Топ-100
Back

ⓘ బల్లాడ్ ఆఫ్ ఎ సోల్జర్, 1959 సినిమా. బల్లాడ్ ఆఫ్ ఎ సోల్జర్ 1959, డిసెంబర్ 1న విడుదలైన రష్యా చలనచిత్రం. గ్రిగోరి చుక్రై దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వ్లాదిమిర్ ఇవ ..




బల్లాడ్ ఆఫ్ ఎ సోల్జర్ (1959 సినిమా)
                                     

ⓘ బల్లాడ్ ఆఫ్ ఎ సోల్జర్ (1959 సినిమా)

బల్లాడ్ ఆఫ్ ఎ సోల్జర్ 1959, డిసెంబర్ 1న విడుదలైన రష్యా చలనచిత్రం. గ్రిగోరి చుక్రై దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వ్లాదిమిర్ ఇవాషోవ్,జున్నా ప్రోఖోరెంకో నటించారు. విమర్శకుల ప్రసంశలతోపాటు పలు అవార్డులను గెలుచుకున్న ఈ చిత్రం, ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే విభాగంలో ఆస్కార్ అవార్డుకు నామినేట్ చేయబడింది.

                                     

1. సాంకేతికవర్గం

  • ఛాయాగ్రహణం: వ్లాదిమిర్ నికోలయెవ్, ఎరా సవిలేవా
  • సంగీతం: మిఖాయిల్ జివ్
  • నిర్మాణ సంస్థ: మోస్ ఫిల్మ్
  • రచన: వాలెంటిన్ యెజోవ్, గ్రిగోరి చుక్రై
  • నిర్మాత: ఎం. చెర్నోవా
  • దర్శకత్వం: గ్రిగోరి చుక్రై
  • కూర్పు: మరియా టిమ్ఫేవీవా
                                     

2. విడుదల - స్పందన

1959, డిసెంబర్ 1న విడుదలైన ఈ చిత్రం, సోవియట్ యూనియన్ లో 30.1 మిలియన్ టికెట్లు అమ్ముడయ్యాయి. ఈ చిత్రం సోవియట్-అమెరికన్ చలన చిత్ర మార్పిడిలో భాగంగా 1960లో యునైటెడ్ స్టేట్స్ లో విడుదల అయింది.

                                     

3. అవార్డులు

  • 1961లో ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే విభాగంలో ఆస్కార్ అవార్డుకు నామినేషన్
  • 1960, 5వ శాన్ ఫ్రాన్సిస్కో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ - ఉత్తమ చిత్రం, దర్శకుడు గోల్డెన్ గేట్ అవార్డులు
  • 1961లో ఉత్తమ యూరోపియన్ చలనచిత్రంగా బోడిల్ అవార్డు
  • 1961లో ఉత్తమ చలనచిత్రంగా బి.ఎ.ఎఫ్.టి.ఎ. అవార్డు
  • 1960 కేన్స్ ఫిలిం ఫెస్టివల్ - ప్రత్యేక జ్యూరీ బహుమతి
                                     
  • కళ త మక గ వ జయ స ధ చ య వ ట ల చప వ ద క ర న స ఆర ఫ ల య గ బల ల డ ఆఫ ఎ స ల జర 1960 - 1970 లల స వ యట చలన చ త ర లల అధ కమ న కళ త మక శ ల ల అభ వ ద ధ

Users also searched:

...
...
...