Топ-100
Back

ⓘ స్వాతి వారపత్రిక. స్వాతి సపరివార పత్రిక తెలుగు పత్రికా ప్రపంచంలో ఒక నూతన విప్లవాన్ని తీసుకొని వచ్చింది. ఇది 1984 సంవత్సరం ప్రారంభమైనది. దీని ప్రస్థానం విజయవాడ న ..




                                     

ⓘ స్వాతి వారపత్రిక

స్వాతి సపరివార పత్రిక తెలుగు పత్రికా ప్రపంచంలో ఒక నూతన విప్లవాన్ని తీసుకొని వచ్చింది. ఇది 1984 సంవత్సరం ప్రారంభమైనది. దీని ప్రస్థానం విజయవాడ నుండి మొదలైనది. సంపాదకులు వేమూరి బలరామ్. వీరు ఒక విధంగా యువతనూ, గృహిణులనూ, పాత తరాల వారిని ఆకట్టుకొనే రచనలను ప్రచురిస్తూ, 2005జాతీయ చదువరులసర్వే ప్రకారం 39.59 లక్షల పాఠకులతో తెలుగులో అత్యధిక సర్క్యులేషన్ కలిగి ఉంది.

                                     

1. ఇతర విశేషాలు

  • ఈ పత్రిక ద్వారా అనేకానేక రచయితలు వెలుగు చూసారు.
  • ఈ పత్రిక నూతన పోకడలను పోతూనే సాంప్రదాయక వ్యాసాలు, రచనలు అందించింది
  • బలరామ్ గారి సంపాదకీయాలు స్వాతి చినుకులు అనే పుస్తకంగా వెలువడ్డాయి.
                                     

2. ప్రచురితమైన కొన్ని శీర్షికలు

  • అనిల్ స్వాతి. పిల్లల పెంపకం, సరియైన తెలుగుగురించిన విషయాలు.
  • సద్గురు సుభాషితం. సద్గురు జగ్గీ వాసుదేవ్
  • ఈ శీర్షిక మీదే. పాఠకులు పంపే ప్రశ్నలు, వాటికి కొంటె జవాబులు
  • నన్ను అడగండి.మాలతీ చందూర్
  • కథా ఫలే.విద్యా ప్రకాశానందగిరి స్వాముల వారు
  • ధర్మ సందేహాలు. ఉషశ్రీ
  • సెక్స్ అండ్ సైకాలజీ డా కొఠారి
  • సెక్స్ విజ్ఞానం. డా.జి.సమరం
                                     

3. పత్రికలో ప్రచురించిన ప్రసిద్ధ రచనలు

  • మరొక రచయిత, కథకుడు ముళ్ళపూడి వెంకట రమణ రాసిన కోతికొమ్మచ్చి
  • "సర్వసంభవామ్" శీర్షికను సీనియర్ ఐ.ఎ.ఎస్. అధికారి పి.వి.ఆర్.కె ప్రసాద్ తాను తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నప్పుడు కలిగిన అనుభవాలను తెలియజేస్తూ రాశారు. ఆ తరువాత "నాహం కర్తా, హరిః కర్తా" అనే పుస్తకంగా వెలువరించారు.
  • దర్శకుడు, రచయిత వంశీ రాసీన మా పసలపూడి కథలు