Топ-100
Back

ⓘ సోనాల్ చౌహాన్ ఒక భారతీయ ఫ్యాషన్ మోడల్, గాయకురాలు, నటి, ప్రధానంగా తెలుగు సినిమా, హిందీ సినిమాల్లో పనిచేస్తున్నారు. ఆమె అనేక అందాల పోటీలను గెలుచుకుంది, ఆమె జన్నత్ ..




సోనాల్ చౌహాన్
                                     

ⓘ సోనాల్ చౌహాన్

సోనాల్ చౌహాన్ ఒక భారతీయ ఫ్యాషన్ మోడల్, గాయకురాలు, నటి, ప్రధానంగా తెలుగు సినిమా, హిందీ సినిమాల్లో పనిచేస్తున్నారు. ఆమె అనేక అందాల పోటీలను గెలుచుకుంది, ఆమె "జన్నత్" అనే హింది చిత్రంలో తొలిసారిగా నటించింది.

                                     

1. కెరీర్

మోడల్గా

మలేషియాలోని సరావాక్ రాష్ట్రంలో మిరిలో మిస్ వరల్డ్ టూరిజం 2005 గా ఆమె గుర్తించబడింది. ఆమె మిస్ వరల్డ్ టూరిజం గా ఎన్నుకొనబడ్ద మొట్టమొదటి భారతీయురాలు.ఆమె డిష్ టి.వి., పాండ్స్, నోకియా వంటి బ్రాండ్ల ప్రకటనలలో కూడా కనిపించింది. ఇండియా ఇంటర్నేషనల్ ఆభరణాల వీక్ 2011 లో నగలు బ్రాండ్ YS18 కోసం షో స్టాపర్గా ఆమె రాంప్లో నడిచింది.

నటిగా

ఆమె మొట్టమొదటిసారి హిమేష్ రేషమ్మియా యొక్క ఆల్బమ్ ఆప్ కా సురోర్లో తెరపై కనిపించింది.అమె మొదటి చిత్రం జన్నత్. ఈ చిత్రంలో ఆమె ఇమ్రాన్ హష్మి సరసన నటించారు. 2008 లో అమె రేయింబో అనే చిత్రమ్లో నటించారు. తరువాత ఒక కన్నడ, మూడు హింది చిత్రాల్లో నటించారు.

ఆ తర్వాత బాలకృష్ణతో కలిసి తెలుగు సినిమా లెజెండ్ చిత్రం లో నటించారు. ఆమె తదుపరి చిత్రం పండగా చెస్కో.2015 ప్రారంభంలో, ఆమె రెండు తెలుగు సినిమాల సైజు జీరోతో ఆర్య, షేర్ సరసన నందమూరి కళ్యాణ్ రామ్తో నటించతానికి ఒప్పుకున్నారు.

2016 లో అమె డిక్టేటర్ అనె తెలుగు చిత్రమ్లో నతించారు.