Топ-100
Back

ⓘ తర్క శాస్త్రము. క్రమ బద్ధమైన చింతనా ప్రక్రియ ద్వారా సాధారణీకరణలు, ఆధరికి అమూర్తీకరణలు సాధించడంతో సంబంధమున్న విజ్ఞాన శాస్త్రం తర్కం. వివేచనా గుణం గురించి, సాక్ష్ ..
                                               

ఆచార్య హేమచంద్రుడు

ఆచార్య హేమచంద్రుడు జైన మతానికి చెందిన ఆచార్యుడు, కవి, బహుశాస్త్రజ్ఙుడు. ఈయన వ్యాకరణ శాస్త్రము, తత్వశాస్త్రము, ఛందస్సు, సమకాలీన చరిత్ర వంటి గ్రంథాలను వ్రాసాడు. సమకాలీనులలో అద్భుతమైన వ్యక్తిగా చరిత్రలో నిలిచాడు. ఆయనకు "కలికాల సర్వజ్ఞ" అనే బిరుదు ఉంది. దీనిఅర్థము కలియుగంలో అన్ని విషయాలు తెలిసినవాడు. ఆయన గుజరాత్ రాష్ట్రం లోని "ఢంఢుక" అహ్మదాబాద్ దక్షిణ ప్రాంతం నుండి 100 కి.మీ. దూరంలో గ్రామములో చాచాదేవ, పాహినీ దేవిలకు జన్మించాడు. వారు అతనికి "చంద్రదేవ" అని నామకరణం చేసిరి. ఆయన జన్మ ప్రదేశంలో జైన తీర్థం అయిన మొథీరా ఉంది.ఆయన యువకునిగా ఉన్నపుడు "దెరసార్" వద్ద సన్యాసి దీక్షను ప్రారంభించి తన పేరును "స ...

                                               

అయ్యల సోమయాజులు గణపతిశాస్త్రి

అయ్యల సోమయాజులు గణపతిశాస్త్రి ప్రముఖ పండితుడు, జ్యోతిష్యుడు, ఆధ్యాత్మికవేత్త. రమణ మహర్షి శిష్యులలో ప్రముఖుడు. ఆయన వసిష్ఠ గణపతి ముని అనీ కావ్యకంఠ గణపతిముని అనీ ప్రసిద్ధుడు. వారు పదియేండ్ల వయసు నండే తెలుగు, సంస్కృత భాషలందును, వేదములు, తర్క శాస్త్రము, గణిత శాస్త్రము, జ్యోతిష శాస్త్రము, ఆయుర్వేదములో అసమాన ప్రతిభ చూపినారు. వీరి యొక్క వాక్చాతుర్యము, సంస్కృత భాషా ప్రావీణ్యము, అన్ని శాస్త్రములందును విశేష ప్రతిభతో - నవద్వీప మందు విద్వత్పరీక్ష లందు పాల్గొని ‘కావ్యకంఠ’ బిరుదమును పొందిరి. వివిధ ప్రదేశములలో తపస్సు ఆచరించి మంత్ర సిద్ది పొందినారు.

                                               

కాశ్యప శిల్ప శాస్త్రము

భారతీయ శిల్పకళ ను పరిశీలిస్తే విభిన్న ప్రాంతీయ కళా రీతులు కనిపిస్తాయి. ఆలయ నిర్మాణానికి అవసరమైన శాస్త్రీయ విజ్ఞానమును గ్రంధరూపములో నిక్షిప్తము చేయబడి దక్షిణ భారత ఆలయ శిల్ప శైలికి ప్రామణిక గ్రంథముగా ఈనాటికి నిలచి ఉన్న గ్రంథము కాష్యప శిల్ప శాస్త్రము. శిల్ప పురాతన భారతీయ గ్రంథాలలో ఏదైనా కళ లేదా కళను సూచిస్తుంది, శిల్ప శాస్త్రం అంటే కళ, చేతిపనుల శాస్త్రం కేవలం రాళ్ళ మీద శిల్పాలు చెక్కటం మాత్రమే కాదు. కశ్యప మహర్షి సత్య కాండం, తర్క కాండం, జ్ఞాన కాండములు అనే మూడు గ్రంథాలు ఉపదేశించినట్లు వైఖాస ఆగమ శాస్త్రం చెపుతున్నది.కాశ్యప శిల్ప శాస్త్రం లో 22 అధ్యాయాలు ఉన్నాయి, ఇందులో మూడువందల ఏడు రకాల శిల్పాల ...

                                               

వైదిక యుగంలో విద్యావ్యవస్థ

పురాతన కాలంలో విద్యను మనిషి మూడవ కన్నుగా భావించారు. జ్ఞానానికి మార్గముగా ఈ చదువును భావించారు. ఆనాటి విద్య యొక్క చివరి లక్ష్యం ఆత్మ సాక్షాత్కారం, కానీ తక్షణ గమ్యం మాత్రం తమ అభిరుచులకు, శక్తిసామర్థ్యాలకు అనుగుణంగా ఉపాధి పొంది సమాజానికి తమ వంతు సహాయం చేయడం. విద్య జీవితానికి వెలుగునిస్తుందని, అది లేనివాడు గుడ్డివానితో సమానమని భావించేవాళ్ళు. విద్యను వారు చాలా గౌరవంగా భావించారు. వారి మాటల్లోనే చెప్పాలంటే "స్త్రీపురుషులకు విద్య చాలా ముఖ్యమైనది, అది జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది, తల్లిలాగా పోషిస్తుంది, తండ్రిలా మార్గదర్శిలా నిలుస్తుంది, భార్యలాగా సుఖసౌఖ్యాలను ప్రసాదిస్తుంది, కీర్తిని సంపాదిస్తుంది, కష ...

                                               

అరిస్టాటిల్

అరిస్టాటిల్ ప్రముఖ ప్రాచీన గ్రీకు తత్వవేత్త. ప్లేటోకి శిష్యుడు, అలెగ్జాండర్కి గురువు. క్రీ.పూ. 384లో గ్రీసు ఉత్తరాన మాసిడోనియా రాజ్యంలో స్టాగిరా నగరంలో ఒక ధనిక కుటుంబంలో జన్మించాడు. తండ్రి నికొమేకస్ మేసిడోనియా రాజు అమిన్ టాస్ కొలువులో ఆస్థాన వైద్యుడు. ఈయన భౌతిక శాస్త్రము, గణితము, కవిత్వము, నాటకాలు, సంగీతం, తర్కము, రాజకీయం, ప్రభుత్వం, నీతి నియమాలు, జీవశాస్త్రం మొదలగు చాలా విషయాలపై పుస్తకాలు రాశాడు.

                                               

బెర్ట్రాండ్ రస్సెల్

బెర్ట్రాండ్ ఆర్థర్ విలియం రస్సెల్ ప్రముఖ బ్రిటీషు తత్త్వవేత్త, తార్కికుడు, చరిత్రకారుడు, సంఘ సంస్కర్త, సామ్యవాది, శాంతివాది, నాస్తికుడు. జీవితంలో చాలా భాగం ఇంగ్లాండులో గడిపినా రస్సెల్ వేల్స్ లో పుట్టాడు. అక్కడే మరణించాడు. "Why I Am Not a Christian" అనే పేరుతో ఇతను వ్రాసిన గ్రంథం ఎందరో నాస్తికులని ప్రభావితం చేసింది.

                                     

ⓘ తర్క శాస్త్రము

క్రమ బద్ధమైన చింతనా ప్రక్రియ ద్వారా సాధారణీకరణలు, ఆధరికి అమూర్తీకరణలు సాధించడంతో సంబంధమున్న విజ్ఞాన శాస్త్రం తర్కం. వివేచనా గుణం గురించి, సాక్ష్య బలం గురించి, ప్రవచనాల ఆపాదనల మీద ఆధారపడే అనుమాన ప్రామాణ్యం గురించి అది అధ్యయనం చేస్తుంది.

అమూర్తీకరించే లక్షణం, అంటే వస్తువుల సారమందుకోవడం బుద్ధికి మూల స్థంబం. విభాగాలను సామస్త్యం తోనూ, వ్యక్తులను సమూహాలతోను సంధానించడం, సాధారణీకరించడం, వర్గీకరించడం, అమూర్తీకరించడం బౌద్ధిక చర్యలో ఎప్పుడూ ఆపాదితమయి ఉంటాయి. ఉదాహరణకు కింది లక్షణాలను గమనించామనుకోండి - దీర్ఘ చతురప ఘనం, కాగిత పదార్థం, ముద్రిత పుటలు, ఏదో ఒకరకమైన బైండింగ్ అర్థవంతమైయిన వార్తావహనం - పత్రిక, కట్టకట్టడం, చాక్‌లేట్ పెట్టె, పుస్తకం వంటి అనేక వస్తువుల్లో వీటిలో ఏవో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అయితే ప్రస్తావిత లక్షణాలన్నీ పుస్తకానికుంటాయి. కనుక ఈ లక్షణాల నుంచి ఎవరయినా పుస్తకమనే భావాన్ని అమూర్తీకరిస్తారు. అట్లాగే క్రింది లక్షణాల పట్టిక నుండి ఎవరయినా సాధారణీకరించగలుగుతారు - తల, కాలు, మూలకోళ్ళు, ఆధర చట్రం. వాటిలో ఏదో ఒక లక్షణమో అనేక లక్షణాలో జంతువు, మేడమెట్లు, పక్క బెడ్ మొదలయిన వాటిలో ఉంటాయి. ఈ అంశాల నుండి అమూర్తీకరిస్తే అవన్నీ పక్కకే సరిపోయాయని గుర్తిస్తారు.

తర్కానికి నిశితమైన నిర్వచనమివ్వలేక పోయినా ఒక ప్రతిజ్ఞా వాక్యం నుంచి గాని, అనేక ప్రతిజ్ఞావాక్యాల నుంచిగాని, మరొక ప్రతిజ్ఞా వాక్యాన్ని ఆవశ్యంగా అంగమించడానికి follows గాని, నిగమిమడానికి deduce గానీ అవసరమైన ఉపాధులను అధ్యయనం చేయడం దాని వృత్తి అనవచ్చు. ఆలోచనా నియమాల అధ్యనాన్ని గూడా తర్కమన్నారు. వివేచన వంటి వాటిద్వారా సాగే ఈ తార్కిక నియంత్రణమే మానవుని తెలివిగా సమస్యలలో తలపడేటట్లు చేస్తుంది. ఆ విధంగా మానవుడు చింతన చేయగలగడం వల్ల తన చింతనకు వివేచనను అనువర్తింపజేసుకోగలగడం వల్లనే అరిస్టాటిల్ అనే గొప్ప గ్రీకు తాత్వికుడు "మానవుడు వివేచనాజీవి" అని నిర్వచించాడు. ప్రత్యయాలను concept మాటలను అర్థం చింతనలో అంతర్భావంగా ఉంటుంది. ప్రత్యయమంటే ఒక భావం. అది ఒక వివిక్త వస్తువుకు సంబంధించిన భావంగావచ్చు, అనుభవ నిర్మితమైన అమూర్త లక్షణాలకు సంబంధించినది కావచ్చు. జ్ఞాన వ్యవస్థా నిర్మాణంలో ప్రత్యయాల వినియోగం గురించి, వాటి సక్రమ వినియోగానికి సంబంధించిన నియమాలను గురించి తర్క శాస్త్రం అధ్యయనం చేస్తుంది.

మనకి జ్ఞానం ఆమోద యోగ్యమైన విధానంలో కలిగింది అనే చెప్పేదాన్ని ప్రమాణం అంటారు. హైందవ తర్క శాస్త్రంలో 8 ప్రమాణాలున్నాయి. వీటిని అన్నం భట్టు తన తక్క సంగ్రహం, తర్క దీపిక అనే గ్రంథాలలో వివరించాడు. కందుల నాగభూషణం తన వ్యాసంలో వీటి గురించి కొంత సమాచారాన్ని అందించాడు.

చూపు, వినికిడి, వాసన, స్పర్శ, రుచి, ల ద్వారా అంటే పంచేంద్రియాల ద్వారా జ్ఞానాన్ని సంపాదించే విధానాన్ని ప్రత్యక్ష ప్రమాణం అంటారు. ఇందులో పరిశీలకుడు, పరిశీలన వేరు అనే భావం ఇమిడి ఉంది.

రెండో ముఖ్యమైన ప్రమాణం అనుమానం. ఒక హేతువు నుంచి సాధ్యాన్ని నిర్థారించే పద్ధతిలో జ్ఞానాన్ని ఆర్జించే విధానం. తర్క శాస్త్ర బద్ధంగా జరిగితే ఈ జ్ఞానం ఆమోదయోగ్యం అవుతుంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం జ్ఞానార్జనకి మనం ఏ విధానం అనుసరించినా, ప్రత్యేకమైన అర్థాలతో వాడే పదజాలం ఉంటుంది. ప్రత్యేకమైన అర్థంలో వాడే పదాలను అపార్థం కలిగించేలా వాడడం లేక అపార్థం చేసుకోవడం సర్వసాధారణం

వాడిన పదానికి పాఠకుడి భావనకి సమన్వయం కుదరాలంటే, పాఠకుడికి ఆలోచన, మననం, వివేచనా అవసరమవుతాయి. భర్తృహరి అటువంటి వర్గానికి చెందని వారి గురించి అబోధోపహతులు అని నిస్పృహ పడతాడు.

కొన్ని ఆమోదయోగ్యమైన "న్యాయ సూత్రాల"ననుసరించి చర్చించి, ఫలితాన్ని నిగమనాన్ని నిర్థారించే ఆమోదయోగ్యమైన పద్ధతిని అనుమాన ప్రమానం అంటాము.

మోడో ప్రమాణం అర్థాపత్తి. అందిన సమాచారాన్ని విశ్లేషించి పొంతన లేని విషయాలను ఒక ఉచితమైన ఊహ ద్వారా సమన్వయం చేస్తే ఆ సమన్వయం మనకి కొత్త జ్ఞానాన్ని కలిగిస్తుంది. ఈ విధానాన్ని అర్థాపత్తి అంటాం.

కాంతి కణ రూపంలో ఉంటోందన్న సమాచారాన్ని, తరంగ రూపంలో ఉంటోందన్న సమాచారాన్ని, కాంతి వెలువడే చోటే, చేరే చోట కణ రూపంలోనూ, ప్రయాణం చేసేటప్పుడు తరంగ రూపంలోనూ ఉంటుందని శాస్త్రవేత్తలు సమన్వయం చేయడం ఈ ప్రమాణానికి ఉదాహరణ. అయితే ప్రయోగాల ద్వారా ఈ విషయాన్ని విజ్ఞానశాస్త్రంలో ఋజువు చేసారు.

ఓపిక, జ్ఞానం సరైన ఆధార జ్ఞానం ఉన్న వారెవరైనా ఈ ప్రయోగాలను చేసి చూడవచ్చు. ప్రయోగం చేసి ఋజువు చేస్తే విజ్ఞానశాస్త్రమవుతుంది. ఊహ చేసి వదిలివేస్తే తర్కం అవుతుంది.

చివరగా ఋషులు లేక గురువులు లేక పెద్దలు తమ అసాధారన స్ఫురణ శక్తితో సత్యాన్ని గ్రహించి చెప్తారు. అటువంటి వారి ద్వారా జ్ఞానార్జన జరిగితే దానిని దృష్టి ప్రమాణం అంటారు. న్యూటన్ గురుత్వాకర్షణ సిద్ధాంతం, ఐన్‌స్టీన్ వక్రప్రదేశ సిద్ధాంతం, జన్యుశాస్త్రంలోని, జంట హెలిక్సుల నమూనాలలు ఇటువంటి యోగ దృష్టి వలన సిద్ధించినవే అని కొందరు అనవచ్చు అయితే విజ్ఞాన శాస్త్రంలో ఈ సిద్ధాంతాలు, నమూనాలు ఇచ్చే ఫలితాల్లో మనం పరిక్షించగలిగినవి ఉంటే పరీక్షించి తీరాలి. పరికరాలు లేనిచో అవి అమరే వరకు ఆగి తీరాలి.