Топ-100
Back

ⓘ పేపర్ బాయ్ 2018, ఆగష్టు 31న విడుదలైన తెలుగు చలనచిత్రం. వి.జయశంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సంతోష్‌ శోభన్‌, రియా సుమన్‌, తాన్యా హోప్ నటించగా, భీమ్స్‌ సిసిరొల ..




పేపర్ బాయ్
                                     

ⓘ పేపర్ బాయ్

పేపర్ బాయ్ 2018, ఆగష్టు 31న విడుదలైన తెలుగు చలనచిత్రం. వి.జయశంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సంతోష్‌ శోభన్‌, రియా సుమన్‌, తాన్యా హోప్ నటించగా, భీమ్స్‌ సిసిరొలియో సంగీతం అందించారు.

                                     

1. కథ

రవి సంతోష్‌ శోభన్‌ బీటెక్‌ చదివినా కుటుంబ పరిస్థితుల కారణంగా పేపర్‌ బాయ్‌గా పనిచేస్తుంటాడు. తన లాంటి ఆలోచనలే ఉన్న ధరణి రియా సుమన్ అనే పెద్దింటి అమ్మాయిని ఇష్టపడతాడు. రవి మంచి తనం విలువలు గురించి తెలుసుకున్న ధరణి కూడా రవిని ఇష్టపడుతుంది. కూతురి ప్రేమకు గౌరవమిచ్చిన ధరణి తల్లిదండ్రులు తమ అంతస్తును పక్కన పెట్టి ఆటో డ్రైవర్‌ కొడుకు, పేపర్‌ బాయ్‌ అయిన రవితో పెళ్లికి ఓకె చెప్తారు. కానీ అనుకోని పరిస్థితుల్లో రవి, ధరణి దూరమవుతారు. వారి విడిపోవడానికి కారణాలేంటి.? వీరి ప్రేమకథకు ముంబైలో ఉండే మేఘ తాన్యా హోపేకు సంబంధం ఏంటి.? రవి, ధరణిల ప్రేమకథ ఎలా ముగిసింది.? అన్నదే మిగతా కథ.

                                     

2. సాంకేతికవర్గం

  • సంగీతం: భీమ్స్‌ సిసిరొలియో
  • దర్శకత్వం: వి.జయశంకర్
  • నిర్మాణ సంస్థ: సంపత్ నంది టీం వర్క్, బి.ఎల్.ఎన్. సినిమా, ప్రచిత్ర క్రియేషన్స్
  • రచన: సంపత్ నంది
  • నిర్మాత: సంపత్‌ నంది, రాములు, వెంకట్‌, నరసింహా
  • కూర్పు: తమ్మిరాజు
  • ఛాయాగ్రహణం: సౌందర్‌ రాజన్‌
  • పంపిణీదారు: గీతా ఆర్ట్స్