Топ-100
Back

ⓘ కాలం ..
                                               

జనవరి

జనవరి, సంవత్సరంలోని ఆంగ్లనెలలులో మొదటి నెల. జనవరి నెలలో 31 రోజులు ఉన్నాయి. ముందుపక్క ఒకముఖము, వెనుకపక్ఒక ముఖము, చేతిలో తాళపు చేతుల గుత్తీ కలిగిన ఒక దేవుడు రోమక పురాణాల్లో కనిపిస్తాడు. అతను పేరు జేనస్ Janus. మహాయుద్ధాలు జరిగే వేళలలో మాత్రమే రోమనులు ఆదేవుని కోవెలతలుపులు తెరచి పూజిస్తారు. శాంతి సమయాల్లో ఎన్ని యేండ్లయినా సరే ఆకోవెల తలుపులు మూసివేస్తారు. ఏపని చేసేముందు ఓం ప్రథమంగా మనము విఘ్నేశ్వర పూజ చేసేటట్లే రోమనులు ప్రతి కార్యారంభంలోనూ జేనస్ దేవునిని పూజిస్తారు. అతను స్వర్గలోకానికి ద్వారపాలకుడట. అతను కోవెలకు ద్వాదశ ద్వారాలు ఉంటాయి. ఒక్కొక్కటీ ఒక్కొక్క మసాధిదేవత రాకపోకలుగ ఏర్పడ్డవట. విఘ్నేశ్వ ...

                                               

జూలై

జూలై నెల, జూలియన్,గ్రెగోరియన్ క్యాలెండర్లు ప్రకారం సంవత్సరంలోని ఆంగ్లనెలలులో ఏడవ నెల. ఈ నెలలో 31 రోజులు ఉన్నాయి.పురాతన రోమన్ క్యాలెండర్లో ఐదవ నెల కావడంతో జూలై నెలను గతంలో లాటిన్లో "క్విన్టిలిస్" అని పిలిచేవారు. జూలియన్ క్యాలెండర్ సంస్కరణ సందర్భంగా జూలియస్ సీజర్ గౌరవార్థం నెల పేరు జూలైగా మార్చబడింది. ఇది గ్రీష్మ ఋతువులో ఒక భాగంగా వస్తుంది.

                                               

నవంబరు

నవంబరు, జూలియన్, గ్రెగోరియన్ క్యాలెండర్ల ప్రకారం సంవత్సరంలోని ఆంగ్లనెలలులో పదకొండవ నెల.ఈ నెలలో 30 రోజులు ఉన్నాయి.సా.శ.ఫూ.750లో రోములస్ క్యాలెండర్ ప్రకారం సంవత్సరంలో ఇది తొమ్మిదివ నెలగా ఉంది. రోమన్ క్యాలెండర్‌లో జనవరి, ఫిబ్రవరి నెలలను చేర్చినప్పుడు, నవంబరు నెల తొమ్మిదివదిగా మారి, దాని పేరును నిలుపుకుంది. నిలుపుకుంది. ప్రాచీన రోమ్‌లో లుడి ప్లెబీ నవంబరు 4 నుండి 17 వరకు, ఎపులం జోవిస్ నవంబరు 13 న, బ్రూమాలియా వేడుకలు నవంబరు 24న జరుగుతాయి.ఈ తేదీలు ఆధునిక గ్రెగోరియన్ క్యాలెండర్‌కు అనుగుణంగా లేవు.నవంబరు నెల దక్షిణార్ధగోళంలో వసంతఋతువు, ఉత్తరార్ధగోళంలో శరదృతువులోని చివరి పూర్తి నెల అయినప్పటికీ, దేశంల ...

                                               

నెల

నెల కాలమునకు ప్రమాణం. ఇది క్యాలండర్లలో ఉపయోగించబడుతుంది. ఇది చంద్రుని కదలికకు సంబంధించిన సహజ కాలానికి సుమారు సమానంగా ఉంటుంది. చంద్రుడు, నెల అనేవి ఒకదానికొకటి సంబంధం ఉన్న పదాలు. సాంప్రదాయకంగా ఈ భావన చంద్ర దశలతో ఉధ్బవించింది. అటువంటి నెలలను చాంద్రమాన మాసములు అంటారు. ఇది సుమారు 29.53 రోజులకు సమనంగా ఉంటుంది. త్రవ్వకాలలో లభించిన గణన కర్రలు ల నుండి పాలియోలిథిక్ యుగం యుగం ప్రారంభంలోనే ప్రజలు చంద్రుని దశలకు సంబంధించి రోజులు లెక్కించారని పరిశోధకులు ఊహించారు. భూమి-సూర్య రేఖకు సంబంధించి చంద్రుని కక్ష్య కాలం ఆధారంగా సైనోడిక్ నెలలు నేటికీ చాలా క్యాలెండర్లకు ఆధారం. అవి సంవత్సరానికి విభజించడానికి ఉపయోగిస ...

                                               

ఫిబ్రవరి

ఫిబ్రవరి, సంవత్సరంలోని ఆంగ్లనెలలులో రెండవ నెల.ఫిబ్రవరి నెలను రోమన్ క్యాలెండర్‌లో సా.శ.పూ.713 లో చేర్చబడింది. నెల పొడవు కాలక్రమేణా మారిపోయింది.ఒక సమయంలో దీనికి 23 రోజులు మాత్రమే ఉన్నాయి.భారతదేశంలో, ఫిబ్రవరి నెల శీతాకాలపు చివరి చల్లని నెల. జూలియస్ సీజర్ రోమన్ క్యాలెండర్‌ను పునర్నిర్మించినప్పుడు, సాధారణ సంవత్సరాల్లో ఈనెలకు 28 రోజులు,ప్రతి నాలుగు సంవత్సరాలకు వచ్చే లీపు సంవత్సరాల్లో 29 రోజులు ఉంటాయి.

                                               

బ్రహ్మ మూహూర్తం

ఒక పనిని ప్రారంభించడానికి నిర్ణయించుకున్న సమయాన్ని ముహుర్తం అంటారు. ఒక పని ఎటువంటి ఆటంకాలు లేకుండా సజావుగా జరగడానికి నిర్ణయించుకున్న మూహుర్తాన్ని మంచి ముహుర్తం అంటారు. ప్రతిరోజు సూర్యోదయానికి ముందు కాలాన్ని అనగా తెల్లవారుజామును మంచి ముహుర్తం అంటారు. అందువలనే తెల్లవారుజామున ప్రారంభించిన పని ఏటువంటి ఆటంకాలు లేకుండా సజావుగా సాగుతాయంటారు. తెల్లవారుజామును రెండు భాగాలుగా విభజించారు. సూర్యోదయమునకు రెండు ఘడియల ముందు కాలాన్ని అనగా 48 నిమిషముల ముందు కాలాన్ని ఆసురీ ముహూర్తం అని ఆసురీ ముహుర్తానికి ముందు 48 నిమిషముల ముందు కాలాన్ని బ్రహ్మ ముహూర్తం అని అంటారు. ప్రతిరోజు బ్రహ్మముహుర్తమున లేచి భగవంతుని ధ్య ...

                                               

భీష్మపంచకం

మహాభారత యుద్ధంలో అర్జనును చేతి భాణంతో మహారధి అయిన భీష్ముడు నేల కూలాడు. అంతటి మహానుభావుడు నేల కూల రాదని అర్జునుడు అనేక బాణాలను సృష్టించి ఒక పడకను ఏర్పాటు చేశాడు. దానినే అంపశయ్య అంటారు. దానిపై భీష్ముడు పడుకున్నాడు. అది దక్షిణాయనం. ఇంకా కొన్ని రోజులకు ఉత్తరాయనం వస్తుంది. అప్పుడు మరణిస్తే తనకు స్వర్గ ప్రాప్తి వస్తుందని తెలిసిన భీష్ముడు అప్పటి దాక ఆగాలని తలపోశాడు. తన కిష్టమైన రోజున మరణించవచ్చుననే తన తండ్రి ఇచ్చిన వరాన్ని భీష్ముడు వినియోగించుకుని రాబోయే ఉత్తరాయణంలో మాఘ శుక్ల ఏకాదశి నాడు తనువు చాలించాలని ముహూర్తం నిర్ణయించు కున్నాడు. మాఘ మాసం శుక్ల పక్షం సప్తమి నుండి రోజు కొక ప్రాణం ప్రాణం చొప్పు ...

                                               

మార్చి

మార్చి March, సంవత్సరంలోని ఆంగ్లనెలలులోని మూడవ నెల. ఈ నెలలో 31 రోజులు ఉన్నాయి. రోమను పురాణాల్లో మార్సు Mars అనే యుద్ధ దేవత ఒకడు. ఉగ్రమూర్తి. సదా సర్వకాలములందును ఆయన భేరీభాంకారాలు, శంఖనాదాలూ, సైనికుల అట్టహాసాలూ మొదలైన భీకరవాతావరణంలోనే సంచరిస్తూవుంటాడుట. తెల్లని రెండు గుర్రాలు కట్టిన దంతపుతేరు అతనికి వాహనము. ఈఅపర నరసింహావతారపు శాఉర్యోటాపాలను, కోపతాపాలను స్మరించినంతమాత్రానే రోమనులు గడగడ వణికి పోతారుట. విల్లు, కత్తి, దండము, గద, ఈటె మొదలైన వివిధాయుతాలతోనూ ఈయన వీరవిహారము చేస్తూ ఉంటాడు. ఉరుములు, మెరుపులు, పిడుగులు, వాన మొదలైనవన్నీ ఈయనవల్లనే ఏర్పడుతున్నవని వీరి నమ్మకము. ఈఉగ్రమూర్తికి ఆదేశస్థులు గొ ...

                                               

మే

మే,జూలియన్, గ్రెగోరియన్ క్యాలెండర్లు ప్రకారం సంవత్సరంలోని ఆంగ్లనెలలులో ఐదవ నెల. ఈ నెలలో 31 రోజులు ఉన్నాయి.సంవత్సరంలో 31 రోజులున్న 7 నెలలులో మూడవది. "మే ఉత్తరార్ధగోళంలో, వసంత ఋతువు, దక్షిణార్ధగోళంలో శరదృతువు వాతావరణం కలిగి ఉంటుంది.అందువల్ల, దక్షిణార్ధగోళంలో మే, ఉత్తరార్ధగోళంలో నవంబరుతో సమానమైన కాలానుగుణమైంది, దీనికి విరుద్ధంగా ఉంటుంది.యునైటెడ్ స్టేట్స్, కెనడాలో వేసవి సెలవుల కాలం సాధారణంగా మే తో ఆలస్యంగా ప్రారంభమవుతుంది. ఇది సెప్టెంబర్ మొదటి సోమవారం కార్మిక దినోత్సవంతో ముగుస్తుంది.మే నెల ఏ సంవత్సరంలోనైనా ఏ నెల వారంలో అదే రోజున ప్రారంభం కాదు, కానీ ముగుస్తుంది. ఈ రెండు లక్షణాలతో ఉన్న నెల ఇది మ ...

                                               

లీపు సంవత్సరం

ఒక కాలెండరు సంవత్సరంలో అదనంగా ఒక రోజు గానీ లేఒక నెల గాని అదనంగా ఉంటే, దానిని లీపు సంవత్సరం అంటారు. ఖగోళ సంవత్సరంతో, కాలెండరు సంవత్సరానికి వచ్చే తేడాను సరిచేయడానికి లీపు సంవత్సరాన్ని ప్రవేశపెట్టారు. ఖగోళ సంవత్సరంలో ఘటనలు కచ్చితంగా ఒక పూర్ణ దినాలలో పునరావృతం కావు. ఉదాహరణకు భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టే కాలం ఖచ్చితంగా 365 రోజులు కాకుండా, సుమారు 6 గంటలు అదనంగా పడుతుంది. కానీ ప్రతి ఏడూ ఒకే సంఖ్యలో రోజులుండే కాలెండరు ఈ పావు రోజును చూపించలేదు. గ్రిగోరియన్ క్యాలెండరులో మామూలుగా 365 రోజులే ఉంటాయి. అంటే ఒక పావు రోజు తక్కువగా ఉంటుంది. ఏళ్ళు గడిచే కొద్దీ ఈ తేడా పెరిగిపోతూ ఉంటుంది. గ్రిగోరియన్ ...