Топ-100
Back

ⓘ ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవం ప్రతి సంవత్సరం మే 8న నిర్వహించబడుతుంది. నోబెల్ పురస్కార గ్రహీత, అంతర్జాతీయ రెడ్‌క్రాస్ సొసైటీ వ్యవస్థాపకుడు జాన్‌ హెన్రీడూన్‌ హంట్‌ ..




ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవం
                                     

ⓘ ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవం

ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవం ప్రతి సంవత్సరం మే 8న నిర్వహించబడుతుంది. నోబెల్ పురస్కార గ్రహీత, అంతర్జాతీయ రెడ్‌క్రాస్ సొసైటీ వ్యవస్థాపకుడు జాన్‌ హెన్రీడూన్‌ హంట్‌ జయంతి రోజున ఈ దినోత్సవం జరుపుకుంటారు.

వివిధ స‌మ‌స్య‌ల‌తో భాద‌ప‌డుతున్న వారికి ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎంతోమంది వాలంటీర్లు, అనేక స్వ‌చ్ఛంద సంస్థ‌లు సహాయం చేస్తున్నాయి. అలాంటివారందరి గౌర‌వార్ధంగా ఈ దినోత్స‌వం ఏర్పాటు చేయబడింది.

                                     

1. చరిత్ర

యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు బాధితులను ఆదుకుని, ఆసరాగా నిలవడం కోసం ప్రత్యేకంగా "రెడ్‌క్రాస్ సొసైటీ" అనే సేవా సంస్థ ఏర్పాటయింది. అంత‌ర్జాతీయ క‌మిష‌న్ శాంతికి ప్ర‌ధాన స‌హ‌కారిగా రెడ్‌క్రాస్‌ను ప్ర‌వేశపెట్టింది.

1934లో టోక్యోలో జరిగిన 15వ అంత‌ర్జాతీయ‌స‌ద‌స్సులో రెడ్‌క్రాస్ ట్రూస్ సూత్రాలను ఆమోదించి, వాటిని ప్ర‌పంచ‌వ్యాప్తంగా అనేక ప్రాంతాకు వ‌ర్తించేలా అమ‌లుచేశారు. అంతర్జాతీయ రెడ్‌క్రాస్ సొసైటీ వ్యవస్థాపకుడు జాన్‌ హెన్రీడూన్‌ హంట్‌ జయంతిని ప్ర‌పంచ రెడ్‌క్రాస్ దినోత్స‌వంగా జ‌రుపుకునే ప్ర‌తిపాద‌న‌ 1948, మే 8న ఆమోదించబడింది. 1984లో అధికారికంగా ప్ర‌పంచ రెడ్‌క్రాస్ రెడ్ క్రెసెంట్ దినోత్సవంగా మార్చబడింది.

                                     

2. కార్యక్రమాలు

ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న వాలంటీర్లు, స్వ‌చ్ఛంద సంస్థ‌లు చేస్తున్న సేవా కార్య‌క‌లాపాల‌ను ప్రోత్స‌హించ‌డానికి అంత‌ర్జాతీయ రెడ్‌క్రాస్ క‌మిటీ, దాని స‌భ్యులు ఈ దినోత్సవం సందర్భంగా వివిధ కార్య‌క్రమాలు నిర్వ‌హిస్తారు.

                                     

3. ఇవీ చూడండి

  • రెడ్‌క్రాస్
  • అంతర్జాతీయ రెడ్‌క్రాస్, రెడ్‌క్రెసెంట్ ఉద్యమ చిహ్నాల జాబితా
  • అంతర్జాతీయ రెడ్‌క్రాస్ కమిటీ
  • రెడ్‌క్రాస్, రెడ్‌క్రెసెంట్ సంఘాల జాబితా
  • అంతర్జాతీయ రెడ్‌క్రాస్, రెడ్‌క్రెసెంట్ సంఘాల సమాఖ్య