Топ-100
Back

ⓘ ది పబ్లిక్ ఎనిమీ, 1931 సినిమా. ది పబ్లిక్ ఎనిమీ 1931, ఏప్రిల్ 23న విడుదలైన అమెరికా క్రైమ్ సినిమా. వార్నర్ బ్రదర్స్ నిర్మాణంలో విలియం వెల్‌మన్ దర్శకత్వంలో జేమ్స్ ..




ది పబ్లిక్ ఎనిమీ (1931 సినిమా)
                                     

ⓘ ది పబ్లిక్ ఎనిమీ (1931 సినిమా)

ది పబ్లిక్ ఎనిమీ 1931, ఏప్రిల్ 23న విడుదలైన అమెరికా క్రైమ్ సినిమా. వార్నర్ బ్రదర్స్ నిర్మాణంలో విలియం వెల్‌మన్ దర్శకత్వంలో జేమ్స్ కేనీ, జీన్ హార్లో ఎడ్వర్డ్ వుడ్స్, జోన్ బ్లాండెల్ తదితరులు నటించిన ఈ చిత్రం మరెన్నో క్రైమ్ చిత్రాలకు మోడల్ గా నిలిచింది.

                                     

1. కథ

చికాగో అమెరికా నగరంలోని మురికివాడల్లో పెరిగిన ఐరీష్ కు చెందిన టామ్ పవర్స్ జేమ్స్ కేనీ, మాట్ డోయల్ ఎడ్వర్డ్ వుడ్స్ ఇద్దరు ఒక దుకాణంలో దొంగతనం చేస్తారు. పియానో ప్లేయర్ పుట్టినోస్ వాళ్ళిద్దరికి తన ఇంట్లో ఆశ్రయం కల్పించి గన్స్ ఇస్తాడు. వాటితో మొదటగా ఒక పోలీసును చంపుతారు. అలా వారు అనేక నేరాలకు పాల్పడతూ, మిగతా గ్యాంగ్‌లను మించిపోతారు. అది సహించని గ్యాంగ్‌స్టర్స్ టామ్, మాట్ లపై దాడికి దిగుతారు, వారితో జరిగిన పోరాటంలో వాళ్ళిద్దరు మరణిస్తారు.

                                     

2. సాంకేతికవర్గం

  • ఛాయాగ్రహణం: దేవరెక్స్ జెన్నింగ్స్
  • స్క్రీన్ ప్లే: హార్వే ఎఫ్. థే
  • దర్శకత్వం: విలియం వెల్‌మన్
  • కూర్పు: ఎడ్వర్డ్ మైఖేల్ మెక్డెర్మాట్
  • రచన: జాన్ బ్రైట్, క్యూబెక్ గ్లాస్మోన్
  • నిర్మాత: డారైల్ ఎఫ్. జనక్
  • ఆధారం: జాన్ బ్రైట్, క్యూబెక్ గ్లాస్మోన్ రాసిన బీర్, బ్లడ్ నవల
  • నిర్మాణ సంస్థ, పంపిణీదారు: వార్నర్ బ్రదర్స్
                                     

3. చిత్ర విశేషాలు

  • ఈ చిత్రంలో అనేక హత్యలు ఉన్నా తెరమీర మాత్రం ప్రేక్షకులకు ఒక హత్యనే కనిపిస్తుంది. మిగతా హత్యలు జరుగుతున్నప్పుడు చీకట్లని చూపించడం, తుపాకీ గొట్టాలనుండి వచ్చే కాల్పుల మెరుపుల కనిపించడం,శబ్ధాలు వినిపించడం వంటివి ఉపయోగించడం జరిగింది.
  • టామ్, అతని ప్రియురాలు మధ్య జరిగే సన్నివేశంలో టేబుల్ మీద ఉన్న బౌల్ తో ఆమె చెంపమీద కొడుతాడు. అది హాలీవుడ్ సినీరంగంలో నేటివరకు కూడా మరిచిపోలేని విధంగా ఉంటుంది.
  • ఈ చిత్రం స్ఫూర్తితో అనేక క్రైమ్ చిత్రాలు రావడంతో అమెరికాలోని క్రైస్తవ మత సంస్థలు నిరసలను చేశాయి. దాంతో కథలను మార్చి విజయమెప్పుడూ చట్టానిదేనన్న నేపథ్యంలో సినిమాలు తీశారు.
                                     

4. గుర్తింపులు

2008లో అమెరికన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ వారి అమెరికన్ చలన చిత్రాలలో ఉత్తమ పది క్లాస్ చిత్రాలు విభాగంలో టాప్ 10 జాబితాలలో ఒకటిగా నిలిచింది. గ్యాంగ్‌స్టర్స్ జానర్ విభాగంలో ఎనమిదవ చిత్రంగా నిలిచింది.

Users also searched:

...
...
...