Топ-100
Back

ⓘ అర్ధవీడు మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రకాశం జిల్లాకు చెందిన ఒక మండలం. OSM గతిశీల పటముఈ మండలం ప్రకాశం జిల్లా ఏర్పాటుకు ముందు కర్నూలు జిల్లాలో ఉంది.ఈ మండలం గిద ..
అర్ధవీడు మండలం
                                     

ⓘ అర్ధవీడు మండలం

అర్ధవీడు మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రకాశం జిల్లాకు చెందిన ఒక మండలం. OSM గతిశీల పటముఈ మండలం ప్రకాశం జిల్లా ఏర్పాటుకు ముందు కర్నూలు జిల్లాలో ఉంది.ఈ మండలం గిద్దలూరు శాసనసభ నియోజకవర్గం, ఒంగోలు లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది.ఈ మండలంలో ఒక నిర్జన గ్రామంతో కలుపుకుని 13 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.

                                     

1. మండల జనాభా

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా మండల జనాభా మొత్తం 36.169 - ఇందులో పురుషులు 18.651 - స్త్రీలు 17.518.

2001 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా మండల జనాభా మొత్తం 36.688 - పురుషులు 18.970 - స్త్రీలు 17.718.అక్షరాస్యత - మొత్తం 53.14% - పురుషులు 70.29% - స్త్రీలు 34.73%