Топ-100
Back

ⓘ సమాజం అంటే మానవులు కలిసిమెలసి పరస్పర సహకారమందించుకొంటూ సమిష్టిగా జీవిస్తుండే నిర్దిష్ట సమూహాం. సమాజం ఒకటి కంటే ఎక్కువ మంది వ్యక్తుల సంఘాలతో కూడిన నిర్దిష్ట సమూహ ..
                                               

సమాజం

సమాజం అంటే మానవులు కలిసిమెలసి పరస్పర సహకారమందించుకొంటూ సమిష్టిగా జీవిస్తుండే నిర్దిష్ట సమూహాం. సమాజం ఒకటి కంటే ఎక్కువ మంది వ్యక్తుల సంఘాలతో కూడిన నిర్దిష్ట సమూహాన్ని, అలాగే వారు సభ్యులుగా ఉన్న విస్తృత సమాజాన్ని కూడా సూచిస్తుంది. విడిగా సాధ్యమయ్యే దానికంటే సమూహంగా ఎక్కువ ప్రయోజనాలను పొందడానికి ప్రజలు సమాజాలను ఏర్పరుస్తారు. దీనిలో అందరు వ్యక్తులు మానవ కార్యకలాపాలను నిర్వహిస్తారు. మానవ కార్యకలాపాలలో ..

                                               

రాష్ట్రం

దేశాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజిస్తారు. ప్రతి రాష్ట్రానికి రాజ్యాంగం ప్రకారం, శాసన వ్యవస్థ, పరిపాలనా వ్యవస్థ, న్యాయ వ్యవస్థ వుంటాయి. భారతదేశాన్ని 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించారు.భారతదేశ భూభాగంలో లేదా భారత ప్రభుత్వ నియంత్రణలో రాష్ట్రం సాధారణ పరిభాషలో, ఏదైనా ఒక దేశంలో రాజ్యాంగం ప్రకారం పరిపాలనా సౌలభ్యం కోసం ఏర్పడిన ప్రాంతాలును రాష్ట్రం అని అంటారు.వీటిని ఆ రాష్ట్ర ప్రభుత్వాలు పరిపాలిస్తాయి.ఇవి భారత ప్రభుత్వ నియంత్రణలో ఉంటాయి.

                                               

డిసెంబర్ 1

1965: భారతదేశంలో సరిహద్దు భద్రతా దళం ప్రారంభింపబడింది. 2006: 15వ ఆసియా క్రీడలు దోహా లో ప్రారంభమయ్యాయి. 1963: నాగాలాండ్ భారతదేశానికి 16 వ రాష్ట్రంగా అవతరించింది. 1965: తిరుమల తిరుపతి దేవస్థానములు ప్రచురిస్తున్న ఆధ్యాత్మిక మాసపత్రిక సప్తగిరి ప్రారంభం.

                                               

తెలుగు సినిమాలు 1938

ఈ సంవత్సరం అత్యధికంగా 14 చిత్రాలు విడుదలయ్యాయి. * గూడవల్లి రామబ్రహ్మం రూపొందించిన మాలపిల్ల సంచలన విజయం సాధించి, సమాజం మీద ప్రభావం చూపగలిగే మాధ్యమంగా సినిమాకు గుర్తింపును తీసుకు వచ్చింది. అప్పటివరకు మన తెలుగు సినిమాలు నాలుగు ప్రింట్లతోనే విడుదలయ్యేవి. మాలపిల్ల చిత్రం ఎనిమిది ప్రింట్లతో విడుదలయింది. * కన్నాంబ, రామానుజాచార్యులతో హెచ్‌.యమ్‌.రెడ్డి రూపొందించిన గృహలక్ష్మి బాగా ప్రజాదరణ పొంది, మంచి వసూళ్ళు సాధించింది. * రాజమండ్రి నిడమర్తి సూరయ్య స్టూడియోలో సి.పుల్లయ్య ఒకేసారి చమ్రియా వారికి "సత్యనారాయణవ్రతం, కాసుల పేరు, చల్‌ మోహనరంగా" అనే మూడు చిత్రాలను తీసిపెట్టారు. మార్కండేయ మాలపిల్ల కచ దేవయాని ...

                                               

కందుకూరి వీరేశలింగం పంతులు

కందుకూరి వీరేశలింగం సంఘ సంస్కర్త, బహుముఖ ప్రజ్ఞాశాలి. సాహితీ వ్యాసంగంలో ఎక్కువగా కృషి చేసాడు. తెలుగు జాతికి నవయుగ వైతాళికుడు. వీరేశలింగం స్త్రీవిద్యకై ఉద్యమించి, ప్రచారం చెయ్యడమే కాక, బాలికల కొరకు పాఠశాలను ప్రారంభించాడు. మగపిల్లలతో ఆడపిల్లలు కలిసి చదువుకునే సహ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాడు కూడా. అంటరాని కులాలకు చెందిన పిల్లలను కూడా చేర్చుకుని మిగతా పిల్లలతో కలిపి కూర్చోబెట్టేవాడు. వారికి ఉచితంగా చదువు చెప్పడంతో బాటు, పుస్తకాలు, పలకా బలపాలు కొనిచ్చేవాడు. అప్పటి సమాజంలో బాల్యంలోనే ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేసేవారు. కాపురాలకు పోకముందే భర్తలు చనిపోయి, వితంతువులై, అనేక కష్టనష్టాలు ఎదుర్కొనే వార ...

                                               

1885

జనవరి 28: గిడుగు వెంకట సీతాపతి, ప్రసిద్ధ భాషా పరిశోధకుడు, విజ్ఞాన సర్వస్వ నిర్మాత. మ.1965 డిసెంబరు 30: కొప్పరపు సోదర కవులు. మ.1942 జూలై 15: పి.ఏ.థాను పిళ్లై, భారత స్వాతంత్ర్య సమరయోధుడు. మ.1970 జనవరి 22: మాడపాటి హన్మంతరావు, హైదరాబాదు నగర్ తొలి మేయర్. అక్టోబర్ 5: రావు వేంకట కుమార మహీపతి సూర్యారావు, సూర్యరాయాంధ్రనిఘంటువును ప్రచురించాడు. పూర్తిగా ఉత్తరవాదిగా వ్యవహరించాడు. మొట్టమొదటి తెలుగు టైపురైటరు కూడా ఇతడి హయాంలోనే మొదలయింది. మ.1964 అక్టోబర్ 7: నీల్స్ బోర్, భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. మ.1962

                                               

పశ్చిమ మేదినిపూర్ జిల్లా

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని 20 జిల్లాలలో పశ్చిమ మేదినిపుర్ ఒకటి. దీనిని పశ్చిమ మిడ్నౌపూర్ లేక వెస్ట్ మిడ్నౌపూర్అని కూడా అంటారు. దీనిని 2002లో జనవరి 1 న రఒందొంచబడింది. జిల్లాలో 4 ఉపవిభాగాలు:- ఖరగపూర్, మెదీనాపూర్ సరదార్, ఘతల్, జర్గం ఉన్నాయి. ప్రస్తుతం ఇది రెడ్ కార్పెట్‌"లో భాగంగా ఉంది.

                                               

మహేంద్రనాథ్ గుప్తా

మహేంద్రనాథ్ గుప్తా రామకృష్ణ పరమహంస గృహస్థాశ్రమ శిష్యుల్లో ఒకరు. ఈయననే మాస్టర్ మహాశయులు లేదా క్లుప్తంగా M అని కూడా పిలుస్తారు. ఈయన శ్రీరామకృష్ణ కథామృతం అనే పుస్తక రచయిత. ఇది బెంగాలీ భాషలో పేరొందిన పుస్తకం. ఇది ఆంగ్లంలో ది గోస్పెల్ ఆఫ్ శ్రీరామకృష్ణ గా అనువదించబడింది. ఈయన పరమహంస యోగానందకు చిన్నతనంలో ఆధ్యాత్మిక బోధకుడిగా వ్యవహరించాడు.

                                               

మహాదేవ గోవింద రనడే

మహాదేవ గోవింద రనడే ఒక భారతీయ విద్యావేత్త, సంఘ సంస్కర్త, న్యాయమూర్తి, రచయిత. ఈయన భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరు. ఈయన బాంబే లెజిస్లేటివ్ కౌన్సిల్లోనూ, కేంద్ర ఆర్థిక కమిటీల్లోనూ, బాంబే హైకోర్టులో న్యాయమూర్తిగా పలు పదవులు నిర్వహించాడు. ఆయన ప్రజలకు బాగా తెలిసిన వ్యక్తి, ప్రశాంతమైన వ్యక్తిత్వం కలవాడు, ఓరిమి కలిగిన ఆశావాది. ఈ లక్షణాలే ఆయన బ్రిటన్ తో ఆయన వ్యవహరించడం, భారతదేశంలో సంస్కరణలు అమలుచేయడం లాంటి కార్యక్రమాల్లో ఆయన వైఖరిని ప్రభావితం చేశాయి. ఆయన జీవిత కాలంలో వక్తృత్వోత్తేజక సభ, పూర్ణ సార్వజనిక సభ, మహారాష్ట్ర గ్రంథోత్తేజక సభ, ప్రార్థనా సమాజం లాంటి సంస్థలను స్థాపించాడు. తన సా ...

                                               

సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్

సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ అనేది పరమహంస యోగానంద 1920లో స్థాపించిన ప్రపంచ ఆధ్యాత్మిక సంస్థ. 1935 లో ఇది లాభాపేక్ష లేని చట్టబద్ధమైన సంస్థ రూపుదిద్దుకుంది. ఈ సంస్థ యోగానంద బోధించిన క్రియా యోగంతో పాటు ఆయన రచనలు, బోధనల పరిరక్షణ, ప్రపంచమంతా వ్యాప్తిచేసేందుకు ఒక సాధనంగా ఉపయోగపడింది. యోగానంద రాసిన భగవద్గీత పుస్తకంలో క్రియా యోగం అనే సైన్సు అసలైన ఆడం అయిన మనువుకు, ఆయన ద్వారా జనక మహారాజుకు, ఇంకా ఇతర రాజర్షులకు ఇవ్వబడింది.

                                               

శారదా హాఫ్‌మన్

ఈమె 1929, జూన్ 14వ తేదీన మద్రాసులోని అడయార్ దివ్యజ్ఞానసమాజం ప్రాంగణంలో పుట్టింది. ఈమె దివ్యజ్ఞాన సమాజానికి చెందిన మూడవతరం వ్యక్తి. ఈమె తాత అల్లాడి మహాదేవశాస్త్రి దివ్యజ్ఞాన సమాజం లైబ్రరీకి గ్రంథపాలకుడిగా వ్యవహరించాడు. ఈమె తండ్రి ఎం.కృష్ణన్ దివ్యజ్ఞాన సమాజం నడిపిన "ఆల్కాట్ మెమోరియల్ హరిజన స్కూల్"కు మొదటి భారతీయ హెడ్‌మాస్టర్. ఈమె 1939లో తన 10వ యేట రుక్మిణీదేవి అరండేల్ ప్రారంభించిన కళాక్షేత్రలో చేరి పి.చొక్కలింగం పిళ్ళై వద్ద నాలుగు సంవత్సరాలు భరతనాట్యం నేర్చుకొంది. కళాక్షేత్రనుండి పట్టభద్రురాలైన రెండవ వ్యక్తి ఈమె. మొదటి వ్యక్తి రాధా బర్నియర్ ఈమె తన 14వ యేట ఆరంగ్రేటం చేసింది. ఈమె 16వ యేట కళాక్ ...