Топ-100
Back

ⓘ రాంచీ రాజధాని ఎక్స్‌ప్రెస్ జార్ఖండ్ రాష్ట్ర రాజధాని రాంచీ,భారతదేశ రాజధాని ల మద్య నడిచే రాజధాని ఎక్స్‌ప్రెస్.ఇది రాంచీ ఢిల్లీ రైలుమార్గంలో నడిచే రైళ్ళలో అత్యంత వ ..




                                               

ధన్‌బాద్ జంక్షన్ - అలప్పుఝ ఎక్స్‌ప్రెస్

ధన్‌బాద్ జంక్షన్ - అలప్పుఝ ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలు, తూర్పు మధ్య రైల్వే మండలం ద్వార నిర్వహింపబడుతున్న ఒక ఎక్స్‌ప్రెస్.ఇది జార్ఖండ్ రాష్టంలో గల ధన్‌బాద్ నుండి బయలుదేరి కేరళ లో గల అలప్పుఝ వరకు ప్రయాణిస్తుంది.

                                               

విశాఖపట్నం - సికింద్రాబాద్ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్

విశాఖపట్నం - సికింద్రాబాద్ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్ జంక్షన్ నుండి విశాఖపట్నం జంక్షన్ రైల్వే స్టేషనుకు అనుసంధానించే భారతీయ రైల్వేల ఆధ్వర్యంలో రోజువారీ నడుస్తున్న సూపర్‌ఫాస్ట్ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ రైలు. ఇది ప్రతిరోజూ నడుపుతున్న మొట్టమొదటి గరిబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ రైలు. రైలు సంఖ్యలు 12739, 12740 ఉన్నాయి. ఇది దక్షిణ మధ్య రైల్వే జోన్ నకు చెందినది. సికింద్రాబాదు నుండి విశాఖపట్నం వరకు 12740 నంబరుతోను, విశాఖపట్నం నుండి సికింద్రాబాద్కు 12739 నంబరుతోనూ ప్రయాణిస్తుంది.

                                               

గరీబ్ రథ్ ఎక్స్ ప్రెస్

గరీబ్ రథ్ ఎక్స్ ప్రెస్ రైలును తక్కువ ధరతో ఎయిర్ కండీషన్డ్ ప్రయాణాన్ని అందించాలనే లక్ష్యంతో 2005 సం.లో భారతీయ రైల్వేల ఆధ్వర్యంలో పరిచయం చేశారు. ఇతర రైళ్ల ఏసీ ప్రయాణం కంటే దీనిలో కేవలం 2/3 వంతు మాత్రమే రేటు ఉంటుంది. ఇది సూపర్ ఫాస్ట్ రైళ్ల కంటే కూడా గరిష్ఠంగా గంటకు 130 కిలోమీటర్ల వేగంతో దగ్గర దగ్గరగా రాజధాని ఎక్స్‌ప్రెస్ తో సమానంగా ప్రయాణిస్తుంది. ఈ రైలును మొదట బీహార్ లోని సహర్షా నుంచి పంజాబ్ లోని అమృత్ సర్ వరకు ప్రవేశపెట్టారు. తదుపరి గరీబ్ రథ్ పేరుతో దేశంలోని వివిధ స్టేషన్ల మధ్య నడిచే చాలా రైళ్లు వచ్చాయి.

                                               

చాబాసా

చైబాసా జార్ఖండ్ రాష్ట్రంలోని పశ్చిమ సింగ్భూమ్ జిల్లాలో ఒక పట్టణం మునిసిపాలిటీ. చైబాసా పశ్చిమ సింగ్భూమ్ జిల్లా ప్రధాన కేంద్రం. ఇది డివిజనల్ కమిషనర్ నేతృత్వంలోని సింగ్భుమ్ కొల్హాన్ డివిజన్ ప్రధాన కార్యాలయం. అలాగే జార్ఖండ్‌లోని అత్యంత స్వాతంత్ర్య సమరయోధుడు బిర్సా ముండా స్వస్థలం.

                                               

పూర్ణియా

పూర్ణియా బీహార్. ఇది ఈశాన్య బీహార్‌ ప్రాంతమైన కోసి - సీమాంచల్ ప్రాంతం లోని అతిపెద్ద నగరం. ఇది పూర్ణియా ఉకు ముఖ్యపట్టణం, పూర్ణియా డివిజన్కు కేంద్ర స్థానం. పూర్ణియా పట్టణ ప్రాంతపు మొత్తం భౌగోళిక విస్తీర్ణం 92 చ.కి.మీ. పాట్నా తరువాత బీహార్‌లో ఇదే అతి పెద్దది. నగరంలో జనసాంద్రత కిలోమీటరుకు 3058 మంది. జనాభా ప్రకారం ఇది బీహార్ లోకెల్లా 5 వ అతిపెద్ద నగరంగా నిలిచింది. ఇది పాట్నా నుండి దాదాపు 302 కిలోమీటర్ల దూరంలో ఉంది, అలాగే సిలిగురి నుండి 171 కి.మీ, భాగల్పూర్ నుండి 90 కి.మీ. గువహతి నుండి సుమారు 640 కి.మీ., కోల్‌కతా నుండి 450 కి.మీ. దూరంలో ఉంది. పూర్ణియా జిల్లా విస్తీర్ణం 3202.31 చ.కి.మీ. భారత సైన్ ...

రాంచీ రాజధాని ఎక్స్‌ప్రెస్
                                     

ⓘ రాంచీ రాజధాని ఎక్స్‌ప్రెస్

రాంచీ రాజధాని ఎక్స్‌ప్రెస్ జార్ఖండ్ రాష్ట్ర రాజధాని రాంచీ,భారతదేశ రాజధాని ల మద్య నడిచే రాజధాని ఎక్స్‌ప్రెస్.ఇది రాంచీ ఢిల్లీ రైలుమార్గంలో నడిచే రైళ్ళలో అత్యంత వేగంగా నడిచే రైలు.

                                     

1. సర్వీసు

  • రాంచీ రాజధాని ఎక్స్‌ప్రెస్ దళ్తోన్గంజ్ మీదుగా ప్రయాణించు ఎక్స్‌ప్రెస్ ఆధివారం,గురువారాల్లో రాంచీ నుండి బయలుదేరి మరుసటిరోజు ఉదయం న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ చేరుతుంది.
  • 20839 రాంచీ రాజధాని ఎక్స్‌ప్రెస్ బొకారో స్టీల్ సిటీ మీదుగా వారంలో రెండు రోజులు బుధ,శని వారాల్లో రాంచీ నుండి బయలుదేరి మరుసటిరోజు ఉదయం న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ చేరుతుంది.
                                     

2. ప్రయాణ మార్గం

  • 12453 రాంచీ రాజధాని ఎక్స్‌ప్రెస్ దళ్తోన్గంజ్ మీదుగా ప్రయాణించు రాజధాని ఎక్స్‌ప్రెస్ జార్ఖండ్,బీహార్,ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రయాణిస్తూ బార్కకానా జంక్షన్,మొగల్ సారై,కాన్పూర్ ల మీదుగా న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ చేరుతుంది.
  • 20839 రాంచీ రాజధాని ఎక్స్‌ప్రెస్ బొకారో స్టీల్ సిటీ మీదుగా ప్రయాణించు రాజధాని ఎక్స్‌ప్రెస్ జార్ఖండ్,బీహార్,ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రయాణిస్తూ బొకారో స్టీల్ సిటీ,కొడేర్మా,గయ,
                                     

3. కోచ్ల అమరిక

రాంచీ రాజధాని ఎక్స్‌ప్రెస్ లో మొదటి తరగతి ఎ.సి భొగీ 1,రెండవ తరగతి ఎ.సి భొగీలు 6,మూడవ తరగతి ఎ.సి భోగీలు 10,పాంట్రీకార్ 1.2 జనరేటర్ల తో కలిపి మొత్తం 20భోగీలుంటాయి.

                                     

4. సౌకర్యాలు

భారతీయ రైల్వే వ్యవస్థలో ఈ రైళ్లకు అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. దీనికి పూర్తిగా ఎయిర్-కండిషన్ బోగీలు ఉంటాయి. ప్రయాణం సందర్భంగా ప్రయాణికులకు ఉచిత భోజనాలు అందజేస్తారు. ప్రయాణ వ్యవధి, సమయాలు ఆధారంగా, మధ్యాహ్న భోజనం, టీ, రాత్రి భోజనం, ఉదయం టీ, అల్పాహారం అందిస్తారు. దాదాపుగా అన్ని రాజధాని రైళ్లలో మూడు తరగతుల వసతి ఉంటుంది: అవి 2- లేదా 4 బెర్త్‌ల లాకబుల్ బెడ్‌రూములతో ఫస్ట్ క్లాస్ AC, ఓపెన్ బెర్త్‌లతో AC 2-టైర్ 4 బెర్త్‌ల గదులు + కారిడార్ మరోవైపు 2 బెర్త్‌లు, దీనిలో ఏకాంతం కల్పించేందుకు కర్టన్లు ఉంటాయి, AC 3-టైర్ 6 బెర్త్‌ల గదులు + మరోవైపు 2 బెర్త్‌లు, వీటికి కర్టన్లు ఉండవు.

                                     

5. ట్రాక్షన్

రాంచీ - న్యూఢిల్లీ ల మద్య రైలుమార్గం పూర్తిస్థాయిలో విధ్యుతీకరించబడింది.అందువల్ల రాంచీ రాజధాని ఎక్స్‌ప్రెస్ కు ఘజియాబాద్ లోకోషెడ్ ఆధారిత WAP-7 లోకోమోటివ్ను ఉపయోగిస్తున్నారు.

                                     

6. ఇవి కూడా చూడండి

  • చెన్నై రాజధాని ఎక్స్‌ప్రెస్
  • హౌరా రాజధాని ఎక్స్‌ప్రెస్
  • తిరువనంతపురం రాజధాని ఎక్స్‌ప్రెస్
  • సికింద్రాబాద్ రాజధాని ఎక్స్‌ప్రెస్
  • అగస్టు క్రాంతి రాజధాని ఎక్స్‌ప్రెస్