Топ-100
Back

ⓘ రాంచీ విశ్వవిద్యాలయం జార్ఖండ్ రాష్ట్ర రాజధాని రాంచీలో ఉన్న విశ్వవిద్యాలయం. 1960లో స్థాపించబడిన ఈ విశ్వవిద్యాలయం జార్ఖండ్ లోని రాంచీ, గుమ్లా, ఖుంతి, సిమ్డెగా, లో ..
                                               

జాతీయ న్యాయ పాఠశాలలు

జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాలు లేదా జాతీయ న్యాయపాఠశాలలు భారతదేశంలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అభీష్టం మేరకు న్యాయవిద్యపై వచ్చిన సంస్కరణల మూలంగా ఏర్పాటయిన విద్యా సంస్థలు. భారత ప్రభుత్వంచే ఏర్పాటు చేయబడిన ఈ విద్యాసంస్థలను బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, కేంద్ర న్యాయవ్యవహారాల మంత్రిత్వశాఖ నియంత్రిస్తున్నాయి. మొదటి జాతీయ న్యాయ విశ్వవిద్యాయం బెంగళూరులోని నే షనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ 1988లో ప్రారంభమయ్యింది. అప్పటి నుండి ప్రతి రాష్ట్రంలోను ఒక జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పారు. ఈ విద్యాసంస్థలు ఉన్నత ప్రమాణాలతో నడుస్తున్నాయి.

                                               

మౌంట్ సిన్హా

మౌంట్ సిన్హా, మౌంట్ సిన్హా అనేది అంటార్కిటికాలోని, మెక్‌డొనాల్డ్ హైట్స్ దక్షిణ భాగంలో ఎరిక్సన్ బ్లఫ్స్ ఆగ్నేయ భాగంలో ఒక పర్వతం దీని ఎత్తు 990 మీ.ఇది మేరీ బైర్డ్ ల్యాండ్‌లో ఉత్తరం నుండి కిర్క్‌పాట్రిక్ హిమానీనదంగా ఉంది. యుఎస్ నేవీ ఎయిర్ ఫోటోల సర్వేలు నుండి, యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే చేత మ్యాప్ చేయబడింది. యుఎస్సిజిసి సౌత్ విండ్ దాని రెండు హెలికాప్టర్లు ఉపయోగించి 1971లో బెల్లింగ్‌షౌసెన్, అముండ్‌సెన్ సముద్రాల ప్యాక్ మంచులో సీల్స్, తిమింగలాలు, పక్షుల జనాభా అధ్యయనాలను చేసిన జీవ పార్టీ సభ్యుడు అఖౌరి సిన్హా కోసం అంటార్కిటిక్ పేర్ల సలహా కమిటీ చేత గుర్తుగా ఆ పేరు పెట్టబడింది.

                                               

మీనాక్షీ బెనర్జీ

మినాక్షీ బెనర్జీ Ph.D., భారత దేశానికి చెందిన మహిళా శాస్త్రవేత్త. ఆమె "అకాడామీ ఆఫ్ ఎన్విరాన్‌మెంటల్ బయాలజీ", "ద నేషనల్ సైన్స్ అకాడమీ" లకు ఫెలోషిప్ పొందారు. ఆమె NASI కు జీవితకాల సభ్యులు. ఆమె ఆల్‌బెర్ట్ ష్వైట్జర్ అంతర్జాతీయ బంగారు పతకాన్ని సైన్స్ రంగంలో పొందడమే కాల అనేక అవార్డులు అందుకున్నారు. ఈమె యు.జి.సి అవార్డును కూడా పొందారు. ఆమె ప్రస్తుతం భోపాల్ లోని భర్కతుల్లా విశ్వవిద్యాలయంలో జీవశాస్త్రవిభాగానికి అధిపతిగా యున్నారు.

                                               

సురేంద్రనాథ్ బెనర్జీ

సర్ సురేంద్రనాథ్ బెనర్జీ బ్రిటిష్ రాజ్ కాలంలో భారత రాజకీయ నాయకులలో ఒకడు. అతను ఇండియన్ నేషనల్ అసోసియేషన్ను స్థాపించాడు, దీని ద్వారా ఆనందమోహన్ బోస్ తో కలిసి 1883, 1885 లలో ఇండియన్ నేషనల్ కాన్ఫరెన్స్ రెండు సెషన్లకు నాయకత్వం వహించాడు. బెనర్జీ తరువాత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడిగా మారారు. కాంగ్రెస్ మాదిరిగా కాకుండా మోంటాగు-చెల్మ్‌స్‌ఫోర్డ్ సంస్కరణలను స్వాగతించాడు. చాలా మంది ఉదారవాద నాయకులతో అతను కాంగ్రెస్ నుండి నిష్క్రమించి, 1919 లో ఇండియన్ నేషనల్ లిబరేషన్ ఫెడరేషన్ అనే కొత్త సంస్థను స్థాపించాడు. అతను ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వ్యవస్థాపక సభ్యులలో ఒకడు.

                                               

భారత జాతీయ సైన్స్ కాంగ్రెస్ సంస్థ

భారత జాతీయ కాంగ్రెస్ సంస్థ భారతదేశానికి చెందిన శాస్త్రీయ సంస్థ. 1914లో కలకత్తా ప్రధానకేంద్రంగా ఏర్పడింది. దేశంలోని శాస్త్ర, విజ్ఞాన, సాంకేతిక రంగాల్లోని పరిశోధనలను ప్రోత్సహించాలనేది ఈ సంస్థ ఉద్దేశం. ఇది ప్రతియేటా జనవరి మొదటి వారంలో దేశం లోని ఏదేని ఒక పట్టణంలో సమావేశ మౌతుంది. మొదటి జాతీయ సైన్స్ సమావేశం 1914లో జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు 2008లో జరిగిన విశాఖపట్నం సమావేశంతో కలిపి 95 సమావేశాలు జరిగాయి. ఈ సమావేశం ఆంధ్ర ప్రదేశ్లో జరగడం ఇది 9 వ పర్యాయం.

రాంచీ విశ్వవిద్యాలయం
                                     

ⓘ రాంచీ విశ్వవిద్యాలయం

రాంచీ విశ్వవిద్యాలయం జార్ఖండ్ రాష్ట్ర రాజధాని రాంచీలో ఉన్న విశ్వవిద్యాలయం. 1960లో స్థాపించబడిన ఈ విశ్వవిద్యాలయం జార్ఖండ్ లోని రాంచీ, గుమ్లా, ఖుంతి, సిమ్డెగా, లోహార్దగా వంటి ఐదు జిల్లాలకు వర్తిస్తుంది. ప్రస్తుతం రమేష్ కుమార్ పాండే విశ్వవిద్యాలయ ఉపకులపతిగా ఉన్నారు.

                                     

1. చరిత్ర

విష్ణుదేవ్ నారాయణ్ సింగ్ మొదటి ఉపకులపతిగా 1960, జూలై 12న ఈ విశ్వవిద్యాలయం స్థాపించబడింది. పరిపాలన సౌలభ్యం కోసం 1992లో దీనిని దాదాపు సగం విభజించి వినోబాభావే విశ్వవిద్యాలయం ఏర్పాటుచేయబడింది. మళ్ళీ 2009 జనవరిలో నిలంబెర్ పిటమ్బెర్ విశ్వవిద్యాలయం మెదినీనగర్, ఆగష్టులో కోల్హాన్ విశ్వవిద్యాలయంగా విభజించబడింది.

                                     

2. సౌకర్యాలు

ఈ విశ్వవిద్యాలయంలోని గ్రంధాలయంలో సుమారు 1.50.000 పుస్తకాలు ఉన్నాయి. రాంచీలోని కుచ్చేరి రోడ్డులో ఉన్న విశ్వవిద్యాలయ ప్రాంగణంలో మొత్తం రెండు విద్యార్థి హాస్టళ్లు, నాలుగు విద్యార్ధినిల వసతి గృహాలు ఉన్నాయి.

                                     

3. పరిపాలన

భారతదేశంలోని అనేక రాష్ట్ర విశ్వవిద్యాలయాల మాదిరిగానే, ఈ విశ్వవిద్యాలయ కులపతిగా రాష్ట్ర గవర్నరే ఉంటారు. 2002, నవంబర్ 15వరకు ఉపకులపతిగా బీహార్ గవర్నర్ ఉండగా, రాష్ట్ర విభజన జరిగి జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడిన తరువాతనుండి జార్ఖండ్ గవర్నరే విశ్వవిద్యాలయ ఉపకులపతిగా ఉంటున్నారు.

                                     

4. రాంచి విశ్వవిద్యాలయం మ్యూజియం

రాంచి విశ్వవిద్యాలయంలో ఆంథ్రోపాలజీ విభాగం మ్యూజియంను ఏర్పాటుచేసింది. కేంద్ర భారతీయ రాష్ట్రాలు, అండమాన్ నికోబార్ దీవులలోని వివిధ జాతలకు సంబంధించిన వివిధ రకాల ప్రదర్శనలు ఇక్కడ ప్రదర్శించబడుతాయి.