంగమం కావటంవల్ల నౌకా రవాణా సౌకర్యాలకూ, విదేశీ వాణిజ్య వర్తకాలకు అనువుగా ఉండటంతో పాదుషా తన రాచ కార్యకలాపాలను ఇక్కడి నుండే నిర్వహించేవాడు

1765లో అవధ్ వవాబు, ముగల్ చక్రవర్తి రెండవ షాహ్ ఆలం బ్రిటిష్ సైన్యాలచేతిలో ఓటమి పాలైయ్యారు. బ్రిటిష్ ప్రభుత్వం అలహాబాదును నేరుగా పాలించకుండా తూర్పు పడమరలను ఈ భూభాగం కలిపే మహాద్వారమని గ్రహించి అలహాబాదు కోటలో తమ సైన్యాలను పునరుద్ధరించారు. 1801లో అలహాబాదును అవథ్ నవాబు నుండి బ్రిటిష్ ప్రభుత్వం తిరిగి స్వాధీనపరుచుకకుంది. క్రమంగా బ్రిటిష్ ప్రభుత్వం పడమరదిశలో ఉన్న డిల్లీ, అజ్మీర్-మేవార భూభాగాలను స్వాధీనపరచుకున్నది. వాయవ్య భూభాగాలు కొత్త ప్రెసిడెన్సీగా మారి నార్త్ వెస్ట్ ప్రొవింసెస్ ఆఫ్ ఆగ్రా అని నామాకరణం చేయబడింది. అలహాబాదు ఈ భూభాగంలో ప్రధానకేంద్రంగా మారింది. 1834 లో అలహాబాదు ఆగ్రా భూభాగం పాలనాకేంద్రంగా చేయబడి ఇక్కడ హైకోర్ట్ కూడా నిర్మించబడింది. అయినప్పటికీ ఒక సంవత్సానంతరం రెండూ ఆగ్రాకు మార్చబడ్డాయి. 1857లో భారతీయ తిరుగుబాటు ఉద్యమంలో అలహాబాదు కేంద్రం అయింది. ఉద్యమంతో స్థభించిన బ్రిటిష్ ప్రభుత్వం డిల్లీ భూభాగాన్ని పంజాబుతో కలిపి వాయవ్య భుభాగానికి అలహాబాదును కేంద్రంగా చేసారు. తరువాత 20 సంవత్సరాల వరకు అలహాబాదు వాయవ్య భూభాగంగా ఉంది. 1877లో ఆగ్రా, అవధ్ భూభాగాలు ఒకటిగా చేయబడి యునైటెడ్ భూభాగంగా మార్చబడింది. తరువాత 1920 వరకూ అలహాబాదు యునైటెడ్ ప్రొవింస్ కేంద్రంగా సేవలు అందించింది.

1857 లో అలహాబాదులో యురేపియన్ల మీద భారతీయులు తిరుగుబాటు ఆరంభం అయింది. స్వాతంత్ర్యోద్యమ వీరుడు మౌలాలి లియాక్విత్ ఆలి యురేరోపియన్ తిరుగుబాటికు తెరతీసాడు. ఉద్యమం మొదలైన కారణంగా బ్రిటిష్ ప్రభుత్వం అలహాబాదులో హైకోర్టు, పోలీస్ ప్రధాన కార్యలయం, పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్థాపనకు ప్రయత్నాలు ఆరంభించింది. ఇది అలహాబాదును పాలనాకేంద్రంగా మార్చింది. 1888లో భారతీయ జాతీయ కాంగ్రెస్ 4వ సమావేశం అలబాదులో జరిగింది. శతాబ్దం చివరినాటికి స్వతంత్రసమర యోధులకు అలహాబాదు ప్రధాన కూడలిగా మారింది. చోక్ ప్రాంతంలో ఉన్న లాల్ సునదర్‌కు స్వంతమైన కార్యాలయం యువతలో స్వాతంత్ర్యజ్వాలను రగిలించడం మొదలుపెట్టింది. యురేపియన్ క్లబ్ మీద బాంబు దాడి చేసిన నిత్యానంద్ చటర్జీ నగరంలో ప్రజలందరిలో గుర్తింపు పొందాడు. అలహాబాదులో ఉన్న ఆల్ఫర్డ్ పార్కులో 1931లో తిరుగుబాటుదారుడైన చంద్రశేఖర్ తనను బ్రిటిష్ పోలీస్ చుట్టుముట్టిన సమయంలో తనను తాను కాల్చుకుని మరణించాడు. భారతీయ స్వాతంత్ర్యోద్యమంలో నెహ్రూ కుటుంబం ప్రధానకేంద్ర స్థానమైంది. పురుషోత్తందాస్ టాండన్, బిషాంబర్ నాథ్ పాండే, నారాయణ్ దత్ తివారీ ఆరంభించిన అల్జీ ఉద్యమంలో పాల్గొన్న వేలాది స్వాతంత్ర్యసమర యోధులకు అలహాబాదు పుట్టినిల్లుగా మారింది. పాకిస్థాన్ దేశానికి మొదటి బీజాలు అలహాబాదులోనే పడ్డాయి. 1930 డిసెంబరు 29 ఆల్ ఇండియా ముస్లిం లీగ్ ముస్లింల కొరకు ప్రత్యేక రాజ్యం కావాలని ప్రతిపాదించింది.                                     

3. భౌగోళిక స్థితి

అలహాబాదు ఉత్తరప్రదేశ్ దక్షిణప్రాంతంలో గనగా, యమునా సంగమస్థానంలో ఉంది. ఈ ప్రాతం కురుసామ్రాజ్య ఆరంభం నుండి ఉన్నదని భావిస్తున్నారు. నగరానికి నైరుతీదిశలో బండేల్ ఖండ్ భూభాగం ఉంది, తూర్పు, ఆగ్నేయంలో భగేల్ ఖండ్ భూభాగం ఉంది, ఉత్తర, వాయవ్యాలలో అవధ్ భూభాగం ఉంది, పడమరలో డోయాబ్ భూభాగం ఉంది. నగరం మద్యలో నగరాన్ని రెండు భాగాలుగా విడదీస్తూ రైల్వే మార్గం నిర్మించబడి ఉంది. రైలుమార్గానికి దక్షిణంలో ఉన్న ప్రదేశాన్ని పాత చౌక్ ప్రాంతం అంటారు. రైలు మార్గానికి ఉఅత్తరభూభాగంలో బ్రిటిష్ ప్రభుత్వం నిర్మించిన నివాసాలు ఉంటాయి. అలహాబాదు భౌగోళిక, సాస్కృతిక ప్రాముఖ్యత కలిగిన నగరం. గంగా యమునా కలిసిన డోయబ్, యమునావది చివరి ప్రయాణం అలహాబాదుతో ముగుస్తుంది. యునైటెడ్ నేషంస్ డెవలెప్మెంట్ ప్రోగ్రాం నివేదికలు వాయువేగం అరియు తుఫానులు వంటివి అలహాబాదుకు తక్కువగా నష్టం కలిగిస్తాయని పేర్కొన్నది.

                                     

3.1. భౌగోళిక స్థితి వాతావరణం

ఉత్తర భారతదేశం యొక్క మైదానములలో నగరాలకు సాధారణ ఆర్ద్ర ఉపఉష్ణమండల వాతావరణం పోలి ఉంటుంది. వార్షిక సగటు ఉష్ణోగ్రత 26.1 ° సెంటీ గ్రేడ్ 79.0 ° ఫారెన్ హీట్ ;. నెలసరి సగటు ఉష్ణోగ్రతలు 18 -29 ° సెంటీ గ్రేడ్ 64-84 ° ఫారెన్ హీట్ అలహాబాద్ వేడిగా ఉండే వేసవి, చల్లని పొడిగా ఉండే శీతాకాలం ఉంటుంది. వేసవి కనిష్ఠ ఉష్ణోగ్రతలు 40 ° సెంటీగ్రేడు ఉంటూ ఏప్రిల్ నుండి జూన్ వరకు కొనసాగుతుంది; గరిష్ఠ ఉష్ణోగ్రతలు తరచు 40 ° సెంటీ గ్రేడ్ 104 °ఫారెన్ హీట్ మే, జూన్ మాసాలలో కొనసాగుతుంది. వర్షపాతం జూలైలో సెప్టెంబరు వరకు కొనసాగుతుంది. శీతాకాలం డిసెంబరు నుండి ఫిబ్రవరి వరకు ఉంటుంది. ఉష్ణోగ్రతలు అరుదుగా గడ్డకట్టే పాయింట్ ఆగిపోతాయి. గరిష్ఠ ఉష్ణోగ్రతలు సుమారు 22 °సెంటీ గ్రేడ్ 72 °ఫారెన్ హీట్ 9, కనీస ° సెంటీ గ్రేడ్ 48 ° ఫారెన్ హీట్. అలహాబాద్ కూడా భారీ ట్రాఫిక్, ప్రయాణ ఆలస్యం ఫలితంగా జనవరిలో చిక్కటి పొగమంచులో బాధపడతాడు. ఇది మంచు లేదు అలహాబాద్. అత్యధిక ఉష్ణోగ్రత 48 ° సెంటీ గ్రేడ్ 118.4 °ఫారెన్ హీట్, అత్యల్ప -2 ° సెంటీ గ్రేడ్ 28 ° ఫారెన్ హీట్.

వర్షాలు నైరుతి వేసవి ఋతుపవనాల బెంగాల్ శాఖ యొక్క బే ద్వారా లేదా అరేబియా సముద్రం శాఖ నుండి అరేబియా సముద్రం గాని తీసుకు

                                     

4. జీవవైవిద్యం

దిగ్రేట్ ఇండో గంగాటిక్ మైదాన భూభాగం పడమర ప్రాంతంలో ఉన్న అలహాబాదు నగరంలో గంగా యమునా పరీవాహక ప్రాంతం ఒక భాగమై ఉంది. డోయబ్ టొరియా ప్రాంతాలు నగర జీవవైవిధ్యానికి పచ్చదనానికి ఆధారభూతమై ఉంది. మానవుల ప్రవేశం తరువాత వెన్నెముక కలిగిన జీవుల స్రవంతి ఇంకా కొనసాగుతున్నప్పటికీ మిగిలినవి అంతరించిపోయే స్థితిలో ఉన్నాయి. మానవుని ప్రవేశం తరువాత కనుగొనబడిన విషజంతువులు, పాములు, ఇతర క్షీరదాలు పలురకాల పెద్ద పక్షులైన గద్దల వంటివి కూడా వినాశనానికి కారణం అయ్యాయి. భారతదేశంలో ఉన్న 4 జాతీయ మ్యూజియంలో ఒకటి అయిన అలహాబాదు మ్యూజియం గంగా యమునా పరీవాహక ప్రాంతంలో అంతరించి పోతున్న జీవజాలం, వృక్షజాలం గురించిన వివారాలు సేకరించి భద్రపరచడానికి ప్రణాళిక చేపట్టింది. ఈ ప్రాంతంలో అధికంగా కనిపిస్తున్న పక్షులు పావురం, నెమలి, అడవి పక్షులు, బ్లాక్ పాట్రిడ్జ్, పిచ్చుకలు, పాటల పక్షి, బ్లూ జాయ్స్, పరకీట్స్, క్వైల్స్, బుల్‌బుల్స్, కోంబ్‌డక్స్ మొదలైనవి. ఇతర జంతువులలో బల్లులు, త్రాచుపాములు, క్రైట్స్, ఘరియల్స్ ఉన్నాయి. శీతాకాలంలో సమీపంలోని సంగమ స్థానం, ఇతర చిత్తడి భూములకు అధిక సంఖ్యలో సైబేరియన్ వలస పక్షులు వచ్చి పోతుంటాయి.                                     

5. జనసంఖ్య

2011 గణాంకాలను అనుసరించి నివేదుకలను అనుసరించి అలహాబాదు జనసంఖ్య 1.216.719. అలాగే 2001లో చరదరపు కిలోమీటరుకు చదరపు కిలోమీటరుకు 901 ఉన్న జనసాంద్రత చరపు కిలోమీటరుకు 1.087కు చేరుకుంది. 2011 గణాంకాలను అనుసరించి ఉత్తరప్రదేశ్ స్థానికప్రజలలో హిందువుల శాతం 75%, ముస్లిముల శాతం 23%, జైన ప్రజల శాతం 1.8%, సిక్కుల శాతం 0.20%. మిగిలిన ప్రజలలో బౌద్ధులు, ఇతర మతానికి చిందిన పజల శాతం 08%.

  • అలహాబాదు అధికారిక బాధ హింది. ఆంగ్లభాష కూడా అధికంగా వాడుకలో ఉంది. ప్రత్యేకంగా ఆంగ్లభాష మాట్లాడే వారిలో వైట్ కాలర్ ఉద్యోలు అధికం. గుర్తించతగినంతగా ఉర్దూ మాట్లాడే వారు ఉన్నారు. సాధారాంగా ఆహాబాదు వాదులు అవధి, ఖరిబోలి యాసతో మట్లాడుతుంటారు. కొన్ని ప్రాంతాలలో బెంగాలీ అరియు పంజాబీ మాట్లాడుతుంటారు.
  • అలహాబాదు అక్షరాస్యత శాతం 74.41%, ఈ భూభాగంలో ఇది అత్యధికశాతం. పురుషుల అక్షరాస్యత 85%, స్త్రీల అక్షరాస్యత 62.67%. జాతీయ నేరపరిశోధన నివేదికలను అనుసరించి అలహాబాదులో చట్టాతిక్రమణ శాతం అధికం.
                                     

6. సంస్కృతి

అలహాబాదు సాహిత్యం, కళాసంప్రదాయానికి ప్రఖ్యాతి చెందినది. అలహాబాదు పవిత్ర గ్రంథాలైన వేదాలు, మహాభారతం, రామాయణం, పురాణాల ఆవిష్కరణలకు పుట్టిల్లు అని భావించబడుతుంది. ఉత్తరప్రదేశ్ సాహిత్య కేంద్రంగా అలహాబాదు గుర్తింపు పొందింది. అలహాబాదు పురాతనత్వం తూర్పు ఆసియన్లను విశేషంగా ఆకర్షించింది. చైనాయాత్రికుడు పాహియన్, హ్యూయంత్సాంగ్ అలహాబాదును సందర్శించి ఈ భూభాగం సంపదలతో సమృద్ధిగా ఉందని భావిస్తున్నారు. శతాబ్ధాలకాలంగా అలహాబాదు జాతీయరాజకీయాలలో ప్రథమస్థానంలో ఉంది. స్వాతంత్ర్యసమరోద్యమంలో అలహాబాదు ప్రముఖపాత్ర వహించింది. నగరం రాజకీయ సంఘటనలను తనదైనరీతిలో వర్ణించడంలోనూ ప్రత్యేకత సంతరించుకుంది. ఉవ్వేత్తుతున్న రాజకీయ ఉద్రేకాలను హాస్యధోరిణి, వ్యగ్యచిత్రాలద్వారా తెలియజేయడంలో తమకంటూ ఒక ప్రత్యేకత సంతరించుకుంది.

అలహాబాదు నగరంలో ఇండో-ఇస్లామిక్, ఇండో-సార్సనిక్ పద్ధతిలో నిర్మించబడిన పలు భవనాలు ఉన్నాయి. బ్రిటిష్ ప్రభుత్వకాలం నుండి పలు భవననిర్మాణాలు సాస్స్కృతిక వారసత్వ నిర్మాణాలుగా ప్రకటించబడ్డాయి. ఇతరభవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. 1930లో నెహ్రూ కుటుంబ నివాసంగా ఉన్న స్వరాజ్‌భవన్ ప్రాంతీయ ప్రధానకార్యాలయంగా మారింది. 19-20శతాబ్ధాలలో మహాదేవి వర్మా, సుమిత్రానందన్ పంత్, త్రిపాథి నిరాలా, హరివంశ్ రాయ్ బచ్చన్ వంటి రచయితలు హిందీ సాహిత్యంలో సంస్కరణాయుతమైన మార్పులను తీసుకువచ్చారు. ఇతర గుర్తింపు కలిగిన రచయితలులో ముఖ్యుడు ఫిరాగ్ ఘోరక్ పూరీగా పసిద్ధుడైన రఘుపతి సాహే. ఫిరాగ్ ఘోరక్ పూరీ, మహాదేవివర్మలు ఙానపీఠ పురస్కారాన్ని అందుకున్నారు.

అలహాబాదు హిందీ ప్రచురణా సంస్థలకు అతిపెద్ద కేంద్రంగా ప్రసిద్ధి చెందినది. వాటిలో ముఖ్యమైనది లోక్ భారతి, రాజ్‌కమల్, నీలభ్ మొదలైనవి. నగరంలో పర్షియన్, ఉర్దూ సాహిత్యానికి గౌరవాదరాలు అధికంగా ఉన్నాయి. ఆధునిక ఉర్ధూ సాహిత్యంలో ప్రత్యేక గుర్తింపు పొదిన రచయితలలో అక్బర్ షాహి ఒకరు. నూత్ నార్వీ, టెగ్ అలహాబాది, రాజ్ అలహాబాది, అషగర్ గొండ్వి, ఐ.బి.ఎన్ ఇ సాఫి, ఆదిల్ రషీద్, ఆజం కురైవి మొదలైన వారు కూడా అలహాబాదు వాదులే. ఆంగ్ల రచయిత అరియు నోబుల్ బహుమతి గ్రహీత అయిన రుద్యార్డ్ కిప్లింగ్ దిపయనీర్ పత్రికకు ఆరంభకాల సంపాదకత్వం, ఓవర్సీస్ కరెస్పాండెంట్ బాధ్యతలు వహించాడు.

హిందూ స్త్రీలు సాధారణంగా సంప్రాదాయ చీరలను ధరిస్తారు. అదేసమయంలో శల్వార్ కమీజ్, ఆధునిక వస్త్రాలు ధరించడానికి యువతులకు అనుమతి లభిస్తున్నది. ధోవతీ, కుర్తాలవంటి వస్త్రాలు పండుగ సమయాలలో ధరిస్తున్నప్పటికీ పురుషులు సాధారణంగా ఆధునిక తరహాలో పాశ్చాత్య దుస్తులు ధరిస్తుంటారు. పురుషుల దుస్తులలో షెర్వాణి అతిసాధారణ వస్త్రధారణగా ఉంది. పండుగ సమయాలలో స్త్రీలు చురిదార్ దుస్తులను ధరించడం మామూలే.

  • అలహాబాదులో అత్యధిక ప్రజాదరణ కలిగిన పండుగలు దీపావళి, రామనవమి ప్రధానమైనవి.
                                     

7. యాత్రాకేంద్రం

కుంభమేళా

ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే మాహాకుంభమేళా, అర్ధ కుంభమేళా సమయంలో కూడే భకసందోహం ప్రపంచంలోనే అత్యధికమని భావించబడుతుంది.

ప్రయాగ

హిందువుల అతిపవిత్ర పుణ్యక్షేత్రాలలో ప్రయాగ ఒకటి. శాక్తేయులు అత్యధికంగా ఆరాధించే పుణ్యక్షేత్రాలలో అలహాబాదు శక్తిపీఠం ఒకటి. అలహాబదులో ఉన్న శక్తిపీఠం సతీదేవి వేలు పడిన దివ్యక్షేత్రమని విశ్వసించబడుతుంది. అలహాబాదులో ఉన్న శక్తి మాధవేశ్వరిగాను పరమశివుడు కాలభైరవుడిగానూ ఆరాధించబడుతున్నాడు.

                                     

8. విద్య

అలహాబాద్ విద్యా వ్యవస్థ ఒక విస్తృత విద్యా లక్ష్యం కలిగి, రాష్ట్ర ఇతర నగరాలకంటే ప్రత్యేకత కలిగి ఉంది. అలహాబాద్ పాఠశాలలు రాష్ట్ర ప్రభుత్వం, ప్రైవేట్ సంస్థలు చేత నడుపుతున్నాయి. ఇందులో పలు మతపరమైనవి కూడా ఉన్నాయి. ప్రభుత్వం పాఠశాలలు, కళాశాలలు హిందీ, ఆంగ్ల విద్య రెండు ఇస్తామని ఇంగ్లీష్ చెప్తుండగా చాలా ప్రైవేటు పాఠశాలలు ఆంగ్లభాషను మాధ్యమంగా చేసుకుని నిర్వహించబడుతున్నాయి. ఉర్దూ కూడా బోధించడానికి ఉపయోగించే భాషలలో ఒకటి. అలహాబాద్ లో పాఠశాలలు 10 +2 +3 ప్రణాళిక అనుసరించబడుతుంది. వారి ఉన్నత పాఠశాల విద్య పూర్తి చేసిన తర్వాత, విద్యార్థులు సాధారణంగా ఒక ఉన్నత సౌకర్యం కలిగి ఇంటర్మీడియట్ విద్యను ఉత్తర ప్రదేశ్ బోర్డు, ఐ.సి.ఎస్.ఇ అనుబంధిత, లేదా సి.బి.ఎస్.సి పాఠశాలలలో విద్యను కొనసాగిస్తుంటారు. విద్యార్థులు సాధారణంగా కళలు, వ్యాపార, లేదా వైజ్ఞానిక విద్యను ఎంచుకోవచ్చు. ఒకేషనల్ కార్యక్రమాలు కూడా అందుబాటులో ఉన్నాయి.

అలహాబాద్ దేశం అంతటి నుండి విద్యార్థులను, అభ్యాసకులను ఆకర్షిస్తుంది. 2010 నాటికి, అలహాబాద్ నగరంలో ఒక సెంట్రల్ విశ్వవిద్యాలయం, మూడు డీమ్డ్ విశ్వవిద్యాలయాలు, ఒక ఓపెన్ విశ్వవిద్యాలయం ఉన్నాయి. భారతదేశంలో ఇతర ప్రాంతంలో ఉన్నట్లు అలహాబాదులో కళాశాలలు విశ్వవిద్యాలయం లేదా సంస్థకు అనుబంధంగా కాని పనిచేస్తుంటాయి. 1876 ​​లో స్థాపించబడిన మోతీలాల్ నెహ్రూ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇరవై నేషనల్ ఇన్స్టిట్యూట్స్ అలహాబాద్ విశ్వవిద్యాలయం రాష్ట్రంలోని ఆధునిక విశ్వవిద్యాలయాలలో పురాతనమైనది. ఆఫ్ ఒక, భారతదేశం యొక్క జాతీయ ప్రాముఖ్యత గల సంస్థగా ఉంది. సామ్ హిగ్గిన్‌బాదం ఇన్స్టిట్యూట్ వ్యవసాయం, టెక్నాలజీ అండ్ సైన్సెస్ దక్షిణ ఆసియాలోని ఆధునిక విశ్వవిద్యాలయాలలో అత్యంత పురాతనమైనదని భావించబడుతుంది. అలహాబాద్ లో దేశవ్యాప్తంగా ఉన్న ప్రసిద్ధమైన వృత్తివిద్యా సంస్థలు ఐ.ఐ.టి -ఎ, మోతిలాల్ నెహ్రూ వైద్య కళాశాల ఎం.ఎం.ఎం, ఉత్తర ప్రదేశ్ రాజర్షి టాండన్ ఓపెన్ విశ్వవిద్యాలయం యు.పి.ఆర్.టి.ఒ.యు, హరీష్-చంద్ర రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హ్రీ, గోవింద్ వల్లభ్ పంత్ సోషల్ సైన్స్ ఇన్స్టిట్యూట్ జి.ఎస్.ఎస్.ఐ, ఇంజనీరింగ్ అండ్ రూరల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐ.ఇ.ఆర్.టి, ఎవింగ్ క్రిస్టియన్ కాలేజ్ ఇ.సి.సి, ఇంజనీరింగ్ & రీసెర్చ్ యునైటెడ్ కాలేజ్, బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మొదలైనవి ఉన్నాయి.                                     

9. పరిశ్రమలు

అలహాబాదులో ప్రదాన పరిశ్రమ పర్యాటకం, మత్యపరిశ్రమ, వ్యవసాయం. రాష్ట్రంలోనే అలహాబాదు బృహత్తర వాణిజ్య కేంద్రంగా ఉంది. అలహాబాదు నివాసుల తలసరి ఆదాయం, జి.డి.పి అభివృద్ధి రాష్ట్రంలో ద్వితీయ స్థానంలో ఉంది. ప్రథమస్థానంళలో కాంపూర్ ఉంది. 58 పెద్ద పరిశ్రమలు, 3.000 కుటీరపరిశ్రమలతో అలహాబాదు ప్రముఖ పారిశ్రామిక నగరంగా ప్రాముఖ్యత కలిగి ఉంది. ఆల్ ఇండియా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ నివేదికలు అలహాబాదులో 10.000 కు పైగా అమోదు చేయబడని కుటీరపరిశ్రములు ఉన్నాయని తెలియజేస్తున్నాయి.

అలహాబాదులో గ్లాస్ అండ్ వైర్ ఆధారిత పరిశ్రములు ఉన్నాయి. నైని అరియు ఫుల్పర్ ప్రాంతాలలో ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు స్థాపించిన అనేక పారిశ్రామిక యూనిట్లు ఉన్నాయి. భారతదేసశంలోని పెద్ద చమురు సంస్థ అయిన భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ సంవత్సరానికి 70 లక్షల టన్నులు ఉత్పత్తి చేసే పరిశ్రమను లోగ్రా వద్ద స్థాపించింది. ఈ స్థాపన వ్యయం 6.2 వేల కోట్లను అంచనా. 1865లో అలహాబాదు బ్యాంక్ స్థాపన ఈ నగరంలో ప్రధానకార్యాలయ స్థాపనతో మొదలైంది. ఐ.టి సంస్థలు కొన్ని ఘర్షణలతో నగరంలో ప్రవేశించాయి. ఐ.టి కంపెనీ వారు నగర మౌలిక వసతుల అభివృద్ధి కావాలని పట్టుపట్టారు. భారతీయ వ్యవసాయ పరిశ్రమకు అలహాబాదు ప్రధాన కేంద్రం.

అలహాబాదు ప్రధాన పరిశ్రమలు భారత్ పంప్స్ & కంప్రెషర్స్, ఆల్‌స్టం, ఐ.టి.ఐ లిమిటెడ్, ఆర్వే, బి.పి.సి.ఎల్, డీస్ మెడికల్, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, త్రువేణి స్ట్రక్చర్స్ లిమిటెడ్, త్రివేణి ఇంజనీరింగ్ వర్క్స్, త్రివేణి స్ట్రీట్ గ్లాస్ లిమిటెడ్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, హెచ్.సి.ఎల్, ఐ.ఎఫ్.ఎఫ్.సి.ఒ, విబ్‌గ్యర్, లాబరేటరీస్, రేమండ్ సింథటిక్స్, జి.ఇ.ఇ.పి ఇండస్ట్రీస్ ఉన్నాయి. అలహాబాదు నగరంలో హరీష్ చంద్ర అటామిక్ రీసెర్చ్ సెంటర్, సివిల్ అవియేషన్ ట్రైనింగ్ సెంటర్ స్థాపించబడ్డాయి.

                                     

10. మాద్యమం

అలహాబాద్ నగరంలో విస్తృతంగా పంపిణీ ఔతున్న హిందీ భాషా వార్తాపత్రికలు మధ్య దైనిక్ జాగరణ్, అమర్ ఉజాలా, దైనిక్ భాస్కర్, నై దునియా, హిందూస్తాన్ దైనిక్, అజ్, రాజస్థాన్ పత్రికా మొదలైనవి. అలహాబాదులో తయారుచేయబడి వినియోగించబడుతున్న రెండు ప్రముఖ ఆంగ్ల భాషా వార్తాపత్రికలు లీడర్, పయనీర్. ప్రచురించిన ఎకనామిక్ వంటి. ప్రచురణ, అలహాబాద్ లో ప్రచురించబడి వినియోగించబడుతున్న ఇతర ప్రముఖ ఆంగ్ల భాషా వార్తాపత్రికలు టైంస్ ఆఫ్ ఇండియా, హిందూస్తాన్ టైమ్స్, హిందూ మతం, ఇండియన్ ఎక్స్‌ప్రెస్, ఆసియన్ ఏజ్ మొదలైనవి. ప్రముఖ ఆర్థిక దినపత్రికలు టైమ్స్, ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్, బిజినెస్ లైన్, రాష్ట్రీయ సహారా, బిజినెస్ స్టడర్డ్ విస్తృతంగా పంపిణీ చేస్తారు. అల్పసంఖ్యాక ప్రజల కొరకు ఉర్దూ, గుజరాతీ, పంజాబీ భాషలు వంటి దేశీయ వార్తాపత్రికలు అందుబాటులో ఉన్నాయి.

నగరంలో ప్రసారం చేయబడుతున్న ఆల్ ఇండియా రేడియో, జాతీయ- రాష్ట్ర స్వంత రేడియో ప్రసారలు అలహాబాద్ ఎయిర్ నుండి రెండు ఎఫ్.ఎం ప్రసారాలు ఐదు స్థానిక రేడియో స్టేషన్లు నిర్వహించబడుతున్నాయి. ప్రత్యక్ష సాటిలైట్ ప్రసారం సేవలు అందిస్తున్న ఇతర ప్రాంతీయ ఛానళ్ళు కేబుల్ చానల్స్, లేదా ఇంటర్నెట్ ఆధారిత టెలివిజన్ ద్వారా అందుబాటులో ఉంటాయి. అలహాబాద్ అలాగే ఒక దూరదర్శన్ కేంద్రం ఉంది.అలహాబదు వాసులకు 2013 మార్చి నుండి కేబుల్ టి.వి డిజిటలైజేషన్ చేయడం అవసరమని భావిస్తున్నారు.

                                     

11. ప్రయాణవసతులు

అలహాబాద్ అలహాబాద్ విమానాశ్రయం 1966 నుండి సేవలు అందిస్తుంది. అలహాబాదు విమానాశ్రయం నగర నడిబొడ్డు నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎయిర్ భారతదేశం, స్పైస్ జెట్ కనెక్ట్ ఢిల్లీ అలహాబాద్. అవాంతరం లేకుండా ప్రయాణం చేయడానికి అత్యంత సౌకర్యవంతం మార్గం టాక్సీ ద్వారా చేరుకోవడం. సమీపంలోని ఇతర విమానాశ్రయాలు వారణాసి, లక్నో, కాన్పూర్ విమానాశ్రయాలు.

ఉత్తర భారతదేశం యొక్క ప్రధాన రైల్వే జంక్షన్లలో అలహాబాద్ జంక్షన్ ఒకటి. నార్త్ సెంట్రల్ రైల్వే జోన్ యొక్క ప్రధాన కార్యాలయం అలహాబాదులో ఉంది. నాలుగు ప్రముఖ రైల్వే స్టేషన్లు ప్రయాగలో ఉన్న సిటీ స్టేషను స్టేషను రాంభోగ్ వద్ద ఉన్న దరగంజ్ స్టేషను, అలహాబాద్ జంక్షన్. అదే విధంగా అలహాబాదు ఉత్తర ప్రదేశ్ లో ప్రధాన నగరాలైన ఝాన్సీ, కోలకతా, న్యూ ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాదు, ఇండోర్, భూపాల్, కాన్పూర్, లక్నో, జైపూర్ వంటి నగరాలతో అనుసంధానించబడి ఉంది. భారతదేశం యొక్క అన్ని ప్రధాన నగరాలతో కూడా అలహాబాదు చక్కగా అనుసంధానించబడి ఉంది. నగరంలోపల ప్రయాణించడానికి పసుపు నలుపు కలగలసిన ఆటో రిక్షాలు, మూడు చక్రాల రిక్షాలు ప్రధానమైనవి. వారు మీటర్లతో లేదు, కనీసం ఆరు మంది ప్రయాణీకులకు వసతి కల్పించే కాల్ టాక్సీలు కూడా అందుబాటులో ఉన్నాయి. మీటర్లతో నడిచే టాక్సీలు సాధారణంగా ఆటో రిక్షాల కంటే ఖరీదైనవిగా ఉంటాయి. అలహాబాద్ లో ప్రయాణించడానికి చౌకైన విధానం టెంపోలలో ప్రయాణించడం.

ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ ప్రభుత్వ బస్సుల యు.పి.ఎస్.ఆర్.టి.సి సేవలు నిర్వహిస్తుంది. నగరంలో అందుబాటులో ఉన్న ప్రజా రవాణా మార్గాలు నగరం మధ్య గుండా పోతున్న జాతీయ రహదారి 2. 2001, 2004 మధ్య నిర్మించబడిన భారతదేశం యొక్క ప్రిమస్ తీగల వంతెన న్యూ యమునా బ్రిడ్జ్. అలహాబాద్ లో యమునా నది ఒడ్డున ఉన్న ఈ వంతెన దాని శివారు అయిన నైనీ ప్రాంతాన్ని అలహాబాదు నగరంతో కలుపుతుంది. పాత నైనీ బ్రిడ్జ్ ప్రస్తుతం రైల్వే, కారు ట్రాఫిక్ వసతి కల్పిస్తుంది. గంగా, యమునా నదులు మీద నిర్మించబడిన రహదారి వంతెనలు అలహబాదును శివారు ప్రాంతాలైన నైనీ, ఝుసి ప్రాంతాలతో కలుపుతున్నాయి.కేంద్ర / రాష్ట్ర భాగస్వామ్యం జె.ఎన్.ఎన్.యు.ఆర్.ఎం 100 కంటే అధికంగా తక్కువ ఎత్తు బస్సులను నడుపుతున్నాయి. ఈ బసులు ప్రధానంగా త్రివేణి పురం ఝుసి నుండి శాంతిపురం వాద్ద ఉన్న మనౌరి ఎయిర్ఫోర్స్ మర్గంలోనూ, రేమండ్ గేట్ నైని నుండి ఫఫమౌ రెండు మార్గాలలో నడుస్తున్నాయి.

                                     

12. నిర్వహణ

అలహాబాద్ పాలనా వ్యవస్థ పలు ప్రభుత్వ సంస్థల చేత నిర్వహించబడుతుంది. అలహాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎ.ఎ.సి, అలహాబాద్ నగర్ నిగమ్ ఎ.ఎన్.ఎన్, ఖండాంతర, నగరం పౌర మౌలిక వసతుల నిర్వహణ వంటి బాధ్యతలు నిర్వహిస్తుంది. సిటీ మునిసిపల్ సంస్థ ప్రాంతం 80 వార్డులుగా విభజించబడింది. ఒక్కో వార్డ్ నుండి ఒక సభ్యుడు కార్పొరేషన్ మున్సిపల్ కమిటీకి ఎన్నుకొనబడతాడు. మున్సిపల్ కమిటీ సభ్యులు నగర మేయరును ఎన్నుకుంటారు. అలబాద్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌ను రాష్ట్రప్రభుత్వం నియమిస్తుంది. వేగంగా జరుగుతున్న నగరాభివృద్ధి వాహనరద్ది వంటి సమస్యలను సృష్టిస్తున్నాయి. అలహాబాదు నగర నిగానికి వాహరద్దీ పెద్ద సంస్యగా మారింది. క్రమపద్ధతిలో సాగని నగరాభివృద్ధి మౌలిక వసతి నిర్మాణాలకు ఆటంకం కలిగిస్తున్నది. ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం, ఒంవే ట్రాఫిక్ ద్వారా వాహనరద్దీ క్రమబద్ధం చేయబడుతుంది.

2012 నాటికి, ఎ.ఎం.సి సమాజ్వాది పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. నగర సంబంధిత ఉత్సవాలు, సమావేశాలు రాజకీయాలకు అతీతమైన నాయకుని నిర్వహణలో జరుగుతుంటాయి. అలహాబాదు పార్లమెంట్ స్థానం కనుక నగరంలో ప్రాంతీయ ప్రభుత్వ కార్యాలయాలు, శాసనసభా కార్యాలయాలు ఉన్నాయి. అలహాబాద్ హైకోర్టు ప్రాంగణంలో రాష్ట్ర సచివాలయం ఉంది. పోలీసు కమిషనర్ ఆధ్వర్యంలో ఉత్తరప్రదేశ్ హోం వ్యవహారాల శాఖ కార్యాలయం ఉంది. అలహాబాదు జిల్లా నుండి రెండు పార్లమెంట్ ప్రతినిధులు ఎన్నుకొనబడతారు. 12 మంది శాసనసభా సభ్యులు ఎన్నుకొనబడుతున్నారు.