Топ-100
Back

ⓘ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం, తెలంగాణకు చెందిన స్వయం ప్రతిపత్తి అధికారాలుగల ఒక స్వతంత్ర రాజ్యాంగ సంస్థ.ఇది 1992 భారత రాజ్యాంగం 73, 74 సవరణ చట్టాల నిబంధనలు ప్రకా ..




తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం
                                     

ⓘ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం, తెలంగాణకు చెందిన స్వయం ప్రతిపత్తి అధికారాలుగల ఒక స్వతంత్ర రాజ్యాంగ సంస్థ.ఇది 1992 భారత రాజ్యాంగం 73, 74 సవరణ చట్టాల నిబంధనలు ప్రకారం ఏర్పడింది.తెలంగాణ రాష్ట్రంలోని అన్ని స్థానిక సంస్థ ఎన్నికలు ఈ సంస్థ నిర్వహిస్తుంది.

                                     

1. నిర్మాణం

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ నియమించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్, ఎన్నికల సంఘానికి నాయకత్వం వహిస్తాడు.రాష్ట్ర ఎన్నికల కమిషనరును, నియమించిన తేదీ నుండి ఐదుసంవత్సరాలుపాటు పదవిలో ఉంటాడు.ఎన్నికల కమిషనర్లను సాధారణంగా వప్రభుత్వ కార్యదర్శి హోదాలో నియమిస్తారు.

                                     

2. విధులు

73 వ, 74 వ రాజ్యాంగ సవరణ చట్టాల ద్వారా మంజూరు చేయబడిన అధికారాలననుసరించి రాష్ట్రంలోని స్థానిక సంస్థల సాధారణ ఎన్నికలు, ఉప ఎన్నికలు, నిర్వహణకు సంబంధించిన పనులను ఎన్నికల సంఘం పర్యవేక్షిస్తుంది.

తెలంగాణ గ్రామీణ పట్టణ సంస్థలకు ఎన్నికలు ప్రత్యక్ష, పరోక్ష ఎన్నికలలో జరుగుతాయి.పూర్తి ఏకైక నియంత్రణ అధికారం తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఉంది.

తెలంగాణ శాసనసభ నియోజకవర్గం ఓటరు జాబితా ప్రకారం, ఓటర్లు నమోదైన ఓటర్లు ఆధారంగా పోలింగ్ కేంద్రంలను గుర్తిస్తారు.ఎన్నికల నోటిఫికేషన్ తరువాత, అసెంబ్లీ ఎన్నికలలో పాటించిన నిబంధనలు వర్తిస్తాయి.

                                     

2.1. విధులు ప్రత్యక్ష ఎన్నికలు

ఈ కిందిపదవులకు ఎన్నికలు ఎన్నికల సంంఘం ద్వారా ప్రత్యక్ష ఎన్నికలు జరుగుతాయి.

  • గ్రామీణ సంస్థలు
  • మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం ఎంపిటిసి సభ్యులు
  • గ్రామ పంచాయతీ సర్పంచ్
  • గ్రామ పంచాయతీ వార్డు సభ్యుడు
  • జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం జెడ్‌పిటిసి సభ్యులు
  • పట్టణ సంస్థలు

పట్టణ సంస్థలలో నగరపాలక సంస్థ, పురపాలక సంఘం, నగర పంచాయతీలు ఉన్నాయి.

  • మునిసిపాలిటీ / నగర పంచాయతీ కౌన్సిలర్లు
  • మునిసిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు
                                     

2.2. విధులు పరోక్ష ఎన్నికలు

స్థానిక సంస్థలలో ఈ కింది పదవులకు ఎన్నికైన అభ్యర్థులు బాధ్యతలు స్వీకరించిన తరువాత, ఎన్నికల సంఘం కేటాయించిన సమయంలో ఈ కింది పదవులకు ఎన్నికలు పరోక్ష పద్ధతిలో జరుగుతాయి.

  • గ్రామీణ సంస్థలు
  • గ్రామ పంచాయతీకి చెందిన ఉప-సర్పంచ్.
  • పట్టణ సంస్థలు
  • నగగరపాలక సంస్థ మేయరు, డిప్యూటీ మేయర్లుకు
  • పురపాలక సంఘం చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్లుకు.
  • జిల్లా పరిషత్‌లో చైర్‌పర్సన్‌, వైస్‌ ఛైర్‌పర్సన్‌లుకు.