Топ-100
Back

ⓘ మానవ పరిణామం ..




                                               

ఆర్డిపిథెకస్

ఆర్డిపిథెకస్, హోమినినే ఉపకుటుంబానికి చెందిన, అంతరించిపోయిన ప్రజాతి. ఇది అంత్య మయోసీన్‌లోను, తొలి ప్లియోసీన్ లోనూ ఇథియోపియా లోని అఫార్ ప్రాంతంలో జీవించింది. చింపాంజీల నుండి మానవులు వేరుపడిన తరువాత, వారి తొట్టతొలి పూర్వీకులలో ఒకటిగా దీన్ని భావించారు. ఈ ప్రజాతికి మానవ పూర్వీకులతో ఉన్న సంబంధం ఏమిటి, ఇది హోమినిన్నేనా కాదా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది. ఈ ప్రజాతికి చెందిన రెండు శిలాజ జాతులను - 44 లక్షల సంవత్సరాల క్రితం తొలి ప్లయోసీన్‌లో నివసించిన ఆర్డిపిథెకస్ రామిడస్, సుమారు 56 లక్షల సంవత్సరాల క్రితం నివసించిన ఆర్డిపిథెకస్ కడబ్బా లను - శాస్త్ర సాహిత్యంలో వివరించారు. ప్రవర్తనా విశ్లేషణను బట్టి ...

                                               

ఆస్ట్రలోపిథెకస్

ఆస్ట్రలోపిథెకస్ అనేది మానవ పూర్వీకుల్లో ఒకటి. ఆస్ట్రలో అనే లాటిన్ మాటకు "దక్షిణాదికి చెందిన" అని, పిథెకోస్ అనే గ్రీకు మాటకు "కోతి" అనీ అర్థం. వెరసి ఆస్ట్రలోపిథెకస్ అంటే దక్షిణాది కోతి అని చెప్పుకోవచ్చు. అధికారిక ఆస్ట్రలోపిథెసీన్ లేదా ఆస్ట్రలోపిత్. ఇది  హోమినిన్లలో ఒక జీనస్. పాలియోంటాలజీ, పురావస్తు శాస్త్రాల ఆధారాలను బట్టి, ఆస్ట్రలోపిథెకస్ జీనస్ 40 లక్షల సంవత్సరాల కిందట తూర్పు ఆఫ్రికాలో ఉద్భవించి, ఆఫ్రికా ఖండమంతటా వ్యాపించి, చివరికి 20 లక్షల సంవత్సరాల క్రితం అంతరించిపోయింది. ఈ జీనస్‌కు నేరుగా ఆపాదించిన సమూహాల్లో ఇప్పటికి ఏదీ జీవించి లేనప్పటికీ, ఆస్ట్రలోపిథెకస్ అక్షరాలా అంతరించిపోయినట్లు అని ...

                                               

ఆస్ట్రలోపిథెకస్ అనామెన్సిస్

ఆస్ట్రలోపిథెకస్ అనామెన్సిస్ అనేది హోమినిని తెగకు చెందిన జాతి. ఇది సుమారు 42, 38 లక్షల సంవత్సరాల క్రితాల మధ్య నివసించింది ఇది ఆస్ట్రలోపిథెకస్ జాతుల్లో కెల్లా అత్యంత పురాతనమైనది. కెన్యా, ఇథియోపియాల్లో 20 మందికి పైగా వ్యక్తులకు చెందిన దాదాపు వంద శిలాజాలు దొరికాయి. ఈ వంశంలోనే ఎ. అఫారెన్సిస్ కూడా ఉద్భవించిందని సాధారణంగా అంగీకరించే విషయం. అయితే, ఎ. అనామెన్సిస్, ఎ. అఫారెన్సిస్ లు ఒకే కాలంలో జీవించినట్లు తెలుస్తోంది. ఆధునిక మానవులకు దారితీసిన వంశం ఈ రెంటిలో దేన్నుండి ఉద్భవించిందనే అంశం ఇంకా తేలలేదు. శిలాజ ఆధారాల ప్రకారం, తుర్కానా బేసిన్లోని మొట్టమొదటి హోమినిన్ జాతి ఆస్ట్రలోపిథెకస్ అనామెన్సిస్ అని ...

                                               

ఆస్ట్రలోపిథెకస్ అఫారెన్సిస్

ఆస్ట్రలోపిథెకస్ అఫారెన్సిస్ ఆఫ్రికాలో 39, 29 లక్షల సంవత్సరాల క్రితాల మధ్య నివసించి, అంతరించిపోయిన హోమినిన్. దీని కంటే తరువాతి కాలానికి చెందిన ఆస్ట్రలోపిథెకస్ ఆఫ్రికానస్ లాగానే ఇది కూడా పీలగా ఉంటుంది. ఎ. అఫారెన్సిస్ హోమో జాతికి ప్రత్యక్ష పూర్వీకుడు గానీ, లేదా పూర్వీకుడికి దగ్గరి బంధువుగానీ అయి ఉంటుంది. ఆ కాలానికి చెందిన ఇతర ప్రైమేట్ల కంటే కూడా అఫారెన్సిస్‌కే హోమో జీనస్‌తో ఎక్కువ సంబంధం ఉందని భావిస్తారు. కొంతమంది పరిశోధకులు ఆస్ట్ర. అఫారెన్సిస్‌ను పారాంత్రోపస్ జీనస్ లోకి చేరుస్తారు. డొనాల్డ్ జోహన్సన్ కనుగొన్న లూసీ 32 లక్షల సంవత్సరాల నాటిది అనే పాక్షిక అస్థిపంజరం ఈ జాతి లోని అత్యంత ప్రసిద్ధ శి ...

                                               

ఆస్ట్రలోపిథెకస్ ఆఫ్రికానస్

ఆస్ట్రలోపిథెకస్ ఆఫ్రికానస్, ఆస్ట్రలోపిథెసీన్ జెనస్ కు చెందిన అంతరించిపోయిన జాతి. పాత ఆస్ట్రలోపిథెకస్ అఫారెన్సిస్‌ లాగానే ఎ. ఆఫ్రికానస్ కూడా సున్నితమైన శారీరిక నిర్మాణం కలిగి ఉండేది. దీన్ని ఆధునిక మానవులకు ప్రత్యక్ష పూర్వీకుడిగా భావించారు. A. ఆఫ్రికానస్‌లో ఆధునిక మానవుల పోలికలు బాగా ఎక్కువ గాను, ఎ. అఫారెన్సిస్ పోలికలు బాగా తక్కువ గానూ ఉంటాయి. దీని పుర్రె మానవుని పుర్రె లాగా ఉండి, పెద్దదైన మెదడు ఉండేందుకు అనుకూలంగా ఉండేది. ఎ. ఆఫ్రికానస్ ఆఫ్రికా దక్షిణ ప్రాంతంలోని నాలుగు ప్రదేశాల్లో మాత్రమే కనుగొన్నారు. అవి: టౌంగ్, స్టెర్క్‌ఫోంటైన్, మకాపాన్స్‌గాట్, గ్లాడిస్వేల్. 2019 జనవరిలో, ఆస్ట్రలోపిథెకస్ ...

                                               

ఆస్ట్రలోపిథెకస్ గార్హి

ఆస్ట్రలోపిథెకస్ గార్హి 25 లక్షల సంవత్సరాల క్రితం నాటి గ్రెసైల్ ఆస్ట్రలోపిథెసిన్ జాతి. దీని శిలాజాలను 1996 లో బెర్హేన్ అస్ఫా, టిమ్ వైట్ నేతృత్వంలోని పాలియోంటాలజిస్ట్ పరిశోధన బృందం కనుగొంది. ఆస్ట్రలోపిథెకస్, హోమో ప్రజాతుల మధ్య పరివర్తన దశకు గార్హి ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు అవశేషాలు సూచిస్తున్నాయి.