Топ-100
Back

ⓘ మహాదేవ గోవింద రనడే ఒక భారతీయ విద్యావేత్త, సంఘ సంస్కర్త, న్యాయమూర్తి, రచయిత. ఈయన భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరు. ఈయన బాంబే లెజిస్లేటివ్ కౌన్సిల ..




మహాదేవ గోవింద రనడే
                                     

ⓘ మహాదేవ గోవింద రనడే

మహాదేవ గోవింద రనడే ఒక భారతీయ విద్యావేత్త, సంఘ సంస్కర్త, న్యాయమూర్తి, రచయిత. ఈయన భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరు. ఈయన బాంబే లెజిస్లేటివ్ కౌన్సిల్లోనూ, కేంద్ర ఆర్థిక కమిటీల్లోనూ, బాంబే హైకోర్టులో న్యాయమూర్తిగా పలు పదవులు నిర్వహించాడు.

ఆయన ప్రజలకు బాగా తెలిసిన వ్యక్తి, ప్రశాంతమైన వ్యక్తిత్వం కలవాడు, ఓరిమి కలిగిన ఆశావాది. ఈ లక్షణాలే ఆయన బ్రిటన్ తో ఆయన వ్యవహరించడం, భారతదేశంలో సంస్కరణలు అమలుచేయడం లాంటి కార్యక్రమాల్లో ఆయన వైఖరిని ప్రభావితం చేశాయి. ఆయన జీవిత కాలంలో వక్తృత్వోత్తేజక సభ, పూర్ణ సార్వజనిక సభ, మహారాష్ట్ర గ్రంథోత్తేజక సభ, ప్రార్థనా సమాజం లాంటి సంస్థలను స్థాపించాడు. తన సాంఘిక, మత సంస్కరణల ఆలోచనలకు అనుగుణంగా ఇందుప్రకాష్ అనే మరాఠీ-ఆంగ్ల దినపత్రికను నిర్వహించాడు.

ఈయన రావు బహదూర్ అనే బిరుదును అందుకున్నాడు.