Топ-100
Back

ⓘ పుల్వామా, భారతదేశ ఉత్తర కేంద్రపాలిత భూభాగమైన జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఇది ఒక నగరం, పురపాలక సంఘం.ఇది వేసవిరాజధాని శ్రీనగర్ నుండి దాదాపు 25 కి.మీ.దూర ..
పుల్వామా
                                     

ⓘ పుల్వామా

పుల్వామా, భారతదేశ ఉత్తర కేంద్రపాలిత భూభాగమైన జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఇది ఒక నగరం, పురపాలక సంఘం.ఇది వేసవిరాజధాని శ్రీనగర్ నుండి దాదాపు 25 కి.మీ.దూరంలో ఉంది.

                                     

1. భౌగోళికం

పుల్వామా 32.88°N 74.92°E  / 32.88; 74.92.వద్ద ఉంది. సముద్రమట్టానికి దీని సగటు ఎత్తు1.630మీ. 53.50అ ఉంది.సగటు వర్షపాతం సంవత్సరానికి 505.3 మి.మీ.గరిష్ఠ ఉష్ణోగ్రత 37°C వరకు చేరుకుంటుంది. కనిష్ఠ ఉష్ణోగ్రత 6°C వరకు తగ్గుతుంది.పుల్వామా ఇతరజిల్లాల మాదిరిగా వార్షిక హిమపాతాన్ని పొందుతుంది, కానీ ఇది కనిష్ఠంగా ఉంటుంది.

                                     

2. జనాభా

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, పుల్వామాలో 18.440 జనాభా ఉంది.వారిలో 10.070 మంది పురుషులు కాగా,8.370 మంది మహిళలు ఉన్నారు. 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 3.167, ఇది పుల్వామా మొత్తం జనాభాలో 17.17%.స్త్రీల లింగనిష్పత్తి రాష్ట్ర సగటు 889కు వ్యతిరేకంగా 831గా ఉంది.పుల్వామాలో పిల్లల లింగనిష్పత్తి 718, జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర సగటు 862 తో పోలిస్తే. పుల్వామా నగర అక్షరాస్యత రాష్ట్ర సగటు 67.16% కంటే 91.18% ఎక్కువగాఉంది.

                                     

3. మతం

జనాభాలో ఎక్కువ భాగం ఇస్లాంను అనుసరిస్తుంది.ఇది మొత్తం పట్టణ జనాభాలో 94.59%గా ఉంది.ఇతర మైనారిటీ మతాలు హిందూ 4.63%, సిక్కు 0.34%, క్రైస్తవమతం 0.17%, బౌద్ధమతం 0.02%, జైనులు 0.01%. ఉన్నారు. 0.24% మంది ప్రజలు తమ మతాన్ని ప్రకటించలేదు.

                                     

4. విద్య సౌకర్యాలు

  • మహిళా కళాశాల,పుల్వామా
  • అఖిలభారత వైద్యవిజ్ఞాన కళాశాల,పుల్వామా
  • ప్రభుత్వ బాలుర ఉన్నత కళాశాల
  • ఇస్లామిక్ విశ్వవిద్యాలయం,పుల్వామా Archived 2020-05-20 at the Wayback Machine
  • పారామౌంట్ విద్యా సంస్థ