Топ-100
Back

ⓘ కె.పి.ఉదయభాను ఒక భారతీయ సినిమా నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు. ముఖ్యంగా మలయాళ సినిమాలో పనిచేశాడు. 2009లో ఇతనికి భారతదేశపు నాలుగవ అత్యున్నత పౌరపురస్కారం పద్మశ్రీ ..
కె.పి.ఉదయభాను
                                     

ⓘ కె.పి.ఉదయభాను

కె.పి.ఉదయభాను ఒక భారతీయ సినిమా నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు. ముఖ్యంగా మలయాళ సినిమాలో పనిచేశాడు. 2009లో ఇతనికి భారతదేశపు నాలుగవ అత్యున్నత పౌరపురస్కారం పద్మశ్రీ లభించింది.

                                     

1. వ్యక్తిగత జీవితం

ఇతడు 1936, జూన్ 6వ తేదీన కేరళ రాష్ట్రం, పాలక్కాడు జిల్లా, థరూర్ గ్రామంలో ఎన్.ఎస్.వర్మ, అమ్ము నేత్యారమ్మ దంపతులకు జన్మించాడు. ఇతని అసలు పేరు భానుప్రకాష్. సంగీత విద్వాంసుడు కె.పి.అప్పుకుట్ట మేనన్, స్వాతంత్ర సమరయోధుడు కె.పి.కేశవ మేనన్‌లు ఇతని మేనమామలు. ఇతని తండ్రి సింగపూరులో వ్యాపారం చేయడం వల్ల ఇతడు బాల్యంలో అక్కడే పెరిగాడు. ఇతని తల్లి మరణం తరువాత, ఇతడు తన 7వ యేట భారతదేశానికి తిరిగి వచ్చి తన మేనమామ సంరక్షణలో పెరిగాడు. ఇతడు కల్పతిలోని త్యాగరాజ సంగీత విద్యాలయలో చేరి సంగీతం ఏరోడ్ విశ్వనాథ అయ్యర్, పాల్గాట్ మణి అయ్యర్, ఎం.డి.రామనాథన్, పాల్గాట్ శ్రీరామ భాగవతార్, ఫ్లూట్ కృష్ణ అయ్యర్‌ల పర్యవేక్షణలో నేర్చుకున్నాడు. ఇతడు 1970లో విజయలక్ష్మిని వివాహం చేసుకున్నాడు. ఆమె గాయని. వీరికి రాజీవ్ ఉదయభాను అనే కొడుకు ఉన్నాడు. ఇతని భార్య విజయలక్ష్మి 2007లో మరణించింది.

ఇతడు 1956లో ఆకాశవాణిలో వ్యాఖ్యాతగా ఉద్యోగంలో చేరి ఆ సంస్థలో 38 సంవత్సరాలు పనిచేశాడు. 1964-65లో లవ్‌డేల్‌లోని లారెన్స్ స్కూలులో సంగీత ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. 1965లో తిరిగి ఆకాశవాణిలో చేరాడు. ఇతడు కేరళ ముఖ్యమంత్రి కె. కరుణ కరన్ వద్ద రెండు దఫాలు పౌరసంబంధాల అధికారిగా పనిచేశాడు.

ఇతౌ 2014, జనవరి 5వ తేదీన తిరువనంతపురంలోని తన ఇంటిలో పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతూ మరణించాడు.,

                                     

2. వృత్తి

ఇతడు సినిమాలలో 1958లో తొలిపాటను పాడాడు. ఇతడు తన కెరీర్‌లో 50కి పైగా పాటలను పాడాడు. 2010లో ఇతడు తన చివరి పాటను 40 సంవత్సరాల విరామం తరువాత పాడాడు. ఇతడు సమస్య, వెలిచమిల్లత వీధి, మయిల్‌పీలి మొదలైన సినిమాలకు సంగీత దర్శకత్వం వహించాడు.

1984లో ఇతడు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే పేరుతో ఒక మ్యూజిక్ ట్రూపును స్థాపించి భారతదేశంలోను విదేశాలలోను అనేక స్టేజి షోలు నిర్వహించాడు. ఇతడు 1985లో సింగపూర్‌లో జరిగిన ఆసియా పసిఫిక్ పాపులర్ సాంగ్ కంటెస్టులో భారత దేశానికి ప్రాతినిథ్యం వహించాడు. 1985లో రిపబ్లిక్ డే ఉత్సవాలలో భాగంగా డ్రమ్స్ ఆఫ్ ఇండియా అనే సంగీత కార్యక్రమాన్ని నిర్వహించాడు. తిరువనంతపురంలో భారతీయం అనే కార్యక్రమానికి సంగీతం సమకూర్చి నిర్వహించాడు. ఇతడు స్వాతంత్ర దినోత్సవపు స్వర్ణోత్సవాల సందర్భంగా పేరుపొందిన కేరళ కవుల 32 పద్యాలను స్వరపరిచాడు. ఇతడు దూరదర్శన్ కోసం వందకు పైగా దేశభక్తి గీతాలకు సంగీతం సమకూర్చాడు. వాటిలో 80కి పైగా మలయాల భాషకు సంబంధించినవి. మిగిలిన పాటలు తమిళం, తెలుగు, కన్నడ, హిందీ, బెంగాలీ, గుజరాతీ, పంజాబీ, అస్సామీ, సింధీ, కాశ్మీరీ, మరాఠీ, ఒరియా భాషలకు సంబంధించినవి.

                                     

3. పురస్కారాలు, గుర్తింపులు

 • 1981లో కేరళ ప్రభుత్వంచే మలయాళ సినిమాపరిశ్రమకు ఉత్తమ సేవలను అందించినందుకు సన్మానం.
 • 2002లో సృజనాత్మక & ప్రయోజనాత్మక సంగీతానికి సంగీత నాటక అకాడమీ అవార్డు
 • 1987లో కేరళ సంగీత నాటక అకాడమీ అవార్డు.
 • 1994లో భారత జాతీయ చలనచిత్ర పురస్కారం -ఉత్తమ సంగీత దర్శకత్వం, నాన్ ఫీచర్ ఫిల్మ్
 • 2004లో కేరళ సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్
 • 2009లో భారత ప్రభుత్వంచే పద్మశ్రీ పురస్కారం
 • 2003లో భారతీయ దళిత సాహిత్య అకాడమీ, న్యూఢిల్లీ వారిచే బి.ఆర్.అంబేద్కర్ కళాశ్రీ అవార్డు.
                                     

4. పదవులు

 • సభ్యుడు - ఆడిషన్ బోర్డ్, ఆల్ ఇండియా రేడియో
 • సభ్యుడు - బోర్డ్ ఆఫ్ స్టడీస్ మ్యూజిక్, మహాత్మాగాంధీ యూనివర్సిటీ, కేరళ
 • సభ్యుడు - కేరళ సంగీత నాటక అకాడమీ
 • సభ్యుడు - ఫిలిం సెన్సార్ బోర్డు మూడు పర్యాయాలు
 • సభ్యుడు - కేరళ స్టేట్ ఫిలిం అవార్డ్స్ కమిటీ మూడు పర్యాయాలు
 • సభ్యుడు - బోర్డ్ ఆఫ్ స్టడీస్ మ్యూజిక్, కాలికట్ యూనివర్సిటీ
 • సభ్యుడు - కేరళ కళామండలం
                                     
 • 1997 సత ష భ ట య 1998 వ శ వమ హన భట 2001 ఎస ర జ ర మ 2002 క ప ఉదయభ న 2007 మ హమ మద జహ ర ఖయ య 2012 ఇళయర జ 2007 - అమర ప ల జ నపద
 • discouraged parameter link ధ ర ర మన థశ స త ర 1985 ఉదయభ న 1 ed. ఒ గ ల ఉదయభ న పబ ల క షన స Retrieved 14 January 2015. CS1 maint: discouraged
 • ప రదర శన: చరణద స భ మ క, హ దర బ ద ఉత తమ దర శక డ జ ఉదయభ న చరణద స ఉత తమ నట డ ప ఆర జ ప త ల క చ త భ గ ఉత తమ నట జగద శ వర క చ త
 • 1952 - 1960 1960 - 1966 1966 - 1972 శ రద భ ర గవ 1952 - 1956, 1956 - 1962, 1963 - 1966 ఉదయభ న భ రత 1954 - 1958 వ దవత బ రగ హ 1954 - 1960 డ యశ ద ర డ డ 1956 - 1962

Users also searched:

...