Топ-100
Back

ⓘ విద్యా విభాగాల జాబితా. బాక్టీరియాలజీ: బాక్టీరియా అనే సూక్ష్మజీవుల అధ్యయన శాస్త్రం. లిమ్నాలజీ: సరస్సుల్లో నివసించే జంతువుల అధ్యయన శాస్త్రం. పెడగాగీ: బోధనాపద్ధతుల ..
                                               

విశ్వవిద్యాలయం

విశ్వవిద్యాలయం అనేది ఉన్నత విద్యాభ్యాసం, పరిశోధనలు జరిపే విద్యాలయం. ఇది వివిధ విద్యా విభాగాలలోని విద్యలకు డిగ్రీలను ప్రధానం చేస్తుంది.ఆంగ్ల పదమైన యూనివర్సిటీ అని కూడా విశ్వవిద్యాలయాన్ని వ్యవహరిస్తుంటారు.పరిశోధన శాస్త్రం, చట్టం, ఔషధం, ఇంజనీరింగ్ వంటి అనేక వృత్తిపరమైన విద్యా విభాగాలు, ఉదార కళల గ్రాడ్యుయేట్ అధ్యయనాల కార్యక్రమాన్ని కలిగి ఉన్న అత్యున్నత స్థాయి నేర్చుకునే సంస్థ.విశ్వవిద్యాలయాలు సాధారణంగా అండర్ గ్రాడ్యుయేట్ విద్య, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యను అందిస్తాయి. కాంటినెంటల్ యూరోపియన్ విశ్వవిద్యాలయాలు సాధారణంగా గ్రాడ్యుయేట్ లేదా ప్రొఫెషనల్ పాఠశాలలను మాత్రమే కలిగి ఉంటాయి. విశ్వవిద్యాలయం అనే ...

                                               

ఆన్ లైన్ పౌర సేవలు

ఛార్జీలు, పిఎన్‌ఆర్‌ స్థితి ఆన్‌లైన్‌ టికెట్‌ బుకింగ్‌ రాకపోకలు విమానాల రాకపోకలు

                                               

రాష్ట్ర ప్రభుత్వం (భారతదేశం)

భారతదేశంలో 28 రాష్ట్రాల రాష్ట్ర ప్రభుత్వాలు 8 కేంద్రపాలిత ప్రాంతాలను పరిపాలించే ప్రభుత్వాలు ఉన్నాయి.రాష్ట్ర మంత్రి మండలికి, ముఖ్యమంత్రి అధిపతిగా ఉంటాడు.కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారం విభజించబడింది.కేంద్ర ప్రభుత్వం రక్షణ, బాహ్య వ్యవహారాలు మొదలైనవాటిని నిర్వహిస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పోలీసుల ద్వారా రాష్ట్ర అంతర్గత భద్రత,ఇతర రాష్ట్రాల సమస్యలతో వ్యవహరిస్తుంది.సరిహద్దు సుంకం,ఉత్పత్తి పన్ను, ఆదాయపు పన్ను మొదలైనవి కేంద్ర ప్రభుత్వానికి ఆదాయంకాగా,అమ్మకపు పన్ను, స్టాంప్ డ్యూటీ మొదలైన వాటి నుండి రాష్ట్ర ప్రభుత్వాానికి ఆదాయంగా వస్తుంది.ఇప్పుడు అమ్మకపు పన్ను, వస్తువులు, సే ...

                                               

ముంబై

ముంబయి మరాఠీ: मुंबई, పూర్వము దీనిని బొంబే అని పిలిచేవారు. ఇది భారత దేశంలోని ఒక ముఖ్య నగరము. ఇది మహారాష్ట్ర రాష్ట్రము యొక్క రాజధాని, ప్రపంచంలో రెండవ అత్యంత జన సమ్మర్ధం గల నగరము. దీని ప్రస్తుత జనాభా 13 మిలియన్లు ఒక కోటి ముప్పై లక్షలు. ఇది మహారాష్ట్రలోని పశ్చిమ సముద్ర తీరంలోని సాష్టీ ద్వీపంలో ఉంది. ఆధునిక భారతదేశ విభిన్నతను ఈ నగరంలో చూడచ్చు. ఈనగర సినీ పరిశ్రమ, రాజకీయాలు, నేరస్థులు కలసిపోయి భవిష్యత్తు గురించి ఆందోళన కలిగిస్తుంది అదే సమయంలో ఈనగర వాసుల సాహసము ఆశ కలిగిస్తుంది.దక్షిణ ఆసియాలో ముంబాయ్ అతి పెద్ద నగరము. ఇది మెట్రోపాలిటన్ ప్రాంతం.

                                               

మహారాజా కళాశాల, విజయనగరం

మహారాజా కళాశాల, లేదా ఎం.ఆర్.కళాశాల భారతదేశంలో అతి పురాతనమైన కళాశాల. ఇది 1879లో శ్రీ పూసపాటి విజయరామ గజపతి, చే స్థాపించబడినది. "నేషనల్ అక్రెడిటేషన్, అసెస్‌మెంట్ కౌన్సిలు" ఈ కళాశాలను "బి" గ్రేడుగా గుర్తించింది. ఈ కళాశాలలో 21 విభాగములు కలవు. ఈ కళాశాలలో 19 వివిధకరములైన గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులను అందిస్తున్నవి. ఈ కళాశాలలో 150 మంది శాశ్వత, తాత్కాలిక ఉద్యోగులు కలరు. 2009 సంవత్సరానికి 2.192 విద్యార్థులు అభ్యసిస్తున్నారు.

                                               

సమాచార గ్రంథాలయం

సమాచార గ్రంథాలయం, సమాచార ఆర్కైవ్ లేదా సమాచార రిపోజిటరీ అనేది పరిశోధనలో ద్వితీయ ఉపయోగం కోసం సంఖ్యా లేదా జియోస్పేషియల్ డేటా సెట్ల సమాహారం. డేటా లైబ్రరీ సాధారణంగా పరిశోధన డేటా ఆర్కైవింగ్ కోసం ఆ సంస్థ యొక్క డేటా వినియోగదారులకు సేవ చేయడానికి ఏర్పాటు చేయబడిన ఒక పెద్ద సంస్థ లో భాగం. డేటా లైబ్రరీ స్థానిక డేటా సేకరణలను కలిగి ఉంటుంది. వాటిని వివిధ మార్గాల ద్వారా యాక్సెస్ చేస్తుంది CD- / DVD-ROM లు లేదా డౌన్‌లోడ్ కోసం సెంట్రల్ సర్వర్. డేటా లైబ్రరీ దాని వినియోగదారులకు ప్రాప్యత చేయడానికి లైసెన్స్ పొందిన డేటా వనరులకు సభ్యత్వాలను కూడా నిర్వహించవచ్చు. డేటా లైబ్రరీని కూడా డేటా ఆర్కైవ్‌గా పరిగణించాలా అనేది ...

                                     

ⓘ విద్యా విభాగాల జాబితా

 • బాక్టీరియాలజీ: బాక్టీరియా అనే సూక్ష్మజీవుల అధ్యయన శాస్త్రం.
 • లిమ్నాలజీ: సరస్సుల్లో నివసించే జంతువుల అధ్యయన శాస్త్రం.
 • పెడగాగీ: బోధనాపద్ధతుల అధ్యయన శాస్త్రం.
 • సైటాలజీ: కణం, కణాంగాల అధ్యయన శాస్త్రం.
 • సెలినాలజీ: చంద్రుని గురించి అధ్యయనం చేసే శాస్త్రం.
 • పిసికల్చర్: చేపల పెంపకం.
 • క్రిమినాలజీ: నేరాలు, నేరస్థుల అధ్యయన శాస్త్రం.
 • పేలియోబోటనీ: వృక్షశిలాజాల అధ్యయన శాస్త్రం.
 • ఫ్లోరీకల్చర్: పుష్పాల పెంపకం.
 • టిష్యూకల్చర్: కణజాలాల సంవర్ధనం.
 • వర్మికల్చర్: వానపాముల పెంపకం.
 • ప్టిక్స్: కాంతి అధ్యయన శాస్త్రం.
 • ఫిలాటలీ: స్టాంపుల సేకరణ.
 • సిల్వీకల్చర్: కలపనిచ్చే చెట్ల పెంపకం.
 • లెక్సికోగ్రఫీ: నిఘంటువుల అధ్యయన శాస్త్రం.
 • మైకాలజీ: వివిధ రకాల ఫంగస్‌ల అధ్యయన శాస్త్రం.
 • మెటియోరాలజీ: వాతావరణ అధ్యయన శాస్త్రం.
 • రుమటాలజీ: కీళ్లు, వాటికి సంబంధించిన వ్యాధులు, చికిత్సల అధ్యయన శాస్త్రం.
 • కార్డియాలజీ: మానవ హృదయ నిర్మాణం, గుండెకు వచ్చే వ్యాధులు, వాటి చికిత్సల అధ్యయన శాస్త్రం.
 • వైరాలజీ: వైరస్‌ల అధ్యయన శాస్త్రం.
 • టాక్సానమీ: మొక్కలు, జంతువుల గుర్తింపు, వాటి వర్గీకరణ వంటి వాటి అధ్యయన శాస్త్రం.
 • ఎటిమాలజీ: పదాల పుట్టుక గురించి అధ్యయనం చేసే శాస్త్రం.
 • హెల్మింథాలజీ: పరాన్నజీవ పురుగుల అధ్యయన శాస్త్రం.
 • హిస్టాలజీ: కణజాలాల శాస్త్రం.
 • పల్మనాలజీ: ఊపిరితిత్తుల అధ్యయన శాస్త్రం.
 • మయాలజీ: కండరాల అధ్యయన శాస్త్రం.
 • సీస్మాలజీ: భూకంపాల అధ్యయన శాస్త్రం.
 • ఓరాలజీ: పర్వతాల అధ్యయన శాస్త్రం.
 • హెపటాలజీ: కాలేయ అధ్యయన శాస్త్రం.
 • న్యూరాలజీ: నాడీ వ్యవస్థ అధ్యయన శాస్త్రం.
 • జెరియాట్రిక్స్: వృద్ధుల వ్యాధులు, వాటి చికిత్సల అధ్యయన శాస్త్రం.
 • కాస్మోలజీ: విశ్వంపై అధ్యయనం చేసే శాస్త్రం.
 • ఓఫియాలజీ: పాముల అధ్యయన శాస్త్రం.
 • హైడ్రాలజీ: భూగర్భ జలాల అధ్యయన శాస్త్రం.
 • ఫొనెటిక్స్: భాషా ఉచ్ఛరణ అధ్యయన శాస్త్రం.
 • విటికల్చర్: ద్రాక్షతోటల పెంపకం.
 • పీడియాట్రిక్స్: చిన్నపిల్లల వ్యాధులు, వాటి చికిత్సల అధ్యయన శాస్త్రం.
 • హైడ్రోపోనిక్స్: నేల సహాయం లేకుండా మొక్కలను నీటిలోనే పెంచటాన్ని అధ్యయనం చేసే శాస్త్రం.
 • మైక్రోబయాలజీ: సూక్ష్మజీవుల అధ్యయన శాస్త్రం.
 • అనాటమీ: మొక్కలు, జంతువులు లేదా మానవ అంతర్నిర్మాణ శాస్త్రం.
 • టాక్సికాలజీ: విషంపై అధ్యయనం చేసే శాస్త్రం.
 • ఫైకాలజీ: ఆల్గేల అధ్యయనం. దీన్నే ఆల్గాలజీ అంటారు.
 • ఆస్ట్రానమీ: ఖగోళ అధ్యయన శాస్త్రం.
 • క్రిప్టోగ్రఫీ: రహస్య సంకేతాలతో రాసిన చేతిరాతల అధ్యయన శాస్త్రం.
 • టెరిడాలజీ: ఫెర్న్స్ వంటి టెరిడోఫైట్ మొక్కల అధ్యయన శాస్త్రం.
 • పేలినాలజీ: పుష్పించే మొక్కల పరాగ రేణువుల అధ్యయనం.
 • పెడాలజీ: నేలల అధ్యయన శాస్త్రం.
 • ఎకాలజీ: మొక్కలు, జంతువులకు వాటి పరిసరాలతో ఉండే సంబంధాల గురించి వివరించే అధ్యయన శాస్త్రం.
 • ఆర్నిథాలజీ: పక్షుల అధ్యయన శాస్త్రం.
 • లిథాలజీ: శిలల అధ్యయన శాస్త్రం.
 • సోషియాలజీ: సమాజ అధ్యయన శాస్త్రం.
 • నెఫ్రాలజీ: మూత్రపిండాల నిర్మాణం, విధులు, వాటికి సంక్రమించే వ్యాధులు, చికిత్సల అధ్యయన శాస్త్రం.
 • జువాలజీ: ఏకకణ జీవి అమీబా నుంచి మానవుని వరకు అన్ని జంతువుల అధ్యయన శాస్త్రం.
 • గైనకాలజీ: స్త్రీల వ్యాధుల అధ్యయన శాస్త్రం.
 • సెఫాలజీ: ఎన్నికల అధ్యయన శాస్త్రం.
 • ఒలెరీకల్చర్: కూరగాయల పెంపకం.
 • పాథాలజీ: మొక్కలు, జంతువుల వ్యాధుల అధ్యయన శాస్త్రం.
 • లెపిడోటెరాలజీ: సీతాకోకచిలుకలు, మాత్‌ల అధ్యయన శాస్త్రం.
 • ఎంటమాలజీ: కీటకాల అధ్యయన శాస్త్రం.
 • క్రయోజెనిక్స్: అత్యల్ప ఉష్ణోగ్రతల నియంత్రణ అధ్యయన శాస్త్రం.
 • పోటమాలజీ: నదుల అధ్యయన శాస్త్రం.
 • ట్రైకాలజీ: మానవుని జుట్టుపై అధ్యయనం చేసే శాస్త్రం.
 • జెనిటిక్స్: జన్యువుల లక్షణాల అధ్యయన శాస్త్రం.
 • న్యూమరాలజీ: సంఖ్యా శాస్త్రం.
 • ఆగ్రోస్టాలజీ: గడ్డి అధ్యయన శాస్త్రం.
 • హెమటాలజీ: రక్తాన్ని అధ్యయనం చేసే శాస్త్రం.
 • అకౌస్టిక్స్: ధ్వని అధ్యయన శాస్త్రం.
 • పేలియోజువాలజీ: జంతు శిలాజాల అధ్యయన శాస్త్రం.
 • పోమాలజీ: పండ్ల మొక్కల అధ్యయన శాస్త్రం.
 • డెమోగ్రఫీ: మానవ జనాభా అధ్యయన శాస్త్రం జననాలు, మరణాల వంటి గణాంకాలు.
 • న్యూమిస్‌మ్యాటిక్స్: నాణేల అధ్యయన శాస్త్రం.
 • ఎంబ్రియాలజీ: పిండాభివృద్ధి శాస్త్రం
 • థానటాలజీ: మృత్యువుపై అధ్యయనం చేసే శాస్త్రం.
 • థియోలజీ: వివిధ మతాల అధ్యయన శాస్త్రం.
 • ఆర్థిక వృక్షశాస్త్రం ఎకనమిక్ బోటనీ: మానవులకు ఆర్థికంగా ఉపయోగపడే మొక్కల అధ్యయనాన్ని ఎకనమిక్ బోటనీ అంటారు. ధాన్యాలు, పప్పులు, నూనెగింజల పంటలు, ఫలాలు, కూరగాయల వంటి వాటి అధ్యయన శాస్త్రం.
 • ఆంకాలజీ: కేన్సర్ అధ్యయన శాస్త్రం.
 • బ్రయాలజీ: బ్రయోఫైట్స్ అనే మొక్కల అధ్యయనం ఉదా: లివర్‌వార్ట్స్, మాస్.
 • హార్టీకల్చర్: తోటల పెంపకం.
 • ఎండోక్రైనాలజీ: అంతస్స్రావక వ్యవస్థ అధ్యయనం జంతువుల్లో విడుదలయ్యే హార్మోన్ల అధ్యయనం.
 • ఆంజియాలజీ: రక్తనాళాల అధ్యయన శాస్త్రం.
 • ఆఫ్తల్మాలజీ: మానవుని కన్ను, నిర్మాణం, విధులు, కంటి వ్యాధులు, చికిత్సల అధ్యయన శాస్త్రం.మ్యునాలజీ: మానవుని రోగ నిరోధక శక్తి అధ్యయన శాస్త్రం.
 • డెర్మటాలజీ: మానవుని చర్మం, నిర్మాణం, విధులు, చర్మానికి వచ్చే వ్యాధులు, వాటికి చికిత్సల అధ్యయన శాస్త్రం.
 • ఎపీకల్చర్: తేనెటీగల పెంపకం.
 • ఇక్తియాలజీ: చేపల అధ్యయన శాస్త్రం.
 • క్రేనియాలజీ: మానవుని పుర్రెను అధ్యయనం చేసే శాస్త్రం. దీన్నే ఫ్రెనాలజీ అని కూడా అంటారు.