Топ-100
Back

ⓘ పెందుర్తి, విశాఖపట్నం జిల్లా, పెందుర్తి మండలానికి చెందిన గ్రామం.ఇది పెందుర్తిలోని పౌర సౌకర్యాలకు బాధ్యత వహించే గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో ..




పెందుర్తి
                                     

ⓘ పెందుర్తి

పెందుర్తి, విశాఖపట్నం జిల్లా, పెందుర్తి మండలానికి చెందిన గ్రామం.ఇది పెందుర్తిలోని పౌర సౌకర్యాలకు బాధ్యత వహించే గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉంది. ఈ ప్రాంతాన్ని జిల్లాలో ప్రధాన నివాస, వాణిజ్య ప్రాంతంగా పరిగణిస్తారు.పెందుర్తి మండలానికి,శాసనసభ నియోజక వర్గానికి ప్రధాన కేంద్రం.పెందుర్తి విశాఖపట్నం లోకసభ నియోజకవర్గంలోని, పెందుర్తి శాసనసభ నియోజకవర్గం కింద నిర్వహించబడుతుంది.ఇది విశాఖపట్నం రెవెన్యూ డివిజను పరిధికి చెందిన ప్రాంతం.

                                     

1. భౌగోళికం

పెందుర్తి విశాఖపట్నం నగరానికి పశ్చిమ దిశ అంచున ఉంది.ఇది 17.8333 ° N 83.2000 ° E. అక్షాంశ,రేఖాంశాల వద్ద ఉంది.సముద్రమట్టానికి సగటు ఎత్తు 22 మీటర్లు 75 అడుగులు ఉంది

                                     

2. రవాణా సౌకర్యం

పెందుర్తి రైల్వే స్టేషన్ హౌరా-చెన్నై మెయిన్‌లైన్‌లో ఉంది. కొన్ని ప్యాసింజర్ రైళ్లు ఈ స్టేషన్‌లో ఆగుతాయి.ఇది వైజాగ్ నగరం నుండి BRTS బస్ రాపిడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టం కారిడార్ కలిగి ఉంది. ప్రధాన రహదారి 200 అడుగుల వెడల్పుతో కలిగి ఉంది.ఇక్కడ నుండి ప్రతి ముఖ్యమైన ప్రతి ప్రదేశాలకు ఆంధ్రప్రదేశ్ రోడ్ రవాణా సంస్థ బస్సులు నడుపుతుంది.