Топ-100
Back

ⓘ ది గుడ్ ఎర్త్, 1937 సినిమా. ది గుడ్ ఎర్త్ 1937, జనవరి 29న సిడ్నీ ఫ్రాంక్లిన్ దర్శకత్వంలో విడుదలైన అమెరికా చలనచిత్రం. నోబెల్ బహుమతి గ్రహీత, అమెరికన్ నవలా రచయిత్ర ..
ది గుడ్ ఎర్త్ (1937 సినిమా)
                                     

ⓘ ది గుడ్ ఎర్త్ (1937 సినిమా)

ది గుడ్ ఎర్త్ 1937, జనవరి 29న సిడ్నీ ఫ్రాంక్లిన్ దర్శకత్వంలో విడుదలైన అమెరికా చలనచిత్రం. నోబెల్ బహుమతి గ్రహీత, అమెరికన్ నవలా రచయిత్రి పెర్ల్ ఎస్.బక్ 1931లో రాసిన ది గుడ్ ఎర్త్ అనే నవల ఆధారంగా రూపొందించబడిన ఈ చిత్రంలో పాల్ ముని, లూయిస్ లైనర్ నటించారు. లాస్ ఏంజిల్స్ లోని ఎలిజెంట్ కార్తే సర్కిల్ థియేటర్ లో ప్రీమియర్ షో వేయబడింది.

ఎన్ని కష్టాలు వచ్చినా రైతు తన కుటుంబాన్ని ఎంతగా ప్రేమిస్తాడో, తనకున్న కొద్ది భూమిని కాపాడుకునేందుకు ఎంతగా ప్రయత్నిస్తాడో ఈ చిత్రంలో చూపించబడింది.

                                     

1. కథ

వాంగ్ లుంగ్, ఓలాన్ లు భార్యాభర్తలు. చైనాలోని ఒక కుగ్రామంలో సాధారణ రైతు కుటుంబం వారిది. తమ జీవనాధారమైన వ్యవసాయం చేసుకుంటూ ఆనందంగా జీవిస్తున్న సమయంలో అనుకోకుండా కరువు వస్తుంది. బతుకుతెరువు కోసం పట్నానికి వలస వస్తారు. అక్కడ ఎన్నో కష్టాలు పడి, పిల్లలకోసం భిక్షాటన మొదలు పెడతారు. కొన్నిరోజుల తరువాత ఆ కుటుంబం మళ్ళీ గ్రామానికి తిరిగి వస్తుంది. అదేసమయంలో మిడతలదండు వీరి పొలంపై దాడి చేస్తుంది. వారు ఆ దాడిని ఎదుర్కొంటారు. కొన్నిరోజులకు ఓలాన్ జబ్బుతో మంచాన పడుతుంది. వాంగ్ లుంగ్ తన పొలాన్ని అమ్మి ఓలాన్ కు నయం చేయించాలనుకుంటాడు. పొలం ఉండడం చాలా ముఖ్యమని, తనకోసం పొలం అమ్మొద్దని చెప్పి ఓలాన్ మరణిస్తుంది.

                                     

2. సాంకేతికవర్గం

 • ఆధారం: పెర్ల్ ఎస్.బక్ 1931లో రాసిన ది గుడ్ ఎర్త్ అనే నవల
 • ఛాయాగ్రహణం: కార్ల్ ఫ్రూయిండ్
 • పంపిణీదారు: మెట్రో-గోల్డ్విన్-మేయర్
 • సంగీతం: హెర్బర్ట్ స్తోథార్ట్,
 • దర్శకత్వం: సిడ్నీ ఫ్రాంక్లిన్,
 • స్క్రీన్ ప్లే: టాల్బోట్ జెన్నింగ్స్, టెస్ సిల్సింజర్, క్లాడైన్ వెస్ట్
 • నిర్మాత: ఇర్వింగ్ థల్బర్గ్, ఆల్బర్ట్ లెవిన్
 • కూర్పు: బాసిల్ వ్రాంగెల్
                                     

3. చిత్రవిశేషాలు

 • ఆ వస్తుసంపదతో కాలిఫోర్నియాలోని 500 ఎకరాల శాన్ ఫెర్నాండో లోయను చైనాలోని పల్లెప్రాంతంగా మార్చి, అక్కడ పొలాలను, నీటిపారుదల విధానాలను సృష్టించారు. అది ప్రపంచంలోనే అతి పెద్ద సెట్ గా తయారయింది.
 • ఇందులోని సాంప్రదాయ బద్ధంగా కనిపించే చైనా రైతు మహిళగా నటించడం కోసం ఆస్ట్రియాకు చెందిన లూయిస్ రైనర్ ను తీసుకున్నారు.
 • చిత్ర నిర్మాణంకోసం చైనా వెళ్ళిన చిత్రబృందం 20 లక్షల అడుగుల ఫిల్మ్ ను, 18 టన్నుల ఇతర వస్తుసంపదను అమెరికాకు తీసుకొచ్చింది.

అవార్డులు

ఈ చిత్రం ఉత్తమనటి లూయిస్ లైనర్,ఉత్తమ ఛాయాగ్రహణం కార్ల్ ఫ్రూయిండ్ విభాగాల్లో ఆస్కార్ అవార్డులను అందుకోవడమేకాకుండా ఉత్తమచిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ ఎడిటర్ విభాగాల్లో నామినేట్ చేయబడింది.

                                     
 • వ స త త గ మ క ర వ వ ర డ య ర ల స కర య ల ద శ య ఉపగ రహ వ యవస థ 3 ఎర త స ట షన ల ఉన న య ఆధ ర త చ ల అత య త అధ న తన ట ల కమ య న క షన ల వ యవస థ దక ష ణ

Users also searched:

...
...
...