Топ-100
Back

ⓘ మాధేపురా. 2001 జనగణన ప్రకారం, మాధేపురా జనాభా 45.015. జనాభాలో పురుషులు 55%, స్త్రీలు 45% ఉన్నారు. మాధేపురా అక్షరాస్యత రేటు 62%. ఇది జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువ: ..
మాధేపురా
                                     

ⓘ మాధేపురా

2001 జనగణన ప్రకారం, మాధేపురా జనాభా 45.015. జనాభాలో పురుషులు 55%, స్త్రీలు 45% ఉన్నారు. మాధేపురా అక్షరాస్యత రేటు 62%. ఇది జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువ: పురుషుల అక్షరాస్యత 71%, స్త్రీల అక్షరాస్యత 51%. మాధేపురా జనాభాలో 15% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు.

                                     

1. రవాణా

పట్టణం నుండి ఇతర ప్రాంతాలకు ప్రభుత్వ, ప్రైవేట్ బస్సులు, టాక్సీలూ అందుబాటులో ఉన్నాయి.

రైలు

దౌరమ్ మాధేపురా రైల్వే స్టేషన్ బరౌని-కతిహార్, సహర్సా, పూర్ణియా విభాగాల్లో, బరౌని-గువహతి మార్గంలో ఉంది. ఇక్కడి నుండి పూర్ణియా, బర్హరా కోఠీ సహర్సా జంక్షన్‌ లకు మూడు జతల ప్యాసింజర్ రైళ్ళున్నాయి. పాట్నా జంక్షన్, దర్భంగా, జయానగర్, కటిహార్, రాంచీ, ఢిల్లీ, అమృత్సర్, సీల్దాకు నేరుగా రైళ్లున్నాయి.

త్రోవ

NH 231, NH 131 మాధేపురా గుండా వెళ్తాయి NH-231 పూర్ణియా, సహర్సా & మహేష్‌ఖుంట్ లకు వెళుతుండగా, NH-131 బీర్‌పూర్, బీహ్‌పూర్ లకు కలుపుతుంది. పట్టణం నుండి పూర్ణియా, సహర్సా, సుపాల్, దర్భాంగా & పాట్నాకు రోజువారీ బస్సు సర్వీసు ఉంది.