Топ-100
Back

ⓘ తెలుగు విశ్వవిద్యాలయము - విశిష్ట పురస్కారాలు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము భారతదేశంలోని భాష ప్రాతిపదిక మీద స్థాపించబడిన విశ్వవిద్యాలయం. ఈ విశ్వవిద్య ..
తెలుగు విశ్వవిద్యాలయము - విశిష్ట పురస్కారాలు
                                     

ⓘ తెలుగు విశ్వవిద్యాలయము - విశిష్ట పురస్కారాలు

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము భారతదేశంలోని భాష ప్రాతిపదిక మీద స్థాపించబడిన విశ్వవిద్యాలయం. ఈ విశ్వవిద్యాలయం 1985, డిసెంబరు 2న హైదరాబాదులో స్థాపించబడింది. తెలుగు భాషా సాహిత్యం, లలిత కళలు, సాంస్కృతిక రంగాల్లో ఏటా ఒక రంగం నుంచి విశిష్ట వ్యక్తికి తెలుగు విశ్వవిద్యాలయం విశిష్ట పురస్కారం అందజేస్తుంది.

సుమారు మూడున్నర దశాబ్దాల కృషి ఉన్న విశిష్ట వ్యక్తులను ఈ పురస్కారానికి ఎంపిక చేస్తారు. 1991 నుండి ప్రారంభమైన ఈ పురస్కారంలో రూ.5116 నగదు, శాలువా, పురస్కారపత్రంతో ఘనంగా సత్కరించడం జరుగుతుంది.

                                     

1. పురస్కార గ్రహీతలు

 • 1998 - డా. నటరాజ రామకృష్ణ లలితకళలు - నృత్యం
 • 2013 - డా. చుక్కా సత్తయ్య లలితకళలు - ఒగ్గుకథ
 • 1994 - డా. వాసిరెడ్డి సీతాదేవి సాహిత్యం
 • 2011 - డా. సి. నారాయణరెడ్డి సాంస్కృతిక రంగం
 • 2001 - డా. మంగళంపల్లి బాలమురళీకృష్ణ లలితకళలు - సంగీతం
 • 2004 - డా. వెంపటి చినసత్యం లలితకళలు - నృత్యం
 • 1996 - బి.ఎన్. శాస్త్రి సాంస్కృతిక రంగం
 • 2008 - డా. బాలాంత్రపు రజనీకాంత రావు సాంస్కృతిక రంగం
 • 2015 - నందిని సిధారెడ్డి సాహిత్యం
 • 2014 - బి. నర్సింగరావు సాంస్కృతిక రంగం
 • 2009 - డా. జె. బాపురెడ్డి సాహిత్యం
 • 1995 - డా. పీసపాటి నరసింహమూర్తి లలిత కళలు - నాటకరంగం
 • 1991 - డా. బోయి భీమన్న సాహిత్యం
 • 1993 - డా. తిరుమల రామచంద్ర సాంస్కృతిక రంగం
 • 1992 - డా. కాపు రాజయ్య లలిత కళలు - చిత్రలేఖనం
 • 2016 - భరత్‌భూషణ్‌ లలితకళలు - ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం
 • 2005 - డా. నేరెళ్ళ వేణుమాధవ్ సాంస్కృతిక రంగం
 • 1997 - డా. రావూరి భరద్వాజ సాహిత్యం
 • 2000 - డా. దాశరథి రంగాచార్య సాహిత్యం
 • 2007 - సి.ఎస్.ఎన్. పట్నాయక్ లలితకళలు - శిల్పం, చిత్రలేఖనం
 • 2003 - ఉత్పల సత్యనారాయణాచార్య సాహిత్యం
 • 1999 - డా. మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి సాంస్కృతిక రంగం
 • 2002 - డా. బాపు సాంస్కృతిక రంగం
 • 2006 - ఆచార్య బిరుదురాజు రామారావు సాహిత్యం
 • 2010 - రావు బాలసరస్వతీ దేవి లలితకళలు - సంగీతం
 • 2012 - ఆచార్య కొలకలూరి ఇనాక్ సాహిత్యం