Топ-100
Back

ⓘ గెటల్సుడ్ ఆనకట్ట జార్ఖండ్ రాష్ట్ర రాజధాని రాంచీజిల్లాలోని ఒర్మాంజీలో ఉన్న సువర్ణలేఖ నదిపై నిర్మించిన ఆనకట్ట. 1971లో ప్రారంభించబడిన ఈ ఆనకట్ట రాంచీ, రాంగడ్ జిల్లా ..




గెటల్సుడ్ ఆనకట్ట
                                     

ⓘ గెటల్సుడ్ ఆనకట్ట

గెటల్సుడ్ ఆనకట్ట జార్ఖండ్ రాష్ట్ర రాజధాని రాంచీజిల్లాలోని ఒర్మాంజీలో ఉన్న సువర్ణలేఖ నదిపై నిర్మించిన ఆనకట్ట. 1971లో ప్రారంభించబడిన ఈ ఆనకట్ట రాంచీ, రాంగడ్ జిల్లాలలోని ప్రజలకు ఒక ప్రసిద్ధ విహారయాత్ర స్థలంగా మారింది. రుక్కా ప్రాంతంలోని స్థానిక ప్రజలకు చిన్నస్థాయి మత్స్య సేకరణకు ఉపయోగపడుతుంది. రాంచి వాసుల తాగునీటి అవసరాలు తీర్చడమే ఈ ఆనకట్ట యొక్క ప్రధాన లక్ష్యం. అంతే కాకుండా, పారిశ్రామిక అవసరాలకోసం, విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి కూడా ఈ ఆనకట్ట ఉపయోగపడుతుంది.

                                     

1. ప్రదేశం

చోటా నాగపూర్ పీఠభూమి యొక్క ఈశాన్య సరిహద్దులో ఉన్న ఈ ఆనకట్ట, రుక్కా బ్లాకులో ఉండడం వల్ల దీనిని రుక్కా ఆనకట్ట అని కూడా పిలుస్తారు. ఇది రాంచీ నుండి 35 కిలోమీటర్ల దూరంలో, రాంగఢ్ నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది.

                                     

2. ముఖ్యాంశాలు

717 కి.మీ.ల పరీవాహక ప్రదేశంతో ఉన్న ఈ ఆనకట్ట 1.954 అడుగుల పూర్తి రిజర్వాయర్ స్థాయిని కలిగి ఉంది. తాగునీటి అవసరాలకు తగినంత నీరు రాగానే ఇక్కడ విద్యుత్తు ఉత్పత్తి నిలిపివేయబడుతుంది. వివిధ పండుగలరోజున రాంచీ, రాంఘర్ ప్రజలు ఇక్కడి వేడుకలను జరుపుకుంటారు. దీని చుట్టుపక్కల అనేక విహార ప్రాంతాలు ఉన్నాయి.