Топ-100
Back

ⓘ తెలుగు సాహితీకారుల జాబితాలు. ఈ వ్యాసం పునర్వవ్యవస్థీకరణ జరుగుతున్నది. ఈ వ్యాసంలో విభజనను పటిష్ఠంగా రూపొందించేందుకు సహకరించండి. సూచనలు ఎందరో మహాను భావులు తెలుగు ..
                                               

తెలుగు సాహిత్యం - ఆధునిక యుగము

ఈ యుగంలో తెలుగు సాహిత్యం ప్రక్రియ, వస్తువు, శైలి తదితర అంశాల పరంగా విప్లవాత్మకమైన మార్పులకు లోనైంది. ఈ మార్పుల వెనుక పలు రాజకీయ, సామాజిక ఉద్యమాలు, ప్రభావాలు ఉన్నాయి. ఆంగ్ల భాష అధ్యయనం, పాశ్చాత్య భావాలను తెలుగు సాహితీవేత్తలు తెలుసుకోవడం వంటివి కథ, నవల వంటి కొత్త ప్రక్రియలను అభివృద్ధి చేసేందుకు ఉపకరించింది. గిడుగు రామమూర్తి పంతులు, గురజాడ అప్పారావు వంటి వ్యవహార భాషావాదులు వివిధ కష్టనిష్టూరాలకు ఓర్చి వ్యవహారభాషను విద్యాభ్యాసం, సాహిత్యసృష్టి వంటివాటికి ఉపయోగించేలా కృషిచేశారు. వస్తువు విషయంలో అభ్యుదయ వాదులు విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చారు. భారత స్వాతంత్ర్య ఉద్యమం, కమ్యూనిజం వంటి రాజకీయ ఉద ...

                                               

తెలుగు సాహిత్యం యుగ విభజన

తెలుగు సాహిత్యాన్ని అధ్యయనా సౌలభ్యం కోసం కొన్ని యుగాలుగా విభజిస్తారు. ఈ విభజన వివిధ పరిశోధకులు వివిధ ప్రమాణాలతో చేశారు. ఆయా కాలాలలో ఉన్న కవుల పేర్ల మీద గాని, లేదా పాలనాధికారుల పేర్లమీద గాని, లేదా కాలానుగుణంగా గాని ఈ యుగాలకు పేర్లు పెట్టారు.

                                               

తెలుగు సాహిత్యం - నన్నయ యుగము

నన్నయకు ముందే ఆంధ్ర సాహిత్యానికి సన్నాహాలు జరిగాయి. రంగం సిద్ధమైంది. ప్రస్తావనానంతరము పాత్ర ప్రవేశపు సూచన కూడా ఇవ్వబడింది. ఇక నన్నయ అనే సూత్రధారుడు "ఆంధ్ర మహా భారతము" అనే పాత్రను తెలుగు సాహితీ రంగంపై ఆవిష్కరించాడు. భారత రచనా ప్రేరణ యశస్సు రాజరాజనరేంద్రునకు దక్కినా గాని అంతకు ముందు మార్గ కవితను సేవించుచున్న ఆంధ్రులకు తెలుగు దేశి కవితను పుట్టించిన ఘనత చాళుక్య రాజులకు దక్కింది. బాదామి చాళుక్య రాజైన రెండవ పులకేశి క్రీ.శ.608–644 తూర్పు దక్కన్ ప్రదేశాన్నిఇప్పటి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కోస్తా జిల్లాలను క్రీ.శ. 616 సంవత్సరంలో, విష్ణుకుండినుని ఓడించి, తన అధీనంలోకి తీసుకొన్నాడు. రెండవ పులకేశి సోద ...

                                               

తెలుగు సాహిత్యం - శివకవి యుగము

తెలుగు సాహిత్యంలో 1100 నుండి 1225 వరకు శివకవి యుగము అంటారు. ఈ యుగం నన్నయకు, తిక్కనకు సంధికాలం. దక్షిణ భారతదేశంలో శైవం ప్రబలిన కాలం ఇది. ఆంధ్రాపధంలో కాకతీయుల పాలన సుస్థిరమౌతున్నకాలం. నన్నెచోడుడు,పాల్కురికి సోమనాధుడు, మల్లికార్జున పండితారాధ్యుడు ఈ యుగంలో శివకవిత్రయం. ఈ కాలంలో రచనా వస్తువు శివగాధామయం. భాషలో సంస్కృత ప్రాబల్యత తగ్గి తెలుగు వాడుక హెచ్చింది.

                                               

తెలుగు సాహిత్యం కాలరేఖ

క్రీ.పూ. 28 - పూజ్యపాదుడనే కన్నడ ఆంధ్ర కవి కాణ్వ వ్యాకరణం గురించి ప్రస్తావించాడు. కాణ్వుడు క్రీ.పూ. 28వ సంవత్సరపువాడని, ఆంధ్రుడని పరిశోధకుల అభిప్రాయం. అప్పటికి జైనమే ప్రబలంగా ఉన్నందున ఆనాటి సాహిత్యం జైన సాహిత్యం కావచ్చునని, కనుక కాణ్వ వ్యాకరణం తెలుగు భాషకు సంబంధించినది కావలెనని కాళ్ళకూరు నారాయణరావు అభిప్రాయం కొరవి శాసనం - 935 - వరంగల్ జిల్లా మానుకోట మహబూబాబాదు పణ్డరంగుని అద్దంకి శాసనము - 770 - అద్దంకి ధనంజయుని కలమళ్ళ శాసనము - సుమారు క్రీ.శ. 575 - కమలాపురం తాలూకా - ఎపిగ్రాఫికా ఇండికా XXVII - పేజి 221 జినవల్లభుని కుర్క్యాల శాసనము - 945 - కరీంనగర్ జిల్లా కుర్క్యాల బణపతి దీర్ఘాసి శాసనము - 997 ...

                                               

తెలుగు సాహిత్యం - ఎఱ్ఱన యుగము

తెలుగు సాహిత్యంలో 1320 నుండి 1400 వరకు ఎఱ్ఱన యుగము అంటారు. ఈ యగంలో ప్రబంధ రచనా విధానానికి పునాదులు పడ్డాయి. మహాభారతంలో అరణ్యపర్వశేషం తెలుగుచేయబడింది. నన్నయ తిక్కనాదుల కాలములో చెల్లిన గ్రాంధిక, పౌరాణిక భాష ఈ యుగంలో ఆధునికతను సంతరించుకోసాగింది. తిక్కన మరణానికి సుమారు 10 సంవత్సరాలముందు 1280 ప్రాంతంలో ఎఱ్ఱన జన్మించి ఉంటాడు. ఎఱ్ఱన మరణం 1360లో జరిగిఉండవచ్చును. 1365-1385 ప్రాంతంలో జన్మించిన శ్రీనాథుడు తరువాతి యుగకవిగా భావింపబడుతున్నాడు. ఎఱ్ఱన పేరుమీద ఒక యుగం అవుసరమా? ఆ కాలాన్ని తిక్కన, శ్రీనాథ యుగాలలో కలుపకూడదా? అన్న సందేహానికి పింగళి లక్ష్మీకాంతం తెలిపిన అభిప్రాయం ఇది - "తిక్కన అనంతరం, శ్రీనాథున ...

                                               

తెలుగు సాహిత్యం - తిక్కన యుగము

తెలుగు సాహిత్యంలో 1225 నుండి 1320 వరకు తిక్కన యుగము అంటారు. నన్నయతో ఆరంభమైన తెలుగు సాహితీ వైభవాన్ని శివకవులు ఇనుమడింపజేశారు. తరువాత కాకతీయుల పాలనలో ఆంధ్రదేశమంతా ఒక సామ్రాజ్యంగా ఏర్పడడంతో తెలుగు సాహిత్యం సుస్థిరమైన సాంస్కృతిక వారసత్వాన్ని పుణికిపుచ్చుకోగలిగింది. కవిత్రయంలో రెండవవాడైన తిక్కన సోమయాజి ఈ యుగానికి ప్రధానకవిగా గుర్తింపు పొందాడు. ఈ యుగంలో పురాణ ఖండాలు, వచన కావ్యాలు, ప్రాకృత నాటకాలు ప్రబంధీకరింపబడడం మొదలయ్యింది. శతక కవిత్వం వర్ధిల్లింది. శైవ కవిత్వంలో ఉన్న పరమతదూషణ, స్వమత మౌఢ్యత తగ్గాయి. ఎక్కుగా ప్రబొధాత్మక రచనలు వెలువడినాయి.

                                               

తెలుగు సాహిత్యం - శ్రీనాధ యుగము

తెలుగు సాహిత్యంలో 1400 నుండి 1500 వరకు శ్రీనాథ యుగము అంటారు. ఈ యుగాన్ని తెలుగు సాహిత్యంలో ఒక సంధి యుగంగా భావింపవచ్చును. ఈ కాలంలో పురాణ కవుల కావ్యానువాద విధానం కొనసాగింది. తరువాత వచ్చిన ప్రబంధ యుగానికి నేపథ్యంగా నిలిచింది. కొంత వాఙ్మయము అనువాదాలుగానూ, కొంత స్వతంత్ర కావ్యాలుగాను, కొంత నానావిధ వైచిత్ర్యంతోను ఆవిర్భవించింది. పురాణ కావ్యాలలో ప్రబంధ రీతులు గోచరమయ్యాయి. రచనలలో అక్షర రమ్యత, అర్ధగౌరవమూ కూడా భాసించాయి. లోకంలో ఉబుసుపోకకు చెప్పుకొనే కథలవంటివి కావ్యరూపం దాల్చాయి.

                                               

జానపద గీతాలు

జానపదమనగా జనపదానికి సంబంధించింది. జనపదమనగా పల్లెటూరు. జనపదమున నివసించు వారు జానపదులు, వారు పాడుకొను పాటలు జానపదములు. జానపద గీతాలు: జానపదులు పాడుకునే గీతాలను జానపద గీతాలు అంటారు. వీటినే ఆంగ్లములో folk songs అని అంటారు. తెలుగు జానపద గీతాలు చాలా పురాతన కాలమునుండి వస్తున్నాయి. ఆశ్చర్యకరమైన విషయము ఏమిటంటే ఈ జానపదగీతాలలో కొన్నిసార్లు చక్కని ఛందస్సు కూడా ఉంటుంది. పదకవితా పితామహుడు అన్నమాచార్యుల వారు ఆ కాలంలో ప్రసిద్ధములైన జానపద బాణీలలో చాలా పదములు రాసారు.

                                               

అమరావతి కథలు

అమరావతి కథలు సత్యం శంకరమంచి రచించిన తెలుగు కథాసంపుటి. అమరావతి గ్రామం, అక్కడి ప్రజలు ఇతివృత్తంగా రచించిన ఈ 100 కథలు మొదట ఆంధ్రజ్యోతి వారపత్రికలో సుమారు రెండు సంవత్సరాలు 1975-77 మధ్య ప్రచురించబడ్డాయి. ఏ కథా కూడా ఒక పేజి కంటే ఎక్కువ ఉండేది కాదు. అప్పట్లో ముద్రణ కాయితం కరువు ఉండేది. ఆ కారణాన, ఆంధ్రజ్యోతి పత్రిక ప్రస్తుతపు వారపత్రిక సైజులో కాకుండా అందులో సగం సైజులో అంటే చందమామ మాసపత్రిక సైజులో కొన్నాళ్ళు వచ్చింది. కారణమేమయినా, కథలన్నీ కూడా రచయిత చక్కగా కుదించి వ్రాశారు. అంత చిన్నకథలో కూడా ఎంతో కథా శిల్పాన్ని ప్రదర్శించిన రచయిత సత్యం శంకరమంచి అభినందనీయులు. శంకరమంచి సత్యంచక్కని తేట తెలుగులో, సరళమ ...

తెలుగు సాహితీకారుల జాబితాలు
                                     

ⓘ తెలుగు సాహితీకారుల జాబితాలు

ఈ వ్యాసం పునర్వవ్యవస్థీకరణ జరుగుతున్నది. ఈ వ్యాసంలో విభజనను పటిష్ఠంగా రూపొందించేందుకు సహకరించండి.

సూచనలు

ఎందరో మహాను భావులు తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసారు. వారి గురించి తెలుసుకొనడానికి ఇది ఒక వేదికగా, ఒక సూచికగా ఉపయుక్తమయ్యే జాబితా.

ఒక్కొక్క కాలానికి చెందిన రచయితలను ఒక్కో వ్యాసం జాబితాలో ఉంచాలి. జాబితాల పేర్లు దిగువన ఇవ్వబడ్డాయి. ఆధునిక యుగంలో వివిధ సాహితీ ప్రక్రియలు పరిఢవిల్లినందున ఆధునిక యుగంలో ఒక్కో విభాగానికి ఒక్కో జాబితా ఏర్పరచబడింది. కొందరు ఉదాహరణ: గురజాడ, విశ్వనాధ చాలా జాబితాలలోకి వస్తారు. అన్ని జాబితాలలోనూ వారి పేర్లు వ్రాయవచ్చును.

రచయితలతో బాటు వారి రచనలను కూడా వ్రాయాలి. ఒక్కో రచయితకూ ఒక్కో వ్యాసం, ఒక్కో ముఖ్యరచనకూ ఒక్కో వ్యాసం వికీలో ఉండాలని ఆకాంక్ష. విశ్వనాధ వంటివారి రచనలు పెద్ద జాబితా అవ్వవచ్చును. అటువంటి చోట వారి రచనల జాబితాకు లేదా వారి గురించిన వ్యాసానికి లింకు ఇవ్వవచ్చును.

                                     

1. నన్నయ యుగము: 1000 - 1100

ఈ యుగంలోని రచనలు, రచయితల వ్యాసాలకు చేర్చవలసిన వర్గాలు, వ్యాసాలకు సంబంధించిన మూస

నన్నయ్య లేదా నన్నయభట్టు - ఆదికవి, వాగనుశాసనుడు
 • ఇంద్ర విజయము - అలభ్యం
 • చాముండీ విలాసము - అలభ్యం
 • శ్రీ మదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము, సభా పర్వము, అరణ్య పర్వములో కొంత
 • లక్షణ సారము - అలభ్యం
 • ఆంధ్రశబ్ద చింతామణి - అలభ్యం
నారాయణ భట్టు - నన్నయ భట్టుకు సహకరించాడు
                                     

2. శివకవి యుగము: 1100 - 1225

ఈ యుగంలోని రచనలు, రచయితల వ్యాసాలకు చేర్చవలసిన వర్గాలు

మూస

మల్లికార్జున పండితారాధ్యుడు
 • శివతత్వ సారము
నన్నెచోడుడు
 • కళా విలాసము
 • కుమార సంభవము
పాల్కురికి సోమనాధుడు
 • వృషాధిప శతకము - తెలుగులో మొదటి శతకం కావచ్చును.
 • పండితారాధ్య చరిత్రము
 • అనుభవ సారము
 • బసవ పురాణము
వేములవాడ భీమకవి
 • ఇతని గ్రంథాలేవీ అందుబాటులో లేవు. కాలం కూడా స్పష్టంగా తెలియదు. కాని ఇతని చాటువులను ఇతరులు ఉట్టంకించారు.
                                     

3. తిక్కన యుగము: 1225 - 1320

ఈ యుగంలోని రచనలు, రచయితల వ్యాసాలకు చేర్చవలసిన వర్గాలు

ఈ యుగానికి సంబంధించిన మూస

తిక్కన్న - కవి బ్రహ్మ, ఉభయ కవిమిత్రుడు
 • నిర్వచనోత్తర రామాయణము
 • కవి వాగ్బంధనము
 • విజయసేనము
 • శ్రీ మదాంధ్ర మహాభారతము - 15 పర్వములు
పావులూరి మల్లన
 • గణిత సార సంగ్రహము - గణిత విజ్ఞానానికి సంబంధించిన రచన
ఎలుగంటి పెద్దన
 • ప్రకీర్ణ గణితము - గణిత విజ్ఞానానికి సంబంధించిన రచన
గోనబుద్ధారెడ్డి
 • రంగనాథ రామాయణము
చక్రపాణి రంగనాధుడు
 • నయన రగడ
మూలఘటిక కేతన
 • ఆంధ్ర భాషా భూషణము
 • దశకుమార చరిత్రము
 • విజ్ఞానేశ్వరీయము
కాచవిభుడు - విట్ఠలుడు సోదరులు, గోనబుద్ధారెడ్డి కుమారులు
 • రంగనాధ రామాయణము ఉత్తరకాండము
మంచన
 • కేయూరబాహు చరిత్రము
యథావాక్కుల అన్నమయ్య
 • సర్వేశ్వర శతకము
మారన
 • మార్కండేయ పురాణము
బద్దెన
 • సుమతీ శతకము ఇది బద్దెన రచించాడని ఒక అభిప్రాయము మాత్రమే
 • నీతిసార ముక్తావళి
శివదేవయ్య - ఈ క్రింది మూడు రచనలు చేసినాడని ఒక అభిప్రాయమున్నది.
 • సకలనీతి సమ్మతము
 • పురుషార్ధ సారము
 • "శివదేవ ధీమణీ" శతకము
అప్పనమంత్రి
 • చారుచర్య
అధర్వణాచార్యుడు ఇతను నన్నెచోడుడు, తిక్కన మధ్యకాలమువాడై యుండవచ్చును
 • వికృతి వివేకము, త్రిలింగ శబ్దానుశాసనము, అధర్వణ ఛందస్సు అనే లక్షణ గ్రంథాలు కూడా వ్రాశాడని కొన్నిచోట్ల ఉంది.
 • ఇతడు భారతమును కొంతభాగము రచించియుండవచ్చునని అభిప్రాయము.


                                     

4. ఎఱ్ఱన యుగము: 1320 - 1400

ఈ యుగంలోని రచనలు, రచయితల వ్యాసాలకు చేర్చవలసిన వర్గాలు

ఈ యుగానికి సంబంధించిన మూస

ఎఱ్ఱన - ప్రబంధ పరమేశ్వరుడు, శంభూమిత్రుడు
 • "సంక్షేప రామాయణము" అనే కావ్యాన్ని కూడా రచించాడంటారు.
 • లక్ష్మీనృసింహ పురాణము
 • హరివంశము
 • శ్రీ మదాంధ్ర మహాభారతము - అరణ్య పర్వము సంపూర్తి
నాచన సోమన
 • ఉత్తర హరివంశము
గోన బుద్ధారెడ్డి -
 • రంగనాధ రామాయణము
హుళక్కి భాస్కరుడు, అతని పుత్రుడు మల్లికార్జున భట్టు, అతని మిత్రుడు అయ్యలార్యుడు
 • భాస్కర రామాయణము
రావిపాటి త్రిపురాంతకుడు రావిపాటి తిప్పన
 • ప్రేమాభిరామము, అంబికా శతకము, చంద్ర తారావళి - అనే గ్రంథాలు కూడా వ్రాశాడు కాని అవి అలభ్యం.
 • త్రిపురాంతకోదాహరణము
చిమ్మపూడి అమరేశ్వరుడు
 • విక్రమ సేనము అలభ్యం
విన్నకోట పెద్దన
                                     

5. శ్రీనాధ యుగము: 1400 - 1500

ఈ యుగంలోని రచనలు, రచయితల వ్యాసాలకు చేర్చవలసిన వర్గాలు

ఈ యుగానికి సంబంధించిన మూస

వేమన
 • వేమన శతకము
శ్రీనాథుడు - కవిసార్వభౌముడు
 • మరుత్తరాట్చరిత్రము
 • శాలివాహన సప్తశతి
 • హరవిలాసము
 • భీమ ఖండము
 • క్రీడాభిరామము
 • శృంగార దీపిక ఇది వ్రాసినది కుమారగిరి రెడ్డి అని కూడా ఒక అభిప్రాయం ఉంది.
 • శివరాత్రి మహాత్మ్యము
 • శృంగార నైషధము
 • పల్నాటి వీరచరిత్రము
 • కాశీ ఖండము
పోతన - సహజకవి, అతని శిష్యులు బొప్పరాజు గంగయ, వెలిగందల నారయ, ఏర్చూరి సింగన
 • భోగినీ దండకము ఇది పోతన రచనయేనని అభిప్రాయం
 • శ్రీ మదాంధ్ర మహాభాగవతము
 • వీరభద్ర విజయము
మడికి సింగన
 • వాసిష్ఠ రామాయణము
 • సకల నీతి సమ్మతము - తెలుగులో మొట్టమొదటి సంకలన గ్రంథం
 • భాగవతం దశమ స్కంధం ద్విపద
 • పద్మపురాణం ఉత్తర ఖండం
పిల్లలమర్రి పినవీరభద్రుడు -
 • శృంగార శాకుంతలము
 • అవసార దర్పణము, నారదీయము, మాఘ మహాత్మ్యము, పురుషార్ధ సుధానిధి, మానసోల్లాస సారము - అవే గ్రంథాలు రచించాడు కాని అవి లభించలేదు.
 • జైమిని భారతము
ప్రతాప రుద్రుడు
 • నీతిసారము రాజనీతి గురించి
అధర్వణుడు
 • త్రిలింగ శబ్దానుశాసనము
భైరవి కవి
 • రత్నసారము - విలువైన మణుల గురించి
మనుమంచి భట్టు
 • హయలక్షణ సారము గుర్రాల గురించి విజ్ఞాన గ్రంథము
తాళ్ళపాక అన్నమయ్య
 • అలమేలు మంగా శతకము
 • అన్నమయ్య కీర్తనలు
 • శ్రీవేంకటేశ్వర శతకము
తాళ్ళపాక తిమ్మక్క
 • సుభద్రా కళ్యాణము
వామనభట్టబాణుడు
 • పార్వతీపరిణయము
 • హంస సందేశము
 • వేమభూపాల చరితము
జక్కన
 • విక్రమార్క చరిత్రము
అనంతామాత్యుడు
 • ఛందోదర్పణము
 • రసాభరణము
 • భోజరాజీయము
గౌరన
 • హరిశ్చంద్ర కథ ద్విపద కావ్యము
 • నవనాధ చరిత్రము
దగ్గుపల్లి దుగ్గన
 • నాచికేతూపాఖ్యానము
 • కాంచీ మాహాత్మ్యము
దూబగుంట నారాయణకవి
 • పంచతంత్రము
బైచరాజు వేంకటనాధుడు
 • పంచతంత్రము బైచరాజు
వెన్నెలకంటి సూరకవి
 • విష్ణుపురాణము
పిడుపర్తి సోమన పిడుపర్తి సోమనాధ కవి
 • బసవ పురాణము
నంది మల్లయ - ఘంట సింగన జంట కవులు
 • ప్రబోధ చంద్రోదయము
 • వరాహ పురాణము
కొఱవి గోపరాజు
 • సింహాసన ద్వాత్రింశిక
వెన్నెలకంటి అన్నయ్య
 • షోడశ కుమార చరిత్ర
విన్నకోట పెద్దన
 • కావ్యాలంకార చూడామణి
కూచిరాజు ఎఱ్ఱన
 • కొక్కోకము "రతి విలాసం" అనే సంస్కృత కామశాస్త్ర గ్రంథానికి తెలుగు
మడికి అనంతయ్య మడికి సింగన తమ్ముడు
 • విష్ణుమాయా విలాసము అయితే ఇది చింతలపూడి ఎల్లన వ్రాశాడనే అభిప్రాయం కూడా ఉంది
వెన్నెలకంటి జన్నమంత్రి
 • దేవకీనందన శతకము
కొలని గణపతి దేవుడు
 • శివయోగ సారము
 • మనోబోధన
అయ్యలరాజు తిప్పయ్య
 • ఒంటిమెట్ట రఘువీర శతకము
ఆంధ్రకవి రామయ్య
 • విష్ణుకాంచీ మాహాత్మ్యము
చెందలూరు చిక్కయ్య
 • వాచికేతూపాఖ్యానము
పశుపతి నాగనాధుడు
 • విష్ణు పురాణము
దోనయామాత్యుడు
 • సస్యానందము శాస్త్ర గ్రంథము - వర్షముల ఆగమ సూచనలు, జ్యోతిశ్సాస్త్రానుసారం
శ్రీధరుడు కృష్ణమాచార్యుడు పిడుపర్తి నిమ్మయాచార్యుడు పిడుపర్తి మొదటి బసవకవి పిడుపర్తి రెండవ బసవకవి ప్రోలుగంటి చెన్నశౌరి గంగనాచార్యుడు ఈశ్వర ఫణిభట్టు సదానంద యోగి పెనుమత్స వెంకటాద్రి పెనుమత్స గోపరాజు కవి అడిదము నీలాద్రి కవి మాడయ కవి రేవణూరి తిరుమల కొండయార్యుడు
                                     

6. రాయల యుగము: 1500 - 1600

ఈ యుగంలోని రచనలు, రచయితల వ్యాసాలకు చేర్చవలసిన వర్గాలు

ఈ యుగానికి సంబంధించిన మూస

కృష్ణదేవరాయలు - ఆంధ్రభోజుడు
 • ఆముక్త మాల్యద
అష్టదిగ్గజాలు అల్లసాని పెద్దన
 • హరికథా సారము
 • మను చరిత్రము
నంది తిమ్మన
 • పారిజాతాపహరణము
ధూర్జటి
 • శ్రీకాళహస్తి మాహాత్మ్యము
 • శ్రీకాళహస్తీశ్వర శతకము
మాదయ్యగారి మల్లన
 • రాజశేఖర చరిత్ర
అయ్యలరాజు రామభధ్రుడు
 • రామాభ్యుదయము
 • సకలకథాసార సంగ్రహము
పింగళి సూరన
 • ప్రభావతీ ప్రద్యుమ్నము
 • రాఘవ పాండవీయము - మొట్టమొదటి ద్వ్యర్ధి కావ్యము
 • గరుడ పురాణం తెనుగించాడు
 • కళాపూర్ణోదయము - ఆరవీటి తిమ్మరాజు వంశానికి చెందిన నంద్యాల కృష్ణమరాజుకు అంకితమిచ్చాడు. ఇది తెఉగు సాహిత్యంలో చాలా విశిష్టమైన కావ్యంగా మన్ననలు పొందింది.
 • గిరిజా కళ్యాణం
రామరాజభూషణుడు భట్టుమూర్తి
 • వసు చరిత్రము
 • హరిశ్చంద్ర నలోపాఖ్యానము
 • నరసభూపాలీయము
తెనాలి రామకృష్ణుడు లేదా తెనాలి రామలింగడు
 • కందర్పకేతు విలాసము - అలభ్యం. జగ్గన ప్రబంధ రత్నాకరము లోని కొన్ని పద్యాల వల్ల ఈ గ్రంథ వివరాలు తెలుస్తున్నాయి.
 • పాండురంగ మాహాత్మ్యము
 • ఘటికాచల మాహాత్మ్యము
 • ఉద్భటారాధ్య చరిత్రము
 • హరిలీలా విలాసము - అలభ్యం. జగ్గన ప్రబంధ రత్నాకరము లోని కొన్ని పద్యాల వల్ల ఈ గ్రంథ వివరాలు తెలుస్తున్నాయి.
తాళ్ళపాక చిన్నన్న
 • అష్టమహిషీ కళ్యాణము
 • పరమయోగి విలాసము
మొల్ల కుమ్మరి మొల్ల
 • మొల్ల రామాయణము
కందుకూరి రుద్రయ్య
 • జనార్దనాష్టకము
 • సుగ్రీవ విజయము యక్షగానము
 • నిరంకుశోపాఖ్యానము
సంకుసాల నృసింహ కవి
 • కవికర్ణ రసాయనము మాంధాతృ చరిత్రము
ఎలకూచి బాలసరస్వతి
 • యాదవ రాఘవ పాండవీయము
 • రంగ కౌముది అలభ్యం
 • మల్లభూపాలీయము భర్తృహరి సుభాషితం
నాదెండ్ల గోపన
 • కృష్ణార్జున సంవాదము
కాకుమాని మూర్తికవి
 • పాంచాలీ పరిణయము
చింతలపూడి ఎల్లన
 • విష్ణుమాయా నాటకము
 • రాధామాధవము
 • తారక బ్రహ్మ రాజీయము వేదాంత గ్రంథము
చదలవాడ మల్లయ
 • విప్రనారాయణ చరిత్రము
బుట్టేపాటి తిరుమలయ్య
 • ద్విపద భారతము
మాదయ్య
 • మైరావణ చరిత్రము
తెనాలి రామభద్రకవి
 • ఇందుమతీ పరిణయము
దోనేరు కోనేరు కవి
 • బాల భాగవతము ద్విపద
అద్దంకి గంగాధర కవి
 • తపతీ సంవరణము
పొన్నగంటి తెలగన్న
 • యయాతి చరిత్ర
శంకర కవి
 • హరిశ్చంద్ర కథ
ఎడపాటి ఎఱ్ఱన
 • శృంగార మల్హణ చరిత్రము
కుమార ధూర్జటి
 • కృష్ణరాయ విజయము
తరిగొప్పు మల్లన
 • చంద్రభాను చరిత్రము
సారంగు తమ్మయ్య
 • వైజయంతీ విలాసము
అందుగుల వెంకయ్య
 • రామరాజీయము అళియ రామరాజు చరిత్ర
కాసె సర్వప్ప భాస్కర పంతులు బైచరాజు వెంకటనాధ కవి వెల్లంకి తాతంభట్లు పిడుపర్తి సోమనాధుడు పిడుపర్తి బసవకవి కోట శివరామయ్య మల్లారెడ్డి రామరాజు రంగప్పరాజు మట్ల అనంత భూపాలుడు కంచి వీరశరభ కవి తిమ్మరాజు తాళ్ళపాక తిరువెంగళ నాధుడు రాయసము వేంకట కవి చరిగొండ ధర్మన్న తురగా రామకవి చెన్నమరాజు చెన్నమరాజు తెనాలి అన్నయ్య సవరము చిననారాయణ నాయకుడు దామెర వేంకటపతి చిత్రకవి పెద్దన్న యాదవామాత్య కవి కంసాలి రుద్రయ్య ముద్దరాజు రామన్న చిత్రకవి అనంతకవి లింగముగుంట రామకవి లింగమగుంట తిమ్మన్న వెలగపూడి వెంగనార్యుడు రెంటూరి రంగరాజు సింహాద్రి వేంకటాచార్యుడు రాజలింగ కవి చిత్రకవి రమణయ్య కాకునూరి అప్పకవి


                                     

7. దక్షిణాంధ్ర యుగము: 1600 - 1775

లేదా నాయకరాజుల యుగము ఈ యుగంలోని రచనలు, రచయితల వ్యాసాలకు చేర్చవలసిన వర్గాలు

మూస

ముద్దుపళని
 • రాధికా సాంత్వనము
రంగాజమ్మ
 • మన్నారుదాస విలాసము యక్షగానము
 • ఉషా పరిణయము ప్రబంధము
మధురవాణి సంస్కృత కవయిత్రి.
 • రఘునాధుని రమాయణ సంగ్రహమునకు సంస్కృతీకరణ
రామభద్రాంబ
 • ఉషా పరిణయం యక్షగానం
క్షేత్రయ్య
 • మువ్వగోపాల పదములు
రామదాసు
 • రామదాసు కీర్తనలు
లింగనమహి శ్రీకామేశ్వరకవి
 • ధేను మాహాత్మ్యము వచన గ్రంథము
 • సత్యభామా సాంత్వనము
శృంగార నైషధ పారిజాతము చేమకూర వెంకటకవి
 • విజయ విలాసము
 • సారంగధర చరిత్రము
రఘునాధ నాయకుడు 1614 - 1633
 • పారిజాతాపహరణము
 • భారత సంగ్రహము
 • రామాయణ సంగ్రహము
 • శృంగార సావిత్రి
 • వాల్మీకి చరిత్రము
విజయ రాఘవుడు 1633-73
 • ప్రహ్లాద చరిత్రము
 • విప్ర నారాయణ చరిత్రము
 • రఘునాధాభ్యుదయము
 • పార్వతీ పరిణయము
కృష్ణాధ్వరి తిరుమలాధ్వరి
 • చిత్రకూట మహాత్మ్యము యక్షగానము
కోనేటి దీక్షిత చంద్రుడు
 • విజయ రాఘవ కళ్యాణము యక్షగానము
చల్లా సూరయ్య
 • వివేక విజయము ప్రబోధ చంద్రోదయానికి యక్షగాన స్వరూపం
కూచిపూడి నాటకములు
 • ఉషా పరిణయము
 • ప్రహ్లాద నాటకము
 • రామ నాటకము
వెలిదండ్ల వేంకటపతి
 • శృంగార రాధామాధవము
మట్ల అనంత భూపాలుడు
 • కకుత్స్థ విజయము
సవరము చిననారాయణ నాయక్
 • కువలయాశ్వ చరిత్ర
దామెళ వెంగ నాయక్
 • బహుళాశ్వ చరిత్ర
విజయరంగ చొక్కనాధుడు
 • నాగ మాహాత్మ్యము
 • శ్రీరంగ మహాత్మ్యము
సుముఖము వేంకటకృష్ణప్ప నాయుడు
 • రాధికా సాంత్వనము
 • జైమిని భారతము వచన రూపం
 • అహల్యా సంక్రందనము
 • సారంగధర చరిత్ర వచన రూపం
రఘునాధ తొండమానుడు
 • పార్వతీ పరిణయము
శేషము వేంకటపతి
 • తారా శశాంకము
వేమన
 • వేమన పద్యములు
పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి
 • బ్రహ్మంగారి కాలజ్ఞానం
 • బ్రహ్మంగారి తత్వాలు
కుందుర్తి వేంకటాచల కవి
 • మిత్రవిందా పరిణయము
వెలగపూడి కృష్ణయ్య
 • మాలతీ మాధవము
నుదురుపాటి వెంకయ్య
 • మల్లపురాణము
నుదురుపాటి సాంబయ్య
 • ఆంధ్ర భాషార్ణవము
 • సాంబ నిఘంటువు
కట్టా వరదరాజు
 • ద్విపద రామాయణము
కళువ వీర్రాజు
 • భారతము వచన రూపం
నంజయ్య
 • హాలాస్య మహాత్మ్యము
                                     

8. క్షీణ యుగము: 1775 - 1875

ఈ యుగంలోని రచనలు, రచయితల వ్యాసాలకు చేర్చవలసిన వర్గాలు

మూస

త్యాగరాజు
 • ప్రహ్లాద చరిత్రము నాటకం
 • త్యాగరాజు కీర్తనలు
 • నౌకా భంగము నాటకం
కంకంటి పాపరాజు
 • ఉత్తర రామాయణము
కనుపర్తి అబ్బయామాత్యుడు
 • అనిరుద్ధ చరిత్రము
కూచిమంచి తిమ్మకవి
 • అచ్చతెనుగు రామాయణము
 • కుక్కుటేశ్వర శతకము
 • రుక్మిణీ కళ్యాణము
 • నీలాసుందరీ పరిణయము
కూచిమంచి జగ్గకవి
 • చంద్రలేఖా విలాపము
వక్కలంక వీరభద్రకని
 • వాసవదత్తా పరిణయము
అడిదము సూరకవి
 • రామలింగేశ్వర శతకము
 • చంద్రమతీ పరిణయము
 • ఇతని చాటువులు బహు ప్రసిద్ధములు
ధరణిదేవుల రామయమంత్రి
 • దశావతార చరిత్రము
దిట్టకవి నారాయణకవి
 • రంగరాయ చరిత్రము
చిత్రకవి సింగనార్యుడు
 • బిల్హణీయము
కృష్ణదాసు
 • రాధాకృష్ణ విలాసము గీత గోవిందం ఆధారంగా
వేమనారాధ్యుల సంగమేశ్వరకవి
 • అహల్యా సంక్రందనము
అయ్యలరాజు నారాయణకవి
 • హంసవింశతి
గట్టు ప్రభువు
 • కుచేలోపాఖ్యానము
కృష్ణకవి
 • శకుంతలా పరిణయము
తరిగొండ వేంకమాంబ
 • జలక్రీడా విలాసము
 • యక్షగానాలు, నాటకములు, శతకాలు
 • రాజయోగసారము
 • ద్విపద భాగవతము ద్వాదశ స్కంధము
 • విష్ణు పారిజాతము
 • కృష్ణ మంజరి.
 • వశిష్ఠ రామాయణము
 • శివలీలా విలాసము
 • వేంకటాచల మాహాత్మ్యము
చెళ్ళపిళ్ళ నరసకవి
 • వేంకటేశ్వర విలాసము
 • యామినీపూర్ణతిలకా విలాసము
మండపాక పార్వతీశ్వరశాస్త్రి
 • రాధాకృష్ణ సంవాదము
 • మండపాక పార్వతీశ్వరశాస్త్రి శతకములు - ఈ కవి 60 పైగా శతకములు వ్రాసెను.
క్రొత్తలంక మృత్యుంజయకవి
 • ధరాత్మజా పరిణయము ద్వ్యర్ధి కావ్యము
బుక్కపట్నం తిరుమల వేంకటాచార్యులు
 • అచలాత్మజా పరిణయము ద్వ్యర్ధి కావ్యము
పిండిప్రోలు లక్ష్మణకవి
 • రావణ దమ్మీయము లంకా విజయము ద్వ్యర్ధి కావ్యము
అయ్యగారి వీరభద్రకవి
 • యాదవ రాఘవ పాండవీయము త్ర్యర్ధి కావ్యము - ఇంతకు పూర్వము ఎలకూచి బాల సరస్వతి వ్రాసినది.
ఓరుగంటి సోమశేఖరకవి
 • రామకృష్ణార్జునరూప నారాయణీయము త్ర్యర్ధి కావ్యము) - యాదవ రాఘవ పాండవీయము - మరొక విధముగా
                                     

9. ఆధునిక యుగము: 1875 నుండి

1875 నుండి 2000 వరకు వెలువడిన రచనలు, రచయితలు, రచయిత్రుల జాబితా ఈ భాగంలో చేర్చాలి. ఇక్కడినుండి సాహిత్య ప్రక్రియలు అనేక రంగాలలో వికసించాయి. కనుక ఒకో ప్రక్రియానుసారం విభజించాలి. కనుక ఈ భాగం ప్రత్యేక జాబితా వ్యాసంగా చేయబడుతున్నది.

ఈ కాలంలో వివిధ సాహితీ ప్రక్రియలు విస్తరించాయి. అచ్చు యంత్రాలు రావడం వల్లా, విద్య అందరికీ అందుబాటులోకి రావడం వల్లా ఎన్నో రచనలు మనకు లభ్యమౌతున్నాయి. కనుక ఈ యుగంలోని రచయితలనూ, రచనలనూ మరిన్ని జాబితాలుగా విభజిస్తున్నాము. సౌలభ్యం కోసం ఈ భాగంలో "ఆధునిక యుగం" అనే పదాలను వాడడం లేదు. చూడండి - ఆధునిక యుగం సాహితీకారుల జాబితా

                                     

10. వనరులు

 • కందుకూరి వీరేశలింగం - ఆంధ్ర కవుల చరితము 2వ భాగం ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం
 • పింగళి లక్ష్మీకాంతం - ఆంధ్ర సాహిత్య చరిత్ర - ప్రచురణ: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాదు 2005 ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం
 • ద్వా.నా. శాస్త్రి - తెలుగు సాహిత్య చరిత్ర - ప్రచురణ: ప్రతిభ పబ్లికేషన్స్, హైదరాబాదు 2004
 • దివాకర్ల వేంకటావధాని - ఆంధ్ర వాఙ్మయ చరిత్రము - ప్రచురణ: ఆంధ్ర సారస్వత పరిషత్తు, హైదరాబాదు 1961 ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం
తెలుగు సాహిత్యం - క్షీణ యుగము
                                               

తెలుగు సాహిత్యం - క్షీణ యుగము

1) కంకంటి పాపరాజు 2) పుష్పగిరి తిమ్మన 3) కూచిమంచి తిమ్మకవి 4) కూచిమంచి జగ్గకవి 5) కనుపర్తి అబ్బయామాత్యుడు 6) దిట్టకవి నారాయణకవి 7) పరశురామ పంతుల లింగమూర్తి కవి 8) కాసుల పురుషోత్తమ కవి 9) అడిదము సూరకవి 10) ఎలకూచి బాలసరస్వతి 11) ఏనుగు లక్ష్మణ కవి 12) పక్కి వేంకట నరసింహ కవి