Топ-100
Back

ⓘ మార్గదర్శి అనగా మార్గాన్ని చూపించేవాడు. మార్గదర్శిని ఆంగ్లంలో గైడ్ అంటారు. మార్గదర్శకుడు తెలియని లేదా తెలిసితెలియని ప్రదేశాలకు వచ్చిన ప్రయాణికులకు, క్రీడాకారులక ..
                                               

మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్

మార్గదర్సి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్, అనే పేరుతో ఉన్న సంస్థ ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఆర్థిక లావాదేవీలతో వ్యవహరిస్తున్న ఒక చిట్ ఫండ్ కంపెనీ. రామోజీరావు దూర దృష్టి దృడనిశ్చయంతో మార్గనిర్దేశం చేయబడిన మార్గదర్సి 1962 అక్టోబర్‌లో ఒక చిన్న కార్యాలయంలో కేవలం ఇద్దరు వ్యక్తులు పనిచేస్తూ ప్రారంభించారు.ఈ సంస్థ రామోజీ గ్రూప్ లో ఒకటిగా నిర్వహింపబడుతుంది.

                                               

బి.ఎస్. నారాయణ

బి.ఎస్. నారాయణ తెలంగాణ రాష్ట్రానికి చెందిన తెలుగు చలనచిత్ర దర్శకుడు, నిర్మాత. జాతీయస్థాయిలో తెలుగు సినీరంగానికి మొట్టమొదటిసారి ఉత్తమ నటి అవార్డును, రెండు జాతీయ అవార్డులను అందించాడు.

                                               

నూతలపాటి గంగాధరం

ఇతడు 1939, డిసెంబరు 15న చిత్తూరు జిల్లా, సత్యవేడు మండలం రామగిరి గ్రామంలో జన్మించాడు. ఇతని తల్లి కుప్పమ్మ, తండ్రి మునుస్వామినాయుడు. ఇతడు ప్రాథమిక విద్య రామగిరిలో, ఉన్నత విద్యాభ్యాసం చిత్తూరులో పూర్తి చేసుకున్నాడు. తిరుపతి ప్రాచ్య కళాశాలలో విద్వాన్ కోర్సు అనంతరం సత్యవేడులోనే తెలుగు పండితుడిగా ఉద్యోగం ప్రారంభించాడు. గంగాధరం చిన్నతనంలోనే సంస్కృత కావ్యాలు, అలంకార, వ్యాకరణ శాస్త్రగ్రంథాలు అధ్యయనం చేశాడు. గంగాధరం కొంతకాలం ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం కార్యవర్గ సభ్యుడిగా ఉన్నాడు. ఇతని కవిత్వం పై కోసూరి దామోదర నాయుడు శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎం.ఫిల్ పరిశోధన గావించాడు.

                                               

ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం

ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం గా పిలవబడే శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ లాంటి భాషల్లో సుమారు 40 వేలకుపైగా పాటలు పాడాడు. అభిమానులు ఆయనను ముద్దుగా బాలు అని పిలుస్తారు. 1966 లో పద్మనాభం నిర్మించిన శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న చిత్రంతో సినీ గాయకుడిగా అతని ప్రస్థానం ప్రారంభమైంది. తర్వాత మరిన్ని అవకాశాలు తలుపు తట్టాయి. మొదట్లో ఎక్కువగా తెలుగు, తమిళ చిత్రాల్లో పాటలు పాడే అవకాశాలు వచ్చాయి. చాలా మంది నటులకు వారి హావభావాలకు, నటనా శైలికి అనుగుణంగా పాటలు పాడేవారు. 1969 లో మొదటిసారిగా నటుడిగా కనిపించిన ఈయన తర్వాత కొన్ని అతిథి పాత్రల్లో ...

                                               

బంటుమిల్లి

పూర్వము బ్రిటీషువారి పరిపాలన కాలంలో సముద్ర మార్గం ద్వారా సరుకుల రవాణా ఎగుమతులు దిగుమతులు మచిలీపట్నం గిలకలదిండి పోర్టులో జరిగేవి అని, అలా సరుకులు రవాణా చేసేటప్పుడు భటులు బంటుమిల్లిలో స్వేద తీరేవారని అలా భటులు పేరు మీదుగా ఈ ఊరికి బంటుమిల్లి అని పేరు వచ్చినట్టు కొందరు చెబుతున్నారు. ఖచ్చితమైన వివరణ అయితే తెలియదు.

                                               

సంఘసంస్కర్త

సమాజాన్ని సంస్కరించేందుకు పూనుకున్న వ్యక్తిని సంఘసంస్కర్త అంటారు. సమాజంలో గల విభిన్న మతాలకు, వర్గాలకు, భాషలకు, సంస్కృతులకు అతీతంగా మానవుల మధ్య గల ప్రేమ, గౌరవాల భావనలనే "సౌభ్రాతృత్వం" అనే లక్షణాన్ని కలిగి ఉంటాడు. ఇంకనూ ముందుకు సాగి, సర్వమానవ ప్రేమ, మానవకళ్యాణం, విశ్వమానవ సమానత్వం, వసుదైక కుటుంబ భావనలు మున్నగు ఉన్నత భావనలు, సద్-నీతి, ప్రకృతినియమాలు, విశ్వజనీయ మానవసూత్రాలు, సమ్మిళిత సామాజిక స్పృహలు వంటి ఉన్నత విలువలతో కూడిన విశాల దృక్పథానికి పాటు పడతాడు. సంఘసంస్కర్త ఆదర్శవంతుడై ఆదర్శవంతులు తయారవడానికి దోహదపడతాడు.

మార్గదర్శి
                                     

ⓘ మార్గదర్శి

మార్గదర్శి అనగా మార్గాన్ని చూపించేవాడు. మార్గదర్శిని ఆంగ్లంలో గైడ్ అంటారు. మార్గదర్శకుడు తెలియని లేదా తెలిసితెలియని ప్రదేశాలకు వచ్చిన ప్రయాణికులకు, క్రీడాకారులకు లేదా పర్యాటకులకు దారి చూపుచూ వారిని గమ్యస్థానికి చేరుస్తాడు. గైడు పర్యాటకులకు దారి చూపి గమ్యస్థానికి చేర్చినందుకు ఫీజు రూపంలో కొంత డబ్బును తీసుకుంటాడు.

టూరిస్ట్ గైడులు పర్యాటక ప్రదేశాలను చూపుచూ దాని చరిత్రను కూడా తెలియజేస్తారు.

                                     

1. ఆదర్శ మార్గదర్శకులు

మానవుని మంచి వ్యక్తిగా పెంపొందించేందుకు మార్గదర్శకులు కారణమవుతారు. మంచిగా నడిచే జీవితంలో కష్టాలు, నష్టాలు అధికమైనప్పటికి మార్గదర్శకులు తాము నమ్మిన సిద్ధాంతాన్ని విడిచి పెట్టక అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు, ఇతరులకు మార్గదర్శకులు అవుతారు. మహాత్మాగాంధీ ప్రపంచానికి అహింసా మార్గాన్ని బోధించిన మార్గదర్శి. మహాత్మాగాంధీ యొక్క అహింసా సిద్ధాంతానికి అనేక మంది ప్రభావితమయ్యారు. అనేక మంది సంఘసంస్కర్తలు మానవాళికి ఆదర్శప్రాయులుగా వారి జీవితమే ఒక సందేశంగా జీవించారు.

                                               

కోడూరి కౌసల్యాదేవి

ఈవిడ జనవరి 27, 1936లో జన్మించారు. ఈమె 1958లో దేవాలయం అనే కథ ద్వారా రచనావ్యాసంగాన్ని మొదలుపెట్టింది. ఈమె మొదటినవల "చక్రభ్రమణం"ను 1961లో తన 25వ యేట వ్రాసింది. ఈ నవల ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక నవలల పోటీలో మొదటి బహుమతిని గెల్చుకుంది. ఈ నవలను డాక్టర్ చక్రవర్తి పేరుతో సినిమాగా తీసారు. ప్రేమనగర్, చక్రవాకం, శంఖుతీర్థం నవలలు కూడా అవే పేర్లతో సినిమాలుగా వచ్చాయి. వివాహం అయ్యాక ఇంటిపేరు ఆరికెపూడిగా మారినతర్వాత తనపేరును ఆరికెపూడికోడూరికౌసల్యాదేవిగా ప్రకటించుకుంది.