Топ-100
Back

ⓘ కాలం ..
                                               

కాల మండలం

భూమి మీద ఒకే వేళకు ఒకే సమయాన్ని పాటించే ప్రాంతాలను కలిపి ఒక సమయ ప్రాంతంగా పరిగణిస్తారు. సాధారణంగా పక్కపక్కన ఉండే సమయ ప్రాంతాలు ఒక గంట తేడాలో ఉంటాయి. సాంప్రదాయికంగా గ్రీన్‌విచ్ మీన్ టైముతో పోల్చి తమ స్థానిక సమయాన్ని లెక్కవేస్తాయి. ప్రపంచంలోని సమయ మండలాలన్నీ కోఆర్డినేటెడ్ యూనివర్సల్ టైమ్‌ యుటిసి ను అనుసరించి ఉంటాయి. 0 o రేఖాంశం వద్ద సగటు సౌర సమయమే యుటిసి. ప్రపంచ దేశాలన్నీ దీన్ని అనుసరించి తమ దేశాల్లోని సమయ మండలాన్ని నిశ్చయించుకుంటాయి. ప్రతీ రేఖాంశానికీ 4 నిమిషాల చొప్పున సమయం ముందుకు గాని, వెనక్కు గానీ ఉంటుంది. దీన్ని యుటిసి నుండి 30 o తూర్పున ఉన్న రేఖాంశం వద్ద సమయం యుటిసి కంటే 120 నిమిషాలు 2 ...

                                               

ఆకురాలు కాలం

ఉష్ణమండలంలో ఉన్న ఆంధ్రదేశంలో చెట్లు ఆకులు రాల్చడం అంతగా కనిపించదుకాని, సమశీతల దేశాలలోను, శీతల మండలాలలోను చలికాలం వచ్చే సరికి కొన్ని చెట్లు ఆకులన్నిటిని పూర్తిగా రాల్చేసి మోడులలా బోడిగా కనిపిస్తాయి. మన దేశంలో కులూ లోయ లోను, కాశ్మీరు లోను ఈ విశేషం చూడవచ్చు. శీతల దేశాలలో కూడా అన్ని చెట్లూ ఆకులని రాల్చవు. పైను, ఫర్‌ మొదలైన చెట్ల ఆకులు సన్నగా సూదులలా ఉంటాయి; ఇవి ఆకులని రాల్చవు. ఎల్లప్పుడూ పచ్చగానే ఉంటాయి. కాని వెడల్పాటి ఆకులు ఉన్న చెట్లన్నీ చలికాలంలో ఆకులని రాల్చుతాయి. ఈ ప్రవర్తనకి చాల కారణాలు చూపించవచ్చు. మొదటి కారణం. ఆకులు వెడల్పుగా ఉన్న చెట్టు వైశాల్యం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ వైశాల్యం ఉన్న ...

                                               

ఆగష్టు

ఆగష్టు, సంవత్సరంలోని ఆంగ్లనెలలులో ఎనిమిదవ నెల. ఈ నెలలో 31 రోజులు ఉన్నాయి.భూమి దక్షిణార్థగోళంలో ఆగస్టు నెల వాతావరణం, ఉత్తరార్థగోళంలో ఫిభ్రవరి వాతావరణం ఒకేరకంగా ఉంటాయి.మొదట్లో ఈ మాసాన్ని సెక్స్టిలస్ అని పిలిచేవారు. ఎందుకంటే ఆనాటి పాత రోమన్ పంచాంగంలో ఇది ఆరవ మాసం. ఆ రోజుల్లో సంవత్సరంలో "మార్చి" మొదటి నెలగా ఉండేది. సంవత్సరానికి మొత్తం పది నెలలు మాత్రమే ఉండేవి. ఆ తర్వాత సా.శ.పూ. ౭౦౦ నాటికి జనవరి, ఫిబ్రవరి నెలలు కలపడంతో ఇది ఎనిమిదవ నెల అయింది. మొదట్లో ఈ నెలకు కేవలం ౨౯ రోజులు మాత్రమే ఉండేవి. ఆ తర్వాత సా.శ.పూ. ౪౫ వ సంవత్సరానికి జూలియస్ సీజర్ రెండు రోజులు కలపడంతో ఈ నెలకు 31 రోజులు వచ్చాయి.సా.శ.పూ. ...

                                               

ఏప్రిల్

ఏప్రిల్, గ్రెగోరియన్, జులియన్ కేలెండర్ ప్రకారం సంవత్సరంలోని ఆంగ్లనెలలులో నాలుగవ నెలగా ఉంది.ఈ నెలకు 30 రోజులు ఉన్నాయి.ఈ పదం లాటిన్ భాష నుండి ఉద్భవించింది.ఏప్రియల్ పేరు గ్రీకు దేవత అనే ఆఫ్రొడైట్ పేరు మీద పెట్టబడిందని కొంత మంది నమ్మకం. ఏప్రియల్, చెట్లు చిగిర్చి, పూలు పూసే వసంత ఋతువులో ఒక భాగంగా ఉంది.

                                               

కార్తె

మన రైతులు ప్రకృతిలో సమతూకం దెబ్బతినకుండా పంటలు సాగు చేశారు.తమ అనుభవాల విజ్ఞాన సారాన్ని సామెతలలో పదిలపరచుకున్నారు.తెలుగురైతులు సామెతల రూపంలో వ్యవసాయ విజ్ఞానాన్ని దాచారు.తరువాతి తరాలకూ ఆ జ్ఞానం అందేలా చేశారు.పురుగుమందులు, జన్యుమార్పిడి విత్తనాలు, ప్రకృతి వైపరీత్యాలతో భయంగొలుపుతున్న కొత్త సమాజంలో రాబోయే రోజుల్లో ఇంకా కొత్త సామెతలు పుట్టవచ్చు. జోతిష్కులు 27 నక్షత్రాల ఆధారంగా జాతకాలు, పంచాంగాలు తయారు చేశారు.సూర్యోదయమప్పుడు ఏ చుక్క చంద్రుడికి దగ్గరగా ఉంటే ఆ రోజుకు ఆ నక్షత్రం పేరు పెట్టారు. పున్నమి రోజు చంద్రుడు ఏ చుక్కతో ఉంటే ఆ నెలకు ఆ పేరు పెట్టారు.కానీ తెలుగు రైతులు మాత్రం ఇవే నక్షత్రాలతో తమ అ ...

                                               

గ్రీష్మ ఋతువు

గ్రీష్మ ఋతువు భారతదేశంలో వివిధ కాలాలలో వాతావరణంలో ఏర్పడే మార్పులను బట్టి సంవత్సరాన్ని ఆరు ఋతువులుగా విభజించారు. వాటిలో ఒకటి గ్రీష్మఋతువు. గ్రీష్మఋతువు అంటే జ్యేష్ఠ, ఆషాఢ మాసములు. ఎండలు మెండుగా వుండు కాలము. ప్లూటో వాతావతణం నెప్ట్యూన్ వాతావతణం యూరోపా వాతావతణం ట్రైటాన్ వాతావతణం బృహస్పతి వాతావతణం టైటాన్ వాతావతణం బుధుని వాతావతణం భూమి వాతావతణం గనీమీడ్ వాతావతణం యురేనస్ వాతావతణం శని యొక్క వాతావతణం ఎన్సెలాడస్ వాతావతణం చంద్రుని వాతావతణం శుక్రుని వాతావతణం Io వాతావతణం అంగారకుని వాతావతణం

                                               

మాస సంక్రాంతి

సూర్యుడు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క నక్షత్ర రాశిలో ఉంటాడు. నెలకి ఒకసారి ఒక నక్షత్రరాశి నుండి మరొక నక్షత్రరాశికి సూర్యుడు సంక్రమణం చెందడాన్ని మాస సంక్రాంతి అంటారు.

                                               

శుక్ల పక్షం

అమావాస్య తరువాతిరోజు పాడ్యమి నుండి మొదలు పౌర్ణమి వరకు గల పదిహేను రోజులను శుక్ల పక్షం లేదా శుద్ధ పక్షం అని అంటారు. ప్రతీ నెలకు రెండు పక్షాలు ఉంటాయి. అవి శుక్ల పక్షం, కృష్ణ పక్షం. రెండు పక్షాలని కలిపి ఒక నెలగా పరిగణిస్తారు. చంద్రుడు అమావాస్య తరువాతనుండి రోజుకూ ప్రవర్ధమానం చెందుతూ పౌర్ణమి రోజున పూర్తి స్థాయిగా ప్రకాశిస్తాడు. ఈ సమయాన్ని శుక్ల పక్షం అని అంటారు. ఈ సమయంలో చంద్రుడిని శుక్ల పక్ష చంద్రుడు అని అంటారు. అనగా రోజు రోజుకూ వృద్ధి చెందుతూ ఉంటాడని అర్థం.