Топ-100
Back

ⓘ ది జాజ్ సింగర్, 1927 సినిమా. ది జాజ్ సింగర్ 1927, అక్టోబర్ 8న విడుదలైన అమెరికా టాకీ చలనచిత్రం. అలాన్ క్రాస్‌లాండ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం, 354 మాటలతో ప్రపంచ ..




ది జాజ్ సింగర్ (1927 సినిమా)
                                     

ⓘ ది జాజ్ సింగర్ (1927 సినిమా)

ది జాజ్ సింగర్ 1927, అక్టోబర్ 8న విడుదలైన అమెరికా టాకీ చలనచిత్రం. అలాన్ క్రాస్‌లాండ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం, 354 మాటలతో ప్రపంచ చలనచిత్రరంగంలో తొలి టాకీ చిత్రంగా నిలిచింది. ఈ చిత్రంలో అల్ జోల్సన్, బాబీ గోర్డన్, మే మెక్ ఎవాయ్, వార్నర్ ఓలాండ్, యూజీనీ బెసెరర్ తదితరులు నటించారు.

                                     

1. కథ

యూదు మత గురువు వార్నర్ ఓలాండ్ తనలాగే తన కొడుకు అల్ జోల్సన్ కూడా మతానికే కట్టుబడివుండాలనుకుంటాడు. అందుకు విరుద్ధంగా అల్ జోల్సన్, జాజ్ సింగర్ మారి బార్‌లలో పాటలు పాడుతుంటాడు. ఆ విషయం తెలుసుకున్న వార్నర్ ఓలాండ్, కొడుకును ఇంటినుండి వెళ్ళిపోమంటాడు. అప్పుడు అల్ జోల్సన్ తన తండ్రికి నచ్చినవిధంగా మతపరమైన పాటలు పాడి తండ్రి అభిమానాన్ని పొందుతాడు.

                                     

2. సాంకేతికవర్గం

  • ఆధారం: సమ్సన్ రాఫెల్స్సన్ రాసిన ది జాజ్ సింగర్ అనే నాటకం
  • కూర్పు: హెరాల్డ్ మెక్కార్డ్
  • పంపిణీదారు: వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్
  • దర్శకత్వం: అలాన్ క్రాస్‌లాండ్
  • స్క్రీన్ ప్లే: ఆల్ఫ్రెడ్ ఎ. కోహ్న్
  • నిర్మాత: డారైల్ ఎఫ్. జనక్
  • ఛాయాగ్రహణం: హాల్ మొహర్
  • నిర్మాణ సంస్థ: వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్, ది వీటాఫోన్ కార్పోరేషన్
  • సంగీతం: లూయిస్ సిల్వేర్స్
                                     

3. చిత్ర విశేషాలు

  • ఈ చిత్రాన్ని టాకీ చిత్రంగా తీయాలని ముందుగా అనుకోలేదు. ఆల్ జోల్సన్ సినిమాలో మొదటి పాటపాడి, రెండోపాట పాడబోతూ కొన్ని మాటలను మాట్లాడగా అవి కూడా రికార్డు అయ్యాయి. దర్శకనిర్మాతలు రషెస్ చూస్తున్న సమయంలో సినిమాలో మాటలు ఉంటే బాగుంటుంది అనిపించి, మరికొన్ని మాటలతో కొన్ని సన్నివేశాలు తీయడం జరిగింది.
  • ఈ సినిమాలో మొత్తం 354 మాటలు ఉన్నాయి. వాటిలో 340 అల్ జోల్సన్, 13 మాటలను యూజీనీ బెసెరర్ తల్లి, స్టాప్ అనే మాటను వార్నర్ ఓలాండ్ తండ్రి పలికారు.
  • ఈ చిత్రంలోని సౌండ్ ను సౌండ్-ఆన్-డిస్క్ విధానంలో రికార్డు చేశారు.
  • విటాఫోన్ విధానంలో టాకింగ్ - మిషన్ డిస్కులతో ఫిల్మ్ ను సింక్రోనైజ్ చేసి పెదవుల కదలికకు మాటలను చేర్చడం జరిగింది.
                                     

4. అవార్డులు

  • 1929లో జరిగిన మొదటి ఆస్కార్ అవార్డులో చిత్ర నిర్మాత డారైల్ ఎఫ్. జనక్ గౌరవ ఆస్కార్ పురస్కారాన్ని అందుకోవడమేకాకుండా ఉత్తమ రచయిత విభాగంలో ఆల్ఫ్రెడ్ ఎ. కోహ్న్ నామినేట్ చేయబడ్డాడు.
                                     
  • ఇ డ యన ప నల క డ భ రత య శ క ష స మ త చట టమ న ర జ 1927 ద జ జ స గర అన త ల ట క స న మ శబ ద చ త ర న వ ర నర బ రదర స అమ ర క ల వ డ దల

Users also searched:

...