Топ-100
Back

ⓘ మానవ పరిణామం ..




                                               

ఒరంగుటన్-మానవ చివరి ఉమ్మడి పూర్వీకుడు

ఒరంగుటన్-మానవ చివరి ఉమ్మడి పూర్వీకుడు హోమినినే, పొంగినే అనే ఉప కుటుంబాల చివరి ఉమ్మడి పూర్వీక జాతి. అంటే గొరిల్లా, చింపాంజీ, మానవులు - ఈ మూడింటి ఉమ్మడి పూర్వీకుడికి, ఒరంగుటన్లకూ ఉన్న చివరి ఉమ్మడి పూర్వీకుడన్నమాట. ఈ జాతి మధ్య మయోసీన్‌లో 110-160 లక్షల సంవత్సరాల క్రితం నివసించినట్లుగా అంచనా వేసారు.

                                               

ఒర్రోరిన్

ఒర్రోరిన్ టుగెనెన్సిస్ హోమినినే కు చెందిన తొలి జాతిగా భావిస్తున్నారు. 61 - 57 లక్షల సంవత్సరాల క్రితం నాటిదని అంచనా. దీన్ని 2000 లో కనుగొన్నారు. ఓరోరిన్‌కు ఆధునిక మానవులకూ ఉన్న సంబంధం ఏమిటో ఇంకా నిర్ధారణ కాలేదు. దీన్ని కనుగొనడంతో, ఆస్ట్రలోపిథెసీన్లు మానవ పూర్వీకులు అనే ఊహకు వ్యతిరేక వాదన ఏర్పడింది. కానీ, 2012 నాటికైతే మానవ పరిణామాన్ని వివరించే పరికల్పనల్లో, ఆస్ట్రలోపిథెసీన్లు మానవ పూర్వీకులు అనేదే ప్రబలంగా ఉంది. ప్రజాతి పేరు ఒర్రోరిన్ బహువచనం ఒర్రోరియెక్ అంటే టుగెన్ భాషలో "అసలు మనిషి" అని అర్థం. ఈ ప్రజాతి లోని ఒకే ఒక్క జాతి పేరు కెన్యా లోని టుగెన్ కొండల పేరు మీదుగా పెట్టారు. ఈ కొండల్లోనే ఈ ...

                                               

గిబ్బన్-మానవ చివరి ఉమ్మడి పూర్వీకుడు

గిబ్బన్-మానవ చివరి సాధారణ పూర్వీకుడు హోమినిడే, హైలోబాటిడే కుటుంబాల చివరి ఉమ్మడి పూర్వీకుడు. మరో మాటలో చెప్పాలంటే, GHLCA అంటే ఒరంగుటాన్-మానవ చివరి ఉమ్మడి పూర్వీకుడికి, గిబ్బన్లకూ ఉన్న ఉమ్మడి పూర్వీకుడు అన్నమాట. సంక్లిష్టమైన సంకర స్పీసియేషన్ కారణంగా, ఈ పూర్వీకుల జనాభా వయస్సుపై ఖచ్చితమైన అంచనా వెయ్యడం సాధ్యం కాదు. ఇది 1.59 - 1.76 కోట్ల సంవత్సరాల క్రితం ప్రారంభ మియోసిన్ కాలంలో నివసించినట్లు అంచనా. ఇంకా గుర్తించని ఈ జాతి, గతంలో అనుకున్నదానికంటే చిన్నదిగా, సుమారుగా గిబ్బన్ పరిమాణంలో ఉంటుంది. హైలోబాటిడే కుటుంబంలో నాలుగు గిబ్బన్ ప్రజాతులు, వాటిలో 20 జాతులూ ఉన్నాయి. ప్రతి జాతికి వేర్వేరు సంఖ్యలో క్ ...

                                               

పురాతన మానవులు

3.15.000 సంవత్సరాలకు ముందు, ఆధునిక మానవుల కంటే ముందు ఉద్భవించిన హోమో రకాలన్నిటినీ కలిపి పురాతన మానవులని అంటారు. హోమో నియాండర్తాలెన్సిస్, డెనిసోవాన్స్, హోమో రొడేసియెన్సిస్, హోమో హైడెల్‌బెర్గెన్సిస్, హోమో యాంటెసెస్సర్ లను సాధారణంగా పురాతన మానవులని భావిస్తారు. ఈ పరిభాషపై సార్వత్రిక ఏకాభిప్రాయం లేదు. "పురాతన మానవుల" రకాలను కొంతమంది రచయితలు హోమో సేపియన్స్ లేదా హోమో ఎరెక్టస్ అనే పేరు కింద చేర్చారు. పురాతన మానవుల మెదడు పరిమాణం సగటున 1.200 నుండి 1.400 క్యూబిక్ సెంటీమీటర్ల వరకూ ఉంటుంది. ఇది ఆధునిక మానవుల మెదడు పరిమాణంతో అటూ ఇటూగా సరిపోలుతుంది. మందపాటి పుర్రె, ఎత్తైన కనుబొమల గట్లూ ఉండడం, స్ఫుటమైన చు ...

                                               

శివాపిథెకస్

శివాపిథెకస్ అంతరించిపోయిన కోతుల జాతి. 1.22 కోట్ల సంవత్సరాల క్రితం, మయోసీన్‌ ఇపోక్‌కు చెందిన ఈ జాతి జంతువుల శిలాజ అవశేషాలను 19 వ శతాబ్దం నుండి భారత ఉపఖండంలోని సివాలిక్ కొండల్లో కనుగొన్నారు. ఈ జీనస్‌లోని ఏదైనా జాతి ఆధునిక ఒరంగుటాన్లకు పూర్వీకులు అయి ఉండవచ్చు. తొలుత కనుగొన్న కొన్ని జంతు అవశేషాలకు రామాపిథికస్ రాముడి కోతి అని, బ్రామాపిథికస్ బ్రహ్మ కోతి అనీ పేర్లు పెట్టారు. ఇవి మానవుల పూర్వీకులు అయి ఉండవచ్చని భావించారు.

Users also searched:

...