Топ-100
Back

ⓘ మోడరన్ టైమ్స్, 1936 సినిమా. మోడరన్ టైమ్స్ 1936, ఫిబ్రవరి 5న విడుదలైన అమెరికా హాస్య చలనచిత్రం. చార్లీ చాప్లిన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రపంచ సినీచరిత్రలో మూ ..




మోడరన్ టైమ్స్ (1936 సినిమా)
                                     

ⓘ మోడరన్ టైమ్స్ (1936 సినిమా)

మోడరన్ టైమ్స్ 1936, ఫిబ్రవరి 5న విడుదలైన అమెరికా హాస్య చలనచిత్రం. చార్లీ చాప్లిన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రపంచ సినీచరిత్రలో మూకీచిత్రాలకు వీడ్కోలు పలికిన చిత్రంగా నిలిచింది. ఇందులో చార్లీ చాప్లిన్, పైలెట్ట గొడ్దార్డ్, హెన్రీ బెర్గ్మాన్, టినీ శాండ్ఫోర్డ్, చెస్టర్ కాంక్లిన్ తదితరులు నటించారు.

                                     

1. కథా నేపథ్యం

కర్మాగారాల్లో కార్మికులను ఎలా పనిచేయించుకుంటారో చూయించిన చిత్రం ఇది. మనిషి జీవితంలో ఆహారం, డబ్బు, ప్రేమ చాలా ముఖ్యమని, వాటికోసం ఆ మనిషి పడే తపనను సినిమాలో వ్యంగ్యంగా చూపించబడింది. యాంత్రిక జీవనంలో మనిషి పిచ్చివాడిలా మారే పరిస్థితి వస్తుంది. జీవితాన్ని ప్రామాణికం చేయడానికి జరుగుతున్న ప్రయత్నాల గురించి, మనుషులను మరలుగా మార్చడానికి జరుగుతున్న పద్ధతుల గురించి తనకు తోచినవిధంగా చార్లీ చాప్లిన్ చెప్పాడు.

                                     

2. సాంకేతికవర్గం

  • పంపిణీదారు: యునైటెడ్ ఆర్టిస్ట్స్
  • ఛాయాగ్రహణం: ఇరా హెచ్. మోర్గాన్, రోలాండ్ టోటెరోహ్
  • రచన, నిర్మాత, సంగీతం, దర్శకత్వం: చార్లీ చాప్లిన్
  • కూర్పు: విల్లార్డ్ నికో
                                     

3. చిత్ర విశేషాలు

  • అమెరికన్ ఫిల్మ్ ఇన్సిట్యూట్ వారిచే 1998లో అమెరికన్ ఫిల్మ్ ఇన్సిట్యూట్ వారి 100 సంవత్సరాలు.100 చిత్రాలు విభాగంలో 81వ చిత్రంగా, 2000లో అమెరికన్ ఫిల్మ్ ఇన్సిట్యూట్ వారి 100 సంవత్సరాలు. 100 హాస్య చిత్రాలు సినిమాలు విభాగంలో 33వ చిత్రంగా, 2007లో అమెరికన్ ఫిల్మ్ ఇన్సిట్యూట్ వారి 100 సంవత్సరాలు.100 సినిమాలు 10వ వార్షికోత్సవ సంచిక విభాగంలో 78వ చిత్రంగా గుర్తించబడింది.
  • ఈ చిత్రంకోసం చార్లీ సంవత్సరంపాటు స్క్రిప్టును తయారుచేసుకొని, 11 నెలలపాటు చిత్రీకరించాడు.
  • 1934, అక్టోబర్ 11న చిత్రీకరణ ప్రారంభమై, 1935, ఆగష్టు 30న ముగిసింది.
  • 2003లో జరిగిన కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించబడింది.
  • సినిమాలో సంభాషణలు పెట్టాలనుకున్న చార్లీ అందుకోసం స్క్రీన్ ప్లే, మాటలను కూడా రాసుకున్నాడు. కానీ, చివరకు మూకీచిత్రంగానే రూపొందించాడు.
  • 1935-36లో బ్రిటీష్ బాక్సాఫీస్ వద్ద అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రంగా నిలిచింది.
                                     

4. ఇతర లంకెలు

  • Movie stills and bibliography
  • ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో మోడరన్ టైమ్స్
  • Tour of Modern Times filming locations
  • మోడరన్ టైమ్స్ on YouTube
  • Filmsite మోడరన్ టైమ్స్ పేజీ