Топ-100
Back

ⓘ డ్రాకులా, 1931 సినిమా. డ్రాకులా 1931, ఫిబ్రవరిలో విడుదలైన అమెరికా హర్రర్ సినిమా. యూనివర్సల్ పిక్చర్స్ నిర్మాణంలో టాడ్ బ్రౌంనింగ్ దర్శకత్వంలో బెలా లుగోసీ, హెలెన్ ..




డ్రాకులా (1931 సినిమా)
                                     

ⓘ డ్రాకులా (1931 సినిమా)

డ్రాకులా 1931, ఫిబ్రవరిలో విడుదలైన అమెరికా హర్రర్ సినిమా. యూనివర్సల్ పిక్చర్స్ నిర్మాణంలో టాడ్ బ్రౌంనింగ్ దర్శకత్వంలో బెలా లుగోసీ, హెలెన్ ఛాండ్లర్, డేవిడ్ మేనర్స్, డ్వైట్ ఫ్రే, ఎడ్వర్డ్ వాన్ స్లోన్ తదితరులు నటించిన ఈ చిత్రం, హామిల్టన్ డీన్, జాన్ ఎల్. బాల్డెస్టన్ 1924లో రాసిన డ్రాకులా నాటకం ఆధారంగా రూపొందించబడింది. ఈ రెండింటికి బ్రిటీష్ అబ్రహం స్టోకర్ 1897లో రాసిన డ్రాకులా అనే నవల మాలం.

                                     

1. కథ

సాయంత్రం సమయంలో ఒక గుర్రపు బండిలో రెన్‌ఫీల్డ్ అనే వ్యక్తి డ్రాకులా భవంతికి వెలుతాడు. 500 సంవత్సరాలుగా ఆ భవనంలో రక్త పిశాచాలుగా ఉన్న డ్రాకులా, అతని ముగ్గురు భార్యలు అర్థరాత్రి శవ పేటికల్లోంచి లేచి రెన్‌ఫీల్డ్ ని చంపేసి అతని రక్తం తాగుతారు. అక్కడినుండి నౌకలో ఇంగ్లాండ్ కు వెళుతూ ఆ నౌకలోని వారందరిని చంపేస్తారు. ఇంగ్లాండ్ వెళ్ళిన తరువాత అక్కడున్న వాన్ హాల్సింగ్ అనే ప్రొఫెసర్ డ్రాకులాను రక్త పిశాచిగా గుర్తించడంతో డ్రాకులా ఆ ప్రొఫెసర్ ను చంపబోతాడు. అది చూసిన హాల్సింగ్ తన చేతిలోని శిలువ క్రాస్ ను డ్రాకులా ముందు చూపించగా, డ్రాకులా మాయం అవుతాడు.

                                     

2. సాంకేతికవర్గం

  • నిర్మాత: టాడ్ బ్రౌంనింగ్, కార్ల్ లెంమెల్, జూనియర్.
  • పంపిణీదారు: యూనివర్సల్ పిక్చర్స్
  • ఛాయాగ్రహణం: కార్ల్ ఫ్రాండ్
  • స్క్రీన్ ప్లే: గారెట్ ఫోర్ట్
  • దర్శకత్వం: టాడ్ బ్రౌంనింగ్
  • ఆధారం: టీష్ అబ్రహం బ్రామ్ స్టోకర్ 1897లో రాసిన డ్రాకులా అనే నవల, హామిల్టన్ డీన్, జాన్ ఎల్. బాల్డెస్టన్ 1924లో రాసిన డ్రాకులా నాటకం
  • కూర్పు: మిల్టన్ కార్టుత్, మారిస్ పివార్
                                     

3. చిత్రవిశేషాలు

  • ఈ సినిమాలో సంగీతం ఉపయోగించే వీలు ఉన్నప్పటికీ, చాలా సన్నివేశాల్లో సంగీతం పెట్టలేదు. సైలెన్స్, బ్లాక్ లండ్ వైట్ సినిమా ప్రేక్షకుల్ని మరింత భయపెడుతుందని యూనివర్సల్ పిక్చర్స్ వారి నమ్మకం.
  • బెలా లుగోసి మొదట 1927లో డ్రాకులా నాటకంలో ‘డ్రాకులా’గా నటించి, విజయవంతంగా 261 ప్రదర్శనలు ఇచ్చాడు.
  • 2017లో జరిగిన వేలంలో డ్రాకులా సినిమా పోస్టర్ $5.25.800 డాలర్లకు అమ్ముడుపోయింది.
  • ఈ చిత్రం విడుదలై విజయం సాధించిన తరువాత హాలివుడ్ లో ఇలాంటి చిత్రాల నిర్మాణం పెరిగింది.