Топ-100
Back

ⓘ చినఓబినేనిపల్లి. 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి దొడ్డి జ్యోతి, సర్పంచిగా, ఏకగ్రీవంగా, ఎన్నికైనారు. ఉపసర్పంచిగా శ్రీ పరమేశ్వరరెడ్డి ఎన్ని ..




చినఓబినేనిపల్లి
                                     

ⓘ చినఓబినేనిపల్లి

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి దొడ్డి జ్యోతి, సర్పంచిగా, ఏకగ్రీవంగా, ఎన్నికైనారు. ఉపసర్పంచిగా శ్రీ పరమేశ్వరరెడ్డి ఎన్నికైనారు.

                                     

1. గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

గ్రామ దేవత శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయం:- ఈ అమ్మవారి వార్షిక జాతర మహోత్సవాన్ని, 2015, అక్టోబరు-4వ తేదీ, ఆశ్వయుజ మాసం, ఆదివారంనాడు వైభవంగా నిర్వహించారు. అమ్మవారికి అభిషేకాలు నిర్వహించి, ప్రత్యేక అలంకరణలు చేసారు. కుంకుమబండ్లు కట్టి, మేళతాళాలతో డప్పు వాయిద్యాలతో, ఊరేగింపుగా పొలిమేరలలో ఉన్న అమ్మవారి ఆలయనికి వెళ్ళి, పెద్ద యెత్తున పూజలు నిర్వహించారు.

                                     

2. గణాంకాలు

జనాభా 2011 - మొత్తం 988 - పురుషుల సంఖ్య 494 - స్త్రీల సంఖ్య 494 - గృహాల సంఖ్య 259

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 983. ఇందులో పురుషుల సంఖ్య 498, మహిళల సంఖ్య 485, గ్రామంలో నివాస గృహాలు 250 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 516 హెక్టారులు.