Топ-100
Back

ⓘ కళానిధి నారాయణన్. ఈమె 1927, డిసెంబరు 7వ తేదీన సుమిత్ర, గణపతి దంపతులకు ఒక సనాతన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. ఈమె తన 7వ యేటి నుండి వివిధ గురువుల వద్ద సంగీత నృత ..
కళానిధి నారాయణన్
                                     

ⓘ కళానిధి నారాయణన్

ఈమె 1927, డిసెంబరు 7వ తేదీన సుమిత్ర, గణపతి దంపతులకు ఒక సనాతన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. ఈమె తన 7వ యేటి నుండి వివిధ గురువుల వద్ద సంగీత నృత్యాలను అభ్యసించింది. వీణ ధనమ్మాళ్ కుమార్తె ఐన కామాక్షి అమ్మాళ్ వద్ద పదాలను, జావళీలను, మనక్కళ్ శివరాజన్ వద్ద గాత్ర సంగీతాన్ని అభ్యసించింది. కాంచీపురానికి చెందిన కన్నప్ప పిళ్ళై వద్ద నృత్యాన్ని అభ్యసించింది. చిన్నయ్య నాయుడు, మైలాపూర్ గౌరి అమ్మ వద్ద అభినయాన్ని నేర్చుకుంది. తరువాతి కాలంలో ఈమె అభినయంలో తనదైన శైలిని అలవరచుకుంది.

ఈమె తన 12వ యేట మద్రాసులోని సెనేట్ హౌస్‌లో తన మొట్టమొదటి నృత్య ప్రదర్శన ఇచ్చింది. 1930-40 దశకాలలో దేవదాసి కాని ఒక బాలిక రంగస్థలంపై నాట్యం చేయడం చాలా అరుదు. ఈమె తన బాల్యంలోనే ధనమాణిక్యం, కె.గణేశన్ వంటి కళాకారులతో కలిసి ప్రదర్శనలు ఇచ్చింది.

                                     

1. వృత్తి

ఈమె 1940లలో స్వల్పకాలం మాత్రమే నృత్యప్రదర్శనలు చేసింది. తల్లి మరణం తరువాత వివాహం చేసుకుని నాట్యానికి కొంత కాలం దూరమయ్యింది. ఈమె బాల్యంలో చేసిన నృత్యాలను గమనించిన కళాప్రియుడు వై.జి.దొరైస్వామి 1973లో నర్తకి అలర్మెల్ వల్లికి అభినయం నేర్పమని కోరడంతో, ఈమె తన సంతానం ప్రోద్బలంతో, తన 48యేళ్ళ వయసులో 30 సంవత్సరాల విరామం తరువాత, మళ్ళీ నాట్యప్రపంచంలోనికి అడుగిడింది. మళ్ళీ ఈమె పద్మా సుబ్రహ్మణ్యం వద్ద భరతనాట్యం థియరీ నేర్చుకుంది. క్రమంగా ఈమె అభినయంలో మంచి గురువుగా పేరు సంపాదించింది.

2003, డిసెంబరు 7వ తేదీన ఈమె శిష్యులు, అనేక మంది నాట్యాచార్యులు కలిసి ఈమె 75వ జన్మదిన వేడుకలను చెన్నైలోని లజ్ కమ్యూనిటీ హాలులో నిర్వహించారు. ఆ సందర్భంగా అభినయంపై రెండురోజుల సెమినార్ నిర్వహించారు.

                                     

2. పురస్కారాలు

ఈమెకు భారత ప్రభుత్వం మూడవ అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్ పురస్కారాన్ని 1985లో ప్రకటించింది. 1990లో ఈమెకు సంగీత నాటక అకాడమీ అవార్డు లభించింది. ఇంకా ఈమెకు 1998లో కాళిదాస్ సమ్మాన్ పురస్కారం, 2011లో సంగీత అకాడమీ వారి టాగూర్ రత్న అవార్డు ఫెలోషిప్ లభించాయి.

                                     

3. శిష్యులు

ఈమె శిష్యులలో రమ్య హరిశంకర్, ఎ.లక్ష్మణస్వామి, బ్రఘ బెస్సెల్, హేమ రాజగోపాలన్, శుభశ్రీ నారాయణ్, మినాల్ ప్రభు, ప్రియా గోవింద్, షర్మిలా బిశ్వాస్,జమునా కృష్ణన్, మీనాక్షి చిత్తరంజన్, మిలానా సెవెర్స్కయ,ప్రతిభా ప్రహ్లాద్, విఏకే రంగారావు మొదలైనవారు ఎన్నదగినవారు.

                                     

4. ఇవీ చదవండి

  • Kalanidhi Narayanan and Padam revival in the modern Bharata Natyam dance practice, by Priya Srinivasan. University of California, Los Angeles, 1997.
  • Kalanidhi Narayanans Triveni: selected Telugu songs of Annamayya Kshetrayya Sarangapani. Abhinaya Sudha Trust, 2008.
                                     

5. మూలాలు

  • Janet OShea 2007. "Revival Era Dancers at Music Academy". At Home in the World: Bharata Natyam on the global stage. Wesleyan University Press. p. 1975. ISBN 978-0-8195-6837-3.