Топ-100
Back

ⓘ హెచ్ సంస్కృతి సమాధులు. సంస్కృతి భారత ఉపఖండంలోని ఉత్తర భాగంలో పంజాబు ప్రాంతంలో కాంస్య యుగం సంస్కృతి హెచ్ సమాధుల సంస్కృతి అని కూడా పేర్కొన్నారు. ఇది హరప్పా నాగరిక ..
                                               

ఉదయ్‌పూర్ (రాజస్థాన్)

ఉదయ్‌పూర్, పశ్చిమ భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రం, ఉదయ్‌పూర్ జిల్లాకు చెందిన ఒక నగరం.దీనిని సిటీ ఆఫ్ సన్ సెట్, సరస్సుల నగరం అని కూడా పిలుస్తారు. స్థానికులు దీనిని శ్వేత నగరం అనికూడా అంటారు.ఇది ఉదయ్‌పూర్ జిల్లాకు, పరిపాలనా ప్రధానకేంద్రం.

                                               

కరీంనగర్ జిల్లా

జిల్లాకు ఉత్తరాన ఆదిలాబాదు జిల్లా, ఈశాన్యమున మహారాష్ట్ర, చత్తీసుగఢ్ రాష్ట్రాలు, దక్షిణాన వరంగల్ జిల్లా, ఆగ్నేయాన మెదక్ జిల్లా, పశ్చిమాన నిజామాబాదు జిల్లా.

                                               

మదురై

మదురై దక్షిణ తమిళనాడులోని నగరము. అదే పేరుగల జిల్లాకు కేంద్రము. మదురై హిందూ ఆధ్యాత్మిక కేంద్రము. ఇది వైగై నదీ తీరాన ఉంది. తమిళనాడులో మదురై పెద్దనగరాలలో మూడవ శ్రేణిలో ఉంది. 2001 జనాభా గణాంకాలను ప్రకారం మదురై నగర జనాభా 12.00.000. మదురై ప్రపంచంలోని పురాతనకాల నివాస నగరాలలో ఒకటి. మదురై నగరం మదురై జిల్లా కేంద్రంలో పాండ్యులు ముందుగా కొర్కైని రాజధానిగా చేసుకుని పాలించారు. తరువాత పాండ్యులు నెడుంజళియన్ కాలంలో కూడల్ నగరానికి వారి రాజధానిని మార్చుకున్నారు. ఆ నగరమే ప్రస్తుత రాజధాని. మదుర నాయక మహారాజు చేత నిర్మించబడిన మీనాక్షీ కోవెలకు మదురై ప్రసిద్ధి చెంది ఉంది. ద్రవిడ సంప్రదాయాన్ని ప్రతిబింబింస్తున్న మద ...

                                               

శాకాలు

శాకా, సాకా, షాకా, సక ఉత్తర, తూర్పు ఐరోపా సోపానవ్యవసాయక్షేత్రాలు. తారిం బేసిన్లలో చారిత్రాత్మకంగా నివసించే సంచార ఇరానియను ప్రజల సమూహం. వీరు ఐరోపా సోపానవ్యవసాయక్షేత్రాలు, తారిం నదీముఖద్వారం ప్రాంతాలలో నివసించిన సంచార ఇరానియను ప్రజలు అని భావిస్తున్నారు. దగ్గరి సంబంధం ఉన్నప్పటికీ శాకాలు పాంటికు సిథియన్సు సోపాన వ్యవసాయక్షేత్రాలు, అరలు సముద్ర ప్రాంతంలోని మసాగేటి నుండి వేరుచేయబడాలి. అయినప్పటికీ అవి విస్తృతమైన సిథియను సంస్కృతులలో భాగంగా ఉన్నాయి. సిథియన్ల మాదిరిగానే శాకాలు చివరికి మునుపటి ఆండ్రోనోవో సంస్కృతి నుండి ఉద్భవించారు. సిథియను భాషలలో భాగంగా వారి భాష ఏర్పడింది. శాకాలు ప్రముఖ పురావస్తు అవశేషా ...

                                               

భారతదేశంలో ఇస్లాం

భారతదేశంలో ఇస్లాం: భారతదేశంలో హిందూమతం తరువాత రెండవ స్థానంలో గలదు. 2007 గణాంకాల ప్రకారం, 13.4% ముస్లింలు గలరు. ప్రస్తుతం భారత్ లో ముస్లింలు ఇండోనేషియా, పాకిస్తాన్ ల తరువాత మూడవ స్థానంలో ఉన్నారు.

                                               

విజాపుర

విజాపుర జిల్లా కర్నాటక రాష్ట్రంలో భాగంగా ఉండేది. బీజాపుర నగరం జిల్లాకు కేంద్రంగా ఉంది. ఇది బెంగుళూరుకు 530 కి.మీ వాయవ్య దిశలో ఉంది. ఆదిల్ షా కాలంనాటి పలు స్మారక చిహ్నాలు అనేకం ఉన్నాయి. బిజ్జపూర విజాపుర కర్ణాటక రాష్ట్రానికి చెందిన జిల్లా. ఇది కర్ణాటకలో ఉత్తరం వైపున మహారాష్ట్ర సరిహద్దులో ఉంది. ఆదిల్‌షాహి వంశస్థులు నిర్మించిన అనేక చారిత్రక కట్టడాలు జిల్లాలో ఉన్నాయి. ఈ జిల్లాలో 5 డివిజన్లు విజాపుర, బాగేవాడి, సింధగి, ఇండి, ముద్దెబిహాళ, బసవన బాగెవాడి ఉన్నాయి.

హెచ్ సంస్కృతి సమాధులు
                                     

ⓘ హెచ్ సంస్కృతి సమాధులు

సంస్కృతి భారత ఉపఖండంలోని ఉత్తర భాగంలో పంజాబు ప్రాంతంలో కాంస్య యుగం సంస్కృతి హెచ్ సమాధుల సంస్కృతి అని కూడా పేర్కొన్నారు. ఇది హరప్పా నాగరికత చివరి దశ ప్రాంతీయ రూపం (సింధు జుకరు సంస్కృతి, గుజరాతు రంగపూరు సంస్కృతి.

                                     

1. ఆరంభం

హెచ్ సంస్కృతి సమాధులు ప్రస్తుత భారతదేశం, పాకిస్తాన్లలో పంజాబు పరిసరప్రాంతంలలో ఉంది. హరప్పా వద్ద లభించిన స్మశానవాటికకు "ఏరియా హెచ్" అని పేరు పెట్టారు. సంస్కృతి అవశేషాలు క్రీ.పూ 1900 నుండి క్రీ.పూ 1300 చెందినవని అంచనావేసారు.

రఫీకు మొఘలు అభిప్రాయం ఆధారంగా క్రీస్తుపూర్వం 1700 లో సింధు లోయ నాగరికత ఉత్తర భాగంలో హెచ్ సంస్కృతి సమాధుల సంస్కృతి అభివృద్ధి చెందింది. ఇది పంజాబు భూభాగంలో ఉంది. సింధు లోయ సంప్రదాయం స్థానికీకరణ యుగంలో లేదా హరప్పా దశ చివరి" లో అభివృద్ధి చెందిన మూడు సాంస్కృతిక దశలలో ఒకటి.

కెనోయెరు అభిప్రాయం ఆధారంగా హెచ్ సమాధుల సంస్కృతి "మునుపటి హరప్పా దశ నమూనా నుండి స్థిరపడిన సంస్థలో మార్పును మాత్రమే ప్రతిబింబిస్తుంది. సాంస్కృతిక ముగింపు కాదు. పట్టణ క్షయం, విదేశీయుల ఆక్రమణ, ప్రాంతాన్ని వదిలివేయడం కాదు. ఇవన్నీ గతంలో ఉన్నాయని సూచించబడింది."

కెన్నెడీ, మల్లోరీ & ఆడంసు అభిప్రాయం ఆధారంగా హెచ్ సమాధుల సంస్కృతి మునుపటి హరప్ప జనాభాతో "స్పష్టమైన జీవసంబంధమైన అనుబంధాలను చూపిస్తుంది.

హెచ్ సంస్కృతి సమాధుల కొన్ని లక్షణాలు స్వాతు సంస్కృతితో సంబంధం కలిగి ఉన్నాయి. ఇది భారత ఉపఖండం వైపు ఇండో-ఆర్య ఉద్యమానికి సాక్ష్యంగా పరిగణించబడుతుంది. పార్పోలా అభిప్రాయం ఆధారంగా హెచ్ సంస్కృతి క్రీస్తుపూర్వం 1900 నాటి నుండి ఇండో-ఆర్య వలసల మొదటి తరంగాన్ని సూచిస్తుంది. వారు తరువాత క్రీ.పూ. 1700 - 1400 లో పంజాబు ప్రాంతానికి వలస కొనసాగించారు. కొచ్చరు అభిప్రాయం ఆధారంగా 4 వ స్వాతు పంజాబులో హరప్పా హెచ్ సమాధులు క్రీ.పూ. 2000-1800 స్థాపించాడాని, 5 వ స్వాతు ఋగ్వేద ఇండో-ఆర్యన్లు తరువాత హెచ్ సమాధుల సంస్కృతికి చెందిన ప్రజలకు నాయకత్వం వహించిన తరువాత చిత్రిత బూడిదవర్ణ పాత్రల సంస్కృతికి చెందిన ప్రజలు క్రీ.పూ 1400 ఉద్భవించారని భావిస్తున్నారు.

గాంధార సమాధి సంస్కృతి, ఓచరు కలర్డు కుమ్మరి సంస్కృతితో కలిసి, హెచ్ సమాధుల సంస్కృతిని కొంతమంది పరిశోధకులు వేద నాగరికత ఏర్పడటానికి ఒక మూలకారకంగా భావిస్తారు.

                                     

2. ప్రధానాంశాలు

ఈ సంస్కృతి ప్రత్యేక లక్షణాలు:

  • భవననిర్మాణం కొరకు మట్టి ఇటుకను ఉపయోగించడం కొనసాగింది.
  • తూర్పున స్థావరాల విస్తరణ.
  • ఎర్రటి కుండలు, జింకలు, నెమళ్ళు మొదలైన వాటి బొమ్మలతో నలుపు రంగులో చిత్రాలు చిత్రించబడ్డాయి. సూర్యుడు, నక్షత్ర మూలాంశాలు, మునుపటి కాలానికి భిన్నమైన ఉపరితల శైలితో ఇవి చిత్రించబడ్డాయి.
  • మానవ అవశేషాల దహన సంస్కారం. మానవులు మరణించిన తరువాత అస్థులను ఖననంచేసే ప్రక్రియలో చిత్రించిన కుండలలో ఉంచారు. మృతదేహాలను చెక్క శవపేటికలలో ఖననం చేసిన సింధు నాగరికతకు ఇది పూర్తిగా భిన్నమైనది. పాత్రలలో ఖననం చేసే సంస్కృతి, "సమాధి అస్థిపంజరాలు" దాదాపు సమకాలీనమైనవి.
  • సింధు నాగరికత విస్తృత వాణిజ్యం స్పష్టమైన విచ్ఛిన్నం, సముద్రపు షెల్సు వంటి పదార్థాలు తరువాత ఉపయోగించబడలేదు.
  • వరి ప్రధాన పంటగా మారింది.

హెచ్ సమాధులు అంత్యక్రియల కుర్చీల మీద చిత్రీకరించబడిన కొన్ని చిత్రాలు వేద పురాణాల అంశాల ద్వారా వివరించబడ్డాయి: ఉదాహరణకు బోలు శరీరాలతో ఉన్న నెమళ్ళు, లోపల ఒక చిన్న మానవ రూపం, ఇది చనిపోయినవారి ఆత్మలుగా వ్యాఖ్యానించబడింది. ఒక మట్టిదిబ్బ యమధర్మరాజు మట్టిదిబ్గగా చూడవచ్చు. ఈ కాలంలో కొత్మత విశ్వాసాల ప్రవేశాన్ని ఇది సూచిస్తుంది. కాని హెచ్ సమాధుల సంస్కృతికి చెందిన ప్రజలు హరప్పా నగరాలను నాశనం చేసేవారు అనే ఊహకు పురావస్తు ఆధారాలు మద్దతు ఇవ్వవు.

                                     

3. పురాతత్వపరిశోధనలు

పురాతన భారతీయ శ్మశానవాటిక సంస్కృతిలో హెచ్ సమాధుల సంస్కృతి ఆధారపూర్వకంగా ధృవీకరించబడిన మొదటి సంస్కృతిగా గుర్తించబడుతుంది. ఇది గతంలో వేదాలలో వివరించబడింది. ఋగ్వేదంలో ఋక్కు 10.15.14 లో ఉద్భవిస్తున్న ఈ అభ్యాసం గురించిన సూచన ఉంది. ఇక్కడ పూర్వీకులు "దహన సంస్కారాలు అగ్నిదగ్ధా-, దహించబడని అనాగ్నిదగ్ధ-" విధానాలలో ఖననం చేయబడ్డారన్న సూచన ఉంది.