Топ-100
Back

ⓘ బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనము. బ్రిటిష్ ఇండియాలో 1911 వరకూ కలకత్తా భారత రాజధాని కావడము చేత బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనము యొక్క ప్రభావము దేశము మొత్తము పై ఉ ..
బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనము
                                     

ⓘ బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనము

బ్రిటిష్ ఇండియాలో 1911 వరకూ కలకత్తా భారత రాజధాని కావడము చేత బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనము యొక్క ప్రభావము దేశము మొత్తము పై ఉంది.

19వ శతాబ్దము, 20 వ శతాబ్దపు మొదటి భాగములలో బ్రిటిష్ ఇండియాలో బెంగాల్ ప్రస్తుత పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ ప్రాంతములో జరిగిన సామాజిక విప్లవాలను కలిపికట్టుగా బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనము ఆంటారు. ఈ సాంస్కృతిక పునరుజ్జీవనము రాజా రామ్మోహన్ రాయ్ 1775-1833 తో మొదలై రవీంద్రనాథ్ టాగోర్ 1861-1941 తో అంతమైనది అని చెప్పవచ్చు. టాగోర్ తరువాత కూడా దిగ్గజాల వంటి మహానీయులు పుట్టి కళలను, సృజనాత్మకతను ప్రోత్సహించారు. 19వ శతాబ్దపు బెంగాల్ మత, సామాజిక ఉద్దారకులు, పండితులు, సాహిత్యకారులు, పాత్రికేయులు, దేశభక్తి ప్రాసంగికులు, శాస్త్రవేత్తల మిశ్రమము

                                     

1. నేపథ్యము

ఈ కాలములో బెంగాల్ లో రెనైసాన్స్ వలే బుద్ధి జాగరణ జరిగిందని చెప్పవచ్చు. ఐరోపా వాసులకు బెంగాల్ వాసుల వలే బ్రిటిష్ వారి వంటి ఆక్రమణ దారులను ఎదిరించవలసిన అవసరము రాలేదు. ఈ బుద్ధి జాగరణ మహిళలు, పెళ్ళి, కట్నము, కులము, మతము వంటి సంప్రదాయములలో చాదస్తములను ప్రశ్నించింది. మొదట ప్రారంభమైన యువ బెంగాల్ ఉద్యమం, విద్యావంతులైన హిందువులలో వివేకము, నాస్తికత్వము శూన్య వాదము లను పౌర నడవడికకు కామన్ డినామినేటర్. 1901 లో రవీంద్రనాథ్ టేగోర్ రచించిన నాస్తానీర్ నవల రెనైసాన్స్ ఐడియాలను ఉపన్యసించి, వాటిని తమ కుటుంబాలలో పాటించని ఒక వ్యక్తిని తూర్పార పడుతుంది.

                                     

2. యూరోపియన్ సాంస్కృతిక పునరుజ్జీవనమురెనసాన్స్ తో తులనాత్మక పరిశోధన

ఐరోపాలో "రెనైసాన్స్" అనే పదానికి అర్థము పునర్జన్మ. సుమారు వెయ్యిసంవత్సరాల మధ్యయుగపు చీకటి తరువాత 15.16 వ శతాబ్దాలలో తిరిగి గ్రీకు-రోమన్ కాలములో మొదలైన శాస్త్ర పరిజ్ఞానమును పునరుద్దరించుట. కేశవ్ చంద్ర సేన్, బిపిన్ చంద్ర పాల్, M.N.రాయ్ వంటి ముఖ్య సూత్రధారులు బెంగాల్ రెనైసాన్స్ ను ఐరోపా రెనైసాన్స్ తో పోల్చడము మొదలు పెట్టారు. సుమారు ఒక శతాబ్దము పాటు మారుతున్న బైటి ప్రపంచమును బెంగాల్, మిగతా భారతదేశము కంటే బాగా అర్థము చేసుకొంది. భారత దేశాన్ని జాగృతము చెయ్యడములో బెంగాల్ ప్రభావము ఐరోపాను జాగృతము చెయ్యడములో ఇటలీ ప్రభావము వంటిదని చెప్పవచ్చు. ఇటలీ రెనైసాన్స్ కుడా సమాజములో కొన్ని వర్గాల వారికే పరిమితమైనది. సామాన్య జనులలో కాకుండా. "బెంగాల్ రెనైసాన్స్ హుస్సేన్ షా కాలము లో మొదలైన బెంగాలీ ప్రజల సాంస్కృతిక లక్షణాల సమ్మేళనము మొక్క పునరుజ్జీవనము అని చెప్పవచ్చు.".

బంగ్లాదేశ్ లోని కొంతమంది పండితులు ఈనాడు బెంగాల్ రెనైసాన్స్ ను కొత్త కోణములో చూస్తున్నారు. ప్రొఫెసర్ ముయునిద్దీన్ అహ్మద్ ఖాన్, ఇస్లాం చరిత్ర సంస్కృతి, చిట్టగాంగ్ విశ్వవిద్యాలయము, ఇలా అన్నారు.

                                     

3. ముఖ్యులు

 • ప్రేమేంద్ర మిత్రా 1904-1988
 • రామకృష్ణ పరమహంస
 • ప్రతాప్ చంద్ర ముజుందార్ 1840-1905
 • రాజా రామ్మోహన్ రాయ్ 1774-1833
 • జగదానంద రాయ్ fl. 1857-1879
 • కేశవ చంద్ర సేన్ 1838-1884
 • కృష్ణ మోహన్ బెనర్జీ 1813-1885
 • నిరాధ్ ఛౌదరి 1897-1999
 • అక్షయ్ కుమార్ దత్తా 1820-86
 • బ్రజేంద్ర నాథ్ సీల్ 1864-1938
 • అలెక్సాండర్ డఫ్ 1806-1878
 • జాన్ ఎలియట్ డ్రింక్ వాటర్ బెథూన్ 1801-1851
 • జగదీశ్ చంద్రబోస్ 1858–1937
 • హెన్రీ డెరోజియో 1809-31 అతని శిష్యులు యువ బెంగాల్ ఉద్యమము
 • బంకిమ్ చంద్ర ఛటోపాద్యాయ్ 1838-1894
 • ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ 1820-91
 • మైఖేల్ మదుసూదన్ దత్ 1824-73
 • లాల్ బెహారీ డే 1824-1892
 • రవీంద్రనాథ్ టాగూర్ 1861-1941
 • సత్యేంద్రనాథ్ బోస్ 1894-1974
 • కాదంబినీ గంగూలీ 1861-1923
 • శరత్ చంద్ర ఛటోపాధ్యాయ్ 1876-1938
 • దేవేంద్రనాధ్ టాగోర్ 1817-1905
                                     

4. తోడ్పడిన సంస్థలు

 • విశ్వభారతి విశ్వవిద్యాలయము 1921
 • హిందూ కళాశాల 1817 ఆ తరువాత దీన్నే ప్రెసిడెన్సీ కళాశాలగా నామకరణం చేశారు
 • విద్యాసాగర్ కళాశాల 1872
 • బెతునే కళాశాల 1879
 • శ్రీరాంపూర్ కళాశాల 1817
 • జనరల్ శాసనసభస్ ఇన్స్టిట్యూషన్ ప్రస్తుత స్కాటిష్ చర్చి కళాశాల 1830
 • ఢాకా విశ్వవిద్యాలయము 1921
 • కలకత్తా విశ్వవిద్యాలయము 1857
 • ఆసియాటిక్ సొసైటీ స్థా.1784
 • కలకత్తా వైద్య కళాశాల 1835
 • ఫోర్ట్ విలియం కళాశాల 1800
 • సంస్కృత కళాశాల 1824
 • కలకత్తా పాఠశాల పుస్తక సంఘం 1817