Топ-100
Back

ⓘ పర్యాటక ఆకర్షణలు ..
                                               

కిష్ట్వర్ జాతీయ ఉద్యానవనం

ఈ ఉద్యానవనాన్ని ఫిబ్రవరి 4, 1981 న జాతీయ ఉద్యానవనంగా ప్రకటించారు. ఇది 400 చదరపు కి.మీ. వైశాల్యంలో విస్తరించి ఉంది. దీని పరీవాహక ప్రాంతంలో కాశ్మీరీలు, ఠాకూర్లు, గుజార్లు, రాజ్‌పుత్‌లు, బ్రాహ్మణులు నివసిస్తుంటారు.

                                               

దిబ్రు సైఖోవ జాతీయ ఉద్యానవనం

ఈ ఉద్యానవనం జూలై 1997 లో 765 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో బయోస్పియర్ రిజర్వ్‌గా గుర్తించబడింది. ఈ 765 చదరపు కిలోమీటర్లలో 340 చదరపు కిలోమీటర్లు కోర్ జోన్ గా, 425 చదరవు కిలోమీటర్లు బఫర్ జోన్ పరిధిలో ఉన్నాయి.

                                               

దేవునిగుట్ట

దేవునిగుట్ట తెలంగాణ రాష్ట్రం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ములుగు మండలం, కొత్తూరు సమీపంలో ఉన్న గుట్ట. ఈ గుట్టపై క్రీ.శ. 6 లేదా 7వ శతాబ్దాలకు చెందిన ఆలయం ఉంది. దీనిని దేవునిగుట్ట ఆలయం అని పిలుస్తారు. ఈది విష్ణు కుండినులు కట్టించినది గా చెప్తారు దీనిలో వీరి ఆరాధ్య దైవం అయిన శ్రీ పర్వతుడు శివుడు విగ్రహాలు ఉన్నాయి.

                                               

నంది హిల్స్

నంది కొండలు కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరానికి చేరువలో ఉన్న చిక్కబళ్ళాపూర్ జిల్లాలో ఉన్నాయి. ఈ కొండలు ఒక అందమైన పర్వత ప్రాంతం. ఈ కొండలపై నుండి సూర్యోదయాన్ని తిలకించడం ఓ రకమైన దివ్యమైన అనుభూతికి గురి చేస్తుంది. కొండపైనుండి చూస్తే మేఘాలపై నుండి చూస్తున్నట్టు ఉంటుంది. ఈ దట్టమైన మేఘాలపైన సూర్యోదయాన్ని చూడటం ఓ అద్భుత దృశ్యాన్ని చూస్తున్నట్టే ఉంటుంది. ఈ దృశ్యాన్ని చూడాలంటే ఉదయం 6 గంటలలోపు అక్కడకు చేరుకోవాలి. పార్కింగ్ సదుపాయం ఉంది. వారంతాల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. మొబైలు సిగ్నల్ దొరకడం కొంచెం కస్టమే. పురాతన కోట కట్టడాలను గమనించవచ్చు. కోట లోపలికి, సూర్యోదయాన్ని చూడడానికి ప్రవేశించాలంటే ప్రవ ...

                                               

బాంధవ్‌గఢ్ జాతీయ ఉద్యానవనం

ఈ ఉద్యానవనాన్ని 1968 లో స్థాపించారు. ఇది 1536 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించి ఉంది. ఈ ఉద్యనవనాన్నికి చారిత్రక చరిత్ర ఉంది. పూర్వం ఈ ప్రాంతాన్ని రేవా వంశానికి చెందిన మహారాజులు ఆట విడుపులు, వినోదాల కోసం వాడేవారు. 1947 లో రేవా రాష్ట్రాన్ని మధ్యప్రదేశ్‌లో విలీనం చేశారు. కానీ అప్పటి ఒప్పందం ప్రకారం రేవా మహారాజాలు వేట హక్కులను తమ ఆధీనంలో ఉండేది. 1972 వన్యప్రాణుల సంరక్షణ చట్టం ప్రకారం ఈ ఉద్యానవనం ప్రాజెక్ట్ టైగర్ కి ఎంపికైంది.

                                               

మౌంట్ హార్రియట్ జాతీయ ఉద్యానవనం

మౌంట్ హార్రియట్ జాతీయ ఉద్యానవనం అండమాన్ నికోబార్ దీవులలోని పోర్ట్ బ్లెయిర్ నగరానికి సమీపంలో ఉన్న ఫెర్రాగుంజ్ అనే ప్రాంతంలో ఉంది. 20 రూపాయల నోటు వెనుక వైపున ఉన్న చిత్రం మౌంట్ హ్యారియెట్ నేషనల్ పార్క్ నుంచే తీసుకొనబడింది.

                                               

సిన్గాలిలా జాతీయ ఉద్యానవనం

ఈ ఉద్యానవనాన్ని 1986 లో వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంగా ప్రకటించారు. దీనిని 1992 లో జాతీయ ఉద్యానవనంగా గుర్తించారు. ఇది మొత్తం 78.6 చ. కిలోమీటర్ల వైశాల్యం లో విస్తరించి ఉంది. ఈ ప్రాంతం చాలాకాలంగా మానేభంజాంగ్ నుండి సందక్ఫు పశ్చిమ బెంగాల్ యొక్క ఎత్తైన శిఖరం, ఫలుట్ వరకు ట్రెక్కింగ్ మార్గంగా ఉపయోగించబడింది.

                                               

సుందర్‌బన్స్‌ జాతీయ ఉద్యానవనం

ఈ ఉద్యానవనాన్ని 1984 లో జాతీయ ఉద్యనవనంగా ప్రకటించారు. ఈ ఉద్యానవనం 1973 లో సుందర్బన్ పులుల సంరక్షణ కేంద్రంగా, 1977 లో వన్యప్రాణుల సంరక్షణ ప్రాంతంగా, మే 4, 1984 న దీనిని జాతీయ ఉద్యానవనంగా ప్రకటించారు. 1987 లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం గుర్తించింది. 2001 నుండి వరల్డ్ నెట్‌వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్ మ్యాన్ అండ్ బయోస్పియర్ రిజర్వ్ గా ఉంది. ఇందులో కొంత భాగం గంగా డెల్టా ప్రాంతం కిందికి వస్తుంది. ఈ డెల్టా ప్రాంతం మడ అడవులతో నిండి ఉంటుంది.