Топ-100
Back

ⓘ జనరిక్ మందులు. నరేంద్ర మోడి జన ఔషధి పధకం ద్వారా దేశంలో కొత్తగా 5000 మెడికల్ షాపులను ఏర్పాటు చేసారు. ఇలా ఎంతో మందికి ఉపాధి లభించడమే కాకుండా పేదలకు మందుల ఖర్చు మి ..
                                               

కరోనా వైరస్ కు మందులు వేక్సిన్ లు ఉత్పత్తి

PRODUCTION OF MEDICINES AND VACCINES FOR CORONA VIRUS COVID-19 అని పిలువబడే కొత్త కరోనావైరస్ వ్యాధికి ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు చికిత్సలు మరియు టీకాలపై పనిచేస్తున్నారు. అనేక కంపెనీలు యాంటీవైరల్ మందులపై పనిచేస్తున్నాయి, వాటిలో కొన్ని ఇప్పటికే ఇతర అనారోగ్యాలకు వ్యతిరేకంగా ఉన్నాయి, ఇప్పటికే COVID-19 ఉన్నవారికి చికిత్స చేయడానికి. వ్యాధుల నివారణ చర్యగా ఉపయోగపడే వ్యాక్సిన్లపై ఇతర కంపెనీలు పనిచేస్తున్నాయి. మే 8 నాటికి, మూడు మందులు కంపెనీలు "ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఎఫ్డిఎ" నుండి అత్యవసర వినియోగ అధికారాన్ని ఇయుఎ అందుకుంది - మలేరియా నిరోధక మందులు క్లోరోక్విన్ మరియు హైడ్రాక్సీక్లోరోక్వ ...

జనరిక్ మందులు
                                     

ⓘ జనరిక్ మందులు

నరేంద్ర మోడి జన ఔషధి పధకం ద్వారా దేశంలో కొత్తగా 5000 మెడికల్ షాపులను ఏర్పాటు చేసారు. ఇలా ఎంతో మందికి ఉపాధి లభించడమే కాకుండా పేదలకు మందుల ఖర్చు మిగులుతుంది.ప్రధాని ఇకపై దేశంలోని వైద్యులందరు జనరిక్ మందులనే రాయాలనీ, లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆదేశించారు. దీనికి కొనసాగింపుగా ఓ కేంద్ర మంత్రి కూడా మెడికల్ కౌన్సిల్ నిబంధనల ప్రకారం వైద్యులు తమ చీటిపై జనరిక్ మందుల పేర్లనే ప్రస్ఫుటంగా పెద్దపెద్ద అక్షరాలతో రాయాలని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ పరంగా ఎన్ని ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ, అధికశాతం వైద్యులు ఈ పని చేయడం లేదు. ఈ మధ్యకాలంలో నాసిరకం మందులు రాజ్యమేలుతున్నట్లు వార్తలొచ్చాయి. మార్కెట్‌లో లభ్యమయ్యే ఔషధాలలో 16 శాతం నాసిరకమైనవని ఇటీవల ఓ సర్వే బాటిల్‌ ఆఫ్‌ లైస్‌: రాన్‌ బాక్సీ అండ్‌ ది డార్క్‌ సైడ్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఫార్మా తేల్చింది.

మందులు అందరికీ అందుబాటులో ఉండేలా ప్రభుత్వం జనరిక్‌ దుకాణాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టినా. అవి జిల్లాలోని అన్ని ప్రాంతాలకూ విస్తరించలేదు. 20 ఫార్మా కంపెనీలు బ్రాండెడ్‌తో పాటు జనరిక్‌ మందులూ తయారు చేస్తున్నాయి. జనరిక్‌ కంపెనీలు ప్రమాణాలకు కట్టుబడి ముడి రసాయనాలతోనే మందులను తయారు చేస్తాయి. భారత ప్రభుత్వం ఆధీనంలోని సెంట్రల్‌ డ్రగ్‌ స్టాండర్స్‌ అనుమతితోనే ఉత్పత్తి చేస్తాయి. మార్కెటింగ్‌ ఖర్చులు లేకపోవడం వల్ల వాటిని తక్కువ ధరకే విక్రయిస్తాయి. సుమారు 75 శాతం వ్యాధులకు 400లకు పైగా రకాల జనరిక్‌ మందులు ఉన్నా ప్రజలకు మాత్రం అవి చేరువ కావడంలేదు. 20 నుంచి 25 శాతం మాత్రమే జనరిక్‌ మందులు విక్రయాలు జరుగుతున్నాయి.అమెరికా లాంటి దేశాల్లో 40 నుండి 80 శాతం జనరిక్ మందులే వాడటానికి ప్రధాన కారణం అక్కడవున్న పటిష్ఠమైన నిఘా నియంత్రణ వ్యవస్థలు. ఎఫ్.డి.ఎ. అనుమతితో, పర్యవేక్షణలో ఏ మందైనా వాడటం వారి ప్రత్యేకత.జనరిక్‌ మందుల తయారీ సంస్థలన్నీ క్రమబద్దీకరణ చట్టాలు కఠినంగా ఉండే యూరోపియన్, అమెరికన్‌ మార్కెట్ల కోసం అత్యున్నత నాణ్యత కలిగిన ఔషధాలను తయారు చేస్తున్నాయి. ప్రపంచదేశాలకు భారత్ జనరిక్ మందులు సరఫరా చేస్తున్నది. అవి సరసమైన ధరలకు అందించటం హర్షించదగ్గ విషయం. అయితే, అత్యవసరమైన మందులు కేవలం 20 నుంచి 30 శాతం వరకే జనరిక్‌లో అందుబాటులో ఉన్నాయి.

                                     

1. ఇవి కూడా చూడండి

 • ► నేత్ర వైద్య నిపుణులు‎
 • ► ఎముకల వైద్యులు‎
 • ► మహిళా వైద్యులు‎
 • ► ప్రసూతి వైద్య నిపుణులు‎
 • ► ఆయుర్వేద వైద్యులు‎
 • ► చర్మ వైద్యులు‎
 • ► దంత వైద్యులు‎
 • ► హోమియోపతి వైద్యులు‎
 • ► ప్రాచీన భారత వైద్యులు‎
 • ► మానసిక వైద్యులు‎
 • ► భారతీయ వైద్యులు‎
 • ► గుండె చికిత్స నిపుణులు‎