Топ-100
Back

ⓘ హుంద్రు జలపాతం జార్ఖండ్ రాష్ట్ర రాజధాని రాంచీ జిల్లాలో ఉన్న జలపాతం. రాంచీ సమీపంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో ఒకటైన ఈ జలపాతం, భారతదేశంలోనే 34వ అతిపెద్ద జలపాతం ..




హుంద్రు జలపాతం
                                     

ⓘ హుంద్రు జలపాతం

హుంద్రు జలపాతం జార్ఖండ్ రాష్ట్ర రాజధాని రాంచీ జిల్లాలో ఉన్న జలపాతం. రాంచీ సమీపంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో ఒకటైన ఈ జలపాతం, భారతదేశంలోనే 34వ అతిపెద్ద జలపాతంగా గుర్తింపుపొందింది.

                                     

1. జలపాతం గురించి

ఇది సువర్ణలేఖ నదిలో ఏర్పడిన జలపాతం. 98 మీటర్ల 322 అడుగుల ఎత్తు ఎత్తు నుండి జాలువారుతున్న ఈ జలపాతం జార్ఖండ్ రాష్ట్రంలోని అత్యంత ఎత్తైన జలపాతాలలో ఒకటి. జలపాతం నుండి నిరంతరంగా నీరు పడటంవల్ల అక్కడి రాళ్ళు వివిధ నిర్మాణాలుగా మారి ఆ ప్రాంతానికి మరింత సౌందర్యాన్ని తెచ్చాయి. వర్షాకాలంలో ఈ జలపాతం సుందరంగా ఉంటూ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇక్కడ స్నానం చేయడంకోసం ఈత కొలను కూడా ఉంది.