Топ-100
Back

ⓘ లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ 2012లో విడుదలైన తెలుగు చలనచిత్రం. ఈ సినిమాకు కథ, దర్శకత్వాన్ని శేఖర్ కమ్ముల అందించాడు. ఈ సినిమాలో కొత్తవారైన అభిజిత్, సుధాకర్, కౌషిక్ నటించా ..




                                     

ⓘ లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్

లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ 2012లో విడుదలైన తెలుగు చలనచిత్రం. ఈ సినిమాకు కథ, దర్శకత్వాన్ని శేఖర్ కమ్ముల అందించాడు. ఈ సినిమాలో కొత్తవారైన అభిజిత్, సుధాకర్, కౌషిక్ నటించారు. ఈ సినిమాకి మిక్కీ జె. మేయర్ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ సినిమాలో అమల అక్కినేని, శ్రియ, అంజులా ఝావేరి ముఖ్యమైన భూమికలను నిర్వహించారు. ఈ చిత్రాన్ని శేఖర్ కమ్ముల, చంద్రశేఖర్ కమ్ముల సంయుక్తంగా ఎమిగోస్ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ చిత్రానికి విజయ్ సి. కుమార్ ఛాయాగ్రాహకుడు.

                                     

1. కథ

విశాఖపట్నంలో ఉండే అమల అక్కినేని తనకు ట్రాన్స్ ఫర్ అయింది, వేరే ఊరు షిఫ్ట్ అవ్వాలి కాబట్టి తాతయ్య, అమ్మమ్మ ల దగ్గర ఉండమని తన ముగ్గురు పిల్లల్ని హైదరాబాద్ పంపిస్తుంది. దీంతో తన ఇద్దరి చెల్లెల్ని తీసుకుని శ్రీనివాస్ అభిజిత్ హైదరాబాద్ లోని సన్ షైన్ వ్యాలీ కాలనీకి వస్తాడు. ఈ కాలనీలో అతనికి నాగరాజు సుధాకర్, అభి కౌషిక్ లు పరిచయం అవుతారు. నాగరాజు సుధాకర్తో చివరికి అనేక తగాదాల నడుమ తన ప్రేమను అంగీకరిస్తుంది. అదేవిధంగా శ్రీనివాస్ అభిజిత్ తన అత్తమ్మ కూతురు పద్దు షాగన్ ప్రేమలో పడుతాడు. దీనిని వాళ్ళ అమ్మ తిరస్కరిస్తుంది. ఇది ఇలా ఉండగా శ్రియ, అభి కౌషిక్ ల మధ్య సన్నిహితం పెరుగుతుంది. ఇది గోల్స్ ఫేజ్ వారికీ నచ్చకపోగా తనపై కోపాన్ని పెంచుకుంటారు. ఈ క్రమంలో శ్రియ అందాల పోటీల్లోలో పాల్గొని గెలుపొందుంతుంది. ముఖ్యంగా ఈ కథ అంతా గోల్డ్ ఫేజ్ కి, సన్ షైన్ వాలీకి నడుమ జరుగుతుంది. ఈ కథలో ప్రేమలో ఎవరెవరు పడ్డారు? శ్రీనివాస్ అభిజిత్ అమ్మ ఎందుకు వారిని హైదరాబాద్ కి పంపించింది? అసలు కాలనిల నడుమ తగువులు ఎందుకు? తెలుపడమే మిగితా కథ సారాంశం.

                                     

2. నటవర్గం

  • శ్రీనుగా అభిజిత్
  • శ్రీరామ్‌
  • మాయగా అంజులా ఝావేరి
  • అజయ్ గా విజయ్ దేవరకొండ
  • కౌషిక్
  • నాగరాజుగా సుధాకర్
  • షాగన్
  • సత్యగా రష్మి
  • జారా
  • సంజీవ్‌
  • అమ్మగా అమల
  • నవీన్‌
  • పార్వతిగా శ్రియ
  • కావ్య
                                     

3. నిర్మాణం

లీడర్ సినిమా విడుదల ఏడు నెలల తర్వాత 2010, ఆగస్టు నెలలో శేఖర్ కమ్ముల ఈ సినిమా యొక్క ప్రకటనను విడుదల చేసారు. ఈ సినిమాని మొదట హీరో వరుణ్ సందేశ్‌తో తీయాలని యోచించారు కానీ తర్వాత ఈ సినిమాని కొత్తవారితో తీయాలని యోచించి ఎనిమిది నెలల పాటు ఆడిషన్ నిర్వహించి నూతన నటీనటులను ఎంపిక చేసారు. ఆ తర్వాత ఈ సినిమా నిర్మాణం జూన్ 2011లో మొదలు పెట్టి ఫిబ్రవరి 2012 వరకు పూర్తీ చేసి జులై 6, 2012న తొలి బుల్లి ప్రచార చిత్రాన్ని సినిమా బృందం విడుదల చేసింది. అదే విధంగా ఈ సినిమాని శేఖర్ కమ్ముల, చంద్రశేఖర్ కమ్ముల సంయుక్తంగా అమిగోస్ బ్యానర్ పై నిర్మించారు.

                                     

4. పురస్కారాలు

ఈ సినిమాకి అమల అక్కినేనికి 63 వ ఫీల్ంఫేర్ ఉత్సవంలో ఉత్తమ నటీగా సపోర్టీంగ రోల్ విభాగంలో అవార్డు వరించింది. ఇదే సినిమాలోని పాత్రకు గాను ఉత్తమ సహాయ నటిగా అమల అక్కినేనికి సినీమా అవార్డు లభించింది.