Топ-100
Back

ⓘ రామ్మోహన్ రాయ్. రాజా రామ్మోహన్ రాయ్ బ్రహ్మ సమాజ్, భారతదేశంలో మొదటి సామాజిక-మత సంస్కరణ ఉద్యమాలను ప్రారంభించాడు. అతని విశేషమైన ప్రభావం రాజకీయ, ప్రభుత్వ నిర్వహణ, వ ..




రామ్మోహన్ రాయ్
                                     

ⓘ రామ్మోహన్ రాయ్

రాజా రామ్మోహన్ రాయ్ బ్రహ్మ సమాజ్, భారతదేశంలో మొదటి సామాజిక-మత సంస్కరణ ఉద్యమాలను ప్రారంభించాడు. అతని విశేషమైన ప్రభావం రాజకీయ, ప్రభుత్వ నిర్వహణ, విద్యా రంగాలలోనే కాకుండా హిందూమతం పైన కూడా కనపడుతుంది. ఇతడు గొప్ప సంఘసంస్కర్త. బ్రిటిష్ ఇండియా కాలంలో అప్పటి సతీసహగమన సాంఘిక దురాచారాన్ని రూపుమాపడానికి చాలా కృషిచేశాడు. వితంతు పునర్వివాహానికి మద్దతు ఇచ్చాడు. స్త్రీవిద్యకై పాటుపడ్డాడు. బ్రహ్మసమాజాన్ని స్థాపించాడు.ఆంగ్ల విద్యకు అనుకూలంగా ఉండి, దేశంలో ఆంగ్ల విద్యావిధానానికి కృషిచేశాడు.

1828 లో ఇంగ్లాండుకు వెళ్ళక ముందు ద్వారకా నాథ టాగూర్తో కలసి బ్రహ్మసమాజ్ ను స్థాపించాడు. బ్రహ్మసమాజ్ ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక, మత సంస్కరణ ఉద్యమంగా మారి బెంగాల్ లో సాంఘిక, వివేచనాత్మక సంస్కరణలకు దారి తీసింది. వీటన్నిటి వలన రాజా రామ్మోహన్ రాయ్, బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనంలో ఒక ముఖ్యుడిగా గుర్తించారు.

                                     

1. బిరుదులు

1.రాజా మొగలు చక్రవర్తి 2వ అక్బర్ ఇచ్చాడు.

2.ఆధునిక భారత దేశ పితామహుడు.

3.పయనీర్ ఆఫ్ న్యూ ఇండియా

వార్త పత్రికలు

1.మిరాత్ ఉల్ అక్బర్

2.సంవాద కౌముది

3.బంగదూత

                                     

2. బాల్యం, విద్యాభ్యాసం

రాయ్ రాథానగర్, బెంగాల్ లో 1772 లో జన్మించాడు. కుటుంబంలో మతపరమైన వైవిధ్యం ఉంది. తండ్రి రమాకాంత్ ఒక వైష్ణవుడు కాగా, తల్లి తరిణి శాక్తమతానికు చెందింది. రామ్మోహన్ బెంగాలీ, పర్షియన్, అరబిక్, సంస్కృత భాషలను పదిహేనో యేడు వరకు అభ్యసించాడు.

యుక్తవయస్సులో కుటుంబ ఆచారాలతో సంతృప్తి పొందక, యాత్రలు సాగించడం మొదలు పెట్టాడు. ఆ తరువాత కుటుంబ ప్యవహారాలు చూసుకోవడానికి తిరిగి వచ్చి, కలకత్తాలో వడ్డీ వ్యాపారిగా మారాడు. 1803 నుండి 1814 వరకు బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీలో పని చేసాడు.

                                     

3. సంఘ సంస్కరణలు

భారత సంఘ సంస్కరణల చరిత్ర లోనే రామ్మోహన్ రాయ్ పేరు, సతీసహగమనాన్ని రూపుమాపడంతో ముడిపడి చిరస్థాయిగా నిలిచిపోయాడు. రామ్మోహన్ రాయ్, హిందూ పూజారుల అధికారాన్ని ధిక్కరించి, అ కాలములో సాధారణమైన బహు భార్యత్వం నేరమని జనులకు నచ్చ చెప్పాడు.జయేంద్ర ఒక్క సంఘ సంస్కర్త.

                                     

4. విలువలు

తాను సంకల్పించిన సామాజిక, న్యాయ, మతపరమైన ఉద్యమాలలో రాయ్ మానవత్వం నే ప్రధానంగా తీసుకొన్నాడు. జనులకు తన ఉద్దేశం సమాజంలో ఉన్న మంచి సంప్రదాయాసను నిర్మూలించడం కాదని, కేవలం వాటిపై సంవత్సరాలపాటు నిరాదరణ వలన పేరుకు పోయిన కుళ్ళును తుడిచివెయ్యడం అని చూపించుటకు కష్టపడ్డాడు. ఉపనిషత్తులను గౌరవించి, సూత్రాసను చదివాడు. విగ్రహారాధనను ఖండించాడు. ఆఖండానందాన్ని పొందుటకు, అధ్యాత్మిక చింతన, భగవంతుని ధ్యానం ఉన్నత మార్గాలని, ఇవి చెయ్యలేనివారికి బలులు ఇవ్వడం మార్గమని ప్రతిపాదించాడు.వితంతు పునర్వివాహం, మహిళలకు ఆస్తిహక్కు లను సమర్థించాడు.

అందరికీ విద్య, ముఖ్యంగా మహిళలకు విద్యను సమర్థించాడు. అచార సంబంధమైన సంస్కృత విద్య కంటే ఇంగ్లీషు విద్య మంచిదని భావించి, సంస్కృత పాఠశాలలకు ప్రభుత్వ నిధులను వ్యతిరేకించాడు.1822 లో ఇంగ్లీషు పాఠశాలను ప్రారంభించాడు.

తాను కనుగొన్న సామాజిక, మతపరమైన దురాచారాలను నిర్మూలించడానికి బ్రహ్మ సమాజాన్నుని స్థాపించడు. బ్రహ్మ సమాజం వివిధ మతాలలో ఉన్న మంచిని గ్రహించి ఉన్నతంగా ఎదిగటానికి తోడ్పడ్డాడు.