Топ-100
Back

ⓘ హైటీ, అధికారికంగా రిపబ్లిక్ ఆఫ్ హైటీ, సాధారణంగా హేతి అంటారు. ఇది కరీబియన్ సముద్రం లోని గ్రేటర్ ఆంటిల్లెస్ ద్వీపమాలికలోని హిపానియోలాలో భాగంగా ఉంది.ఇది ద్వీపంలోని ..
హైటీ
                                     

ⓘ హైటీ

హైటీ, అధికారికంగా రిపబ్లిక్ ఆఫ్ హైటీ, సాధారణంగా హేతి అంటారు. ఇది కరీబియన్ సముద్రం లోని గ్రేటర్ ఆంటిల్లెస్ ద్వీపమాలికలోని హిపానియోలాలో భాగంగా ఉంది.ఇది ద్వీపంలోని పశ్చిమభాగంలో ఉంది. హైటీ వైశాల్యం 27.750 చ.కి.మీ.జనసంఖ్య 10.6 మిలియన్లు. ఇది కరీబియన్, కరీబియన్ దేశాలలో అత్యంత జనసాంధ్రత కలిగిన దేశంగా ఉంది. ఆరంభకాలంలో ఈప్రాంతంలో టైనో అనే స్థానికజాతి ప్రజలు నివసించారు.1492 డిసెంబర్ 5 న స్పెయిన్ ఈద్వీపాన్ని కనుగొన్నది. క్రిస్టోఫర్ కొలబస్ మొదటి సాహసయాత్రలో ఆట్లాంటిక్ మహాసముద్రాన్ని దాటి వెళుతున్న సమయంలో కొలంబస్ ఈ ద్వీపాన్ని చేరుకుని ఈద్విపాన్ని ఇండియా లేక ఆసియా అనుకున్నాడు. 1492 క్రిస్మస్ రోజున కొలంబస్ ఫ్లాగ్ షిప్ శాంటా మారియా లిమనేడ్ సమీపంలో పయనించింది. కొలంబస్ తన మనుష్యులకు నౌకను విడిచి ద్వీపంలో దిగమని ఆదేశించాడు. తరువాత కొలంబస్ ద్వీపంలో మొదటి యురేపియన్ సెటిల్మెంటు స్థాపించి దీనికి లా నేవిడాడ్ అని నామకరణం చేసాడు. తరువాత రోజు నౌక విధ్వంశం అయింది. స్పెయిన్ ఈ ద్వీపాన్ని ఆక్రమించుకున్న తరువాత ఈద్వీపానికి లా ఎస్పనొలా అని నామకరణం చేయబడింది. స్పెయిన్ ఈద్వీపాన్ని 17వ శతాబ్ధం ఆరంభం వరకు పాలించింది.సెటిల్మెంట్లు, ఆక్రమణలు మొదలైన పోటీ కారణంగా ద్వీపంలోని పశ్చిమప్రాంతాన్ని ట్రీటీ ఆఫ్ రిస్విక్ తర్వాత ఫ్రెంచి ప్రభుత్వానికి స్వాధీనం చేసింది.ఫ్రెంచి స్వాధీనం చేసుకున్న భూభాగానికి ఫ్రెంచి సెయింట్ డొమినిక్యూ అని నామకరణం చేసింది. తరువాత ఇక్కడ సెటిల్మెంట్లను స్థాపించి చెరకు తోటలను ఏర్పాటు చేసి తోటలలో పనిచేయడానికి ఆఫ్రికా నుండి బానిసలను దిగుమతి చేసుకున్నారు.

బానిసత్వం నిర్మూలించబడిన తరువాత, నెపోలియన్ బొనాపర్టే సైన్యం వర్టియరీస్ యుద్ధంలో ఓటమి పొందిన తరువాత ఫ్రెంచి విప్లవం 1789-1799 మద్యలో బానిసలు, స్వతంత్రులైన శ్వేతజాతీయులు హైటీయన్ తిరుగుబాటు 1791-1799ప్రారంభించారు. తరువాత 1804 జనవరి 1న హైటీ లాటిన్ అమెరికా దేశాలలో మొదటి సార్వభౌమదేశంగా, అమెరికా ఖండాలలో రెండవ రిపబ్లిక్‌గా అవతరించింది.పశ్చిమార్ధగోళంలో అత్యున్నత శక్తులుగా ఉన్న ఫ్రెంచి, స్పెయిన్, యునైటెడ్ కంగ్డలను ఓడించిన ఏకైకదేసంగా హైటీ గుర్తించబడింది.అంతేకాక ప్రపంచంలో బానిసల తిరుగుబాటుతో స్థాపించబడిన ఏకైక స్వతంత్రదేశంగా కూడా హైటీ ప్రత్యేకత కలిగి ఉంది. మునుపటి బానిసల నాయకత్వంలో ఆరంభమైన 1791 తిరుగుబాటుకు ఫ్రెంచి సైన్యంలోని నల్లజాతికి చెందిన తౌసెయింట్ లౌవర్చ్యూర్ నాయత్వం వహించాడు. ఫ్రెంచి జైలులో ఆయన మరణించిన తరువాత ఉద్యమానికి తౌసెయింట్ లౌవర్చ్యూర్ లెఫ్టినెంట్ జీన్- జాక్యూస్ డిస్సలినెస్ నాయకత్వం వహించాడు.స్వతంత్రం లభించిన తరువాత జీన్- జాక్యూస్ డిస్సలినెస్ హైటీ పాలకుడు అయ్యాడు. 12 సంవత్సరాల హైటీ తిరుగుబాటు తరువాత అలెగ్జాండ్రె పెషన్ నుండి విడిపోయిన తరువాత బానిసలే రిపబ్లిక్ మొదటి అధ్యక్షుడు ప్రభుత్వ నాయకులుగా నియమించబడ్డారు. అమెరికా ఖండాలలో అతిపెద్ద గుర్తించబడిన హెంరీ క్రిస్టోఫె కోటను పూర్వపు బానిస, హైటీ మొదటి పాలకుడు మొదట్ హెంరీ నిర్మించాడు.విదేశీ దండాయాత్రల నుండి దేశాన్ని రక్షించడానికి ఈకోట నిర్మించబడింది. హతి యునైటెడ్ నేషంస్ ఆర్గనైజేషంస్ ఆఫ్ అమెరికన్ స్టేట్స్ అసోసియేషన్ ఆఫ్ కరీబియన్ స్టేట్స్, ది ఆర్గనైజేషన్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ ఫండ్ ఫౌండింగ్ సభ్యత్వం కలిగి ఉంది.అదనంగా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషంస్, కమ్యూనిటీ ఆఫ్ లాటిన్ అమెరికన్ స్టేట్స్ అండ్ కరీబియన్ సభ్యత్వం కలిగి ఉంది.హ్యూమన్ డెవెలెప్మెంట్ జాబితాలో హైటీ అమెరికా ఖండాలలో చివరి స్థానంలో ఉంది.2004లో హైతీ అధ్యక్షుడు జీన్ బెర్ట్రాండ్ ఆర్టిస్టైడ్ "ను పదవి నుండి తొలగించాలని దేశం ఉత్తర భూభాగంలో తిరుగుబాటు ప్రారంభించబడింది." యునైటెడ్ నేషంస్ స్టెబిలైజేషన్ మిషన్ ఇన్ హైటీ ఆధ్వర్యంలో మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటుచేయబడింది.

                                     

1. పేరువెనుక చరిత్ర

హైటీ హేతి అనేపదానికి స్థానికప్రజలకు చెందిన టైనోభాష మూలంగా ఉంది.టైనాలోభాషలో ఈ పేరు హిస్పానియో ద్వీపం అంతటికీ వర్తిస్తుంది. ఈపదానికి ఎత్తైన పర్వతభూభాగం అని అర్ధం. ఇంగ్లీష్‌లో ఈపదాన్ని హైతీ అని ఉచ్ఛరించబడుతుంది. దీనిని వైవిద్యంగా హై-తి, హై-ఈ-తి, హా-ఈ-తి అని పిలువబడుతున్నప్పటికీ దేశవ్యాప్తంగా హేతి అనే పేరు వాడుకలో ఉంది. హతియన్ తిరుగుబాటుదారుడు జీన్ జాక్యూస్ డిస్సలినెస్ ఈ పేరును అధికారికంగా స్థిరీకరించాడు. ఫ్రెంచిలో హైటీకి పీర్ల్ ఆఫ్ ది ఆంటిల్లెస్ లా పర్లె డేస్ ఆంటిల్లెస్ అని మారు పేరు ఉంది. ఈ ద్వీపం సౌనర్యానికి, ఇక్కడ ఫ్రెంచి సాంరాజ్యానికి చెందిన సంపద విస్తారంగా ఉన్నందున ఈద్వీపానికి ఈ పేరు వచ్చింది.యురేపియన్ కాలనీలలో ఈద్వీపం అత్యంత సంపన్నమై ఉన్నందున ఈద్వీపానికి ఈపేరు వచ్చింది.

                                     

2.1. చరిత్ర కొలంబియన్ కాలానికి పూర్వం

యురేపియన్లు హైతీ అంతర్భాగంగా ఉన్న హిస్పానియోలా ద్వీపంలో ప్రవేశించే సమయానికి అనేక కరీబియన్ ద్వీవులలో టైనో ప్రజలు నివసిస్తూ ఉండేవారు.టైనో ప్రజలకు అరవాకన్ భాషాకుటుంబానికి చెందిన టైనో భాష వాడుకభాషగా ఉంది. టైనో భాష హైటీయన్ క్రియోల్ భాషలో భద్రపరచబడి ఉంది.టైనోలు ఈ మొత్తం ద్వీపానికి హైతీ అని నామకరణం చేసారు. టైనోప్రజలు శతాబ్ధాలక్రితం దక్షిణ అమెరికా నుండి కరీబియన్ దీవులకు వలస వచ్చారు. టైనోప్రజలు అమెజాన్ బేసిన్‌ లోని యానోమమికు సంబంధించిన వారని జన్యు అధ్యయనాలు సూచిస్తున్నాయి. వారికి మద్య, దక్షిణ అమెరికాతో కూడా సంబంధం ఉందని జన్యుశాస్త్ర అధ్యయనాలు సూచిస్తున్నాయి. 15 వ టైనోప్రజలు శతాబ్దంలో కరేబియన్ దీవులకు వలస వచ్చిన తరువాత ఐలాండ్ కరీబియన్లు వారిని ఈశాన్య కరేబియన్ ద్వీపాల్లోకి తరిమి కొట్టారు. హైతీ ద్వీపం ఐదు కాకిక్వాట్లలో విభజించబడింది: ఈశాన్యంలో మాగు, వాయువ్య ప్రాంతంలో మేరీన్, సౌత్ వెస్ట్లోని సారాగువా, దక్షిణాన ఉన్న సిబావో, హిగ్యుయే మధ్య ప్రాంతంలో ఉన్న మగువాణ. పశువుల పెంపకంతో ప్రధాన జీవనోపాధి కలిగిన కప్పం చెల్లించే సామంతరాజ్యాలు మాత్రమే ఉన్నాయి. టైనో సాంస్కృతిక కళాఖండాలు దేశంలోని అనేక ప్రాంతాలలో గుహ పెయింటింగ్స్ భాగంగా ఉన్నాయి. ఇవి హైతీ జాతీయ చిహ్నాలుగా పర్యాటక ఆకర్షణలుగా మారాయి. ఆధునికకాలంలో నైరుతి ప్రాంతంలో ఫ్రెంచ్ వలసరాజ్య నగరంగా లెగోన్ అభివృద్ధి చేయబడింది.దాని ప్రక్కన పూర్వపు రాజధాని "క్వారాగువా" ఉంది.

                                     

2.2. చరిత్ర స్పానిషుల పాలన 1492–1625

1492 డిసెంబర్ 5న నావికుడు క్రిస్టోఫర్ కొలంబస్ హైతీ భూభాగంలో ప్రవేశించాడు. కొలంబస్ తాను ప్రవేశించిన ప్రాంతానికి మోలె సెయింట్ నికోలస్ అని నామకరణం చేసి ఈ ద్వీపాన్ని క్రౌన్ ఆఫ్ కాస్టిలేలో భాగం చేసాడు. పంతొమ్మిది రోజుల తరువాత అతని నౌక శాంటా మారియా ప్రస్తుత కాప్-హైత్న్ ప్రాంతాన్ని చుట్టుముట్టింది. ద్వీపంలో కొలంబస్ 39 మనుష్యులను విడిచిపెట్టి లా నావిడద్ సెటిల్మెంటు స్థాపించాడు. నావికులతో యురేషిన్ అంటువ్యాధులు ద్వీపంలో ప్రవేశించాయి. స్థానికప్రజలలో ఈ అంటువ్యాధులను నివారించే వ్యాధినిరోధక శక్తి లేనందున అంటువ్యాధులతో పెద్ద సంఖ్యలో స్థానికులు మరణించారు. 1507లో హిస్పానియోలాలో ప్రవేశించిన స్మాల్ ఫాక్స్ అమెరికా ఖండాలలో నమోదైన మొదటి సంఘటనగా భావిస్తున్నారు. ఎకోమియండా విధానం స్థానికులను బలవంతంగా బంగారు గనులలో, ప్లాంటేషన్లలో పని చేసేలా వత్తిడి చేసింది. స్పానిషులు అమలుచేసిన లాస్ ఆఫ్ బర్గోస్ 1512-13 చట్టం స్థానికులపట్ల వివక్ష చూపడానికి దారితీసింది. ఈ చట్టం స్థానికులను కాథలిజానికి మారేలా వత్తిడి చేసింది. ఇది ఎకోమిండియాకు చట్టపరమైన హోదా కల్పించింది. కరేబియన్ ద్వీపాలకు ప్రవేశ ద్వారంగా హిస్పానియోలా ప్రారంభ వలసరాజ్యాల కాలంలో పైరేసీ ఇన్ ది కారిబియన్ పేరుతో సముద్రపు దోపిడీదారులకు స్వర్గంగా మారింది. ద్వీపంలోని పశ్చిమ భాగంలో ఫ్రెంచ్ బుకానీర్‌లు స్థిరపడ్డారు. వారిలో బెర్ట్రాండ్ డిఓర్గాన్ పొగాకు పండించడం కొనసాగించాడు. అతను అనేక ఫ్రెంచ్ వలస కుటుంబాలను మార్టినిక్, గ్వాడెలోప్ తీసుకునివచ్చి పొగాకు తోటలలో పనిచేయడానికి నియమించాడు. యూరోపియన్ దేశాలు న్యూవరల్డ్ మీద ఆధిపత్యం కరేబియన్‌, ఉత్తర అమెరికాలో నియంత్రణ సాధించడానికి పోటీ పడ్డాయి. 1697 లో స్పెయిన్ సామ్రాజ్యం, ఫ్రెంచి సామ్రాజ్యం ట్రీట్ ఆఫ్ రిస్విక్ ద్వారా వారి ప్రతీకారాలకు ముగింపు పలికి హిస్పానియోలా ద్వీపాన్ని వారిలో వారు విభజించుకున్నారు.                                     

2.3. చరిత్ర ఫ్రెంచి పాలన 1625–1804

ఫ్రెంచి స్వాధీనం చేసుకున్న పశ్చిమంలోని మూడవభాగానికి సెయింట్-డొమింగు, ఫ్రెంచ్ హెప్నియోనా అని నామకరణం చేసారు. హిస్పొటానియో లోని స్పానిష్ కాలనీకి సెయింట్ డోమినిక్ అని నామకరణం చేయబడింది. ఫ్రెంచి ప్రభుత్వం చెరకు పంటల పెంపకం కోసం ఆఫ్రికా నుండి వేలమంది బానిసలను దిగుమతి చేసుకుంది. చక్కెర 18 వ శతాబ్దం మొత్తంలో చక్కెర లాభదాయకమైన పంటగా ఉంది. 1789 నాటికి, దాదాపు 40.000 మంది శ్వేతజాతి వలసవాదులు సెయింట్-డోమింగ్లో నివసించారు. ఇందుకు వ్యతిరేకంగా 1763 నాటికి న్యూ ఫ్రాన్స్ ఫ్రెంచ్ కెనడా శ్వేతజాతీయుల సంఖ్య 65.000కు చేరుకుంది. వేలాది మంది ఆఫ్రికన్ బానిసలు తోటల పెంపకంలో పని చేసేందుకు దిగుమతి చేసుకున్నారు.వీరు ప్రధానంగా చెరకు ఉత్పత్తి కొరకు నియమించబడ్డారు. ద్వీపం ఉత్తరంలో ఉన్న బానిసలు ఆఫ్రికన్ సంస్కృతి మతం, భాషతో సంబంధాలు కలిగి ఉన్నారు. కొత్తగా దిగుమతి చేసుకున్న ఆఫ్రికన్లచే ఈ సంబంధాలు నిరంతరం పునరుద్ధరించబడ్డాయి. సంఖ్యాపరంగా నల్లజాతీయులు స్వేతజాతీయులను అధిగమించారు. నల్లజాతీయులు, శ్వేతజాతీయుల నిష్పత్తి 10:1కి చేరుకుంది.

ఫ్రెంచి ప్రభుత్వం జీన్-బాప్టిస్ట్ కోల్బెర్ట్‌చే తయారు చేయబడి లూయిస్ XIVచే ధృవీకరించబడిన "కోడ్ నోయిర్" "బ్లాక్ కోడ్" అమలు చేసింది.కొత్తచట్టం బానిసల జీవితాలను దుర్భరం చేసేవిధంగా వారి స్వేచ్ఛలపై నియమాలను ఏర్పాటు చేసింది. సెయింట్-డొమింగు అనేది అత్యంత దారుణమైన బానిస కాలనీల్లో ఒకటిగా వర్ణించబడింది. దుర్భరమైన పరిస్థితుల కారణంగా కొత్తగా దిగుమతి చేసుకున్న ఆఫ్రికన్లలో మూడింట ఒక వంతు మంది మరణించారు. బానిసలలో అనేక మంది టైఫాయిడ్, స్మాల్ ఫాక్స్ మొదలైన వ్యాధులతో మరణించారు. వారిలో జననాల నిష్పత్తి తక్కువగా ఉంటుంది.కొంతమంది మహిళలు తమ సంతానం బానిసత్వబంధాలలో బంధించబడానికి అంగీకరించలేక గర్భస్థశిశువును గర్భం నుండి తొలగించారనడానికి సాక్ష్యాలు ఉన్నాయని భావిస్తున్నారు.

హైటీలోని లూసియానా కాలనీఫ్రాంస్లో న్యూ ఫ్రాన్స్ ప్రభుత్వం ఫ్రీ పీపుల్ ఆఫ్ కలర్స్ "కుమిశ్రిత వర్ణాలు కొన్ని హక్కులను అనుమతించింది. మిశ్రమ-జాతి వారసులు వలసదారులలోని శ్వేతజాతి మగవారికి, నల్లజాతి స్త్రీ బానిసలకు తరువాత, మిశ్రమ-జాతి మహిళలుజన్మించిన వారు అత్యధికంగా ఉన్నారు. కాలక్రమేణా, అనేకమంది బానిసత్వం నుండి విడుదలయ్యారు. వారు ప్రత్యేకమైన సామాజిక తరగతిను స్థాపించారు. శ్వేతజాతి ఫ్రెంచ్ క్రియోల్ ప్రజల తండ్రులు తరచూ తమ మిశ్రమ-జాతి కుమారులను విద్య కోసం ఫ్రాన్స్‌కు పంపించారు. కొంతమంది మనుషులను సైన్యంలో అనుమతించబడ్డారు. మిశ్రమజాతి ప్రజలు ఎక్కువ మంది ద్వీపంలోని దక్షిణప్రాంతంలోని పోర్ట్-ఆ-ప్రిన్స్ సమీపంలో నివసించారు.అనేకమంది తమ సమాజంలోనే వివాహం చేసుకున్నారు. వారు తరచూ కళాకారులు, వ్యాపారవేత్తలుగా పనిచేశారు, కొంత ఆస్తిని కలిగి ఉన్నారు. కొందరు బానిసలు అయ్యారు. స్వేచ్ఛాయుత వ్యక్తులు వారి హక్కులను విస్తరించడానికి న్యూ ఫ్రాన్స్ ప్రభుత్వాన్ని అభ్యర్థించారు.

ట్రాన్స్-అట్లాంటిక్ ప్రయాణం ద్వారా హైటీ చేరిన బానిసలు, హైటీలో జన్మించిన బానిసల వివరాలు మొదటిసారిగా హైతీ యొక్క ఆర్చివ్స్‌లో పత్రబద్ధం చేసి దానిని ఫ్రాన్స్ యొక్క రక్షణ మంత్రిత్వశాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖకు బదిలీ చేశారు. 2015 గణాంకాల ఆధారంగా ఈ నివేదికలు ది నేషనల్ ఆర్కివ్స్ ఆఫ్ ఫ్రాన్స్ లో ఉన్నాయని భావిస్తున్నారు. 1788 గణాంకాలు హైతీ జనాభాలో దాదాపు 25.000 శ్వేతజాతీయులు, 22.000 మిశ్రిత జాతీయులు, 7.00.000 బానిసలను కలిగి ఉందని తెలియజేస్తున్నాయి.

                                     

2.4. చరిత్ర హైటీయన్ తిరుగుబాటు 1791–1804

1789 ఫ్రెంచ్ విప్లవం ప్రేరణ, మానవహక్కుల సూత్రాలు,మిశ్రితవర్ణాలకు చెందిన ప్రజలు, సెయింట్-డోమింగ్, ఫ్రెంచ్ వెస్ట్ ఇండీస్‌ ద్వీపాలలోని మిశ్రితవర్ణాల ప్రజలు, బానిసలు స్వేచ్ఛ కొరకు, మరిన్ని పౌర హక్కుల కోసం ఒత్తిడి చేశారు. 1791 లో ఉత్తర మైదానాల్లో సెయింట్-డోమినిక్యూలో బానిసల విప్లవం ఆరంభం అయింది. చాలా ముఖ్యమైనది, ఇక్కడ ఆఫ్రికన్లు ఎక్కువగా శ్వేతజాతీయుల కంటే ఎక్కువగా ఉన్నారు.

1792 లో, ఫ్రెంచ్ ప్రభుత్వం నియంత్రణలను తిరిగి స్థిరపరచడానికి మూడు దళాలతో కూడిన కమిషనర్ల పంపించింది. గేన్స్ డి కూలీర్, బానిసలతో ఒక కూటమిని నిర్మించడానికి, ఫ్రెంచ్ కమీషనర్లు సొన్నోనాక్స్, పోలెవర్ల్ కాలనీలో బానిసత్వాన్ని రద్దు చేశారు. ఆరు నెలల తరువాత, రోబెస్పైర్రే, జాకోబిన్స్ నేతృత్వంలోని నేషనల్ కన్వెన్షన్ బానిసత్వాన్ని రద్దుచేసి దానిని ఫ్రెంచ్ వలసరాజ్యాలకు విస్తరించింది.

కొత్త రిపబ్లిక్‌గా అవతరించినప్పటికీ యునైటెడ్ స్టేట్స్‌లోని రాజకీయ నాయకులు ఇబ్బందులకు గురౌతున్న రైతులకు ఎప్పటికప్పుడు సాయపడుతూ తిరుగుబాటును అణిచివేసేందుకు ప్రయత్నించారు. తరువాత విప్లవంలో ఉత్తర అమెరికా, కరేబియన్ దేశాల్లో ఫ్రెంచ్ ప్రభావం తగ్గించే లక్ష్యంతో నల్లజాతీయ సైనికదళాలకు మద్దతు అందించారు. బానిసల తిరుగుబాటు నాయకుడు, పూర్వపు బానిస టౌస్సైట్ లూవేర్‌చ్యూర్ శాంటో డొమింగో నుండి స్పానిష్‌లను, కాలనీని బెదిరిస్తున్న బ్రిటిష్ దాడిదారులను వెలుపలకు పంపాడు.విప్లవం సాగిన అనిశ్చితి నెలకొన్న సమయంలో యునైటెడ్ స్టేట్స్ ఒకదానికొకటి వ్యతిరేకంగా ఇరు పక్షాలకు సహకరించింది. వ్యాపారులు ఫ్రెంచ్, తిరుగుబాటుదారులకు అవసరమైన సరఫరాలను అందించారు. ఆండ్రె రిగాడ్ నాయకత్వంలో 1799 నుండి 1780 మద్య కాలంలో మిశ్రితవర్ణాలకు చెందిన ప్రజలు, లౌవర్చ్యూర్ నాయకత్వంలో నల్లజాతీయుల మద్య వార్ ఆఫ్ నైవ్స్ పేరుతో అంతఃకలహాలు ఆరంభం అయ్యాయి. ప్రాణాలతో మిగిలిన మిశ్రితవర్ణాలకు చెందిన ప్రజలు ద్వీపంలో శరణార్ధులుగా ఉన్నారు.

లౌవర్చ్యూర్ ప్రత్యేకవాద రాజ్యాంగం రూపొందించిన తరువాత హతిమీద దాడిచేయడానికి ఫ్రెంచి ప్రభుత్వాధినేత నపోలియన్ బొనాపర్టే 20.000 సైనికులు, నావికులను పంపాడు. తిరిగి భుభాగాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఫ్రెంచి ప్రభుత్వం పంపిన సైన్యానికి నపోలియన్ బొనాపర్టే బావమరిది చార్లెస్ లెక్లెర్క్ నాయకత్వం వహించాడు.ఫ్రెంచి కొంత విజయం సాధించినప్పటికీ ఫ్రెంచి సైన్యంలో వ్యాపించిన ఎల్లో జ్వరం కారణంగా సైన్యంలో చాలామంది మరణించారు. కాలనీని తిరిగి స్వాధీనం చేసుకోనే ప్రయత్నంలో 50.000 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు.వీరిలో 18 మంది జనరల్స్ ఉన్నారు. పట్టుబడిన లౌవర్చ్యూర్‌ విచారణ కోసం ఫ్రాంస్‌కు పంపబడ్డాడు. అక్కడ ఆయన ఫోర్ట్ డి జౌక్స్‌లో ఖైదులో ఉంచబడ్డాడు. ఆయన 1803 ఎక్స్పోజర్, బహుశా క్షయవ్యాధిలో కారణంగా ఖైదులోనే మరణించాడు.

బానిసలు మిశ్రితవర్ణాలు, మిత్రపక్షాలతో కలిసి స్వాతంత్ర్యం కోసం పోరాటం కొనసాగించారు. 1803 నవంబర్ 18 న వర్టియర్ యుద్ధంలో జీన్-జాక్వెస్ డెసాలియన్స్ ఫ్రెంచ్ దళాలను 1892 నవంబరులో ఓడించాడు. ఇది బానిస సైన్యం విప్లవంద్వారా సాధించిన మొదటి విజయంగా భావించబడింది. 1803 చివర్లో ఫ్రాన్సు మిగిలిన 7.000 మంది సైనికులను ద్వీపం నుండి ఉపసంహరించుకుంది. నెపోలియన్ ఉత్తర అమెరికా సామ్రాజ్యాన్ని తిరిగి స్థాపించాలన్తన ఆలోచనను విడిచిపెట్టాడు. యుద్ధం ఘోరంగా జరగడంతో నెపోలియన్ లూసియానా కొనుగోలు ద్వారా లూసియానా న్యూ ఫ్రాన్స్ను యునైటెడ్ స్టేట్స్ కు విక్రయించాడు.

                                     

2.5. చరిత్ర ఫస్ట్ ఎంపైర్ 1804–1806

1804 జనవరి 1 న డెస్సలైంస్ చేత సెయింట్ - డోమినిక్యూ స్వాతంత్రం ప్రకటించబడింది. హైటీయన్ రివల్యూషన్‌లో సంభవించిన మరణాల గురించిన ఖచ్ఛితమైన వివరాలు అస్పష్టంగానే ఉన్నాయి. డెస్సలైంస్‌ను అతని బృదాలు ఎంపరర్ ఫర్ లైఫ్ గా ప్రకటించాయి. డెస్సలైంస్‌ ముందుగా శ్వేతజాతి ప్లాంటర్లకు, ఇతరులకు రక్షణ కల్పించాడు. అధికారానికి వచ్చిన వెంటనే డెస్సలైంస్‌ తనకు మద్దతుగా లేని శ్వేతజాతీయులందరినీ వయసు, లింగబేధం లేకుండా వధించమని ఆదేశించాడు. అధికారం కొరకు కొనసాగించిన పోరాటంలో 1806 అక్టోబర్ 17 న డెస్సలైంస్‌ హత్యచేయబడ్డాడు. 1804 హైతీ మారణకాండ నుండి మూడు వర్గాల శ్వేతజాతి ప్రజలకు మాత్రమే మినహాయింపు ఇవ్వబడింది. హైటీయన్ పోలిష్ హైటియన్ సైనికులు, చాలామంది ఫ్రెంచ్ సైన్యం నుండి వెలుపలకు వచ్చిన వారిలో చాలామంది, హైతీయన్ తిరుగుబాటుదారులతో కలిసి పోరాడిన వారికి మూకుమ్మడి హత్యల నుండి మినహాయింపు ఇవ్వబడింది.జర్మన్ హైటీయన్ వలసప్రజలు వాయవ్యప్రాంతానికి కొంతమంది వైద్యులను, నిపుణులను ఆహ్వానించారు. హైతీయన్ సైన్యంలోని అధికారులతో సంబంధాలున్న వ్యక్తులు అలాగే శ్వేతజాతి కాని పురుషులను పెళ్లి చేసుకోవడానికి అంగీకరించిన మహిళలు కూడా మినహాయించబడ్డారు. తిరుగుబాటు ప్రభావం గురించి భయపడటంతో అమెరికా అధ్యక్షుడు థామస్ జెఫెర్సన్ కొత్త రిపబ్లిక్‌ను గుర్తించేందుకు నిరాకరించారు, చాలా యూరోపియన్ దేశాల వలె. యు.ఎస్ అధికారికంగా హైతీని కొన్ని దశాబ్దాలుగా గుర్తించలేదుఅమెరికన్ పౌర యుద్ధం వరకు. తురుగుబాటు అత్యధికమైన విదేశీవలసలకు దారితీసింది. 1809లో సెయింట్ డొమినిక్యూ నుండి 10.000 మంది న్యూ ఆర్లింస్ చేరుకున్నారు. వారు నగరజనాభాను రెట్టింపు చేసారు. కొత్తగా చేరిన బానిసలు నగర ఆఫ్రికన్ల సంఖ్యను అధికం చేసారు.                                     

2.6. చరిత్ర హైటీ దేశం, హైటీ రాజ్యం, హైటీ రిపబ్లిక్ 1806–1820

సెయింట్ - డొమినిక్యూ ఉత్తరభాగం కింగ్డం ఆఫ్ హైటీ, దక్షిణ భూభాగం రిపబ్లిక్‌కు విభజించబడింది.హెంరీ క్రిస్టోఫె ఆధ్వర్యంలో ఉన్న భాగంలో నిర్భంధ విద్య, ఎకనమిక్ కోడ్ ప్రవేశపెట్టబడ్డాయి. తిరుగుబాటు నాయకుడు సింసన్ బొలివర్‌కు అధ్యక్షుడు పెషన్ సైనిక, ఆర్ధిక సాయం అందించాడు. న్యూ స్పెయిన్ నుండి దక్షిణ అమెరికా దేశాలు స్వతంత్ర్యం సాధించడానికి ఆయన ఉపకరణంగా పనిచేసాడు.

                                     

2.7. చరిత్ర హైటీయన్ యీనిఫికేషన్ 1821–1844

1821లో పెషన్ వారసుడు అధ్యక్షుడు జీన్ పియరె బోయర్ హైతీ రెండు భాగాలు తిరిగి కలిపి ద్వీపంలోని మొత్తం పశ్చిమ ప్రాంతంలో నియంత్రణను విస్తరించాడు. 1821 నవంబర్ 30 న శాంటో డొమింగొ స్పెయిన్ నుండి స్వాతంత్ర్యం ప్రకటించిన తరువాత నియంత్రణను తీసుకునేందుకు యునిఫికేషన్ ఆఫ్ హిస్పనియోలా దళాలు పంపాడు. బోయెర్ నిరంకుశ పాలనతో మొత్తం ద్వీపాన్ని పాలించాడు అలాగే శాంటో డొమింగోలో బానిసత్వాన్ని నిర్మూలించాడు. శాంటో డొమింగో హైతీ నుండి స్వతంత్రాన్ని సాధించిన తరువాత దేశం ప్రత్యేక జాతీయ గుర్తింపును స్థాపించింది.

వ్యవసాయరంగం పునరుద్ధరించడానికి కమ్మోడిటీ పంటల అభివృద్ధికి వీలుకల్పిస్తూ రైతు కార్మికులకు భూములను విడిచిపెట్టి పట్టణాలలోకి ప్రవేశించే హక్కు, లేదా తమ స్వంత ఫాంస్ లేదా దుకాణాలను ప్రారంభించే హక్కును రద్దు చేయడానికి బోయర్ చట్టం రూపొందించాడు. విప్లవం తరువాత అనేక మంది రైతులు తోటలలో పనిచేయడానికి బదులుగా వారి స్వంత పొలాలు కలిగి ఉండాలని కోరుకున్నారు. ది అమెరికన్ కాలనైజేషన్ సొసైటీ ఎ.సి.ఎస్ స్వతంత్రులైన నల్లజాతి ప్రజలను యునైటెడ్ స్టేట్స్ నుండి హైటీకి వలసవెళ్ళాడానికి ప్రోత్సాహం అందించింది.1824 సెప్టెంబర్‌న 6.000 మంది ఆఫ్రికన్ అమెరికన్లు యు.ఎస్. నుండి హైటీకి వలసపోయారు.ఎ.సి.ఎస్. వీరి ప్రయాణవ్యయాన్ని భరించింది. వారిలో చాలా మంది హైటీలోని పరిస్థితుల కాఠిన్యాన్ని భరించలేక యునైటెడ్ స్టేట్స్‌కు తిరిగి వెళ్ళారు. జులై 1825 లో, ఫ్రెంచ్ రాజవంశం పునరుద్ధరణ సమయంలో ఫ్రాన్స్కి చెందిన కింగ్ చార్లెస్ X హైటీని జయించడానికి ఫ్రెంచి నావికాదళాన్ని పంపాడు. ప్రెసిడెంట్ బోయెర్‌ ఎదురైన వత్తిడి కారణంగా ఫ్రాంస్‌తో ఒప్పందానికి అంగీకరిస్తూ 150 మిలియన్ల ఫ్రాంకులను కప్పంగా 1838 లో 90 మిలియన్లకు తగ్గించబడ్డాడు చెల్లించడానికి అంగీకరించాడు. బదులుగా హతి స్వాతంత్రాన్ని అధికారికంగా ఫ్రాంస్ గుర్తించింది. హైతీలోని ఉన్నతవర్గీయుల మద్దతును కోల్పోయిన కారణంగా బోయెర్ 1843 లో పదవి నుండి తొలగించబడ్డాడు. దీర్ఘకాల తిరుగుబాటు తరువాత బోయర్ దేశం నుండి పారిపోయాడు. కొన్ని సంవత్సరాల కాలం ఫ్రాంస్‌కు కప్పం చెల్లించిన కారణంగా హైతీ ఆర్ధికరంగం దిగజారింది. పశ్చిమదేశాలు హైటీకి దౌత్యపరమైన గుర్తింపు ఇవ్వలేదు. ఈ రెండు సమస్యలు హైతీని ఆర్ధికపరంగా, సాంఘికపరంగా ఒంటరిని చేసాయి.

                                     

2.8. చరిత్ర 20వ శతాబ్ధం ఆరంభకాలం

1892 లో జర్మనీ ప్రభుత్వం అంటెనోర్ ఫిర్మిన్ సంస్కరణ ఉద్యమాన్ని అణిచివేసేందుకు మద్దతునిచ్చింది. 1897 లో జర్మన్లు హైటీ ప్రభుత్వాన్ని బెదిరించడానికి, అవమానం చేయడానికి​​" గన్ బోటు డిప్లమసీ ని ఉపయోగించింది.20 వ శతాబ్దం యొక్క మొదటి దశాబ్దాలలో, హైటీ గొప్ప రాజకీయ అస్థిరత్వంను ఎదుర్కొంది, ఫ్రాన్స్, జర్మనీ, యునైటెడ్ స్టేట్స్‌లకు భారీగా రుణపడింది. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత 1914 డిసెంబరులో అధ్యక్షుడు వుడ్రో విల్సన్ యు.ఎస్. నౌకాదళాలను హైటీకి పంపాడు.వారు హైటీయన్ నేషనల్ బ్యాంక్ నుండి $ 5.00.000 డాలర్లను తీసుకుని దానిని న్యూయార్క్‌లోని యునైటెడ్ స్టేట్ బ్యాంకులో భద్రపరిస్తామని తీసుకుని వెళ్ళారు. 1915 లో హైటీ అధ్యక్షుడు విల్బర్న్ గుయిల్యుమె శాం హత్యచేయబడిన తరువాత యునైటెడ్ స్టేట్స్ హైతీని ఆక్రమించుకుంది. అమెరికన్ మద్దతుతో పదవిని అధిష్ఠించిన అధ్యక్షుడు 167 మంది రాజకీయ ఖైదీలను చంపమని ఆదేశాలుజారీచేసిన తరువాత కోపోద్రిక్తులైన ప్రాంతీయ తిరుగుబాటుదారులు అధ్యక్షుని మీద తిరుగుబాటుచేసి వీధిలోకి లాగి క్రూరంగా హత్యచేసారు.యు.ఎస్.ఎస్. వాషింగ్టన్ రియర్ అడ్మైరల్ నాయకత్వంలో కాపర్టన్ పోర్ట్ ఔ ప్రింస్ చేరుకుని పరిస్థితులు చక్కబరచడానికి ప్రయత్నించారు.తరువాత దాదాపు 20 సంవత్సరాల కాలం హైటీలో యు.ఎస్. ఆధిపత్యం కొనసాగింది. హైటీలో ప్రవేశించిన కొన్ని రోజులలో నావికులు రాజధాని నగరాన్ని, బ్యాంకులను, కస్టంస్ హౌస్‌ను స్వాధీనం చేసుకుని దేశం ఫైనాంస్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు.నావికాదళం ద్వీపంలో మార్షల్ లా ప్రవేశపెట్టి, కఠినతరమైన ప్రెస్ సెంసార్ "ను ప్రవేశపెట్టింది.తరువాత ఒక వారకాలంలో అమెరికాకు అనుకూలమైన ఫిలిప్పె దుద్రె డార్టిక్యూనవె ను అధ్యక్షునిగా నియమించింది.తరువాత అమెరికాకు అనుకూలమైన విధంగా రాజ్యాంగం రూపొందించబడింది.రాజ్యాంగంలో సరికొత్తగా విదేశీయులకు భూ యాజమాన్యం కల్పించబడింది. వెదేశీయులకు భూయాజమాన్య వసతి కల్పించడాన్ని హైటీయన్ లెజిస్లేచర్, పౌరులు వ్యతిరేకించారు.

                                     

2.9. చరిత్ర యు.ఎస్. నావికాదళం

తరువాతి 5 సంవత్సరములలో యు.ఎస్ నావికాదళం, వారి స్థానిక కార్యనిర్వాహకులు, హైటీయన్ ప్రజలు బెదిరింపు, కాల్పులు, హింస, హత్య కేసులు ఎదుర్కొన్నారు. ఆక్రమిత శక్తులు 15.000 మంది హైటీయన్లు ప్రాణాలు కోల్పోవడం, ఆయుధాలను ఆయుధాలను కోల్పోవడం, బలవంతంగా ఊడిగం చేయడం మొదలైన నిర్భంధానికి గురైయ్యారని అంచనా వేయబడింది. ఈ విధానం ద్వారా ఆక్రమితదళాలు ఆయుధాలద్వారా బెదిరించి రోడ్లు వంతెనలు మొదలైనవాటిని నిర్మించటానికి అవసరమైనప్పుడు ప్రజల ఆయుధాలు, గృహాలు, పొలాలను స్వాధీనంచేసుకోవడానికి అనుమతించింది. ప్రతిఘటించిన వారు అదే ప్రదేశంలో చంపబడడం, నిర్భంధ కార్మిక విధానంలో పనిచేస్తున్న సమయంలో వ్యాధుల భారిన పడి మరణించడం, పోషకాహార లోపం ద్వారా మరణించడం సంభవించాయి.

రెండు దేశాల చరిత్రలలోని ఈ అధ్యాయం మధ్య అమెరికా, కరేబియన్ ప్రాంతాలలోని పొరుగువారి వైపుగా యునైటెడ్ స్టేట్స్ యొక్క అణచివేత విదేశీ విధానాన్ని ప్రతిబింబిస్తుంది. శతాబ్ధం ఆరంభకాలంలో ఈప్రాంతంలో సంభవించిన ఈ సంఘటనలు "గన్ బోట్ దౌత్యం" లేదా "బనానా వార్స్"గా అభివర్ణించబడ్డాయి. 1934 వరకు 19 సంవత్సరాల కాలం యు.ఎస్. మెరైన్స్ దేశంలో నిలిచి ఉన్నారు. చివరికి ఫ్రాంక్లిన్ డి. రూజ్వెల్ట్ తన "గుడ్ నైబర్ పాలసీ" ప్రకటించాడు.అయినప్పటికీ యులెస్.ప్రభుత్వం ద్వీపం ఫైనాస్ రంగన్ని తన స్వాధీనంలో ఉంచుకున్నది.1980 వరకు హతి ఎన్నికలను యు.ఎస్.ప్రభావితం చేసింది. సైసల్ కొత్తగా హైటీలో ప్రవేశపెట్టబడింది. పత్తి, చెరకు ప్రధాన ఎగుమతులుగా అభివృద్ధి చెందాయి. గ్రామీణప్రాంతాలలో నివసిస్తున్న హైటీ సంప్రదాయవాదులు అనెరికన్ నేపథ్యంలో ప్రవేశపెట్టబడుతున్న మార్పులను తీవ్రంగా వ్యతిరేకించారు.నగరప్రాంత ప్రముఖులు మరింత అమెరికన్ నియంత్రణను కోరుకున్నారు. 1934 నాటికి ఆక్రమణ ముగింపుకు వచ్చింది. ఋణాలు అధికరించాయి 1941 వరకు బడ్జెట్‌కు అమెరికన్ ఫైనాంషియల్ అడ్వైజర్ జనరల్ బాధ్యతవహించాడు. వైవిధ్యమైన హైటీయన్ సంప్రదాయం యుజెనె ఒ నెయిల్, జేంస్ వెల్డన్ జాంసన్, లాంగ్స్టన్ హగ్స్, జోరా నీలె హర్స్టన్, హార్సన్ వేల్స్ మొదలైన యునైటెడ్ స్టేట్స్‌ రచయితలను ప్రభావితం చూపింది. 1934 లో అమెరికన్ దళాలు ద్వీపాన్ని విడిచిపెట్టిన తరువాత డొమినికన్ రిపబ్లిక్ నియంత రాఫెల్ ట్రుజిల్లో హతివ్యతిరేక భావజాలాన్ని ఉపకరణగా జాతీయవాద సాధనంగా ఉపయోగించుకున్నాడు. పార్స్లీ ఊచకోతగా పిలువబడిన ఒక సంఘటనలో డొమినికన్ సరిహద్దులలో ఉన్న ఊచకోతచేయమని ఆదేశించాడు. ఈ సంఘటనలో 10.000-20.000 వరకు ఊచకోతకు గురైయ్యారు. ట్రుజిల్లో నాలుగవ వంతు హైటీయన్ వారసత్వం కలిగి ఉన్నప్పటికీ పొరుగున ఉన్న హతియన్ వ్యతిరేకచర్యలను కొనసాగించాడు.1945 సెప్టెంబర్ 27న యునైటెడ్ నేషంస్ ఫండింగ్ సభ్యదేశంగా మారింది. 1950లో అమెరికన్, యూరప్ దేశాలకు చెందిన పర్యాటకులు హైటీని సందర్శించడం ప్రారంభించారు. పోర్ట్ ఔ ప్రింస్ పునరుద్ధరించబడింది. క్రూసీల ద్వారా హైతీకి చేరుకునే పర్యాటకులకు సాస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయబడ్డాయి.ఈ ఆకర్షణలలో మూరీష్-శైలి శైలి ఐరన్ మార్కెట్, హైటీయన్ కళాఖాండలు, మహోగనికి విక్రయించబడుతుంటాయి. సాయంత్రం వ్యాపారవేత్తలు నృత్యం, క్యాసినో జూదం, ఊడూ షోలను అందిస్తుంటారు. ట్రూమాన్ కాపోట్, నోయెల్ క్యార్డ్, హోటల్ ఓలోఫ్సన్ 19 వ శతాబ్దపు గోతిక్ బెల్లం భవనం, ఒక ఉష్ణమండల తోటలో సందర్శించారు. ఇది గ్రహం గ్రీన్ నవల అయిన ది కమేడియన్‌ చిత్రీకరించబడింది.                                     

2.10. చరిత్ర దువాలియర్ రాజవంశం 1957–1986

హైటీయన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ 1957లో డాక్టర్ ఫ్రాంకోయిస్ డవాలియర్ పాపా డాక్ హైటీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.జనాదరణ పొందిన డువాలియర్ 1971లో అతని మరణం వరకు అధ్యక్షుడుగా ఉన్నాడు.డువాలియర్ నగరప్రాంతాలలోని విధ్యావంతులలో మిశ్రమవర్ణప్రజలు సంఖ్యాపరంగా ఆధిఖ్యత కలిగి ఉన్నప్పటికీ ప్రభుత్వరంగాలలో నల్లజాతి ప్రజలకు ప్రాముఖ్యత కలిగించాడు. ఆయన టాంటంస్ మాకౌటెస్ సేవాసంస్థ మద్దతుతో రాజకీయప్రత్యర్ధులను ఎదుర్కొంటూ పాలనసాగించాడు. స్వల్పకాలం విప్లవాత్మకంగా అభివృద్ధి చెందిన హైటీ పర్యాటకరంగం ఫ్రాంసిస్కో పాపా డాక్ డువాలియర్ పాలనలో హతిలో నెలకొన్న రాజకీయ అశాంతి కారణంగా తుడిచిపెట్టుకు పోయింది.1970లో ఆయన వారసుడు జీన్- క్లౌడ్ బేబీ డాక్ డువాలియర్ అధ్యక్షుడుగా ఎన్నికైన తరువాత పర్యాటకరంగం పునరుద్ధరించబడింది." వైవె లా డ్ఫియంస్ చాలాకాలం హైటీయన్ నినాదంగా ప్రజాదరణ కలిగి ఉంది. 1986లో లో డువాలియర్ మరణించే వరకు యునైటెడ్ స్టేట్స్‌కు సామీప్యంలో ఉండడం హైతీని ప్రత్యేక ఆకర్షణ కలిగించింది.

                                     

2.11. చరిత్ర సమకాలీన చరిత్ర

పాపా డాల్స్ కుమారుడు జీన్ క్లౌడే డువాలియర్ బేబీ డాక్ 1971లో పదవి చేపట్టి 1986లో పదవి నుండి తొలగించబడే వరకు పాలన సాగించాడు. బేబీ డాక్‌ను నిరసనదారులు పదవి నుండి తొలగించి ఫ్రాంస్‌కు పారిపోయేలా చేసారు. సైనిక నాయకుడు హెంరీ నంఫీ కొత్తగా స్థాపించబడిన నేషనల్ కౌంసిల్ ఆఫ్ గవర్నమెంటు ప్రభుత్వానికి నాయకత్వం వహించాడు. టొంటన్స్ మాకౌటెస్ నాయకత్వంలో సైనికులు రాజధానిలో డజన్ల కొద్దీ నివాసితులు కాల్పులు జరిపిన తరువాత హైతీరియా అధ్యక్ష ఎన్నిక 1987 రద్దచేయబడింది.మోసపూరితమైన హైటీయన్ అధ్యక్ష ఎన్నిక 1988లో ఎన్నికైన అధ్యక్షుడు లెస్లీ మయినగత్ కొన్నిమాసాల తరువాత 1988 జూన్ మాసంలో తలెత్తిన హైటీయన్ తిరుగుబాటు కారణంగా పదవీచ్యుతుడయ్యాడు.తరువాత సెయింట్ జీన్ బోస్కో మారణకాండను జరిగింది. మాజీ టొంటన్స్ మాకౌట్స్ యొక్క ప్రాముఖ్యతను వెల్లడయ్యింది. జనరల్ ప్రోస్పెర్ అవిల్ 1990 మార్చి వరకు సైనిక పాలనకు నాయకత్వం వహించాడు.

1990 డిసెంబరులో హైతీయన్ జనరల్ ఎలక్షన్ 1990-91 తరువాత మాజీ కాథలిక్ ప్రీస్ట్ జీన్-బెర్ట్రాండ్ అరిస్టైడ్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. తరువాతి సంవత్సరం సెప్టెంబరులో 1991 హైటీయన్ తిరుగుబాటు ద్వారా అరిస్టైడ్‌ను సైన్యం పదవీచ్యుతుని చేసింది. 1994 లో ఒక అమెరికన్ బృందం రాజీద్వారా హైతీ సైనిక నాయకుల నిష్క్రమణ, ఆపరేషన్ అఫొల్డ్ డెమోక్రసీ ద్వారా యు.ఎస్. శాంతిదళాల ప్రవేశం గురించి చర్చలు జరిపింది. ఈరాజీ ప్రయత్నం ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకోబడిన జీన్-బెర్ట్రాండ్ అరిస్టైడ్‌ను అధ్యక్షుడిగా ఎన్నుకోవడానికి సహకరించింది. 1994లో అరిస్టైడ్ హైటీకి తిరిగివచ్చి తన అఫ్హికారాన్ని చేపట్టాడు. హైతీ సాధారణ ఎన్నికల 1995 88% ఓట్లతో రెనే ప్రెవెల్ అధ్యక్షుడిగా ఎన్నుకోబడి తరువాత అరిస్టైడ్ పాలన ముగింపుకు వచ్చింది. 1994 నవంబర్‌లో హరికేన్ గోర్డాన్ 1994 హైటీలో విధ్వంశం సృష్టించింది, భారీగా కురిసిన వర్షం తీవ్రమైన వరదలకు, మట్టికొట్టుకు పోవడానికి కారణం అయింది. గోర్డాన్ తుఫాను దాదాపు 1.122 మందిని హతమార్చిందని అధికారవర్గాలు తెలియజేయగా ఇతర గణాంకాలు 2.200 మరణించారని పేర్కొన్నాయి. హతితీ ఎన్నికలు 2000 ద్వారా అరిస్టైడ్ 92% ఓట్లతో అధ్యక్షపదవిని చేపట్టాడు. శాసనసభ ఎన్నికలు 2000 ప్రతిపక్షాలు బహిష్కరించాయి.శాసనసభ ఎన్నికలు 2000 వివాదం పరిష్కరించడానికి కన్వర్జెన్స్ డెమోకక్సిక్ నిర్వహించబడింది. తరువాతి సంవత్సరాల్లో హింస, మానవ హక్కుల ఉల్లంఘన సంఘటనలు చోటుచేసుకున్నాయి. అరిస్టిడ్ మద్దతుదారులు ప్రతిపక్షాలను ఎదుర్కొన్నారు. ఎన్నికల విధానాల అభివృద్ధి కొరకు అరిస్టైడ్ ఒకసంవత్సరకాలం కంవర్జెంస్ డెమొక్రటిక్‌లతో చర్చలు జరిపినప్పటికీ చర్చలు అసఫలం కావడంతో ఎన్నికలు ఆసక్తిని కోల్పోయాయి.

2004 లో, ఉత్తర హైతీలో ప్రాంరంభమైన తిరుగుబాటు 2004 చివరకు రాజధానికి చేరుకుని, అరిస్టైడ్స్‌ను బలవంతంగా దేశం నుండి బహిష్కరించబడిన తరువాత హైతీలో ఐక్యరాజ్యసమితి శాంతిదళం నిలిపివేయబడింది. అరిస్టైడ్, అతని అంగరక్షకుడు ఫ్రాంజ్ గాబ్రియేల్ అతను తిరుగుబాటు దళాల కొత్త బలిపశువు లేక ఆధునిక కిడ్నాప్" కు బాధితుడు గా పేర్కొన్నాడు. అరిస్టైడ్ కిడ్నాపర్లు యు.ఎస్. స్పెషల్ ఫోర్సెస్ యూనిఫాంను ధరించారని కాని హైతీ నుండి అరిస్టైడ్‌ను తొలగించడానికి ఉపయోగించిన విమానానికి వెళ్లేందుకు పౌర దుస్తులలోకి మారారని పేర్కొన్నాడు. 2004 తిఎఉగుబాటు తరువాత స్థాపించబడిన యునైటెడ్ నేషన్స్ స్టెబిలైజేషన్ మిషన్ నేటి వరకు దేశంలో మిగిలిపోయింది. బోనిఫేస్ అలెగ్జాండర్ తాత్కాలిక అధికారంను స్వీకరించాడు. 2006 ఫిబ్రవరిలో నిర్వహించబడిన హైతీయన్ జనరల్ ఎన్నిక 2006 రెనె ప్రివాల్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

2004 లో హరికేన్ జాన్ హయిటీ హైతీ ఉత్తర తీరాన్ని చేరింది. వరదలు, మట్టిగడ్డలు విరిగిపడడం కారణంగా 3.006 మంది ప్రజలు చనిపోయారు. మరణాలు అధికంగా గోనాయివ్స్ నగరంలో సంభవించాయి. 2008 లో హైటీలో తిరిగి ఉష్ణమండల తుఫానులు సంభవించాయి: 2008లో ఫే ఉష్ణమండల తుఫాను, గుస్టోవ్ ఉష్ణమండల తుఫాను, హన్నా ఉష్ణమండల తుఫాను, ఐకె ఉష్ణమండల తుఫాను సృష్టించిన పెనుగాలుల కారణంగా 331 మరణించారు.8.00.000 మందికి మానవీయసహాయం అవసరమైంది. ఈ తుఫాను కారణంగా ఆయిల్ ధరలు అధికరించడం, ఆహారసంక్షోభం ఏర్పడింది. ఆహారసంక్షోభం కారణంగా 2008లో హైతీలో రాజకీయ అశాంతి చోటుచేసుకుంది. 2010 జనవరి 12 న హతిలో 7.0 మాగ్నిటూడు భూకంపం సంభవించింది. ఇది 200 సంవత్సరాల తరువాత సంభవించిన తీవ్రమైన భూకంపంగా పేర్కొనబడింది. 2010 హైటీ భూకంపం 3.16.000 మంది మరణాలకు కారణం అయింది. అయినప్పటికీ ఇవి ఊహజనితమైన నివేదికలని వాస్తవంగా 46.000 నుండి 85.000 వరకు ఉండవచ్చని అంచనా వేయబడింది. హైటీ 2010 భూకంపం నుండి కోలుకున్న తరువాత దేశమంతటా కలరా వ్యాపించింది. మినుస్టా పీస్‌కీపింగ్ స్తేషన్ నుండి వెలువడిన కలరా సంబంధిత చెత్త దేశంలోని ప్రధాననది ఆర్టిబోంటేనదీ ప్రవాహంలో కలుపడినందున కలరా హైటీలో తీవ్రంగా వ్యాపించింది. 2010లో నిర్వహించాలనుకున్న ఎన్నికలు భూకంపం కారణంగా పొడిగించబడ్డాయి. 2011 మార్చిలో మైకేల్ మార్టెల్లి, మార్లెండే మనిగాట్ మద్య నిర్వహించబడిన మైకేల్ మార్టెల్లి విజేతగా ప్రకటించబడ్డాడు. 2016 ఫిబ్రవరి 7 న మైకేల్ మార్టెల్లీ వారసుడు లేకుండా అధ్యక్షపదవి నుండి వైదొలిగాడు. ఉభయసభలు కొత్త అధ్యక్షుని ఎన్నికచేసే వరకు ప్రధానమంత్రి పౌల్ పదవీబాధ్యత వహించాడు. 2013 లో బానిసత్వం కోసం నష్టపరిహారాన్ని చెల్లించాలని హైటీ యూరప్‌కు పిలుపిచ్చింది. గతంలో సంభవించిన అపరాధాల పరిష్కారం కోసం అధికారిక కమిషన్ నియమించాలని ఏర్పాటు చేశారు. 1964 అక్టోబరు 4 న మాథ్యూ తుఫాను ప్రభావంతో లెస్ యాంగ్లీస్‌లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఇది 1964 లో సంభవించిన క్లియో హరికేన్ క్లియో తరువాత దేశంలోంతీవ్రమైన విధంశం సృష్టించిన హరికేన్‌గా అభివర్ణించబడింది. తుఫాను ప్రభావంతో సంభవించిన ఘోరమైన గాలులు, వర్షాలు హైటీలో ఏర్పరిన తీవ్రమైన నష్టాన్ని కలిగించింది. తుఫాన్ దేశంలోని అన్ని వనరులను నాశనం చేయడం వలన హైటీ ఐక్యరాజ్యసమితి నుంచి 120 మిలియన్ డాలర్ల విలువైన సహాయాన్ని అందుకున్నది. తిఫాను కారణంగా మొత్తం సుమారు 3.000 మంది మరణించారు. ఇంఫ్రాస్ట్రక్చర్ ధ్వంశం అయిన కారణంగా నష్టం వేలాది మంది ప్రజలు తమతమ నివాసాల నుండి తరలించబడ్డారు. తుఫాను కారణంగా బాధించబడిన హైటీలో కలరా విపరీతంగా వ్యాప్తి చెందింది. తుఫాను తరువాత సంభవించిన అదనపు వరదలతో కలరా అధికారుల నియంత్రణ దాటి వ్యాపించింది. తుఫాను ఆసుపత్రులకు, రోడ్లు నష్టాన్ని కలిగించింది, ఇది బాధితులకు మొబైల్ వసతులు అందించడానికి అంతరాయం కలిగించింది.హరికేన్ మాథ్యూ కారణంగా సంభవించిన వినాశనం, నష్టం అనూహ్యమై దేశాన్ని అత్యవసర పరిస్థితిలోకి నెట్టింది.

                                     

3. భౌగోళికం

హిపానియోలా పశ్చిమ దిశలో ఉన్న హైతీ గ్రేటర్ ఆంటిల్లెస్ "లో రెండవ అతిపెద్ద ద్వీపం. కరీబియన్ ద్వీపాలలో హైటీ వైశాల్యపరంగా మూడవ స్థానంలో ఉంది. మొదటి రెండు స్థానాలలో క్యూబా, డొమినికన్ రిపబ్లిక్ ఉన్నాయి. హైతీ, డొమినికన్ రిపబ్లిక్ మద్య 360 కి.మీ పొడవైన సరిహద్దు ఉంది. క్యూబా నుండి హైటీ దూరంగా ఉన్న 45 నాటికల్ మైళ్ళ దూరంలో ఉంది. హైతీ ద్వీపకల్పం "గుర్రపు నాడా ఆకారం" ఆకారాన్ని కలిగి ఉంది. ఈ కారణంగా హైటీ సముద్రతీర పొడవు 1771 కి.మీ ఉంది. గ్రేటర్ ఆంటిల్లెస్‌లో సముద్రతీరపొడవులో హైటీ రెండవ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో క్యూబా ఉంది. కరీబియన్ దీవులలో హైటీ పర్వతమయమైన భూభాగం కలిగి ఉంటుంది. భూభాగంలో ప్రధానంగా చిన్న తీర మైదానాలు, నదీ లోయలు ఉంటాయి. హతి ఉష్ణమండల వాతావరణం నెలకొని ఉంటుంది. ఎత్తును అనుసరించి కొన్ని వాతావరణ వైవిధ్యాలు ఉంటాయి. దేశంలో ఎత్తైన ప్రదేశం పెక్ లా సెల్లె ఎత్తు 2680 మీ ఉత్తర ప్రాంతంలో మస్సిఫ్ డు నోర్డ్ ఉత్తర మాసిఫ్, ప్లైన్ డౌ నోర్డ్ నార్తర్న్ మైదానాలు ఉన్నాయి. "మాసిఫ్ డు నోర్డ్" డొమినికన్ రిపబ్లిక్‌లోని "కోర్డిల్లెరా సెంట్రల్" పర్వతశ్రేణి పొడిగింపు. ఇది హైతీ యొక్క తూర్పు సరిహద్దులో గుయామౌక్ నది ఉత్తర దిశగా మొదలై ఉత్తర ద్వీపకల్పం ద్వారా వాయువ్య దిశకు విస్తరించింది. ప్లెయిన్ డూ నార్డ్ లోతట్టులు డొమినికన్ రిపబ్లిక్‌ ఉత్తర సరిహద్దులో మాసిఫ్ డు నార్డ్, ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రం మధ్య.

కేంద్ర ప్రాంతంలో రెండు మైదానాలు, రెండు జతల పర్వత శ్రేణులు ఉంటాయి. ప్లాట్యూ సెంట్రల్ సెంట్రల్ పీఠభూమి మస్సిఫ్ డు నోర్డ్ దక్షిణాన గుయామోక్ నదికి రెండు వైపులా విస్తరించి ఉంది. ఇది ఆగ్నేయం నుండి వాయువ్య వరకు విస్తరించి ఉంది. ప్లాట్యూ సెంట్రల్ నైరుతికి మాంటేగ్నస్ నోయర్స్ ఉన్నాయి, వీటిలో చాలా భాగం వాయువ్య భాగం "మస్సిఫ్ డు నార్డ్" తో విలీనమవుతుంది. దీని పశ్చిమప్రాంతన్ని కేప్ కార్కాస్సె అని పిలుస్తారు

దక్షిణ ప్రాంతంలో ప్లైన్ డూ కుల్-డి-సాక్ ఆగ్నేయ, పర్వతమయమైన దక్షిణ ద్వీపకల్పం టిబ్రోన్ ద్వీపకల్పంగా కూడా పిలువబడుతుంది. ప్లైన్ డి కుల్-డే-సాక్ ఏటవాలుగా ఉంటూ ఇది ట్రౌ కైమాన్ సరోవర, హైటీలోని అతి పెద్ద సరసు ఎటాంగ్ సామట్రే సరోవరాలకు నౌకాశ్రంగా ఉంది. చైనీ డి లా సెల్లె పర్వత శ్రేణి - డొమినికన్ రిపబ్లిక్ లోని దక్షిణ పర్వతశ్రేణి విస్తరణగా ఉంది. సియెర్ర డి బోరుకో - తూర్పున మాసిఫ్ డే ల సెల్లె నుండి పశ్చిమంలో మాసిఫ్ డి లా హాట్టే వరకు విస్తరించింది. ఈ పర్వత శ్రేణిలో హైతీలోని ఎత్తైన ప్రదేశం లా లా సెల్లె ఉంది.

హైతీ లోని ప్లైన్ డి ఎల్ ఆర్టిబోనైట్ మైదానం దక్షిణంగా ఉన్న మాంటేగ్నస్ నోయర్క్‌ లోయ వ్యవసాయపంటలకు అనుకూలంగా ఉంది. ఈ ప్రాంతం డొమినికన్ రిపబ్లిక్ యొక్క పశ్చిమ ప్రాంతంలో మొదలై మద్య హైటీ మద్యభూభాగం వరకు విస్తరించి ఉంది. ఇక్కడ ప్రవహిస్తున్న హిస్పానియోల నది దేశంలో అయంత పొడవైన నదీగ గుర్తించబడుతుంది.ఇది అధికంగా హైటీ మదూప్తాంతంలో ప్రవహించి గల్ఫ్ ఆఫ్ గొంవేవ్ లో సంగమిస్తుంది. ద్వీపం యొక్క తూర్పు, కేంద్ర ప్రాంతంలో విశాలమైన ఎత్తైన పీఠభూమి ఉంది.

హైతీలో పలు ఆఫ్ షోర్ దీవులు ఉన్నాయి. టోర్టుగా హైటి ఐల్ డి లా టోర్టు ద్వీపం ఉత్తర హైతీ తీరంలో ఉంది. లా గోనావ్ అర్రోండిస్మెంట్స్ ఆఫ్ హైటీ అదే పేరు గల గల్ఫ్ ఆఫ్ గోనవ్ ద్వీపంలో ఉంది. గ్రానైట్ ద్వీపం గ్రామీణ గ్రామస్థులకు నివాసంగా ఉంది. ఫ్లె ఆ వాచె ఆవు ద్వీపం, ఎన్నో అందమైన దృశ్యాలు కలిగిన లష్ ద్వీపం, నైరుతి హైటీ కొనలో ఉంది. కాయేమిట్స్, ఐలె డి అనాకానా హైతీలో భాగంగా ఉన్నాయి. లా నవాస్సే హైటీ నైరుతి ద్వీపకల్పంలో జెరేమి హైటీకి పశ్చిమంలో 40 కి.మీ దూరంలో ఉంది. is subject to an ongoing territorial dispute with the United States.

                                     

3.1. భౌగోళికం వాతావరణం

హైతీలో ఆల్టిట్యూడ్ ఆధారిత వైవిధ్యమైన ఉష్ణమండల వాతావరణం నెలకొని ఉంటుంది. పోర్ట్-ఓ-ప్రిన్స్ పర్వతశ్రేణిలో జనవరి నుండి సగటున గరిష్టం ఉష్ణోగ్రత 31 కనిష్ఠ ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంటుంది. జూలై నుండి 25-35 ఉష్ణోగ్రత ఉంటుంది. వర్షపాతం ప్రాంతాలవారిగా వైవిధ్యంగా ఉంటుంది. ఉత్తర, తూర్పు పర్వతవాలులలో వర్షపాతం అధికంగా ఉంటుంది. హైతీలో పొడి సీజన్ నవంబర్ నుండి జనవరి వరకు కొనసాగుతుంది.

పోర్ట్-ఓ-ప్రిన్స్ సగటు వార్షిక వర్షపాతం 1370 మి.మీ. రెండు వర్షపాతాలు ఉంటాయి. మొదటి ఏప్రిల్-జూన్ రెండవ సీజన్ అక్టోబర్-నవంబరు ఉంటుంది. హైటీలో సంభవించే కాలానుగుణ కరువులు, వరదలకు అటవీ నిర్మూలన ఒక కారణంగా ఉంది. హైతీకి హరికేన్స్ కూడా ఒక బెదిరింపుగా ఉన్నాయి. హైటీ సాధారణంగా వేడి, తేమతో కూడిన ఉష్ణమండల వాతావరణం ఉంటుంది.

                                     

3.2. భౌగోళికం నైసర్గికం

హతీలో ఎరిక్విల్లో-ప్లాస్టైన్ గార్డెన్ ఫాల్ట్ జోన్ "తో సంబంధం ఉన్న బ్లైండ్ ఫాల్ట్ ఉంది. 2010 భూకంపం తరువాత ఉపరితల చీలిక, భూకంప భూగర్భ, భూ పతనం డేటా ఆధారాలు లేవు. కరేబియన్ ప్లేట్ టెక్టోనిక్ ప్లేట్ తూర్పు దిశగా ఉత్తర అమెరికా ప్లేట్ వైపుగా సంవత్సరానికి 20 మి.మీ కదులుతూ ఉంది. ఈ ప్రాంతంలోని స్ట్రైక్ -స్లిప్ ఫాల్ట్ వ్యవస్థ సెపెంట్రియల్-ఒరిఎంటే ఫాల్ట్, దక్షిణాన ఎన్రిక్విలో-ప్లాస్టైన్ గార్డెన్ ఫాల్ట్ అనే రెండు శాఖలు ఉన్నాయి.

2007 భూకంప ప్రమాదం గురించిచేసిన అధ్యయనం ఎన్రిక్విలో-ప్లాస్టైన్ గార్డెన్ ఫాల్ట్ జోన్ భూకంప చక్రానికి ముగింపుగా ఉందని ఇక్కడ 7.2 ప్రమాణంలో భూకంపం కలిగడానికి అవకాశం ఉందని నిర్ధారించింది. అదే పరిమాణంలో 1692 జమైకా భూకంపం సంభవించింది. మార్చి 2008 లో 18 వ కరేబియన్ జియోలాజిక్ సమావేశంలో ఒక పరిశోధనా బృందం ఎన్రిక్విలో-ప్లాంటైన్ గార్డెన్ ఫాల్ట్ సిస్టం గురించి ఒక ప్రమాదకరమైన అంచనాను అందించింది. ఇది పెద్ద ఒత్తిడిని పేర్కొంది. అంతకుముందు 40 సంవత్సరాల్లో కొన్ని భూకంపాలను నమోదు చేసిన కారణంగా, "అధిక ప్రాధాన్యత" కలిగిన ప్రాంతంగా చారిత్రక భూవిజ్ఞాన శాఖ అధ్యయనాలు సిఫార్సు చేసింది. సెప్టెంబరు 2008 లో హైటీ లె మ్యాటిన్ వార్తాపత్రికలో ప్రచురించబడిన ఒక వ్యాసం భూగోళ శాస్త్రవేత్త ప్యాట్రిక్ చార్లెస్ వ్యాఖ్యానిస్తూ, పోర్ట్-ఓ-ప్రి సెస్మిక్ ఏక్టివిటీ ప్రమాదం అత్యధికస్థాయిలో ఉందని తెలియజేసాడు. హైటీలో బంగారం వంటి అరుదైన నిలువలు కూడా ఉన్నాయి. మాంట్ ఆర్గనైజే పర్వతప్రాంతంలో బంగారు గని స్థాపించబడింది.

                                     

3.3. భౌగోళికం పర్యావరణం

అటవీ నిర్మూలన, నేల కోత హైటీలో కాలానుగుణమైన, తీవ్రవరదలు సృష్టించాయి. ఉదాహరణకు 2004 సెప్టెంబరు 17 న డొమినికన్ రిపబ్లిక్‌ హైతీ దక్షిణ సరిహద్దులో సంభవించిన వరదలలో 3.000 మంది ప్రజలు మరణించారు. యాభై సంవత్సరాల క్రితం దేశంలో 60 శాతం ఆటవీప్రాంతం విస్తరించి ఉంది. ప్రస్తుత పర్యావరణ విశ్లేషణ అధారంగా దేశంలో దాదాపు 30% వృక్షాలతో కప్పడి ఉంది. ఇంటర్నేషనల్ ఎర్త్ సైన్స్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ సి.ఐ.ఎస్.ఐ.ఎన్, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాం శాస్త్రవేత్తలు హైతీలో పేదరికం, సహజ విపత్తు దుర్బలత్వాన్ని తగ్గించడానికి పర్యావరణం పునరుద్ధరణ, సహజవనరుల నిర్వహణ గురించిన పరిశోధనలు చేపట్టారు.

                                     

4. ఆర్ధికం

2010 గణాంకాల ఆధారంగా హైటీ కొనుగోలుశక్తి జి.డి.పి. 12.15 నుండి 11.18 బిలియన్ల అమెరికన్ డాలర్లు. తలసరి కొనుగోలు శక్తి 1200 అమెరికన్ డాలర్లు. హైతీలో పర్యాటక పరిశ్రమ విజయవంతంగా ఉన్నప్పటికీ హైటీ ప్రపంచ పేద దేశాలలో ఒకటిగా ఉంది. పేదరికం, అవినీతి, బలహీనమైన మౌలికనిర్మాణం, ఆరోగ్య సంరక్షణ లేకపోవడం, ప్రధాన వనరైన విద్య లేకపోవడం వంటి సమస్యలతో అమెరికాలోని అత్యంత పేద దేశాలలో హైటీ ఒకటిగా ఉంది. 2010 హైతీ భూకంపం, తరువాతి 2010 హైతీ కోల్లె వ్యాప్తి కారణంగా ఆర్థిక వ్యవస్థ పతనం అయింది. 2010 యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ డెవెలప్మెంట్ ఇండెక్స్ లో 182 దేశాలలో హైతీ 145 వ స్థానంలో ఉంది. జనాభాలో 57.3% కనీసం HDI యొక్క పేదరికం చర్యలను కోల్పోయింది. వివాదాస్పదమైన 2000 ఎన్నికల తరువాత అధ్యక్షుడు ఆర్టిస్టైడ్ పాలన ఆక్షేపించబడింది. 2001 నుండి 2004 మద్య హైటీ దేశానికి యు.ఎస్. సహాయం నిలిపివేయబడింది. 2004లో ఆర్టిస్టైడ్ పదవిని విడిచి వెళ్ళిన తరువాత సహాయం తిదిగి అందించబడింది. యునైటెడ్ నేషంస్ స్టెబిలఒజేషన్ మిషన్ ఇన్ హైటీ తరఫున హైటీలో శాంతిస్థాపన చేయడానికి బ్రెజిలియన్ సైన్యం నిలిపివేయబడింది.నాలుగు సంవత్సరాల కాలవ్యవధి తరువాత 2005లో ఆర్ధికం 1.5% అధికరించింది. 2009 సెప్టెంబర్‌లో వరల్డ్ బ్యాంక్ హెవీలీ ఇండెబ్టెడ్ పూర్ కంట్రీస్ ప్రణాళికలో భాగంగా హైతీ విదేశీ ఋణాలు రద్దు చేయబడ్డాయి. హైటీ బడ్జెట్‌లో 90% వెనుజులా నాయకత్వంలోని ఆయిల్ సంకీర్ణంలో భాగం అయిన పెట్రోకార్బైడ్ ఒప్పందం ద్వారా లభిస్తుంది.

                                     

4.1. ఆర్ధికం విదేశీసహాయం

1990 నుండి 2003 మద్యకాలంలో హైటీ విదేశాల నుండి 4 బిలియన్ల అమెరికన్ డాలర్ల సహాయం అందుకున్నది. ఇందులో యు.ఎస్. సహాయం 1.5 బిలియన్లు భాగంగా ఉంది. వీరిలో అత్యధికంగా సహాయం చేసిన దేశం యు.ఎస్. తరువాత కెనడా, యురేపియన్ యూనియన్లు ఉన్నాయి. 2010 జనవరి భూకంపం తరువాత యు.ఎస్. అధ్యక్షుడు బారక్ ఒబామా 1.5 బిలియన్ల డాలర్ల సహాయం అందిస్తానని మాట ఇచ్చాడు. యురేపియన్ యూనియన్ 400 మిలితన్ల యోరోలు 600 అమెరికా డాలర్లు సహాయం అందించింది. పొరుగున ఉన్న డొమినికన్ రిపబ్లిక్ కూడా ధనం, ప్రభుత్వ విశ్వవిద్యాలయ నిర్మాణాలకు సరిహద్దుప్రాంత ప్రజలకు ఉచిత ఆరోగ్యరక్షణ, భూకంపం తరువాత లాజిస్టికల్ సహాయం అందించింది.

2013లో సి.ఐ.ఎ.వరల్డ్ ఫేస్ బుక్ ఆధారంగా 2010 హైటీ భూకంపం లో సంభవించిన 7.8 బిలియన్ల నష్టం హైటీ జి.డి.పి.ని ప్రభావితం చేసింది. 2010 భూకంపం తరువాత రెండిసంవత్సరాల తరువాత ఐక్యరాజ్యసమితి అందించిన 13.34 బిలియన్ సహాయం 2020 నాటికి కేటాయించబడుతుందని పేర్కొంది. ఇందులో సగం కంటే అధికంగా విడుదల చేయబడిందని ఐఖ్యరాజ్యసమితి డాక్యుమెంట్లు పేర్కొంటున్నాయి.2015 నాటికి యు.ఎస్. ప్రకటించిన 4 బిలియన్ల డాలర్లలో బిలియన్ డాలర్లు ఇప్పటికే ఖర్చు చేయబడింది. మిగిలిన నిధులు భవిష్యత్తు అభివృద్ధి పనులకు కేటాయించబడ్డాయి.

                                     

4.2. ఆర్ధికం వాణిజ్యం

2015 వరల్డ్ ఫేస్ బుక్ ఆధారంగా హైటీ ప్రధాన దిగుమతులలో యు.ఎస్.26.8%, డొమినికన్ రిపబ్లిక్ 35%, నెదర్లాండ్స్ ఆంటిల్లెస్ 8.7%, చైనా భాగస్వామ్యం వహిస్తున్నాయి.హైటీ ప్రధాన ఎగుమతులలో యు.ఎస్.83.5%కి భాగస్వామ్యం వహిస్తుంది. 2011 హైటీ వాణిజ్య లోటు 3 బిలియన్ల అమెరికన్ డాలర్లు 41% జి.డి.పి.

                                     

4.3. ఆర్ధికం విద్యుత్తు

1925 నాటికి కరీబియన్‌లో కాక్మెల్ ప్రాంతానికి మాత్రమే పూర్తి స్థాయిలో విద్యుత్తు సరఫరా చేయబడింది. ఈ నగరాన్ని సిటీ ఆఫ్ లైట్ అని పేర్కొనబడింది. ప్రస్తుతం హైటీ విద్యుత్తు అవసరాల కొరకు అధికంగా పెట్రోకారిబ్ మీద ఆధారపడి ఉంది. సమీపకాలంలో కొన్నిసంవత్సరాలుగా జలవిద్యుత్తు, సూర్యశక్తి, పవనశక్తి ద్వారా విద్యుత్తు తయారు చేయబడుతుంది.

                                     

4.4. ఆర్ధికం వ్యక్తిగత ఆదాయం

ది వరల్డ్ ఫేస్ బుక్ నివేదికలో నైపుణ్యత కలిగిన కార్మికశక్తి లోపం, దేశవ్యాప్తంగా నిరుద్యోగం, అర్హతకు తగిన ఉపాధి లభించకపోవడం, మూడింట రెండువంతుల మందికి సరైన ఉద్యోగాలు లేకపోవడం వంటి సమస్యలను పేర్కొన్నది. విదేశీద్రవ్యనిలువకు విదేశాలలో పనిచేస్తున్న ఉద్యోగుల నుండి లభిస్తుందని వరల్డ్ ఫేస్ బుక్ అభిప్రాయపడుతుంది.ఇది జి.డి.పి.లో 20% భాగస్వామ్యం వహిస్తూ ఎగుమతులకు ఐదింతలు ఉందని 2012 గణాంకాలు తెలియజేస్తున్నాయి. హైటీయన్ ప్రభుత్వ ఆర్ధికరంగానికి విదేశీ ఉపాధినిధి ప్రధాన ఆధారంగా ఉందని భావించబడుతుంది.2004 లో వరల్డ్ బ్యాంక్ హైటీలోని పట్టబధ్రులలో 80% విదేశాలలో నివసిస్తున్నారని పేర్కొన్నది. హైటీ ఆర్ధికరంగాన్ని హైటీ భూకంపం 2010 తీవ్రంగా కుదిపివేసింది.భూకంపంలో దాదాపు 30.000 మంది మరణించారు. 1.5 మిలియన్ల ప్రజలు నివాసాలను పోగొట్టుకున్నారు.

                                     

4.5. ఆర్ధికం నిర్మాణరంగం

గ్రామీణప్రాంతాలలో ప్రజలు పైకప్పులతో చెక్క గుడిసెలను నిర్మించుకుని నివసిస్తారు. గుడిసెల వెనుక ఔట్ హౌసులు ఉంటాయి.పోర్ట్-ఓ-ప్రింస్‌లో రంగురంగుల షంటీటౌన్స్ కేంద్ర నగరం చుట్టూ ఉండి, పర్వతపైభాగం వరకు విస్తరించాయి.

మధ్యతరగతి, ఉన్నత వర్గాలు పట్టణప్రాంతాలు, పెద్ద నగరాల కేంద్ర భాగంలో ఉన్న అపార్ట్మెంట్లలో నివసిస్తుంటారు.వారు నివసించే అనేక గృహాలు చిన్న రాళ్ళతో, మెత్తలు, గడ్డి, విరిగిన గ్లాసు, కొన్నిసార్లు మూడింటిని ఉపయోగించి సూక్ష్మరూప కోటలవలె నిర్మించబడుతుంటాయి.ఈ గృహాలకు గేట్లు రాత్రి తెరచి ఉంచబడి ఉంటాయి.ఇల్లు తాళం వేయబడి ఉంటాయి. కాపలా కుక్కలు పెరటి కాపలాకాస్తూ ఉంటాయి.ఇళ్ళు జనరేటర్లను కలిగి ఉన్నాయి, ఎందుకంటే హైతీలోని విద్యుత్ సరఫరా నమ్మతగినది కాదు. నీటి సరఫరా కోసం కూడా పైకప్పు రిజర్వాయర్లు కూడా ఉన్నాయి, ఎందుకంటే నీటి సరఫరా కూడా నమ్మదగినది కాదు.

                                     

4.6. ఆర్ధికం వ్యవసాయం

హైటీ వట్టివేరు ఉత్పత్తికి ప్రసిద్ధిచెందింది. విలాసవంతమైన సెంటు తయారీకి, ముఖ్యమైన ఆయిల్ తయారీకి, సువాసన ద్రవ్యాలతయారీకి వట్టివేరు ఉపయోగించబడుతుంది.ప్రంపచ సరఫరాలో సగం వట్టివేరు హైటీలో తయారుచేయబడుతుంది. హతి వ్యవసాయరంగంలో సగభాగానికి వట్టివేరు ఉత్పత్తి ప్రాముఖ్యత వహిస్తుంది. హైటీ ఆహార అవసరాలకు 50%, బియ్యం కొరకు 80% దిగుమతి మీద ఆధారపడుతుంది. హైటీ మామిడి, కొకో, కాఫీ, బొప్పాయి, మహోగనీ, స్పినాచ్, కర్రపెండెలం వంటి ఉత్పత్తులను ఎగుమతి చేస్తుంది. వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతులలో 6% భాగస్వామ్యం వహిస్తున్నాయి. అదనంగా ప్రాంతీయ వ్యవసాయ ఉత్పత్తులలో మొక్కజొన్న, బీంస్, కసావా, స్వీట్ పొటాటో, బఠాణీ, పిస్తాచియో, అరటి, మిల్లెట్, కంది, చెరకు, బియ్యం, జొన్న, వుడ్ ప్రధానమైనవి.

                                     

4.7. ఆర్ధికం ద్రవ్యం

హతి జాతీయ ద్రవ్యం పేరు హైటీయన్ గుర్డే ".హతియన్ డాలర్ 5 గుర్డేలకు సమానం.వ్యాపారం, ఇతర అవసరాలకు అధికంగా యు.ఎస్.డాలర్లను ఉపయోగిస్తుంటారు. అయినప్పటికీ వీధివ్యాపారులు గార్డులకు ప్రాముఖ్యత ఇస్తుంటారు. ప్రాంతీయవాసులు డాలర్లను అమెరికన్ డాలర్లు లేక డాలర్ అంటారు.

                                     

4.8. ఆర్ధికం పర్యాటకం

2014లో హైటీని 12.50.000 మంది పర్యాటకులు సందర్శించారు.వీరు అధికంగా క్రూసీషిప్పుల ద్వారా హైటీ చేరుకున్నారు. 2014లో పర్యాటక రంగం నుండి దేశానికి 200 మిలియన్ డాలర్లు లభించాయి. 2014 డిసెంబర్‌లో యు.ఎస్. స్టేట్ డిపార్టుమెంటు హతిలో బందిపోటు గురించి పర్యాటకులను హెచ్చరించింది. ప్రత్యేకంగా పోర్ట్ ఔ ప్రింస్ ప్రాంతం లో దోపిడీ జరుగుతుందని హెచ్చరిక చేయబడింది. అయినప్పటికీ వేలాది అమెరికన్లు సురక్షితంగా పర్యటనచేయగలుగుతున్నారు. 2014లో ఖరీదైన బెస్ట్ వెస్టర్న్ ప్రీమియర్ తో, ఆక్సిడెంటల్ హోటెల్, రిసార్ట్ పెషన్ - వ్యాలీలో నిర్మించిన ఒక ఫైవ్ స్టార్ రాయల్ ఒయాసిస్ హోటెల్, పోర్ట్ ఔ ప్రింస్ ప్రాంతణ్లోని తుర్గ్యూలో ఫోర్ స్టార్ మారియట్ ఇంటర్నేషనల్ హోటెల్, పోర్ట్ ఔ ప్రింస్ ప్రాంతంలో కొన్ని హోటెల్స్ అభివృద్ధి, లెస్ కేస్, కాప్ - హైటీయన్, జాక్మెల్ వంటి హోటళ్ళు ప్రారంభించబడ్డాయి. ఇతర పర్యాటక గమ్యాలలో ఐలె-అ-వాచె, కాంప్-పెర్రిన్,పిక్ మాక్యా ప్రధానమైనవి.హైటీయన్ కార్నివల్ కరీబియన్ ద్వీపాలలో న్rain ర్వహించబడుతున్ ప్రధాన కార్నివల్స్‌లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. 2010 లో ఈ కార్నివల్స్‌ను పోర్ట్ ఔ ప్రింస్‌లో నిర్వహిస్తున్నట్లు ఇతర నగరాలలో నిర్వహించాలని హైటీ ప్రభుత్వం నిర్ణయించింది. ది నేషనల్ కార్నివల్, ఫిబ్రవరి లేక మార్చి మాసాలలోని వారాంతంలో జాక్మెల్ కార్నివల్ నిర్వహించబడుతుంది.

                                     

4.9. ఆర్ధికం కారకోల్ పారిశ్రామిక పార్క్

2012 అక్టోబర్‌లో హైటీయన్ అధ్యక్షుడు మైకేల్ మార్టెల్లీ యు.ఎస్. సెక్రెటరీ హిల్లారీ క్లింటన్, బిల్ క్లింటన్, రిచర్డ్ బ్రాంస్టన్, బెలన్ స్టిల్లర్, సీన్ పెన్ కలిసి కారకోల్ పారిశ్రామిక పార్క్ ప్రారంభించారు.600 ఎకరాలు 240 హె.ఇది కరీబియన్ ద్వీపాలలో అతిపెద్ద పారిశ్రామికవాడగా గుర్తించబడుతుంది. 300 మిలియన్ల అమెరికన్ డాలర్ల విలువైన ఈ పారిశ్రామికవాడలో 10- మగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయగలిగిన పవర్ ప్లాంట్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంటు, వర్కర్ హౌసింగ్ ప్లాంటు అంతర్భాగంగా ఉన్నాయి. ఇది ఉత్తర హైతీలో 65.000 మందికి ఉపాధి సౌకర్యం కల్పిస్తుంది. ఈ పార్క్ హైటీ ఉత్తర, ఈశాన్య డిపార్టుమెంటులో భాగంగా ఉంది.ఈ ప్రణాళికలో కాప్ హైటీయన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ను అంతర్జాతీయ పెద్ద విమానాల రాకపోకలకు అనువుగా విస్తరించడం, ఫోర్ట్ - లిబర్టె అంతర్జతీయ నౌకాశ్రయ నిర్మాణం, కాప్ హైటీయన్ సమీపంలో రాయ్ హెంరీ క్రిస్టీఫె కాంపస్ నిర్మాణం కూడా ఈ ప్రణాళికలో భాగంగా ఉన్నాయి. పార్క్‌లో స్థాపించబడిన సౌత్ కొరియాకు చెందిన దుస్తుల తయారీ సంస్థ సా-ఏ- ట్రేడింగ్ కొ లిమిటెడ్ 5.000 పర్మనెంటు ఉద్యోగాలను కల్పిస్తుంది.ఈ సంస్థ తన ఉద్యోగుల కొరకు సమీప ప్రాంతాలలో 8.600 గృహాలను నిర్మించింది.ఈ పార్క్ పూర్తిగా అభివృచేయబడితే 65.000 మందికి ఉపాధి కల్పించబడుతుందని విశ్వసిస్తున్నారు.

                                     

5.1. మౌలిక నిర్మాణాలు రవాణా సౌకర్యాలు

హైతీలో రెండు ప్రధాన రహదారులు ఉన్నాయి. ఇవి దేశంలోని ఒక సరిహద్దు నుండి మరొక సరిహద్దును అనుసంధానం చేస్తూ ఉన్నాయి. ఉత్తర రహదారి రూట్ నేషనల్ No. 1" నేషనల్ హైవే వన్ పోర్ట్-ఓ-ప్రింస్ వద్ద ఆరంభమై మాంట్రోయిస్, గోనాయివ్స్ దాటుతూ ఉత్తరతీరంలో ఉన్న పోర్ట్ కాప్ హైటీయన్ వద్ద ముగుస్తుంది. దక్షిణ రహదారి రూట్ నేషనల్ నెంబర్ 2 నేషనల్ హైవే 2 లయోగ్నే, పెటిట్-గూవేవ్ దాటుతూ లెస్ కేస్‌ పోర్ట్-ఓ-ప్రింస్ వద్ద ముగుస్తుంది.

వాషింగ్టన్ పోస్ట్ ఆధారంగా "యు.ఎస్. ఆర్మీ కార్ప్స్ ఆఫ్ ఇంజనీర్స్ అధికారులు శనివారం భూకంపం నుండి నష్టాన్ని అంచనా వేసి హతిలోని లోని రహదారులకు అదనపు నష్టం సంభవించలేదు. అవి భూకంకంపం సంభవించడానికి మునుపే దారుణమైన స్థితిలో ఉన్నాయి అని వ్యాఖ్యానించారు. పోర్ట్-ఓ-ప్రిన్స్ వద్ద ఉన్న పోర్టు ఇంటర్నేషనల్ డీ పోర్ట్-ఓ-ప్రిన్ నౌకాశ్రయం, దేశంలోని ఇతర డజను పోర్టుల కంటే ఎక్కువ నౌకలను నమోదుచేస్తుంది. పోర్ట్ సౌకర్యాలలో క్రేన్ యంత్రంలు, పెద్ద బెర్త్ మూరింగ్స్, గిడ్డంగిలు ప్రధానంగా ఉన్నాయి. అయితే ఈ సదుపాయాలు సరైన స్థితిలో లేవు. ఈ పోర్ట్ తగినంతగా ఉపయోగంలో లేదు పోర్ట్ అధికరుసుము వసూలు చేయడం ఇందుకు కారణం కావచ్చని భావిస్తున్నారు. సెయింట్-మార్క్ పోర్ట్ ప్రస్తుతం హైతీలోకి వస్తున్న వినిమయ వస్తువులను దేశంలోకి రావడానికి అనుమతిస్తుంది. పోర్ట్-ఔ-ప్రిన్స్ ట్రాఫిక్ రద్దీ, అనేక హైటీయన్ నగరాలకు కేంద్ర స్థానం నుండి దూరంగా ఉండటం ఇందుకు ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు.

2010 భూకంపం సమయంలో, పోర్ట్-ఓ-ప్రిన్స్ నౌకాశ్రయానికి విస్తారమైన నష్టం సంభవించింది.బాధితులకు సహాయపడడానికి ఇది ఆటంకంగా మారింది. ప్రధాన పీర్ ప్రవేశించి నీటిలో పడింది. ప్రధాన క్రేన్లు కూడా నీటిలో కూలిపోయాయి. పోర్ట్ చేరుకునే రోడ్లు బాగా దెబ్బతిన్నాయి.

గతంలో హైతీలో రైలు రవాణాను ఉపయోగంలో ఉంది. పునరావాసం ఖర్చు హైటీయన్ ఆర్ధికవ్యవస్థకు మించినకారణంగా రైలు మార్గాల నిర్వహణ కష్టతరంగా మారింది.

                                     

5.2. మౌలిక నిర్మాణాలు ఎయిర్ పోర్టులు

టౌస్సియెట్ లౌవేటూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పోర్ట్ - ఓ ప్రింస్ నౌకాశ్రయానికి ఈశాన్యంలో 10 కి.మీ. దూరంలో ఉంది.దేశంలో ప్రవేశించడానికి, నిష్క్రమించడానికి ఇది ప్రధాన రవాణా కేంద్రంగా ఉంది. ఇది హైతీ ప్రధాన జెట్వే, క్యాప్-హైటీన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉత్తర నగరమైన కాప్-హైటీకు సమీపంలో ఉంది. ఇది అనేక అంతర్జాతీయ విమానాల రాకపోకలకు సహకరిస్తుంది. జామెల్, జెరెమీ, లెస్ కేస్, పోర్ట్-డే-పాయిక్స్ వంటి నగరాలు ప్రాంతీయ ఎయిర్లైన్స్, ప్రైవేట్ ఎయిర్ క్రాఫ్ట్ తక్కువ స్థాయిలో సేవలు అందిస్తున్నాయి. ఇవి ప్రాంతీయ విమానాలకు, ప్రైవేట్ విమానాలకు సేవలు అందిస్తున్నాయి. కేరిటింటైర్, సన్ రైజ్ ఎయిర్వేస్, టార్టుగ్ ఎయిర్.మొదలైన సంస్థలు ఈ విమానాశ్రయాల నుండి సేవలు అందుకుంటున్నాయి.

                                     

5.3. మౌలిక నిర్మాణాలు బస్సు సర్వీసు

వర్ణరంజింతంగా టాఫ్ టాఫ్ బస్సులు లేక పిక్ అప్ ట్రక్కులు షేర్ టాక్సీ సేవలు అందిస్తున్నాయి. ప్రయాణీకులు బస్సు నిలపడానికి బస్సుల మెటల్ బాడీని తట్టడం కారణంగా ఈ బసులకు టాప్ టాప్ అని పేరు వచ్చింది. ఈ బాడుగ వాహనాలు సాధారణంగా ప్రైవేట్ యజమానులకు స్వంతంగా ఉన్నాయి. వారు నిర్ణీతమార్గాలలో వాహనాలను నడుపుతుంటారు. ప్రయాణీకులతో వాహనాలు భర్తీ అయ్యే వరకు వాహనాలను కదిలించరు. ప్రయాణీకులు తమకు అవసరమైన ఏ కేంద్రంలోనైనా వాహనాల నుండి దిగుతుంటారు. వాహానాలు హతియన్ కళాశైలితో అలంకరించబడుతుంటాయి. 2013 ఆగస్టులో మొదటి కోచ్ బస్ ప్రోటోటైప్ తయారు చేయబడింది.

                                     

5.4. మౌలిక నిర్మాణాలు సమాచార రంగం

2014లో హైతీలో సమాచార ప్రసారాలలో రేడియో, టెలివిజన్, స్థిర, మొబైల్ టెలిఫోన్లు, ఇంటర్నెట్ ఉన్నాయి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం నెట్వర్క్ రెసిడెన్షియల్ ఇండెక్స్ ఎన్ఆర్ఐలో ఉత్తర అమెరికా దేశాలలో హైతీ సమాచారరంగ అభివృద్ధిలో 143 వ స్థానంలో మొత్తం 148 దేశాలు ఉంది. 2013 లో 141 వ స్థానంలో ఉంది.

                                     

5.5. మౌలిక నిర్మాణాలు నీటి సరఫరా, మురుగునీటి నిర్వహణ

హైటీ నీటి సరఫరా, పారిశుధ్యంలో ముఖ్య సవాళ్లను ఎదుర్కొంటుంది. పబ్లిక్ సర్వీసెస్ తక్కువగా అందుబాటులో ఉంది. వారి సేవల నాణ్యత తక్కువ స్థాయిలో ఉంటుంది. విదేశీ సాయం, ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేయాలని ప్రభుత్వం ప్రకటనచేసినప్పటికీ ప్రభుత్వ సంస్థలు చాలా బలహీనంగా ఉన్నాయి. గ్రామీణ, పట్టణ మురికివాడ ప్రాంతాలలో విదేశీ, హైటియన్ ఎన్జిఓలు రంగంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.

                                     

6. గణాంకాలు

హైతీ జసంఖ్యలో సగంకంటే అధికగా 20 సంవత్సరాలకు లోబడిన ప్రజలు ఉన్నారని ఐఖ్యరాజ్యసమితి గణాంకాలు తెలియజేస్తున్నాయి. 1950లో మొదటిసారిగా నిర్వహించబడిన గణాంకాల ఆధారంగా హైటీ జనసంఖ్య 3.1 మిలియన్లు. హైతీ జనసాంధ్రత చదరపు కిలోమీటరుకు సుమారుగా 350 చదరపు మైలుకు ~ 900. జనాభా అధికంగా పట్టణ ప్రాంతాలు, తీరప్రాంత మైదానాలు, లోయలలో కేంద్రీకృతమై ఉంది.ఆధునిక హైతీయులు మాజీ నల్ల జాతీయులు, బానిసలు, మిశ్రిత జాతీయులు ములాటీలు చెందినవారు ఉన్నారు. మిగిలినవారిలో ఐరోపా సంతతికి, అరబ్ హైతీయన్స్, మొదటిప్రపంచ యుద్ధం, రెండవప్రపంచ యుద్ధం సమయంలో వలసరాజ్యాల నుండి ఇక్కడ స్థిరపడిన ఐరోపియ సంతతికి చెందిన ప్రజలు ఉన్నారు.తూర్పు ఆసియన్ ఇండియన్లు లేక ఈస్టిండియన్లు 400 కంటే అధికంగా ఉన్నారు.మిలియన్ల మంది యినైటెడ్ స్టేట్స్, డొమినికన్ రిపబ్లిక్, క్యూబా, కెనడా ప్రధానంగా మాంట్రియల్, బహామాస్,ఫ్రాంస్,ఫ్రెంచి అంటిల్లెస్, ది టర్క్స్ అండ్ కైకోస్, జమైకా,యూరొటో రికో, వెనెజుయేలా, బ్రెజిల్,సురినామె, ఫ్రెంచి గయానా దేశాలలో నివసిస్తున్నారు. యునైటెడ్ స్టేట్స్‌లో దాదాపు 8.81.500 మంది హైటీయన్లు నివసిస్తున్నారు. డొమినికన్ రిపబ్లిక్‌లో 800.000 క్యూబాలో 300.000 కెనడాలో 100.000 ఫ్రాంస్‌లొ 80.000, బహామాస్‌లో 80.000 మంది ఉన్నారు. అలాగే స్వల్పసంఖ్యలో చిలీ, స్విడ్జర్లాండ్, జపాన్, ఆస్ట్రేలియా దేశాలలో కూడా ఉన్నారు.2015 గణాంకాల ఆధారంగా హైటీ ప్రజల ఆయుఃపరిమితి 63 సంవత్సరాలు.

                                     

6.1. గణాంకాలు ఆస్ట్రోనోమల్

2010 గణాంకాల ఆధారంగా హైతీ జన్యుపరమైన గణాంకాల ఆధారంగా 95.5% సబ్- సహరన్ ఆఫ్రికన్లు, 4.3% యురేపియన్ సంతతికి చెందిన ప్రజలు, మిగిలిన వారు ఈస్టిండియన్లు ఉన్నారని తెలియజేస్తున్నాయి.

                                     

6.2. గణాంకాలు జాతులు

కాలనీ హైటీలో హైటీయన్ ములాటోలు ఆధిఖ్యత కలిగి విశేషాధికారాలు కలిగి ఉన్నారు. హైటీ చరిత్రలో భాగస్వామ్యం వహించిన పలువురు నాయకులు హైటీయన్ ములాటో జాతికి చెందినవారు ఉన్నారు. వీరు దేశజనాభాలో 5% ఉన్నారు. ములాటోలు రాజకీయంగా, ఆర్ధికంగా, సాంఘికంగా, సాంస్కృతికంగా ప్రధాన్యత కలిగి ఉన్నారు. కాలనీపాలనలో బానిసలకు విద్య, ఆదాయం, వృత్తులకు సంబంధించి పరిమిత అవకాశాలు ఇవ్వబడ్డాయి. స్వతంత్రాన్ని పొందిన తరువాత కూడా ఎగువ, దిగువ తరగతుల మధ్య అసమానత సంస్కరించబడనందున సాంఘిక నిర్మాణం తగినంతగా మార్పులు సంభవించలేదు. ఫలితంగా స్వల్పసంఖ్యలో ఉన్న పైతరగతి ప్రజలు తమకుతాముగా ఉన్నతమైన గౌరవనీయమైన స్థితిని ఏర్పరచుకున్నారు. హైటీయన్ తల్లికి, ఫ్రెంచి తండ్రికి జన్మించిన అలెగ్జాండర్ పెషన్ రిపబ్లిక్ మొదటి అధ్యక్షునిగా ఎన్నికచేయబడ్డాడు.

                                     

6.3. గణాంకాలు మతం

2017 లో సి.ఐ.ఎ. ఫాక్ట్ బుక్ నివేదిక ఆధారంగా రోమన్ కాథలిక్కులు 54.7%, ప్రొటెస్టెంట్లు 28.5% ఉన్నారు.2001లో ఇతర వనరుల ఆధారంగా ప్రొటెస్టెంట్లు సంఖ్య అధికంగా ఉన్నాయని మొత్తం జనసంఖ్యలో మూడవ వంతు ఉందని తెలియజేస్తున్నాయి. హతియన్ వొడౌ మతం ఆఫ్రికన్ మూలాల నుండి ఆరంభం అయింది. ఇది క్యూబా, బ్రెజిల్ లో కూడా ఉంది. ఇది కాలనీ కాలంలో హైటీలో ప్రారంభం అయింది. హైతీలోని అల్పసంఖ్యాక మతాలకు చెందినవారిలో ఇస్లాం, బహై, జ్యూడిజం, బుద్ధిజం ప్రధానమైనవి.

                                     

6.4. గణాంకాలు భాషలు

హైటీలో ఫ్రెంచి, హైటీయన్ క్రియోల్ అధికార భాషలుగా ఉన్నాయి. వ్రాయడానికి, ప్రభుత్వ నిర్వహణకు ఉపయోగిస్తున్న ఫ్రెంచి భాష 42% ప్రజలకు వాడుకభాషగా ఉంది. ఫ్రెంచి విద్యావంతులైన హైతీయన్లు అధికంగా మాట్లాడుతుంటారు.ఇది చాలా పాఠశాలల్లో బోధన మాధ్యమంగా, ఇది వ్యాపార రంగంలో ఉపయోగించబడుతుంది. ఇది వివాహాలు, గ్రాడ్యుయేషన్లు, చర్చి మాస్ వంటి ఉత్సవ కార్యక్రమాలలో కూడా ఉపయోగించబడుతుంది. అమెరికా ఖండాలలో ఫ్రెంచి అధికార భాషగా ఉన్న రెండు దేశాలలో హైటీ ఒకటి. రెండవ దేశం కెనడా.హైటీయన్ క్రియోల్‌కు ప్రస్తుతం అధికంగా ముఖ్యత్వం ఇది హైటీయన్లు అందరికీ వాడుక భాషగా ఉంది. ఫ్రెంచి ఆధారిత క్రియోల్ భాషలలో హైటీయన్ క్రియోల్ ఒకటి. ఈ భాషాపదాలు 90% ఫ్రెంచి నుండి గ్రహించబడ్డాయి. ఈ బాషా వ్యాకరణం పశ్చిమ ఆఫ్రికన్ వ్యాకరణాన్ని పోలి ఉంటుంది.ఈ భాషను టైనో, స్పెయిన్, పోర్చుగీసు భాషలు కూడా ప్రభావితం చేస్తున్నాయి. హైటీయన్ క్రియోల్ ఇతర ఫ్రెంచి క్రియోల్ భాషలతో సంబంధితమై ఉన్నప్పటికీ అమెరికన్, లూసియానా క్రియోల్ భాషలతో సన్నిహితసంబంధం కలిగి ఉంది.

                                     

6.5. గణాంకాలు వలసలు

1804 నుండి హైటీయన్ వలసప్రజలు అమెరికా, కెనడా దేశాల సాంఘికజీవితంలో అంతర్భాగంగా ఉన్నారు. ప్రభావవంతులైన అమెరికన్ సెటిలర్లు, స్వతంత్రులైన నల్లజాతి ప్రజలుజీన్ బాప్టిస్టే పాయింట్ డూ సేబుల్, డబల్యూ.ఇ.బి. డూ బోయిస్ హైటీయన్ సంతతికి చెందినవారై ఉన్నారు. జీన్ బాప్టిస్టే పాయింట్ డూ సేబుల్ సెయింట్ డోమినిక్యూ ప్రస్తుత హైటీ రిపబ్లిక్ నుండి అమెరికా చేరుకుని యునైటెడ్ స్టేట్స్‌లోని అతిపెద్ద నగరాలలో మూడవ నగరమైన చికాగోలో నాన్‌ఇండిజెనిస్ సెటిల్మెంటును స్థాపించాడు. ఇల్లినాయిస్ రాష్ట్రం, చికాగో నగరం సేబుల్ ను చికాగో స్థాపకుడుగా 1968 అక్టోబర్ ప్రకటించాయి.

                                     

7. సంస్కృతి

హైటీ దేశానికి సుసంపన్నమైన, అసమానమైన సస్కృతిక ప్రత్యేకత ఉంది. హతియన్ సంస్కృతి ఫ్రెంచి, ఆఫ్రికా తీవ్రంగా ప్రభావితమై గణనీయంగా స్పానిష్, స్థానిక టైనో సంస్కృతిని కలుపుకుని విభిన్నమైన మిశ్రిత సంస్కృతిగా రూపొందింది. దేశం ఆచారాలు ముఖ్యంగా హిస్పోనియోల ద్వీపంలో నివసించిన అనేక జాతుల సమూహాల నుండి వచ్చిన సాంస్కృతిక నమ్మకాల మిశ్రమంగా ఉంటాయి. హైతీ సంస్కృతి పెయింటింగ్స్, సంగీతం, సాహిత్యంలో ప్రతిబింబిస్తుంది. యునైటెడ్ స్టేట్‌, ఫ్రాన్స్ లోని ప్రదర్శనశాలలు, సంగ్రహాలయాలు హైతీ నుండి వచ్చిన ఉత్తమ కళాకారుల కళాఖండాలను ప్రదర్శిస్తున్నాయి.

                                     

7.1. సంస్కృతి కళలు

హైటీయన్ కళలు శిల్పాలు, పెయింటింగ్స్‌తో ప్రత్యేకత కలిగి ఉంటుంది.ఇది ప్రత్యేకమైన కళాత్మక భావాల ప్రతీకగా పేరుగడించింది. ప్రకాశవంతమైన రంగులు సరళ కళాదృక్పథాలు, తెలివితక్కువ హాస్యరసప్రధానమైన అంశాలు హైటీకళలలో భాగంగా ఉంటాయి. హైతీ కళలలో తరచూ ఉన్న అంశాలలో ఆకర్షణీయమైన ఆహారాలు, ఆకర్ష్ణీయమైన ప్రకృతి దృశ్యాలు, మార్కెట్ కార్యకలాపాలు, అడవి జంతువులు, ఆచారాలు, నృత్యాలు, దేవతలు అధికంగా ప్రాధాన్యత వహిస్తున్నాయి. ఆర్టిస్ట్స్ తరచుగా చిన్నకథలను పెయింట్‌లో చిత్రిస్తుంటారు. ప్రజలు జంతువులుగా, జంతువులు ప్రజలుగా రూపాంతరం చెందుతూ మారువేషంలో ఉంటాయి.

హైటీ లోతైన చరిత్ర, బలమైన ఆఫ్రికన్ సంబంధాలు ఫలితంగా చిహ్నాలు హైటీయన్ సమాజంలో గొప్ప అర్థాన్ని ఇస్తుంటాయి. కాప్-హైయిటెన్ పాఠశాల నగరంలో రోజువారీ జీవితం యొక్క చిత్రణలను కలిగి ఉంది. జామెల్ స్కూల్ సముద్రతీర పట్టణంలోని నిటారుగా ఉన్న పర్వతాలు, బే ప్రతిబింబించే చిత్రాలు ఉన్నాయి. సెయింట్ సోలెల్ స్కూల్ మానవ రూపాల లక్షణాలను ప్రతిబింబించే చిత్రాలను, వోడౌ సిబాలిజం ప్రతిబింబించే చిత్రాలను కలిగి ఉంటుంది.

                                     

7.2. సంస్కృతి సంగీతం, నృత్యం

హైటీయన్ సంగీతాన్ని ఈ కరీబియన్ ద్వీపంలో స్థిరపడిన పలువురు వ్యక్తులు ప్రభావితం చేసారు. ఇది ఫ్రెంచ్, ఆఫ్రికన్ లయలు, స్పానిష్ ఆంశాలు, హిస్పానియోలా, అల్పసంఖ్యాక స్థానిక టైనో సంగీతశైలిని ప్రతిబింబిస్తుంది.అసమానమైన హైతీ సంగీతంలోని పాటలు హైదరా వడోవవు వేడుకల సంప్రదాయాలు నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్నాయి.హతియన్ సంగీత బాణిలో రారా పారడాజింగ్ మ్యూజిక్, ట్యుబోడా జానపదాలు, మినీ-జాజ్ రాక్ బ్యాండ్లు, రాసిన్ ఉద్యమం, హైటీయన్ హిప్ హాప్ క్రెయోల్, మెరెంగ్యూ, కాంపస్ ప్రాధాన్యత వహిస్తున్నాయి. యువకులు డిస్కోస్ ", బాల్ అనబడే నైట్ క్లబ్బులలో పార్టీలకు హాజరౌతూ ఉంటారు.కాంపాస్ కొంపా ఆఫ్రికన్ లయలు, యురేపియన్ బాల్‌రూం నృత్యాల మిశ్రితరూపంగా హైతీ బర్గియోస్ సంస్కృతిని కలుపుకుని ప్రదర్శించబడుతుంది.ఇది మెరిక్యూ లయ ఆధారంగా ఉత్పత్తి చేయబడిన రిఫైండ్ మ్యూజిక్‌గా ప్రసిద్ధి చెందింది. 1937 వరకు హైతీలో సంగీతం రికార్డు చేయబడలేదు. మొదటిసారిగా లాభాపేక్ష లేకుండా జాజ్ గుయిగ్నార్డ్ సంగీతం రికార్డు చేయబడింది.

                                     

7.3. సంస్కృతి సాహిత్యం

హైతీ ఎప్పుడూ సాహిత్య ప్రాధాన్యత కలిగిన దేశంగా ఉంది.హైటీ నుండి కవిత్వం, నవలలు, అంతర్జాతీయ గుర్తింపు పొందిన నాటకాలు వెలువడ్డాయి. సెయింట్ డొమినింగ్ ఫ్రెంచ్ భాషను సంస్కృతి, గౌరవ స్థానంగా స్థాపించిన తరువాత సాహిత్య ఇతి వృత్తాలు, సాహిత్యప్రక్రియలను ఫ్రెంచి ఆధిఖ్యత చేసింది. అయినప్పటికీ 18వ శతాబ్దం నుండి హైతీయన్ క్రియోల్‌లో వ్రాయడానికి నిరంతర కృషి జరిగింది. క్రియోల్ అధికారిక భాషగా గుర్తించడం నవలలు, కవితలు, సాహిత్యప్రక్రియలు క్రియోల్‌భాషలో నాటకాలు విస్తరించడానికి దారితీసింది. 1975లో ఫ్రెంచి భావనలను విచ్ఛిన్నం చేస్తూ ఫ్రాంకెటియెన్నె పూర్తిగా క్రియోల్ భాషలో రచించబడిన డెజాఫి నవలను మొదటి క్రియోల్ నవలగా ప్రచురించాడు. ఈ నవల హైటీయన్ జీవనవిధానం కవిత్వరూపంలో అందించబడింది.

                                     

7.4. సంస్కృతి ఆహారం

హైటియన్ ఆహారసంస్కృతి వివిధ జాతుల సమూహాల ఆహారవిధానాల, సాంప్రదాయాల సమ్మేళనంగా ఉంటుంది. ప్రధానంగా హిస్పానియోల ద్వీపంలో నివసించిన ఫ్రెంచ్ ప్రజల వంటకాలు,ఆఫ్రికన్ వంటకాలు, స్పానిష్ వంటకాలు, స్వదేశీ టైనోల వంటకాలు హతి ఆహారాలను విపరీతంగా ప్రభావితం చేసాయి.హైటీయన్ ఆహారవిధానాలు మిగిలిన లాటిన్-కరేబియన్ దేశాల ఆహారాలను పోలి ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ ప్రాంతీయ సహచర దేశాల ఆహారాలకు భిన్నమైన ప్రత్యేకమైన మసాలను చేర్చిన హైటీ వంటకాలు తన ప్రత్యేకతను చాటుతుంటాయి.

వంటకాలు సరళంగా రుచికలిగి ఉంటాయి. ఫలితంగా హైటీయన్ వంటకాలు తరచుగా మధ్యస్తమైన కారంగా ఉంటాయి. ప్రధానమైన ఆహారంలో బియ్యం, బీన్స్, అనేక వైవిధ్యమైన తరహాలో పచనం చేయబడుతూ ఉంటాయి.

హతి వంటకం మాస్ మౌలు "మేయి మౌలెన్" సాస్ పాయిస్ "సాస్ పావా" తో తినవచ్చు, ఇది కిడ్నీ బీన్, పింటో బీన్, చిక్పాలు లేదా పిగ్యోన్ పీలు కొన్ని దేశాలలో గండూల్స్ అని పిలుస్తారు వంటి పలు బీన్స్‌ను రుబ్బి చేసిన పిండి తయారుచేస్తారు.మాయిస్ మౌలిన్ ను చేపలతో తరచుగా లుట్జనస్ కాంపెనస్ కలిపి తింటారు. లేదా వ్యక్తిగత ప్రాధాన్యతపై ఆధారపడి ఉంటుంది. హైటీయన్ వంటలలో ఉపయోగించే అనేక మొక్కలలో టమోటా, ఒరెగానో, క్యాబేజీ,అవోకాడో, బెల్ పెప్పర్‌లు ప్రధానమైనవి. మరొక ప్రసిద్ధ హైటీయన్ ఆహారం బనానా పెసి,ప్లాంటియన్ చేర్చి తింటారు. జనవరి 1 న స్వంత్రదినం రోజున హైటీయన్లు సంప్రదాయమైన జౌమౌ సూపును తీసుకుంటారు. హతి రమ్ము తయారీకి ప్రసిద్ధం. అంతర్జాతీయంగా గుర్తిపు పొందిన రం బార్బంకోర్ట్ హైటీలో తయారు చేయబడుతుంది.

                                     

7.5. సంస్కృతి నిర్మాణరంగం

1982 లో హైటీ లోని శాంస్- సౌసి ప్యాలెస్ ", సిటాడెల్లె లాఫరియరె ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించబడ్డాయి. హైతీ నేషనల్ పార్కులలో ఒకటైన నార్తెన్ మాసిఫ్ డూ నార్డ్ 19వ శతాబ్ధం ఆరంభంలో స్థాపించబడింది. హైటీ ఫ్రాంస్ నుండి స్వాతంత్ర్యం పొందాక మొదటిసారిగా నిర్మించబడిన భవనాలు ఇక్కడ ఉన్నాయి. ఉత్తర హైటీలో అమెరికా ఖండాలలో అతిపెద్ద కోటగా గుర్తించబడుతున్న సిటాడెల్లె లాఫర్రియరె కోట ఉంది. ఇది 1805, 1820 మద్యకాలంలో నిర్మించబడింది. ప్రస్తుతం ఈ కోటను హైటీయన్లు 8వ ప్రపంచవింతగా అభివర్ణిస్తుంటారు. కాలనీ పాలనలో స్థాపించబడిన జాక్మెల్ నగరం ప్రపంచవారసత్వ సంపదగా గుర్తించబడింది. 2010 హైటీ భూకంపం ఈ నగరాన్ని అధికంగా ధ్వంశం చేసింది.

                                     

7.6. సంస్కృతి మ్యూజియంలు

ది యాంకర్ ఆఫ్ క్రిస్టోఫర్ కొలంబస్ అతి పెద్ద నౌక శాంటా మరియా ప్రస్తుతం పోర్ట్ ఓ ప్రింస్‌లో ఉన్న మౌసీ డూ పాంతియాన్ నేషనల్ హైటీయన్ లో ప్రదర్శించబడుతుంది.

                                     

7.7. సంస్కృతి జాతీయ శలవు దినాలు, పండుగలు

ఫిబ్రవరిలో కార్నివాల్ హైటీలో అత్యంత ఉత్సాహంగా జరుపుకునే పండుగ హైటీయన్ క్రియోల్ లేదా మార్డి గ్రాస్లో కనావాల్ గా పిలువబడుతుంది. ఈ ఉత్సవంలో సంగీతం, కవాతు, వీధుల్లో నృత్యం, పాటలు పాడటం భాగంగా ఉంటాయి. కార్నివల్ వారంలో ప్రతిరోజూ సాంప్రదాయ విందులు చేసుకుంటారు.ఈస్టర్‌కు పూర్వం జరుపుకునే పండుగ రారా. పండుగ సందర్భంలో కార్నివాల్ శైలి సంగీతం ఉంటుంది.

                                     

7.8. సంస్కృతి Sports

హైతీలో అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడ అసోసియేషన్ ఫుట్‌బాల్. వందల కొద్దీ చిన్న ఫుట్‌బాల్ క్లబ్బులు స్థానిక స్థాయిలో పోటీపడుతున్నాయి. బాస్కెట్బాల్ ప్రజాదరణ పెరుగుతోంది. పోర్ట్-ఓ-ప్రింస్‌లో ఉన్న బహుళ-ప్రయోజన క్రీడామైదానంలోని స్టేడ్ సిల్వియో కేటర్ అసోసియేట్ ఫుట్‌బాల్ క్రీడల కొరకు ఉపయోగించబడుతుంది.ఈ క్రీడామైదానం 10.000 మంది ప్రజల కూర్చుని క్రీడను తిలకించే సామర్ధ్యం కలిగి ఉంది. 1974 లో హైతీ కరీబియన్ ద్వీపాలలో రెండవ దేశంగా జాతీయ ఫుట్బాల్ జట్టు ప్రపంచ కప్‌ క్రీడలలో పాల్గొన్నది.ఈ క్రీడలలో పాల్గొన్న మొదటి కరీబియన్ దేశంగా 1938 లో క్యూబా పాల్గొన్నది. ఓపెనింగ్ క్వాలిఫైయింగ్ దశలలో వారు ఫుట్%బాల్ వరల్డ్ కప్ చాంపియన్లైన ఇటలీ,పోలాండ్, అర్జెంటీనాపోటీపడి ఓడిపోయింది జాతీయ జట్టు 2007 కరేబియన్ నేషన్స్ కప్‌ను గెలుచుకుంది. హైతీ 1900 నుండి ఒలంపిక్ క్రీడలలో పాల్గొని, అనేక పతకాలు గెలుచుకుంది. 1950 ఎఫ్.ఐ.ఎఫ్.ఎ.ప్రపంచ కప్‌లో హైతీ ఫుట్‌బాల్ క్రీడాకారుడు జో గేట్జెన్స్ యునైటెడ్ స్టేట్స్ జాతీయ జట్టు కొరకు ఆడాడు. ఇంగ్లండ్ 1-0లో ఆడిన ఆటలో గెలిచిన గోల్ సాధించాడు.