Топ-100
Back

ⓘ కాశీ లేదా వారణాసి భారతదేశపు అతి ప్రాచీన నగరాల్లో ఒకటి. హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్య క్షేత్రము. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోవుంది. ఇక్కడ ప్రవహించే గంగానదిలో ..
కాశీ
                                     

ⓘ కాశీ

కాశీ లేదా వారణాసి భారతదేశపు అతి ప్రాచీన నగరాల్లో ఒకటి. హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్య క్షేత్రము. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోవుంది. ఇక్కడ ప్రవహించే గంగానదిలో స్నానం ఆచరిస్తే సర్వపాపాలు నశించి పునర్జన్మ నుంచి విముక్తులౌతారని హిందువుల నమ్మకం. వరుణ, అసి అనే రెండు నదులు ఈ నగరం వద్ద గంగానదిలో కలుస్తాయి. అంచేత, ఈ క్షేత్రానికి వారణాసి వారణాసి అని అంటుంటారు అని కూడా నామాంతరం ఉంది. బ్రిటిషువారి వాడుకలో వారణాసి, బెనారస్ అయింది. కాశ్యాన్తు మరణాన్ ముక్తి: - "కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుంది" - అని హిందువులు విశ్వసిస్తారు. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన విశ్వేశ్వర లింగం ఇక్కడ ఉంది. బౌద్ధులకు, జైనులకు కూడా ఇది పుణ్యక్షేత్రం. వారాణసి ప్రపంచంలోనే అవిచ్ఛిన్నంగా జనావాసం ఉన్న నగరాలలోఅత్యంత పురాతనమైనది అని భావిస్తున్నారు.

గంగా నది, హిందూమతము, హిందూస్తానీ సంగీతము, పట్టు వస్త్రాల నేత, హిందీ, సంస్కృత పండితుల పీఠం - ఇవి వారాణసి నగరపు సంస్కృతీ చిహ్నాలలో ప్రముఖంగా స్ఫురణకు వస్తాయి. హరిశ్చంద్రుడు, గౌతమ బుద్ధుడు, వేదవ్యాసుడు, తులసీదాసు, శంకరాచార్యుడు, కబీర్ దాసు, మున్షీ ప్రేమ్‌చంద్, లాల్ బహదూర్ శాస్త్రి, పండిట్ రవిశంకర్, బిస్మిల్లా ఖాన్, కిషన్ మహరాజ్ వంటి ఎందరో పౌరాణిక, చారిత్రిక, సాంస్కృతిక ప్రముఖులు వారణాసి నగరం లేదా దాని పరిసర ప్రాంతాలతో ప్రగాఢమైన అనుబంధం కలిగి ఉన్నారు. వారణాసికి గంగానది ఆవలివైపున రామనగరం ఉంది. వారణాసి సమీపంలో సారనాథ్ బౌద్ధ క్షేత్రం ఉంది.

విశ్వేశ్వరాలయం, అన్నపూర్ణాలయం, విశాలాక్షి ఆలయం, వారాహీమాతాలయం, తులసీ మానస మందిరం, సంకట మోచనాలయం, కాల భైరవాలయం, దుర్గా మాత దేవాలయం, భారతమాత మందిరం, లోలార్కడు - ఇలా కాశీలో ఎన్నో దేవాలయాలున్నాయి. దశాశ్వమేధ ఘట్టం, హరిశ్చంద్ర ఘట్టం వంటి పలు స్నాన ఘట్టాలున్నాయి. కాశీ హిందూ విశ్వవిద్యాలయం ఇక్కడి ప్రస్తుత విద్యా సంస్థలలో ముఖ్యమైనది. వారణసిని "మందిరాల నగరం", "దేశపు ఆధ్యాత్మిక రాజధాని", "దీపాల నగరం", "విద్యా నగరం", "సంస్కృతి రాజధాని" వంటి వర్ణనలతో కొన్ని సందర్భాలలో ప్రస్తావిస్తుంటారు. అమెరికన్ రచయిత మార్క్ ట్వేయిన్ ఇలా వ్రాశాడు - "బెనారస్ నగరం చరిత్ర కంటే పురాతనమైనది. సంప్రదాయంకంటే పురాతనమైనది. గాధలకంటే ముందుది. వీటన్నింటినీ కలిపినా బెనారస్ నగరం కంటే తరువాతివే అవుతాయి."

                                     

1. వారాణసి

గంగానదితో రెండు చిన్న నదులు "వరుణ", "ఆస్సి" అనే రెండు నదుల సంగమాల మధ్య ఉన్నందున "వారణాసి" అనే పేరు వచ్చిందని ఒక అభిప్రాయం. వారాణసి నగరానికి ఉత్తరాన వరుణ సంగమ స్థానం, దక్షిణాన అస్సి ఇది చిన్న నది నది సంగమ స్థానం ఉన్నాయి. మరొక అభిప్రాయం ప్రకారం "వరుణ" నదికే పూర్వకాలం "వారాణసి" అనే పేరు ఉండేది. కనుక నగరానికి కూడా అదే పేరు వచ్చింది. కాని ఈ రెండవ అభిప్రాయం అధికులు విశ్వసించడంలేదు.

"వారాణసి" అనే పేరును పాళీ భాషలో "బారనాసి" అని వ్రాశేవారు. అది తరువాత బవారస్‌గా మారింది. వారాణసి నగరాన్ని ఇతిహాస పురాణాలలో "అవిముక్తక", "ఆనందకానన", "మహాస్మశాన", "సురధాన", "బ్రహ్మవర్ధ", "సుదర్శన", "రమ్య", "కాశి" అనే వివిధ నామాలతో ప్రస్తావించారు.

                                     

2. చరిత్ర

సుమారు 5.000 సంవత్సరాల క్రితం శివుడు వారాణసి నగరాన్ని స్థాపించాడని పౌరాణిక గాథల సారాంశం. ఇది హిందువుల ఏడు పవిత్ర నగరాలలో ఒకటి. ఋగ్వేదం, రామాయణం, మహాభారతం, స్కాంద పురాణం వంటి అనేక భారతీయ ఆధ్యాత్మిక గ్రంథాలలో కాశీనగరం ప్రసక్తి ఉంది.

వారాణసి నగరం సుమారు 3.000 సంవత్సరాల నుండి ఉన్నదని అధ్యయనకారులు భావిస్తున్నారు. విద్యకు, పాండిత్యానికి, శిల్పం, వస్త్రం, సుగంధ ద్రవ్యాలవంటి వస్తువుల వ్యాపారానికి వారాణసి కేంద్రంగా ఉంటూ వచ్చింది. గౌతమ బుద్ధుని కాలంలో ఇది కాశీ రాజ్యానికి రాజధాని. చైనా యాత్రికుడు యువాన్ చాంగ్ Xuanzangఈ నగరాన్ని గొప్ప ఆధ్యాత్మిక, విద్యా, కళా కేంద్రంగా వర్ణించాడు. ఇది గంగానదీ తీరాన 5 కిలోమీటర్ల పొడవున విస్తరించిందని వ్రాశాడు.

18వ శతాబ్దంలో వారాణసి ఒక ప్రత్యేక రాజ్యమయ్యింది. తరువాత బ్రిటిష్ పాలన సమయంలో ఈ నగరం ఆధ్యాత్మిక, వాణిజ్య కేంద్రంగా కొనసాగింది. 1910లో "రామ్‌నగర్" రాజధానిగా బ్రిటిష్ వారు ఒక రాష్ట్రాన్ని ఏర్పరచారు. కాని ఆ రాష్ట్రానికి వారాణసి నగరంపైన మాత్రం పాలనాధికారం లేదు. ఆ వంశానికి చెందిన కాశీ నరేష్ మహారాజ్ ఇప్పటికీ రామ్ నగర్ కోటలోనే నివసిస్తున్నాడు.

                                     

2.1. చరిత్ర పురాణకథనాలు

కాశీ శివస్థాపితమని పురాణకథనాలు వివరిస్తున్నాయి. కురుక్షేత్ర యుద్ధం తరువాత పాండవులు భాతృహత్య, బ్రహ్మహత్యా పాతకాల నుండి విముక్తులవడానికి సప్తముక్తిపూరాలలో ఒకటైన కాశీ పట్టణానికి విచ్చేసారు.అయోధ్య, మథుర, గయ,కాశి, అవంతిక, కంచి, ద్వారక నగరాలను సప్తముక్తి పురాలని హిందువుల విశ్వాసం. ఆరంభకాల పూరాతతత్వ పరిశోధనలు వారణాశి పరిసరప్రాంతాలలో 11-12 శతాబ్ధాలలో నివాసాలు ఆరంభమయ్యాయని తెలియజేస్తున్నాయి. ఇది ఆర్యౌల మత, తత్వశాస్త్రాలకు మూలమని విశ్వసించబడుతుంది. ప్రపంచంలో నిరంతరంగా నివాసయోగ్యమైన ప్రదేశాలలో కాశీ ప్రథమ స్థానంలో ఉందని భావిస్తున్నారు. పురాతత్వ అవశేషాలు వారణాశి వేదకాల ప్రజల అవాసమని వివరిస్తున్నాయి. కాశీ పట్టణం గురించి ప్రథమంగా అధర్వణ వేదంలో వర్ణించబడింది. అధర్వణవేదం సుమారుగా వేదకాల ప్రజలిక్కడ నివసించారని భాస్తున్న సమయానికి సరొపోతున్నాయి. ఈ ప్రాంతంలో స్థానికులు నివసించారాని చెప్పడానికి తగిన ఆధారాలు లభిస్తున్నాయి. 8వ శతాబ్దంలో 23వ జైనగురువు, ఆరంభకాల తీర్ధగురువు అయిన పర్ష్వ జన్మస్థానం వారణాసి అనడానికి ఆధారాలు లభిస్తున్నాయి.

                                     

2.2. చరిత్ర ఆర్ధికం

వారణాశి పారిశ్రమికంగా కూడా అభివృద్ధి చెందింది. వారణాశి మస్లిన్, పట్టు వస్త్రాలకు, సెంటు, దంతపు వస్తువులు, శిల్పాలకు ప్రసిద్ధి. గౌతమబుద్ధుడు జననం 567 క్రీ.పూనివసించిన కాలంలో కాశీ రాజ్యానికి కాశీ రాజధానిగా ఉండేది. క్రీ.పూ 528 బుద్ధిజం కాశీలో స్థాపించబడిందని అంచనా. గౌతమబుద్ధుడు కాశీలోని సారనాధ్ వద్ద ధర్మచక్రం కదిలింది టర్నింగ్ ది వీల్ ఆఫ్ లా మొదటిసారిగా గంభీరఉపన్యాసం ప్రజలకు అందించాడు. చైనా యాత్రికుడు హూయంత్సాంగ్ క్రీ.శ 635లో వారణాశిని దర్శించాడు. కాశీ పశ్చిమతీరంలో ఐదు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన వారణాశి మతం, కళలకు కేంద్రంగా ఉండేదని హూయంత్సాంగ్ వర్ణించాడు. 7వ శతాబ్దంలో హూయంత్సాంగ్ వారణాశిలో నివసించాడు. హూయంత్సాంగ్ వారణాశిని పోలనైస్ అని పేర్కొన్నాడు. 30 సన్యాదులకు సంబంధించిన 30 ఆలయాలను కూడా ఆయన వర్ణించాడు. 8వ శతాబ్దంలో శంకరాచార్యుడు శివారధన విధానాలను సాధికారంగా ఆరంభించిన తరువాత వారణాశి మతపరంగా మరింత ప్రసిద్ధి చెందింది.

                                     

2.3. చరిత్ర ప్రముఖులు

మౌర్యుల కాలంలో తక్షశిల, పాటలీపుత్ర మద్య ఉన్న రహదారితో కాశీపట్టణం అనుసంధానించబడి ఉంది. 1194లో వారణాశి నగరం కుతుబుద్దీన్ ఐబక్ స్వాధీనమైంది. కుతుబుద్దీన్ ఐబక్ ఆదేశంతో నగరంలోని సుమారు 1000 ఆలయాలను ధ్వశం చేయబడ్డాయి. ముస్లిం ఆక్రమణలో నగరం దాదాపు 3 శతాబ్ధాల కాలం క్షీణావస్థను చవిచూసింది. ఆఫ్గన్ దండయాత్ర తరువాత నగరంలో సరికొత్తగా ఆలయాలు నిర్మించబడ్డాయి. ఫెరోజ్ షాహ్ కాలంలో 1376లో వారణాశిలోని మరికొన్ని ఆలయాలు ధ్వశం చేయబడ్డాయి. ఆఫ్గన్ రాజు సికిందర్ లోడి హిదువుల ఆణిచివేతను కొనసాగిస్తూ 1496లో మిగిలిన హిందూ ఆలయాలను ధ్వశం చేయించాడు. ముస్లిం పాలన కాలంలోనే మరికవైపు వారణాశి మేధావులకు, తాత్వికులకు కేంద్రంగా మారింది. మద్యకాలంలో వారణాశి మతసంప్రదాయాలకు, విద్యకు కేంద్రమై విలసిల్లింది. భక్తి ఉద్యమకాలంలో వారణాశిలో 1389లో రామభక్తుడైన కబీరుదాసు జన్మించాడు. కబీరరుదాసు రచించిన భక్తిరసపూరిత కీర్తనలు 15 వ శతాబ్దంలో భారతదేశంలో కీర్తించబడ్డాయి. అలాగే 15 వ శతాబ్దంలో సంఘసంస్కర్త, యోగి, కవి, యాత్రికుడు, మతగురువు అయిన రవిదాసు వారణాశిలో జన్మించాడు. రవిదాసు జీవనోధి కొరకు తోళ్ళపరిశ్రమలో పనిచేసాడు. అలాగే భారతదేశం, దక్షిణాసియా అంతటి నుండి అనేక ప్రఖ్యాత విద్యావేత్తలు, బోధకులు వారణాశిని సందర్శించారు. 1507లో గురునానక్ దేవ్ శివరాత్రి సందర్భంగా వారణాశిని సందర్శించాడు. ఈ సంఘటన సిక్కుమత స్థాపనలో అత్యంత ప్రాముఖ్యత వహించింది.                                     

2.4. చరిత్ర స్వాతంత్రానికి ముందు చరిత్ర

16వ శతాబ్దంలో మొగల్ చక్రవర్తి అక్బర్ పాలనలో వారణాశిలో సరికొత్త సంస్కృతి మొదలైంది. ఆక్బర్ చక్రవర్తి ఆధ్వర్యంలో వారణాశిలో శివునికి, విష్ణుమూర్తికి రెండు పెద్ద ఆలయాలను నిర్మించబడ్డాయి. పూనా రాజు 200 మీటర్ల 660 అడుగులు ఎత్తైన అంపూర్ణాదేవి నమందిరం నిర్మించాడు. అలాగే పూనా రాజు పాలనలో శివా - విష్ణులకు అంకితమివ్వబడిన అక్బారి వంతెన కూడా నిర్మించబడింది. 16వ శతాబ్దం నుండి వారణాశికి యాత్రికుల రాక ప్రారంభమైంది. 1665లో ఫ్రెంచి యాత్రికుడైన జీన్ బాప్టిస్ట్ ట్రావర్నియర్ ఈ నగరాన్ని సందర్శించి వారణాశిలోని గంగాతీరంలో ఉన్న బిందు మహాదేవాలయం సౌందర్యాన్ని వర్ణించాడు. చక్రవర్తి షేర్ షాహ్ సూరి కాలంలో వారణాశి రహదారి పునరుద్దరినబడి కొలకత్తా నుండి పెషావర్ వరకు పొడిగించబడింది. తరువాత బ్రిటిష్ పాలనా కాలంలో ఈ రహదారి ప్రఖ్యాతమైన గ్రాండ్ ట్రంక్ రోడ్డుగా అవతరుంచింది. 1656లో ఔరంగజేబు పలు ఆలయాలు ధ్వంసం చేయబడి మసీదులు నిర్మించబడ్డాయి. నగరం తిరిగి సంస్కృతి పరంగా వెనుకబడింది. అయినప్పటికీ ఔరంగజేబు మరణానంతరం భారాదేశంలో తిరిగి హిందూ రాజ్యాలు తలెత్తి వర్ద్ధిల్ల సాగాయి. ప్రస్తుతం వారణాశిలో ఉన్న ఆలయాలు హిందూ రాజులైన రాజపుత్రులు, మరాఠా రాజులచేత నిర్మించబడ్డాయి. ప్రస్తుతం వారణాసిలోని పలు నిర్మాణాలు 18వ శతాబ్ధానికి చెంది ఉన్నాయి. బెనారస్ రాజు లేక కాశీ నరేష్ తో సహా ఈ రాజులు బ్రిటిష్ పాలనా సమయంలో క్రీ.శ 1775-1945 కూడా కొనసాగారు. 1737లో మొగల్ చక్రవర్తుల ఆధ్వర్యంలో బెనారస్ రాజ్యం కింగ్డం అఫ్ బెనారస్ పేరుతో సాధికారంగా ఏర్పాటు చేయబడి 1947 వరకు కొనసాగింది. 18వ శతాబ్దంలో మహమ్మద్ షాహ్ ఆధ్వర్యంలో గంగాతీరంలో ఉన్న మాన్ మందిరం ఘాట్ వద్ద ఒక అబ్జర్వేటరీ కేంద్రాన్ని నిర్మించబడింది. ఇది జ్యీతిషశాస్త్ర విషయాల పరిశీలనకు అనుకూలమైంది. 18వ శతాబ్దంలో ఈ ప్రాంతానికి బ్రిటిష్ గవర్నర్లైన వారెన్ హేస్టింగ్, వారణాశిలో సంస్కృత కళాశాలను స్థాపించిన జూనాథాన్ డంకన్ కాలంలో వారణాశి పర్యాటకం మరింత వర్ధిల్లింది. 1867లో వరణాశిలో పురపాలక సంఘస్థాపన జరిగిన తరువాత వారణాశి నగరంలో మరింత అభివృద్ధి కొనసాగింది.                                     

2.5. చరిత్ర ప్రత్యేక సంఘటనలు

1897లో మార్క్ ట్వైన్, వారణాశి గురించి వర్ణిస్తూ బెనారస్ చరిత్రకంటే పురాతనమైనది. సంప్రదాయాలకంటే పాతది, పురాణాలకంటే పురాతనమైనది అలాగే అన్నింటికంటే అత్యంత పురాతనమైనది. 1910లో బ్రిటిష్ ప్రభుత్వం వారణాశిని భారతీయ భూభాగంగా చేసి రామనగరాన్ని రాజధానిగా చేసి తన న్యాయపరిధి నుండి తొలగించింది. అయినప్పటికీ తరువాత కూడా గంగాతీరంలో వారణాశి భుభాగంలో ఉన్న రామనగర్ కోటలో కాశిరాజు నివసిస్తూ ఉన్నాడు. ప్రస్థుతం రామనగర్ కోటలో కాశిరాజులకు చెందిన వస్తుసంగ్రహాలతో మ్యూజియం నిర్వహించబడుతుంది. 18వ శతాబ్దం నుండి ఈ కోటలో కాశీరాజులు నివసిస్తూ వచ్చారని ప్రాంతీయ వాసులు వివరిస్తున్నారు. రాజు మతపరంగా అధ్యక్ష స్థానంలో ఉంటాడు అలాగే ప్రజలు రాజుని శివుని అవతారంగా భావిస్తారు. రాజు స్వయంగా అన్ని మతసంప్రదాయాల సంప్రదాయాలకు ఆధిపత్యం వహిస్తుంటాడు.

1857 లో వారణాశిలో బ్రిటిష్ సామ్రాజ్యానికి చెందిన భారతీయ సైనికులు స్వాతంత్ర సమరయోధుల మీద జరిగిపిన దమనకాండలో సామూహిక హత్యలు జరిగాయి. వారణాశిలో అనీబిసెంట్ దియోసాఫీ సిద్ధాంతం ప్రతిపాదించడమేగాక సెంట్రల్ హిందూ కాలేజ్ స్థాపన కూడా చేసింది. తరువాత సెంట్రల్ హిందూ కాలేజ్ 1916 నుండి బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం గా మారింది. ఇది మతాతీతంగా విద్యాసేవలు అందిస్తుంది. అనీబిసెంట్ సెంట్రల్ హిందూ కాలేజ్ ని అన్ని మతాలకు చెందిన మనుషులు కేంద్రీకృతమై సహోదరత్వంతో కృషిచేసి భారతీయ సంస్కృతిని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో స్థాపించింది. అలాగే భారతీయ సమూహాలలో ఉన్న మూఢవిశ్వాసాలను తొలగించడం అనీబిసెంట్ లక్ష్యాలలో భాగమే. వారణాశి 1948 అక్టోబరు 15 న యూనియన్ ఆఫ్ ఇండియాకు ఇవ్వబడింది. 2000 లో విభూతి నారాయణన్ సింగ్ మరణం తరువాత ఆయన కుమారుడైన అనంత్ నారాయణ్ సింగ్ రాజయ్యాడు. రాజు కాశీరాజు సంప్రదాయాల ఆచరణ బాధ్యతను వసహిస్తాడు.

                                     

3. భౌగోళికం

వారాణసి నగరo ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం తూర్పు భాగంలో గంగా మైదానంలో, గంగానది ఒడ్డున ఉంది. ఇక్కడ గంగానది వంపు తిరిగి ఉంది. ఇది వారాణసి జిల్లాకు కేంద్రం కూడాను. వారాణసి నగం, దాని పరిసర ప్రాంతాలు "Varanasi Urban Agglomeration" కలిపి మొత్తం 112.26 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించి ఉన్నాయి. ఈ నగరం ప్రాంతం 82° 56’తూ. - 83° 03’తూ. రేఖాంశాల మధ్య, 25° 14’ఉ. - 25° 23.5’ఉ. అక్షాంశాల మధ్య ఉంది. గంగానది వరదలతో low level floods ఈ ప్రాంతం నేల సారవంతంగా ఉంటుంది.

వారాణసి నగరం మాత్రం గంగ, వరుణ నదుల మధ్య ఉంది. ఈ నగరం సముద్ర మట్టం నుండి 80.71 మీటర్ల ఎత్తులో ఉంది. పెద్దగా ఉపనదులు, పిల్ల కాలువలు లేనందున ఇక్కడి భూమి అధికంగా పొడిగా ఉంటుంది.

వారాణసి నగరం రెండు సంగమ స్థానాల మధ్య ఉన్నట్లుగా చెప్పబడుతుంది. 1 గంగ, వరుణ నదుల సంగమం 2 గంగ, అస్సి నదుల సంగమం. అస్సి నది చాలా చిన్నది కాలువ వంటిది ఈ రెండు సంగమాల మధ్య దూరం సుమారు 2.5 కిలోమీటర్లు. ఈ రెండు సంగమ స్థానాల మధ్య 5 కిలోమీటర్ల యాత్ర "పంచ క్రోశి యాత్ర" పవిత్రమైనదిగా భావిస్తారు. యాత్రానంతరం సాక్షి వినాయకుని మందిరాన్ని దర్శిస్తారు.

                                     

3.1. భౌగోళికం వాతావరణం

వారాణసి వాతావరణం తేమగా ఉన్న సమోష్ణ వాతావరణం humid subtropical climate. వేసవి, శీతాకాలం ఉష్ణోగ్రతల మధ్య అంతరం చాలా ఎక్కువగా ఉంటుంది. ఏప్రిల్-అక్టోబరు మధ్య వేసవి కాలంలో ఋతుపవనాల వల్ల అప్పుడప్పుడు వర్షాలు పడుతుంటాయి. హిమాలయ ప్రాంతంనుండి వచ్చే చలి తెరగలు Cold waves కారణంగా డిసెంబరు - ఫిబ్రవరి మధ్య శీతాకాలంలో చలి బాగా ఎక్కువగా ఉంటుంది. వేసవిలో నగరం ఉష్ణోగ్రతలు 32 - 46 °C మధ్య, చలికాలంలో 5° - 15 °C మధ్య ఉంటాయి. సగటు వర్షపాతం 1110 మిల్లీమీటర్లు చలికాలంలో దట్టమైన పొగ మంచు, వేసవి కాలంలో వడ గాడ్పులు ఉంటాయి.

నగరంలో వాతావరణ గాలి కాలుష్యం ఇప్పటికి అంత తీవ్రమైన సమస్య కాదు. కాని నీటి కాలుష్యం మాత్రం బాగా ఎక్కువగా ఉంది. ఇందువలనా, నది పైభాగంలో కడుతున్న ఆనకట్టల వలనా గంగానదిలో నీటి మట్టం తగ్గుతున్నది. నది మధ్యలో మట్టి మేటలు బయటపడుతున్నాయి.

                                     

3.2. భౌగోళికం ఆర్ధికరంగం

వారాణసిలో ఉన్న ఒక పెద్ద పరిశ్రమ రైల్వే డీసెల్ ఇంజన్ల తయారీ కర్మాగారం Diesel Locomotive Works - DLW. కాన్పూర్‌కు చెందిన నిహాల్ చంద్ కిషోరీ లాల్ కుటుంబం 1857లో స్థాపించిన ఆక్సిజన్ కర్మాగారం ఇక్కడి మొదటి పెద్ద పరిశ్రమ కావచ్చును.

కాని అధికంగా వారాణసిలో చిన్న పరిశ్రమలు ఉన్నాయి. ముఖ్యంగా పట్టు వస్త్రాల నేత ఇక్కడ పెద్ద కుటీర పరిశ్రమ. ఇంకా తివాచీల నేత, చేతి కళల వస్తువుల తయారీ ఉన్నాయి. బనారసీ పాన్, బనారసీ కోవా ప్రసిద్ధాలు. లార్డ్ మెకాలే వారాణసి ఎంతో సంపన్నమైన నగరమని, ఇక్కడ తయారయ్యే నాణ్యమైన సన్నని పట్టు వస్త్రాలు ప్రపంచంలో వివిధ సంపన్న గృహాలను అలంకరిస్తున్నాయని వ్రాశాడు. మొదటినుండి యాత్రా స్థలం అవ్వడం వలన, వారాణసి దేశం అన్ని ప్రాంతాలనుండి జనులను ఆకర్షించేది. కనుక ఇది ప్రముఖ వాణిజ్య కేంద్రంగా అభివృద్ధి చెందింది.

వారణాశిలోని 29% ప్రజలు ఉద్యోగాలను కలిగి ఉన్నారు. వారిలో 40% వస్తూత్పత్తి పరిశ్రమలలో పనిచేస్తుండగా 26% ప్రజలు వ్యాపార వాణిజ్యాలు చేస్తున్నారు, 19% ప్రజలు సేవారంగాన్ని జీవనోపాధిగా ఎంచుకున్నారు, 8% రవాణా, సమాచార రంగంలో పనిచేస్తున్నారు, 4% వ్యవసాయరంగంలో పనిచేస్తున్నారు, 2% నిర్మాణరంగంలో పనిచేస్తున్నారు వీరికి సంవత్సరంలో ఆరుమాసాలు మాత్రమే పని ఉంటుంది. తయారి పనివారిలో 51% స్పిన్నింగ్ పనిలో ఉన్నారు, 6% ప్రజలు ముద్రణ, ప్రచురణ పనిలో ఉన్నారు, 5% ప్రజలు విద్యుత్తు మిషనరీ పనిలో ఉన్నారు, మిగిలిన వారు పరిశ్రమలోని ఇతర పనులలో ఉన్నారు.

వారణాశిలో తయారీ వ్యవస్థలో పట్టునేత ఆధిక్యత వహిస్తుంది. వారణాశిలో సాధారణంగా నేతపని కుటీరపరిశ్రమగా ఉంటుంది. నేవారిలో అధికంగా మోమిన్ అంసారీ ముస్లిములు ఉన్నారు. వారణాశి పలుచని పట్టువస్త్రాలు, బనారస్ పట్టు చీరలు భారతదేశం అంతటా పఖ్యాతి వహిస్తున్నాయి. వివాహాది శుభకార్యాలలో ధరించే ఈ పట్టు చీరలు వెండి, అంగారు జరీనూలుతో అలకృతమై ఉంటాయి. మిగిలిన భారతదేశం కంటే వారణాశిలో అత్యధికంగా బాలలను కట్టుబానిసలుగా పట్టుపరిశ్రమలో వాడుకుంటున్నారు. సమీపకాలంలో అభివృద్ధి చెందుతున్న పవర్ లూంస్, కంప్యూటర్ డిజైన్లు అలాగే చైనా పట్టువస్త్రాల పోటీ వంటి సమస్యలు సంప్రదాయక పట్టునేత పరిశ్రమను కలవరానికి గురిచేస్తూ ఉంది.

లోహ తయారీ పరిశ్రమలో డీసెల్ లోకోమోటివ్ వర్క్స్ ప్రధానమైనది, భారత్ హెవీ ఎలెక్ట్రానికల్స్ లిమిటెడ్ అధికంగా విద్యుత్చక్తి పరికరాలను ఉత్పత్తి చేస్తుంది, ఈ సంస్థ హెవీ ఎక్విప్మెంట్ రిపెయిర్ ప్లాంట్ కూడా నిర్వహిస్తుంది, ఇంకా కామ్మోడిటీ తయారీ కూడా ప్రధాన్యత వహిస్తుంది, చేతితో చేసిన మిజాపిఉర్ కార్పెట్లు, రగ్గులు, ధుర్రీలు, ఇత్తడి వస్తువులు, రాగి వస్తువులు, కొయ్య, బంకమట్టి బొమ్మలు, హస్థకళా ఉత్పత్తులు, బంగారు నగలు, సంగీత పరికరాలు, తమల పాకులు, లాంగ్రా మామిడి, ఖోవా వంటి ముఖ్యమైన వ్యసాయ ఉత్పత్తులు ప్రధానమైనవి.

వారణాశిలో పర్యాటకం ముఖ్యమైన పరిశ్రమ. ఇది ఆర్థికంగా రెండవ స్థానంలో ఉంది. సంవత్సరానికి 30 లక్షల దేశీయ, 2 లక్షల విదేశీ పర్యాటకులు వారణాశికి విచ్చేస్తున్నారు. పర్యాటకులు సాధారణంగా మతపరంగా వారణాశికి వస్తుంటారు. దేశీయంగా బీహార్, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ నుండి వస్తుంటారు. విదేశీ యాత్రికులలో అధికంగా శ్రీలంక, జపాన్ నుండి వస్తుంటారు. అక్టోబరు, మార్చి మద్యలో యాత్రీకుల రాక అత్యధికంగా ఉంటుంది. వారణాశిలో యాత్రీకుల అవసరార్ధం దాదాపు 12.000 పడకల అవసరం ఉంది. వీటిలో సగం ఖరీదైనవి కాగా మూడవ భాగం ధర్మశాలలలో లభిస్తాయి. అయినప్పటికీ వారణాశి పర్యాటక నిర్మాణాలు సౌకర్యవంతమైనవి కావు. ఈ రంగంలో అనుకున్నంతగా అభివృద్ధి జరగలేదు.

వారణాశిలో సిగ్రాలో ఉన్న ఐపి మాల్, భేల్‌పూర్‌లో ఉన్న ఇ.పి విజయా మాల్, వారణాశి కంటోన్మెంటు ప్రాంతంలో ఉన్న లక్సా వద్ద ఉన్న పి.డి.ఆర్, జె.హెచ్.వి ముఖ్యమైనవి. నగరంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్, ది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి పలు బ్యాంకులు,                                     

4. సంస్కృతి

వారాణసి సమకాలీన జనజీవనం తక్కిన నగరాల వలెనే ఉంటుంది. అయితే వారాణసికి హిందూమతంలో ఉన్న ప్రాధాన్యత వలన ఇక్కడి గంగానది, స్నానఘట్టాలు, దేవాలయాలు, హిందూ మత సంస్థలు సంస్కృతీ చిహ్నాలుగా ప్రముఖంగా ప్రస్తావించబడుతాయి. ఇంతే కాకుండా పట్టు చీరల నేత, హిందూ-ముస్లిమ్ సహ జీవనం మత కలహాలు కూడా, హిందూస్తానీ సంగీతం, ఘరానా, పెద్ద సంఖ్యలో వచ్చే పర్యాటకులు నగర జీవనంలో ప్రముఖంగా కానవచ్చే అంశాలు. గంగానది తీరాన, పాత నగరంలో ఇండ్లు, ఆలయాలు, దుకాణాలు ఇరుకు ఇరుకుగా ఉంటాయి. అధిక జనాభా నగరంలో ఇతర ప్రాంతాలలో నివసిస్తున్నారు.

                                     

5. గంగానది

గంగానదికి, వారాణసికి హిందూ మతంలో ఉన్న ప్రాముఖ్యత వలన ఈ రెండింటికి అవినాభావమైన సంబంధం ఉంది. ప్రధానమైన విశ్వేశ్వరాలయం, మరెన్నో ఆలయాలు గంగానది వడ్డున ఉన్నాయి. అనేక స్నాన ఘట్టాలు గంగానది వడ్డున ఉన్నాయి. గంగానదిలో స్నానం కాశీయాత్రలో అతి ముఖ్యమైన అంశం. ఈ మత పరమైన అంశాలే కాకుండా నీటి వనరుగా కూడా ఇది చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది.

                                     

5.1. గంగానది స్నాన ఘట్టాలు

వారణాశిళొని గంగా తీరం అంతా స్నానఘట్టాలతో నిండి ఉన్నాయి. స్నాఘట్టాలలో రాతిపలకతో నిర్మించబడిన మెట్లు ఉంటాయి. యాత్రీకులు స్నానం ఆచరించడానికి, సంప్రదాయక ఆచారాలను అనుష్ఠించడానికి అనువైన ఏర్పాట్లు చేయబడి ఉన్నాయి. వారాణసిలో సుమారు 84 ఘాట్‌లు ఉన్నాయి. వీటిలో చాలా వరకు ఇక్కడ మరాఠా పరిపాలనా కాలంలో అభివృద్ధి చేయబడ్డాయి. ఈ స్నానఘట్టాలు మరాఠీలు, సింధీలు సింధియాలు, హోల్కార్లు, భోంస్లేలు, పెషావర్లు నిర్మించబడ్డాయి. కొన్ని ఘాట్‌లు ప్రైవేటు ఆస్తులుగా ఉంటున్నాయి. ఉదాహరణకు "శివాలా ఘాట్", "కాళీ ఘాట్"లకు స్వంతదారు కాశీ మహారాజు. ఎక్కువ ఘాట్‌లు స్నానానికి, దహనకాండలకు వాడుతారు. కొన్న ఘాట్‌లు పురాణ గాథలతో ముడివడి ఉన్నాయి. ఆధ్యాత్మిక, భౌతిక భావాలతో కూడిన పవిత్రభావాలకు ఈ స్నానఘట్టాలు ప్రతీకలుగా ప్రశంశించబడుతున్నాయి. ఈ స్నానఘట్టాలు పురాణ ఘట్టాలతో ముడివడి ఉన్నాయి. వీటిలో దశాశ్వమేధఘట్టం, పనచగంగ ఘట్టం, ధహనసంస్కారాలు జరిపించే మణికర్ణికా, హరిశ్చంద్రా ఘాట్లు ప్రత్యేకమైనవి. ఉదయం బోటులో స్నానఘట్టాలను దర్శించడం యాత్రీకులను ఎక్కువగా ఆకర్షించే విషయాలలో ఒకటి. స్నానఘట్టాలలో అనేక ఆలయాలు కూడా ఉంటాయి.

 • తులసీ ఘాట్ వద్ద తులసీదాసు తులసీ రామాయణాన్ని రచించాడని విశ్వసిస్తున్నారు.
                                     

5.2. గంగానది దశాశ్వమేధ ఘాట్

కాశీ విశ్వనాధ మందిరం ప్రక్కనే ఉన్న దశాశ్వమేధ ఘాట్ వారణాశిలో ఉన్న స్నాన ఘట్టాలలో అతి పురాతనమైనదిగా భావిస్తున్నారు. ఇది యాత్రికులతోను, పూజారులతోను, అమ్మకందారులతోను ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. వెనుక ప్రక్కనే అనేక మందిరాలు దర్శనమిస్తూ ఉండడంతో ఇది ఫొటోలు తీసికొనేవారికి చాలా ప్రియమైన స్థలం. బ్రహ్మ స్వయంగా ఇక్కడ పది అశ్వమేధ యాగాలు చేసి శివుడిని ఇక్కడ కొలువుండమని కోరాడని పురాణ గాథ. ప్రతి రోజూ సాయంకాలం పూజారులు ఇక్కడ అగ్ని పూజ చేసి, శివుడిని, గంగమ్మను, సూర్యుడిని, అగ్నిని, విశ్వాన్ని కొలుస్తారు. ఇక్కడ శూలకంథేశ్వరుడు, బ్రహ్మేశ్వరుడు, వరాహేశ్వరుడు, అభయవినాయక ఆలయాలతో గంగా, బండిదేవి ఆలయాలు ఉన్నాయి. ఇక్కడ ప్రతిరోజు నిర్వహించే హారతి నదిలో నుండి చూడడానికి యాత్రీకులు ఇక్కడి ఇక్కడ ఉన్న పడవలను మాత్రమే ఎక్కాలి. వారు ఒకసారి ఘాట్లన్నింటిని చూపించి తిరిగి ఘాటు వద్దకు బోట్లను తీసుకువచ్చి నదిలో నిలిపి వేస్తారు. యాత్రీకులు అక్కడి నుండి హారతి చూడవచ్చు. సాధారణంగా హారతి ముగిసిన తరువాత నది నిర్మానుష్యం ఔతుంది. బోటులో ఉండగానే చిన్న చిన్న వ్యాపారులు తమవస్తువులను విక్రయించడం యాత్రీకులను ఆకర్షించే విషయాలలో ఒకటి.

                                     

5.3. గంగానది మణి కర్ణికా ఘాట్

మణి కర్ణికా ఘట్టం ఎంతో పావనమైనదిగా హిందువులు భావిస్తారు. ఒక గాథ ప్రకారం శివుని సమక్షంలో విష్ణువు ఇక్కడ తన సుదర్శన చక్రంతో ఒక గోతిని తవ్వాడు. దానిని తన స్వేదంతో నింపుతుండగా విష్ణువు చెవి కుండలం మణి కర్ణిక అందులో పడింది. మరొక కథ ప్రకారం పార్వతీదేవి తన చెవిపోగు మణికర్ణికను ఇక్కడ దాచిపెట్టి, దానిని వెతకమని శివుడిని కోరింది. దానికోసం వెతుకుతూ అక్కడే శివుడు ఉండిపోవడం వల్ల అతడు దేశద్రిమ్మరి కాడని పార్వతి ఆలోచన అట. ఇక్కడ దహనమైన శరీరం తాలూకు ఆత్మను శివుడు స్వయంగా మణికర్ణిక కనిపించిందేమోనని అడుగుతాడట. పురాణ కథనాల ప్రకారం ఈ మణికర్ణికా ఘాట్ యజమానే హరిశ్చంద్రుడిని కొని, హరిశ్చంద్ర ఘాట్‌లో కాటిపనికి నియమించాడు. మణి కర్ణికా ఘాట్, హరిశ్చంద్రఘాట్‌లలో అధికంగా దహన సంస్కారాలు జరుగుతుంటాయి. మణికర్ణికాఘాటుకు మహాశ్మశానమని మరొక పేరుకూడా ఉంది. ఈ ఘాట్ గురించి మరొక కథనం కూడా ప్రచారంలో ఉంది.ఈ తీర్థమును ఈశ్వరుడు చూడాలని అనుకుని పరమేష్టికై 1008 సంవత్సరములు తపస్సు చేసాడట. ఈశ్వరుడు ప్రత్యక్షమై, ఆ తీర్థము యొక్క విశిష్టతను తెలుసుకుని చాల సంతోషించి తల ఊపాడట. అలా ఊపినప్పుడు కుడి చెవి యొక్క మణి జారి సరస్సు మధ్యలో పడినది. కావున దాని పేరు మణికర్ణికా ఘట్టముగా పేరు ప్రస్తుత ఘాట్ 1032 లో నిర్మించబడింది. 4వ శతాబ్దంలో గుప్తుల కాలంలో ఈ ఘాట్ ప్రస్తావన ఉంది. ఈ ఘాట్ వద్ద ఉన్న తారకేశ్వరాలయంలో నుండి పరమశివుడు మరణిస్తున్న వారి చెవిలో తారకనామం ఉపదేశిస్తుంటాడని విశ్వసించబడుతుంది. ఇక్కడ మరణించిన వారికి మోక్షం ప్రసాదించమని పరమశివుడు విష్ణువును కోరిన ప్రదేశమిదే ఈ మణికర్ణిక ఘట్టములొ మిట్ట మధ్యాహ్నము మణికర్ణిక స్తవము చదువుకుని, స్నానము చేసిన చాలా పుణ్యము వస్తుందని శంకర భగవత్పాదులవారు శివా నంద లహరిలొ చెప్పారు అంతటి పుణ్యము కాశీలోని మణికర్ణిక ఘట్టములొ మధ్యాహ్న స్నానము చేసిన కలుగుతుందని, ఈ పుణ్య ఫలము కాశీలో ఒక యజ్ఞము చేసిన దాని కంటె కూడ ఎక్కువని శ్రీ చాగంటి గారు తమ శివ వైభవ ప్రసంగములొ చేప్పారు అని ప్రజల విశ్వాసం.

                                     

5.4. గంగానది ;సిండియా ఘాట్

150 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ ఘాట్ బరువుకు ఇక్కడి శివాలయం కొంతవరకు నీట మునిగి ఉంటుంది. ఇది అగ్ని దేవుని జన్మ స్థలమని పురాణ కథనం. మగ సంతానం కావాలని కోరేవారు ఇక్కడ వీరేశ్వరుని అర్చిస్తారు. సిండియా ఘాట్‌కు ఉత్తరాన మణికర్ణికా ఘాట్ ఉంది. వెనుక ప్రక్క సిద్ధక్షేత్రంలో అనేక ముఖ్యమైన అలయాలున్నాయి.

                                     

5.5. గంగానది లలితా ఘాట్

ఇది నేపాల్ రాజుచే నిర్మింపజేయబడింది. ఇక్కడ నేపాలీ శైలిలో చెక్కతో నిర్మించిన గంగా కేశవ మందిరం ఉంది. ఈ విష్ణ్వాలయంలో పాశుపతేశ్వరస్వామి విగ్రహం ఉంది.

                                     

5.6. గంగానది అస్సీ ఘాట్

ఇది చాలా సుందరమైనది. అన్ని ఘాట్‌లకు చివర ఉంది. ఇది ఫొటోగ్రాఫర్లు, చిత్రకారులు, వాద్య బృందకారులతో కోలాహలంగా ఉంటుంది.

ఇంకా

జైన భక్తులు బచరాజ్ ఘాట్‌ను సందర్శిస్తారు. అక్కడ నది వడ్డున మూడు జైనాలయాలున్నాయి. తులసీ ఘాట్ వద్ద గోస్వామి తులసీ దాస్ రామచరిత మానస్ కావ్యాన్ని రచించాడు.

                                     

6. పవిత్ర క్షేత్రం

వారాణసి హిందువులందరికి పరమ పావన క్షేత్రం. ప్రతి యేటా లక్షమంది పైగా యాత్రికులు ఇక్కడికి వచ్చి గంగాస్నానం, దైవ దర్శనం చేసుకొంటారు. ఇక్కడ విశ్వేశ్వరాలయంలోని శివలింగం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. స్వయంగా ఇక్కడ శివుడు కొలువైయున్నాడని హిందువుల నమ్మకం. గంగా స్నానం వల్ల సకల పాపాలు పరిహారమై ముక్తి లభిస్తుందని భక్తుల నమ్మకం.అష్టాదశ శక్తి పీఠాలలో కాశీ కూడా ఒకటి. దక్షయాగంలో ఆత్మార్పణం చేసిన సతీదేవి చెవిపోగు పడిన చోట ఇప్పుడు విశాలాక్షి మందిరం ఉన్నదంటారు. గంగమ్మ తల్లియే శక్తి స్వరూపిణి కూడాను. కనుక శాక్తేయులకు కాశీ పరమ పవిత్ర క్షేత్రం. ఆదిశంకరుడు తన బ్రహ్మసూత్ర భాష్యాన్ని, భజ గోవింద స్తోత్రాన్ని కాశీలో రచించాడంటారు.

బౌద్ధులకు కూడా వారాణసి పవిత్ర స్థలం. కుశీనగరం, కాశీ, బోధిగయ, లుంబిని, కాశీ - ఈ ఐదు ముఖ్యమైన యాత్రాస్థలాలలని బుద్ధుడు బోధించాడు. వారాణసి సమీపంలోనే సారనాధ్ బౌద్ధ క్షేత్రం ఉంది. అక్కడ బుద్ధుడు తన మొదటి బోధననుపదేశించాడు. అక్కడి ధమేక స్తూపం అశోకునికంటే ముందు కాలానిది. ఇంకా అక్కడ చౌఖండి స్తూపం ఉన్న స్థఅనంలో బుద్ధుడు తన మొదటి శిష్యుని కలిశాడట.

జైనుల 23వ తీర్ధంకరుడైన పార్శ్వనాధుని జన్మ స్థలం అయినందున వారాణసి జైనులకు కూడా పవిత్ర స్థలమే.

వారాణసిలో ఇస్లామిక్ సంస్కృతి కూడా గాఢంగా పెనవేసుకొని ఉంది. హిందూ-ముస్లిమ్ వర్గాల మధ్య ఘర్షణలు అప్పుడప్పుడూ సంభవింఛాయి.

                                     

7. ఆలయాలు

వారణాసి ఆలయాలకు నెలవు. చరిత్రలో వివిధ కాలాల్లో నిర్మించబడ్డ పెద్ద పెద్ద ఆలయాలు ఉన్నాయి. ఇంకా ప్రతీ వీధిలోనూ ఒక ఆలయాన్ని దర్శించవచ్చు. చిన్న ఆలయాల్లో కూడా దైనందిన ప్రార్థనలు, కార్యక్రమాలు జరుగుతుంటాయి. వారణాశిలో అనేక దాదాపు 23.000 ఆలయాలు ఉన్నాయి. అయినప్పటికీ అత్యధికంగా ఆరాధించబడే ఆలయం విశ్వనాధ మంధిరం, హనుమాన్ మందిరం, దుర్గా మందిరం ఈ మందిర సమీపంలో నివసిస్తున్న అనేక ఉన్న కోతుల కారణంగా ఈ మందిరం కోతుల ఆలయంగా కూడా పిలువబడుతుంది.

                                     

7.1. ఆలయాలు విశ్వనాధ మందిరం

కాశీ విశ్వనాధ మందిరం వారాణసిలో ప్రధాన ఆలయంగా చెప్పుకోవచ్చును. దీని గోపురంపైన పూసిన బంగారు పూత కారణంగా దీనిని "బంగారు మందిరం" అని కూడా అంటుంటారు. ప్రస్తుతం ఉన్న మందిరాన్ని 1780లో ఇండోర్ రాణి అహల్యాబాయి హోల్కర్ కట్టింపించింది. ఇందులో లింగాకారంగా కొలువై ఉన్న దేవుడు "విశ్వేశ్వరుడు", "విశ్వనాధుడు" పేర్లతో పూజలందుకొంటుంటాడు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఈ విశ్వేశ్వర లింగం దర్శనం తక్కిన లింగాల దర్శనం కంటే అధిక ఫలప్రథమని భక్తుల విశ్వాసం. ఈ ఆలయం పలుమార్లు విధ్వశం చేయబడి తిరిగి నిర్మించబడింది. ఆలయసమీపంలో ఉన్న గ్యాంవాపీ మసీదు ప్రాంతమే అసలైన ఆలయం ఉన్న ప్రదేశం. 1785లో అప్పటి గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్ సూచనల మేరకు కలెక్టర్ మొహమ్మద్ ఇబ్రాహీమ్ ఖాన్ ఈ ఆలయం ముందు భాగంలో ఒక "నౌబత్ ఖానా" కట్టించాడు. 1839లో పంజాబ్ కేసరిగా పేరొందిన మహారాజా రంజిత్ సింగ్ ఈ iఆలయం రెండు గోపురాలకు బంగారపు పూత పూయించడానికి సరిపడా బంగారం సమర్పించాడు. 1983 జనవరి28న ఈ మందిరం నిర్వహణా బాధ్యతలను ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం హస్తగతం చేసుకొని అప్పటి కాశీ రాజు డా. విభూతి నారాయణ సింగ్ అధ్వర్యంలోని ఒక ట్రస్టుకు అప్పగించింది. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు కాలంలో అప్పటి మందరిరం విధ్వంసం చేయబడింది. తరువాత సమీపంలో మరొక మందిరం కట్టబడింది. ఈ విషయం హిందూ-ముస్లిమ్ వర్గాల మధ్య ఘర్షణలకు దారితీసే విభేదాలలో ఒకటి

ఈ మందిరం అధికారిక వెబ్‌సైటు కాశీ విశ్వనాధ 2007 జూలై 23న ప్రాంభమైంది. ఈ వెబ్‌సైటులో మందిరంలోని సదుపాయాలు, పూజా వివరాలు వంటి సమాచారం లభిస్తుంది

                                     

7.2. ఆలయాలు అన్నపూర్ణామందిరం

కాశీ విశ్వనాథాలయానికి సమీపంలో అన్నపూర్ణాదేవి ఉంది. విశ్వనాథుని దర్శించుకున్న తరువాత భక్తులు అన్నపూర్ణాదేవిని దర్శించడం ఆచారం.ఈ దేవాలయం లోపలనే ఉచిత అన్నదానం,దేవాలయం వారిచే నిర్వహించ బడుచున్నది.

                                     

7.3. ఆలయాలు విశాలాక్షిమందిరం

కాశీ విశ్వనాధ ఆలయానికి సమీపంలో విశాలాక్షి అమ్మవారి మంధిరం ఉంది.విశ్వనాధుని దర్శించుకున్న తరువాత భక్తులు విశాలాక్షిదేవిని దర్శించడం ఆచారం.ఈ దేవాలయ పూజలు రెండు వేలల నాట్టు కోట్టై నగర సత్తరం వారిచే నిర్వహించబడుచున్నది.

                                     

7.4. ఆలయాలు శాంక్తా మందిరం

సింధియా ఘాట్ వద్ద శాంక్త మందిరం ఉంది. శాంక్తామందిరంలో పెద్ద సింహంశిల ఉంది. అలాగే ఈ ఆలయంలో నగ్రహాలు ప్రతిష్ఠితమై ఉన్నాయి.

                                     

7.5. ఆలయాలు దుర్గా మందిరం

వారణాశిలో రెండు దుర్గామందిరాలు ఉన్నాయి. 500 సంవత్సరాలకు ముందు నిర్మించిన దుర్గామందిరం ఒకటి. రెండవది "కోతుల గుడి"గా కూడా ప్రసిద్ధమైన దుర్గా మందిరం 18వ శతాబ్దంలో ఒక బెంగాలీ రాణిచే నిర్మింపబడింది. ఇక్కడ చాలా కోతులు ఉండడంవల్ల కోతుల గుడి అని కూడా అంటుంటారు. ఇక్కడ అమ్మవారు స్వయంభూమూర్తి అని భక్తుల నమ్మకం. ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఆలయం గోపురం ఉత్తర భారత నాగర"శైలిలో నిర్మింపబడింది. గుడి దగ్గరున్న కోనేరును "దుర్గా కుండ్" అంటారు. ఈ కోనేరు ఇదివరకు నదితో సొరంగమార్గం ద్వారా కలపబడి ఉండేది కాని ఆ సొరంగాన్ని తరువాత మూసివేశారు. నాగపంచమి నాడు ఇక్కడ విష్ణువు శేషశాయిగా ఉండే దృశ్యాన్ని ప్రదర్శిస్తారు.

                                     

7.6. ఆలయాలు సంకట మోచన్ హనుమాన్ మందిరం

కాశీలో ఉన్న పవిత్రాలయాలలో సంకట్ మోచన్ హనుమాన్ మందిరం ఒకటి. ఈ మందిరం బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం ఆవరణలో ఉన్న దుర్గా, కొత్త విశ్వనాథ్ మందిరాలకు పోయే మార్గంలో అసినదీతీరంలో ఉంది. ప్రస్తుత ఆలయం 1900 లో విద్యావేత్త, స్వాతంత్ర్య సమరవేత్త, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం వ్యవస్థాపకుడూ అయిన మదనమోహన్ మాలవ్యా చేత నిర్మించబడింది. మద్యయుగానికి చెందిన సన్యాసి, రామాయణ తులసి రామాయణం సృష్టికర్త అయిన తులసీదాసుకు హనుమంతుడు ప్రత్యక్షమైన ప్రదేశంలో నిర్మించబడినట్లు విశ్వసిస్తున్నారు. ఈ ఆలయంలో హనుమంతునికి ప్రధానమైన మంగళ, శనివారాలలో హనుమతునికి విశేష పూజలు నిర్వహించబడతాయి కనుక ఈ రెండు రోజులలో ఆలయానికి వేలాది భక్తులు వస్తుంటారు. కష్టాలనుండి భక్తులను కడతేర్చే దేవునిగా ఇక్కడ కొలువైయున్న హనుమంతుని భక్తులు ఎంతో భక్తితో ఆరాధిస్తారు. ఇక్కడ అనేక ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతుంటాయి. 2006 మార్చి 7 న ఈ మందిరంలో ఉగ్రవాదులు హనుమంతునికి హారతి ఇస్తున్న సమయంలో బాంబులు పేల్చారు. అప్పుడు ఆలయంలో వివాహబృదం పూజలు నిర్వహిస్తున్న కారణంగా అధికసంఖ్యలో భక్తులు గాయాలపాలయ్యారు. అయినప్పటికీ మరునాడు ఆలయంలో పూజాదికాలు నిర్వహిచి హనుమాన్ చాలిసా, సుందరా కాండ పారాయణం నిర్వహించి తులసీదాసు విరచిత హనుమాన్ చాలిసా, సుందరా కాండ పుస్తకాలు ఉచితంగా అందించబడ్డాయి. తీవ్రవాదుల దాడి తరువాత ఆలయంలో పోలీస్ రక్షణ ఏర్పాటు చేయబడింది. ఈ ఆలయ ప్రాంగణంలో హనుమంతుని ఆరాధ్యాఇవాలైన సీతారాముల ఆలయం ఉంది.

                                     

7.7. ఆలయాలు భారతమాత ఆలయం

భారతదేశం జాతీయ మానవీకరణ అంకితం భారత మాతా ఆలయం, 1936 లో మహాత్మా గాంధీ చేత ప్రారంభించబడింది. ఇది పాలరాతితో చెక్కిన భారతదేశం చిత్రపటణ్ ఉంది. బాబు శివ ప్రసాద్ గుప్తా, దుర్గా ప్రసాద్ ఖత్రీ, ప్రముఖ, పురాతన వస్తువులను అధ్యయన శాఖ, జాతీయ నేతలు, దాని నిర్మాణం కోసం విరాళంగా నిధులను అందించారు.

                                     

7.8. ఆలయాలు బిర్లా మందిరం

కాశీ హిందూ విశ్వవిద్యాలయంలో కట్టిన ఆధునిక మందిరం ఇది. బిర్లా కుటుంబంచే ఈ విశ్వనాధ మందిరం పురాతన మందిరం శైలిలోనే నిర్మించబడింది. ఈ ఆలయం బెనారస్ హిందూ విశ్వవిద్యాలయ ఆవరణలో బిర్లాకుంటునబం చేత నిర్మ్ంచబడింది. ఈ ఆలయానికి ప్రణాళిక వేసింది పండిట్ మదన్ మోహన్ మాలవ్యా అన్నది మరొక ప్రత్యేకత.

                                     

7.9. ఆలయాలు కాలభైరవ మందిరం

కాలభైరవుడు కాశీక్షేత్రానికి క్షేత్రపాలకుడు. విశ్వేశ్వర దర్శనం చేసుకోవడానికి ముందుగా కాలభైరవుని దర్శించుకుని ఆయన అనుమతి తీసుకుని విశ్వేశ్వర దర్శనం చేసుకోవాలని పురాణకథనం వివరిస్తుంది. కనుక భక్తులు విశ్వేశ్వర దర్శనానికి ముందుగా కాలభైరవుని దర్శించుకుని విశ్వనాథ దర్శనానికి అనుమతి ఇవ్వమని ప్రార్ధిస్తారు. ఈ ఆలయం విశ్వేశ్వర్ గంజ్ ప్రధాన తపాలాఫీసు సమీపంలో ఉంది. ఈ అలయం నుండి దారానగర్ పోయే మార్గంలో మృత్యుంజయ శివుడు మందిరం ఉంది. ఆలయసమీపంలో ఉన్న బావికి ఒక ప్రత్యేకత ఉంది. బావిలోకి పలు అంతర్గత ప్రవాహాలనుండి నీరు ఊరుతుందని ఈ జలాలకు రోగవిముక్తి చేసే శక్తి ఉందని విశ్వసిస్తున్నారు.

                                     

7.10. ఆలయాలు కవళీ మాత

కవళిమాత ఒకప్పుడు కాశిలో నివసిస్తూ ఉండేది. ఆమె జీవనోపాధి కొరకు గవ్వలను అమ్ముతూ ఉండేది. ఆమె సదావిశ్వేరుని భక్తిశ్రద్ధాసక్తులతో ఆరాధించేది. శివారాధనకు ముందుగా గంగానదిలో స్నానం ఆచరించేది. గంగాస్నానం తరువాత విశ్వేశ్వర దర్శనం అయిన తరువాత ఆమె ఆహారాన్ని స్వీకరించేది. ఒకరోజు ఆమె స్నానంచేసి గట్టుకు రాగానే ఒక హరిజనుడు ఆమెను స్పృజించాడు. హరిజన స్పర్శ కారణంగా ఆమె తిరిగి గంగలో స్నానానికి వెళ్ళింది. అలా ఆమె స్నానం చెయ్యడం తిరిగి హరిజనుడు స్పృజించడం తిరిగి గంగాస్నానానికి పోవడం చేస్తుండగా రాత్రి అయింది. ఆమె ఆరోజంతా భోజనం చేయలేదు. కాశీ అన్నపూర్ణా మాత క్షేత్రం కనుక ఆక్షేత్ర సరిహద్దులలో ఎవరూ భోజనం చేయకుండా ఉండకూడదు కనుక అన్నపూర్ణాదేవి స్వయంగా కవళీకి ప్రత్యక్షమై తనక్షేత్రంలో ఎవరూ పస్తులు ఉండదు కనుక భోజనం చెయ్యమని చెప్పింది. కవళీ మాత్రం విశ్వేశ్వర దర్శనం చేయకుండా భోజనం చెయ్యనని చెప్పింది. అన్నపూర్ణా మాత కోపించి ఆమెను కాశీ సరిహద్దులు దాటి వెళ్ళమని ఆదేశించింది. కవళీ కాశీ సరిహద్దులు దాటి వెళ్ళిన ఆమె విశ్వేశ్వర దర్శనం చెయ్యలేక పోయినందుకు చింతిస్తూ శివుని గురించి తపసు చేసింది. ఆమెకు శివిడు ప్రత్యక్షం కాగానే ఆమె ఈశ్వరా! నాభక్తిలో లోపమేమిటి. నన్నిలా కాశీనుండి పంపిన తరువాత నేనిక నీదర్శనం ఎలాచేయగలను. అని ఆవేదనపడింది. ఈశ్వరుడు కవళీ! నీ భక్తి తిరుగులేనిది అయినప్పటికీ హరిజనుడు స్పృజించాడని తిరిగి స్నానం చేయడం అపరాధమే. నాకు హరిజనులు, పురజనులే కాదు. సకల ప్రాణులూ ఒకటే. ఎవరైనా నన్ను స్పృజించి నమస్కరించడానికి అర్హులే. నీవు హరిజన స్పర్శ అపవిత్రమని భావించి చేసిన అపరాధానికే ఈ దండన లభించింది. అయినప్పటికీ నీభక్తికి, తపసుకు మెచ్చి నీకు ఒక వరం ఇస్తాను. ఇక మీదట నా భక్తులు నన్ను సందర్శించిన ఫలితం నీకు ఇస్తాను. భక్తులు నీకు కానుకలు సమర్పించి వారి దర్శన ఫలితాలను తిరిగి పొందగలరు అని చెప్పి అదృశ్యం అయ్యాడు. అప్పటి నుండి కవళీ కవళీ మాత అయింది. కనుక భక్తులు కాశీ విశ్వేరదర్శనం చేసుకున్న ఫలితం కవళీ మాతకు దక్కుతుంది. అందుకు పరిహారంగా భక్తులు కవళీమాత దర్శనం చేసుకుని ఆమెతో ఈ గవ్వలు నీకు సమర్పిస్తున్నాము. కాశీ ఫలితం నాకు ఇవ్వు అని ప్రార్థించిన భక్తులకు కాశీ పోయిన ఫలితం దక్కుతుందని విశ్వశించబడుతుంది. కనుక కాశీవిశ్వేశ్వర దర్శనం చేసుకున్న భక్తులు కవళీమాతను కూడా దర్శించుకుంటారు.

                                     

7.11. ఆలయాలు మసీదులు

వారణాశిలో ఉన్న మసీదులలో ప్రధానమైనవాటిలో విశ్వేశ్వరాలయ సమీపంలో ఉన్న గ్యానవాపి మసీదు ఒకటి, తరువాత అలాంగిరి మసీదు, ది గంజ్ షహీదాన్ మసీదు, చుఖాంబా మసీదు మొదలైనవి. 10లక్షల ముస్లిములలో నలుగవ వంతు ముస్లిములు వారణాసిలో న నగరంలో ఉన్నచుఖాంబా మసీదులో ప్రార్థనలు నిర్వహిస్తుంటారు. ఢిల్లీ సుల్తానుల పరిపాలన ఆరంభమైన తరువాత వారణాశిలో ప్రారంభమైన ముస్లిముల రాక ఇప్పటికీ పలు తరాలుగా కొనసాగుతూ ఉంది. పెరుగుతున్న ఆ ముసల్మానుల సంఖ్య హిందూ సంస్ర్కతికి ఆటంకంగా మారింది

                                     

7.12. ఆలయాలు ముఖ్య శివ లింగాలు

వారాణసిలో ఉన్న కొన్ని ముఖ్యమైన శివ లింగాల స్థలాలు

 • నీల కంఠేశ్వరుడు - నీల కంఠా
 • ఆత్మ విశ్వేశ్వరుడు - శంక్తా ఘాట్
 • శుక్రేశ్వరుడు - కాళికా గలీ
 • ఓంకారేశ్వరుడు - చిట్టన్ పురా
 • కుక్కుటేశ్వరుడు - దుర్గా కుండ్
 • హరిశ్చంద్రేశ్వరుడు - శంక్తా జీ
 • పరమేశ్వరుడు - శంక్తా ఘాట్
 • ఆంగనేశ్వరుడు - గణేష్ ఘాట్
 • విశ్వేశ్వరుడు - గంగానది ఒడ్డున దశాశ్వమేధ ఘాట్ వద్ద
 • కాల మాధవుడు - కథ్ కీ హవేలీ
 • ఉపస్థానేశ్వరుడు - గణేష్ ఘాట్
 • కేదారేశ్వరుడు - కేదార్ ఘాట్
 • మంగళేశ్వరుడు - శంక్తా ఘాట్
 • వశిష్టేశ్వరుడు - శంక్తా జీ
 • శ్రీ మహా మృత్యుంజయుడు - మైదాగిన్
 • అంగారకేశ్వరుడు - గణేష్ ఘాట్
 • కాశేశ్వరుడు - త్రిలోచన్
 • ప్రయాగేశ్వరుడు - దశాశ్వమేధ ఘాట్
 • త్రి పరమేశ్వరుడు - దుర్గా కుండ్
                                     

8. మతపరమైన ఉత్సవాలు

 • సంకట్ మోచన్ హనుమాన్ ఆలయంలో హనుమాన్ జయంతి మార్చి-ఏప్రిల్ హనుమంతునికి ప్రత్యేక పూజలు, హారతి, ఊరేగింపు నిర్వహించబడతాయి. 1923 నుండి హనుమాన్ సంగీత సమారోహ్ పేరిట ఐదు రోజులపాటు సాస్కృతిక సంగీతం, నృత్య ప్రదర్శనలు నిర్వహించబడుతున్నాయి. ఈ ప్రదర్శనకు దేశం అంతటి నుండి ప్రముఖ కళాకారులు ప్రదర్శనలివ్వడానికి ఆహ్వానించబడుతుంటారు.
 • గంగా హారతి. గంగామాతకు నదీతీరక్షేత్రాలలో నిర్వహించే ఈ హారతి పవిత్ర కాశీలో కూడా ఘనంగా ప్రతిరోజూ నిర్వహిస్తుంటారు. ఈ హారతి దృశ్యాలను పతిరోజూ వేలాది మంది తిలకిస్తుంటారు. వీరిలో విదేశీయులు అధికంగా ఉండడం ఒక ప్రత్యేకత. ఈ హారతులను దశాశ్వమేధ్ ఘాటులో నిర్వహిస్తారు కనుక యాత్రీకులు దశాశ్వమేధ ఘాటుకు చేరుకోవడం అవసరం.
 • భారత్ మిలాప్ మిలాప్ పేరిట 14 సంవత్సరాల వనవాసం తరువాత రామ భరతుల సమావేశం ఉత్సవం ఘనంగా నిర్వహించబడుతుంటాయి. ఈ ఉత్సవాలను విజయదశమి మరునాడు నిర్వహించబడుతుంటాయి. కాశీరాజు తనపరివారంతో రాజరీక అలంకారలతో ఈ ఉత్సవాలలో పాల్గొంటాడు. ఈ ఉత్సవాలు అధిక సంఖ్యలో ప్రజలను ఆకర్షిస్తున్నాయి.
 • గంగాఅహోత్సవాల పేరిట ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం పర్యాటక శాఖ చేత నిర్వహించబడుతుంది. ఈ ఉత్సవాలను కార్తిక పూర్ణిమనాడు నిర్వహించబడుతుంటాయి. పంటల కొరకు గంగాదేవికి కృతఙత తెలుపుతూ ఈ ఉత్సవాలు నిర్వహించబడుతుంటాయి.
 • తులసీ ఘాట్ వద్ద ద్రుపదునికి అంకితం ఇవ్వబడిన ఉత్సవాలు ఐదు రోజులపాటు నిర్వహించబడుతుంది. ఇది ఫిబ్రవరి- మార్చి మాసాల మద్య నిర్వహించబడతాయి.
 • రామనగర్ రామలీలా వద్ద రామచరితమానసలో వర్ణించినట్లు రామాయణం ప్రదర్శించబడుతుంది. రామనగర్‌లో 31 రోజులు ప్రదర్శించే ఈ ప్రదర్శనకు కాశినరేష్ చేత నిధిసహాయం అందుతూ ఉంది. ఈ ఉత్సవాలకు రావణసంహారంతో ముగింపు పలుకుతారు. కాశీనరేష్ చేత 1830లో ఆరంభించబడిన ఈ ఉత్సవాలను ఇప్పటికీ విజయవంతంగా నిర్వహిస్తున్నారు.
 • కార్తికమాస కృష్ణచవితి నాడు కాళీయుని మీద కృష్ణిని విజయానికి సంకేతంగా కాళీయమర్ధన దృశ్యాన్ని ప్రదర్శిస్తారు. ఈ కార్యక్రమం కొరకు గంగాతీరంలో కదంబ వృక్ష శాఖను నాటి దాని సమీపంలో నిర్వహిస్తారు. ఈ ప్రదర్శనలో పాల్గొనే బాలలు కాళీయుని శిరసులపై నృత్యం చేసి వేణుగానం వినిపిస్తుంటాడు. ఈ దృశ్యాన్ని ప్రజలు గంగాతీరం, పడవలలో ఉండి చూస్తుంటారు.
 • మహాశివరాత్రి పర్వదినంలో శివరాత్రి ఊరేగింపు మృత్యుంజయ ఆలయం నుండి విశ్వనాథ ఆలయం వరకు కొనసాగుతుంది.

ఈ హారతి దృశ్యాన్ని గంగాతీరంలో, పడవలలో కూర్చుని వేలాదిమంది యాత్రికులు తిలకిస్తుంటారు.

                                     

9. కళ, సాహిత్యం

అనాదిగా వారాణసి నగరం సాహిత్యానికి, పాండిత్యానికి, కళలకు నిలయంగా ఉంది. కబీర్, తులసీదాస్, రవిదాస్, కుల్లూకభట్టు 15వ శతాబ్దంలో మను వ్యాఖ్య రచయిత వంటి పురాతన రచయితలు, భారతేందు హరిశ్చంద్ర ప్రసాద్, జయశంకర్ ప్రసాద్, ఆచార్య రామచంద్ర శుక్లా, మున్షీ ప్రేమ్ చంద్, జగన్నాధ ప్రసాద్ రత్నాకర్, దేవకీ నందన్ ఖత్రీ, తేఘ్ ఆలీ, క్షేత్రేశ చంద్ర ఛటోపాధ్యాయ, బలదేవ్ ఉపాధ్యాయ, వాగీశ్ శాస్త్రి, విద్యా నివాస్ మిత్రా, కాశీనాథ్ సింగ్, నమ్వార్ సింగ్, రుద్ర కాశికేయ, నిర్గుణ వంటి ఆధునిక రచయితలు వారాణసికి చెందినవారు. శుశ్రుత సంహితం వ్రాసిన ఆయుర్వేద శస్త్రచికిత్సానిపుణుడు శుశ్రుతుడు వారాణసికి చెందినవాడే.

రాజ కొషోర్ దాస్ కళా శోధకుడు, ఆనంద కృష్ణ చరిత్ర కారుడు, ఓంకార్ ఠాకుర్ పండిట్ రవిశంకర్, బిస్మిల్లా ఖాన్, గిరిజాదేవి, సిద్ధేశ్వరీ దేవి, డా. లాల్ మణి మిశ్రా, డా. గోపాల శంకర్ మిశ్రా, డా. ఎన్.రాజన్, డా. రాజభాను సింగ్, పండిట్ సమతా ప్రసాద్, కంథే మహరాజ్, పండిట్ ఎమ్.కల్వంత్, సితారా దేవి, గోపీకృష్ణ, పండిట్ కిషన్ మహరాజ్, రాజన్-సాజన్ మిశ్రా అన్నదమ్ములు, మహాదేవ మిశ్రా వంటి అనేక సంగీతకారులు వారాణసినుండి ప్రఖ్యాతులయ్యారు.

వారాణసిలో ఉత్తర హిందూస్తానంలో జరుపుకొనే పండుగలన్నింటినీ ఘనంగా జరుపుకొంటారు.

                                     

10. జన విస్తరణ

2001లో పరిసర ప్రాంతాలతో కలిపి వారాణసి Varanasi urban agglomeration జనాభా 1.371.749. ఆడు, మగ నిష్పత్తి 879 కి 1000 వారాణసి మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని జనాభా 1.100.748, ఆడు, మగ నిష్పత్తి 883కి 1000. అక్షరాస్యత శాతం మొత్తం అర్బన్ ప్రాంతంలో 61.5%, మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 61%. మునిసిపల్ ఏరియాలో సుమారు 138.000 మంది మురికివాడ slumsలలో నివసిస్తున్నారు. నగరంలో నేరాలు రేటు 2004 సంవత్సరంలోలో 128.5 ప్రతి 100.000కు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఈ సంఖ్య 73.2, దేశం మొత్తానికి 168.8.

                                     

10.1. జన విస్తరణ వసతిగృహాలు

ఇచ్చట జంగంబాడి సత్తరం ఉంది.ఇచ్చట గదులు తక్కువ అద్దెకు ఇస్తారు.ఉచిత భోజనం వసతికూడా ఉంది., నాట్టు కోట్టై నగర సత్తరం తమిళనాడు వారిచే నిర్వహించ బడుచున్నది.ఇచ్చట తక్కువ అద్దెకు గదులు దొరుకుతాయి.సత్తరం చాల పరిశుభ్రంగా ఉంటుంది.ఇచ్చట తక్కువ దరకే ఉదయం టిఫన్,మద్యాన్నం భోజనం,రాత్రికి టిఫన్ లభించును.ఇధి ఆంధ్రావారికి,తమిళ వాడు వారికి భాగుంటుంది., శ్రీ వాసవి అన్నపూర్న సత్తరం ఉన్నధి.ఇక్కడ గదులు దొరుకుతాయి.ఉచిత భోజనం మద్యాన్నందొరుకుతుంది.రాత్రికి టిఫన్ కూడా దొరుకుతుంది.ఇచ్చట ఆర్య వైశ్యులకు మాత్రమే ఇస్తారు.ఇవికాక ఇంకా హోటల్స్ ఉన్నాయి.అన్నిప్రాంతాల వారికి,అన్నిరకాల,ఆహారం దొరుకుతున్నది.

                                     

11. రవాణా

తరతరాలుగా వారాణసి ప్రధాన ప్రయాణ మార్గంలోని నగరంగా ఉంది. చారిత్రికంగా ఇది తక్షశిల, ఘాజీపూర్, పాటలీపుత్రం పాట్నా, వైశాలి, అయోధ్య, గోరఖ్‌పూర్, ఆగ్రా వంటి నగరాలకు కూడలిగా ఉంది. మౌర్యుల కాలంళో తక్షశిల నుండి పాటలీపుత్రనగరానికి వెళ్ళే దారిలో వారాణసి ఉంది. దీనిని 16వ శతాబ్దంలో షేర్ షా సూరి తిరిగి వేయించాడు.

ప్రస్తుతం వారాణసి నగరం దేశంలో అన్ని ప్రధాన నగరాలనుండి రోడ్డు, రైలు, విమాన మార్గాల ద్వారా కలుపబడింది. ఇది రెండవ నంబరు ఢిల్లీ కొలకత్తా జాతీయ రహదారిపై ఢిల్లీ నుండి 800 కిలోమీటర్లు కొలకత్తా నుండి 700 కిలోమీటర్లు దూరంలో ఉన్న పట్టణం. బాబత్‌పూర్ విమానాశ్రయంనగరం నడిబొడ్డునుండి 25 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడికి ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కొలకత్తా, నేపాల్ లకు విమాన స్వీసులు ఉన్నాయి. వారాణసి రైల్వేస్టేషను ఢిల్లీ - కలకత్తా ప్రధాన రైలు మార్గంలో ఉంది. నగరం లోపల సిటీ బస్సులున్నాయి. కాని అత్యధికంగా ప్రైవేటు వాహనాలు, ఆటోరిక్షాలు, సైకిల్ రిక్షాలు నగరం లోపలి ప్రయాణాలకు వాడుతుంటారు. గంగా నదిని దాటడానికి చిన్న పడవలు, స్టీమర్లు ఉపయోగిస్తారు. వారాణసి ప్రక్కనే గంగానదిపై వంతెన ఉంది. అటువైపు మొఘల్ సరాయి రైల్వే జంక్షన్ పట్టణం ఉంది. నగరం లోపల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ మార్గాలు ఇరుకైనవి. ఇచ్చట నుండి అలహాబాద్ 120 కిలోమీటర్లు దూరంలో ఉంది.

                                     

12. పాలన, సేవా వ్యవస్థ

తక్కిన నగరాలలాగానే వారాణసిలో పాలనా బాధ్యతలు మునిపల్ సంస్థ వారాణసి నగర్ నిగమ్ అధ్వర్యంలో నడుస్తాయి. ప్రణాళిక, ప్రగతి విషయాలు అధికంగా "వారాణసి డెవలప్‌మెంట్ అథారిటీ" చూస్తుంది. నీటి సరఫరా, మురుగు నీటి తొలగింపు వంటి పనులు "జల నిగమ్" బాధ్యత. విద్యుత్ సరఫరా "ఉత్తర ప్రదేశ్ పవర్ కార్పొరేషన్" బాధ్యత. నగరంలో రోజుకు 350 మిలియన్ లీటర్ల మురుగునీరు, 425 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుంది. ఈ చెత్తను "లాండ్ ఫిల్" సైటులలో పారవేస్తారు. చాలా మురుగునీరు గంగానదిలోకి విడిచిపెడుతున్నారు. దీనివల్ల, గంగానది వడ్డున ఉన్న అనేక నగరాల లాగానే, తీవ్రమైన నీటి కాలుష్యం జరుగుతున్నది. "గంగా యాక్షన్ ప్లాన్" పరిధిలో ఉన్న ఐదు నగరాలలో వారాణసి ఒకటి.

నగరంలో ఎస్.పి. అత్యధిక హోదా కలిగిన పోలీసు అధికారి. వారాణసి నగరం ఒక లోక్ సభ నియోజక వర్గం. 2014లో ఇక్కడినుండి భరతియ జనత పార్టీ అభ్యర్థి నరేంద్ర మోడీ గెలుపొందాడు.

                                     

13. విద్య

వారాణసిలో మూడు సార్వత్రిక విశ్వవిద్యాలయాలున్నాయి. వీటిలో కాశీ హిందూ విశ్వవిద్యాలయం లేదా బెనారస్ హిందూ యూనివర్సిటీ అన్నింటికన్నా పెద్దది. 1916లో పండిట్ మదనమోహన మాలవ్యాచే స్థాపింపబడిన ఈ విశ్వవిద్యాలయంలో 128 ప్రత్యేక విభాగాలున్నాయి. ఇది ముందుగా అనీబిసెంట్ ప్రారంభింపబడిన హిందూ విద్యార్థుల పాఠశాలగా ఉండేది. ప్రస్తుతం ఈ విశ్వవిద్యాలయం 1350 ఎకరాల స్థలంలో విస్తరించి ఉంది. తక్కిన రెండు విశ్వ విద్యాలయాలు - మహాత్మా గాంధీ కాశీ విద్యాపీఠ్ విశ్వవిద్యాలయం, సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయం. 1791లో లార్డ్ కారన్ వాలిస్ చే ప్రారంభింపబడిన సంస్కృత కాలేజీ క్రమంగా సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయంగా రూపొందింది.

సారనాథ్‌లో ఉన్న "కేంద్రీయ ఉన్నత టిబెటన్ అధ్యయన సంస్థ" సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ హయ్యర్ టిబెటన్ స్టడీస్కు కూడా విశ్వవిద్యాలయ హోదా ఉంది. క్రీడా రంగంలోను, విజ్ఞాన రంగాల్లోనూ ప్రత్యేక శిక్షణనిచ్చే "ఉదయ్ ప్రతాప్ కళాశాల" కూడా విశ్వవిద్యాలయ హోదా కలిగి ఉంది. ఇంతే కాకుండా అనేక ప్రభుత్వ, ప్రైవేటు, సాంప్రదాయిక విద్యా కేంద్రాలున్నాయి. సనాతన కాలంనుండి సంస్కృతం, వేదాంతం, జ్యోతిషం వంటి సంప్రదాయ పాండిత్యానికి వారాణసి ప్రధాన అధ్యయన కేంద్రంగా ఉంటూ వచ్చింది. దీనిని "సర్వ విద్యా రాజధాని" అంటుండేవారు. నగరంలో జామియా సలాఫియా అనే సలాఫీ ఇస్లామీయ అధ్యయన సంస్థ కూడా ఉంది. ఇవే కాకుండా అనేక ప్రభుత్వ, ప్రైవేటు రంగ పాఠశాలలు, కాలేజీలు కూడా ఉన్నాయి.

                                     

13.1. విద్య ఆరోగ్యసంరక్షణ

సుస్రుతసంహిత అనే సంస్కృత శస్తచికిత్సా వైద్య గ్రంథ రచయిత సుష్రుతుడు వారణాశిలో నివసించాడు. నగరంలో ఇప్పటికీ ఆయుర్వేదం, పంచకర్మ వైద్యవిధానాన్ని అవలంబిస్తుంది. నగరంలో పలు ఆయుర్వేద వైద్యశాలలు ఉన్నాయి. పునామావా హెల్త్ ఆయుర్వేదిక్ సెంటర్ శుశ్రుత ది ఇంపీరియల్ గజటీర్ ఆఫ్ ఇండియా ఉంది. నగరంలో వారణాశి హాస్పిటల్ అండ్ మెడికల్ రీసెర్చ్ సెంటర్, హెరిటేజ్ హాస్పిటల్, శివ్ ప్రసాద్ గుప్తా హాస్పిటల్, సర్ సుందర్లాల్ హాస్పిటల్, రాజకీయ హాస్పిటల్, మాతా ఆనందమయీ హాస్పిటల్, రామక్రష్ణ మిషన్ హాస్పిటల్, మార్వారి హాస్పిటల్, కేంసర్ ఇంస్టిట్యూట్ ఉన్నాయి. 1964లో బృహత్తరమైన వారణాశి హాస్పిటల్ బైజినాథ్ ప్రసాద్ చేత స్థాపించబడింది. ఈ హాస్పిటల్‌లో 2012 నాటికి 66 పడకల స్థాయికి చేరుకుంది. వారణాశి, పరిసరప్రాంతాల నుండి ఇక్కడకు శస్త్రచికిత్సలకు వస్తుంటారు. ఇందులో ఎక్స్ రే, అల్ట్రాసోనోగ్రఫీ, ఎకోకాడ్రియాలజీ, పాథాలజీ వంటి ఆధునిక వైద్యసౌకర్యాలు ఉన్నప్పిటికీ నిధులకొరత వంటి సమస్యలను ఎదుర్కొంటున్నాది. వారణాశి నగరప్రాంతంలో 1000 మందికి 70 శిశుమరణాలు సంభవిస్తున్నట్లు 2010-2011 గణాంకాలు తెలియజేస్తున్నాయి.

The urban portion of Varanasi District had an infant mortality rate of 70 per 1.000 live births as of 2010–2011.

                                     

14. పర్యాటక రంగం

వారణాసిలో విలసిల్లిన అసమానమైన సంస్కృతి మూలంగా విదేశీ యాత్రికులకు చాలా ప్రీతిపాత్రమైన యాత్రా స్థలం. నగరంలో 3.4, 5 స్టార్ హోటళ్ళు కూడా ఉన్నాయి. అన్ని రకాల వంటకాలు లభ్యమౌతాయి.అక్కడి సంస్కృతి ప్రభావం వలన వీటిలో చాలా వరకు వీధుల్లోనే లభిస్తాయి. పట్టు వస్త్రాలకు, ఇత్తడి సామానుకు వారాణసి ప్రసిద్ధి చెందినది. ఎంతో చక్కని పనితనం ఉట్టిపడే పట్టు చీరలు, ఇత్తడి పాత్రలు, ఆభరణాలు, చెక్క సామాను, తివాచీలు, గోడకు వేలాడదీసే పటాలు, ఆకర్షణీయమైన దీపపు స్తంభాలు, హిందూ, బౌద్ధ దేవతల బొమ్మలు విరివిగా లభిస్తాయి. చౌక్, గొధౌలియా, విశ్వనాధ్ సందు, లహురాబీర్, థటేరి బజార్ ముఖ్యమైన బజారులు పురాతనమైన వారణాశి నగరంలో నాలుగవ భాగం గంగాతీరంలోనే ఉంది. ఇరుకైన సందులతో కూడిన వీధులతో ఉంటుంది. ఇవి కొత్తవారిని చాలా అయోమయంలో పడవేస్తాయి కనుక ఇక్కడ తిరగాలంటే సహాయకుల అవసరం ఎంతైనా ఉంది. హిందూ ఆలయాలు వీధివెంబడి అంగళ్ళూ ఇక్కడ ప్రసిద్ధం. ఈ నగర పురాతన తత్వం విదేశీ పర్యాటకులను సైతం అమితంగా ఆకర్షిస్తుంది. వారణాశిలో మద్యతరగతి, ఉన్నత వర్గాలకు చెందిన ప్రజలు నివసించడానికి అనువైన ప్రదేశాలు ఆలయానికి దూరంగా ఉంటాయి. అక్కడ తక్కువ కాలుష్యం అరియు తక్కువ జనసాంద్రత ఉండడం విశేషం. అంతేకాక పర్యాటక ఆకర్షణ కలిగిన ప్రదేశాలలో సారనాథ్ మ్యూజియం, జంతర్ మంతర్, భారత్ కళాభవన్, రామనగర్ కోట ముఖ్యమైనవి.

                                     

14.1. పర్యాటక రంగం జంతర్ మంతర్

గంగాతీరంలో ఉన్న పర్యాటక ఆకర్షణలలో జంతర్ అంతర్ ఒకటి. ద్శాశ్వమేధ్ ఘాట్ సమీపంలో గంగాతీరంలో ఎత్తైనప్రదేశంలో జయపూర్ రాజు అయిన రాజా జై సింగ్ ఘాటును ఆనుకుని జంతర్ మంతర్ ఉంది. డిల్లీ, జైపూర్ అబ్జ్ర్వేటరీలలా వారణాశి అబ్జర్వేటరీలో ఉపకరణాలు తక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ ఇక్కడ ఉన్న సన్డయల్ ఏక్వేషనల్ ఒకే ఒకేఒక న్యక్తి నిర్వహిస్తూ వివరాలనలు నమోదు చేయబడుతున్నాయి.

                                     

14.2. పర్యాటక రంగం రామనగర్ కోట

రామనగర్ కోట గంగానది తూర్పుతీరంలో తులసీఘాటుకు ఎదురుగా ఉంది. రామనగర్ కోటను 18వ శతాబ్దంలో కాశీనరేష్ రాజా బలవంత్ సింగ్ చేత నిర్మించబడిది. ఈ కోట చునార్ ఇసుకరాళ్ళతో నిర్మించబడింది. ఇది మొగల్ నిర్మాణశైలితో వంపైన బాల్కనీలు, బహిరంగ సభామండపాలు, సుందర ద్వారాలు కలిగిఉంది. ప్రస్తుతం ఈ కోట జీర్ణావస్థలో ఉంది. ఈ కోట, ఇందులో ఉన్న పురాతన వస్తుసంగ్రహాలయంలో బెనారస్ రాజవంశానికి చెందిన వస్తువులు బధ్రపరచబడి ఉన్నాయి. 18వ శతాబ్దం నుండి ఈ కోట కాశీనరేశ్ నివాసస్థాంగా ఉంది. ప్రస్తుతం ఈ కోటలో ప్రస్తుత కాశీనరేస్ అనంత నారాయణ్ సింగ్ నివసిస్తున్నాడు. 1971లో నుండి కాశీ రాజరికం తొలగించినప్పటికీ నామమాత్ర రాజరికం, పురాతన సంప్రదాయాలు కొనసాగుతున్నాయి. యాన్ ఎసెంట్రిక్ మ్యూజియం" అసాధారణ మ్యూజియం అన్న పేరుతో ఉన్న ఉపభాగంలో నవరత్నఖచిత పల్లకీలు, అద్భుతమైన ఆయుధశాల, అరుదైన జ్యోతిష గడియారం భద్రపరచబడి ఉన్నాయి. సరస్వతీ భవనంలో మతసంబంధిత వ్రాతపతులు భద్రపరచబడి ఉన్నాయి. గోస్వామీ తులసీదాస్ వ్రాసిన రామాయణప్రతులు కూడా ఇక్కడ భద్రపరచబడి ఉన్నాయి. సుందరమైన డిజైనులు కలిగిన కవర్లను తొడిగిన మొగల్ మినియేచర్ శైలిలో పలు వర్ణచిత్ర పుస్తకాలుఇక్కడ భద్రపరచబడి ఉన్నాయి. ఈ పుస్థకాలలో గంగాతీర సౌందర్యం ప్రతిబింబించే చిత్రాలు ఉన్న కారణంగా ఇవి చలనచిత్రాల ఔట్‌డోర్ చిత్రాలలో ఉపయోగించబడుతున్నాయి. ఇక్కడ నిర్మించిన చలనచిత్రాలలోంబెనారస్ పేరున్న చలనచిత్రం చిత్రం ప్రధానమైన చలనచిత్రం చిత్రాలలో ఒకటి. ఈ కోటలో కొంతభాగం పర్యాటకుల కొరకు తెరచి ఉన్నప్పటికీ మిగిలిన భాగం కాశీ నరేష్, కుటుంబానికి నివాసంగా ఉపయోగపడుతూ ఉంది. ఈ కోట వారణాశి నుండి 14 కిలోమీటర్ల 9 మీటర్లు దూరంలో ఉంది.

                                     

15. ఇతరాలు

ఋగ్వేదంలో ఈ నగరాన్ని "కాశి", "జ్యోతి స్థానం" అని ప్రస్తావించారు. స్కాంద పురాణంలోని కాశీఖండంలో ఈ నగర మహాత్మ్యం గురించిన వర్ణన ఉంది. ఒక శ్లోకంలో శివుడు ఇలా అన్నాడు. ముల్లోకాలు నాకు నివాసమే. అందులో కాశీ క్షేత్రం నా మందిరం.

                                     

16. వనరులు

 • Singh, Rana P.B. Varanasi as Heritage City India on the scale the UNESCO World Heritage List: From Contestation to Conservation. Swedish South Asian Studies Network.
                                     

17. బయటి లింకులు

 • కాశీ at the Open Directory Project
 • District Varanasi Official Website - Official website of Varanasi District and City
 • WanderingScapes: A travelers blog entry on Varanasi with comprehensive city information
 • Gallery of photos from Varanasi

gallery of photos in