Топ-100
Back

ⓘ రేవూరి శోభాదేవి పద కవితా పితామహుడు అన్నమాచార్య జీవితం, భక్తి తత్వంపై పుస్తకాలు రచించడంతో పాటు ఆధ్యాత్మిక ప్రసంగాలు చేసిన మహిళా సాహితీవేత్త రేవూరి శోభాదేవి. భర్త ..




                                               

రేవూరి అనంత పద్మనాభరావు

రేవూరి అనంత పద్మనాభరావు ఆకాశవాణి లో సుదీర్ఘ కాలం పనిచేసిన తరువాత, దూరదర్శన్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ హోదాలో నాలుగేళ్లు పనిచేసి పదవీ విరమణ చేశాడు. ఎన్నో అష్టావధానాలు చేసిన ఆయన 120 గ్రంథాలు వ్రాశాడు. పదవీ విరమణ తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానములో పనిచేశాడు.

                                     

ⓘ రేవూరి శోభాదేవి

రేవూరి శోభాదేవి పద కవితా పితామహుడు అన్నమాచార్య జీవితం, భక్తి తత్వంపై పుస్తకాలు రచించడంతో పాటు ఆధ్యాత్మిక ప్రసంగాలు చేసిన మహిళా సాహితీవేత్త రేవూరి శోభాదేవి. భర్త రేవూరి అనంత పద్మనాభరావు మార్గదర్శకత్వం,ప్రోత్సాహంతో సారస్వత అభిరుచిని మరింత పెంచుకున్న ఆమె తిరుపతి ప్రాంతంలోని అన్నమాచార్య కళాక్షేత్రంలో సంకీర్తనల గాన శిక్షణ పొందారు. కేంద్రప్రభుత్వ నిర్వహణలోని సాంస్కృతిక శాఖ నుంచి సీనియర్ ఫెలోషిప్ సాధించారు.

                                     

1. బాల్యం, వివాహం

జన్మస్థలం: మాతామహుల ఇంట కరేడు గ్రామంలో. విద్యాభ్యాసం:హైస్కూలు విద్య: విజయవాడ,రాజమండ్రి, బిట్రగుంట రైల్వే పాఠశాలల్లో. కళాశాల విద్య: జవహర్ భారతి, కావలి; డి.కె.మహిళా కళాశాల, నెల్లూరు.1972లో బి.ఎ.డిగ్రీ. వివాహం: 8.5.1969 న బిట్రగుంటలో. భర్త:డాక్టర్ రేవూరి అనంత పద్మనాభరావు. సంగీత గురువు:రాజమోహన్ తిరుపతి.

                                     

2. రచనలు

1. అన్నమయ్య భక్తి సామ్రాజ్యం-2008*

2. అన్నమయ్య సంకీర్తనా సౌరభం -2009;

3. అన్నమయ్య జీవితం, రచనలు-2014 తెలుగు అకాడమీ ప్రచురణ

4. సంభవామి యుగే యుగేతి.తి.దే.సౌజన్యంతో 5. ఆధ్యాత్మిక విలువలు అవసరం అంటూ శోభాదేవి వివరాలతో 2018 మే 14 న ఆంధ్రజ్యోతి నెల్లూరు ఎడిషన్లో ప్రచురితమైన కథనం.

ఇతర రచనలు: ఆరాధన, సప్తగిరి, వేదాంతభేరి మాసపత్రికలలో ఆధ్యాత్మిక వ్యాసాలు

రేడియో ప్రసంగాలు: ఆకాశవాణి కడప, విజయవాడ, హైదరాబాదు, అనంతపురం కేంద్రాలలో ఉపన్యాసాలు

                                     

3. పురస్కారాలు

  • అన్నమయ్య సంకీర్తనలపై పరిశోధనకు కేంద్రప్రభుత్వ సాంస్కృతిక శాఖ సీనియర్ ఫెలోషిప్ 2007-2009.
  • ప్రపంచ తెలుగు మహాసభలు - తిరుపతిలో రచయిత్రిగా సన్మానం‌.
  • అన్నమాచార్య 600వ జయంత్యుత్సవాలలో సప్తగిరి సంకీర్తనా గోష్ఠిలో గాన సత్కారం మే 2008.
  • కిన్నెర ఆర్ట్ థియేటర్స్, హైదరాబాద్ ఆధ్వర్యంలో అప్పటి తమిళనాడు గవర్నరు కె. రోశయ్య చేతులమీదుగా ఉత్తమ రచయిత్రి పురస్కారం - యామిజాల రామచంద్రన్ అవార్డు 2018.